అన్వేషించండి

'స్పై' నిర్మాతతో గొడవ - క్లారిటీ ఇచ్చిన నిఖిల్!

గత రెండు రోజులుగా 'స్పై' మూవీ నిర్మాత, హీరో నిఖిల్ మధ్య రిలీజ్ విషయంలో గొడవలు జరుగుతున్నట్టు వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా హీరో నిఖిల్ దీనిపై క్లారిటీ ఇచ్చాడు.

టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్న విషయం తెలిసిందే. 'కార్తికేయ2', '18 పేజేస్' వంటి బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో ఫుల్ ఫామ్ లో ఉన్న ఈ యంగ్ హీరో ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్ లో భారీ బడ్జెట్ సినిమాల్లో నటిస్తున్నాడు. ప్రస్తుతం నిఖిల్ 'స్పై' అనే సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఫ్రీడమ్ ఫైటర్ సుభాష్ చంద్రబోస్ మర్డర్ మిస్టరీ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకి గ్యారి బిహెచ్ దర్శకత్వం వహిస్తున్నారు. అయితే గత రెండు రోజులుగా ఈ సినిమా నిర్మాతకి, నిఖిల్ కి మధ్య అసలు పడడం లేదని.. ఇద్దరి మధ్య చిన్నపాటి యుద్ధం నడుస్తుందని వార్తలు వస్తున్నాయి. స్పై రిలీజ్ డేట్, ప్రమోషన్స్ విషయంలోనే హీరో నిఖిల్, నిర్మాత రాజశేఖర్ రెడ్డి మధ్య అభిప్రాయబేధాలు నెలకొన్నట్లు తెలుస్తోంది.

నిఖిల్ ఈ సినిమా రిలీజ్ ని వాయిదా వేయాలని కోరగా నిర్మాత రాజశేఖర్ రెడ్డి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ సినిమాని ముందు ప్రకటించిన తేదీ జూన్ 29 విడుదల చేయడానికి డిసైడ్ అయ్యారట. దీంతో నిఖిల్ ఈ సినిమాకు డబ్బింగ్ చెప్పడానికి నిరాకరించినట్లు తెలుస్తోంది. అంతేకాదు ఈ సినిమా ప్రమోషన్స్ కి కూడా నిఖిల్ దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నట్లు ఇప్పటికే వార్తలు వినిపించాయి. దీంతో ఈ ఇష్యూ కాస్త ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. అయితే గతంలో కూడా నిఖిల్ ఇలా చాలాసార్లు చేశాడని అతనిపై కొన్ని కథనాలు వచ్చాయి. సరిగ్గా సినిమా రిలీజ్ టైం లోనే నిర్మాతలకు నిఖిల్ ఇలాంటి తలనొప్పులు తెచ్చి పెడతాడని, నిర్మాతల గురించి కానీ సినిమా బిజినెస్ గురించి ఏమాత్రం ఆలోచించకుండా కేవలం తన ప్రయోజనాల కోసం ప్రాధాన్యత ఇస్తాడంటూ నిఖిల్ పై ఇదివరకు నుంచే ఇండస్ట్రీలో ఓ టాక్ ఉంది.

అయితే తాజాగా హీరో నిఖిల్ దీనిపై క్లారిటీ ఇచ్చాడు. స్పై మూవీ సీజీ వర్క్ ఇంకా పూర్తి కాలేదని, పోస్ట్ ప్రొడక్షన్ పనులు సైతం పెండింగ్లో ఉన్నాయని ఈ సందర్భంగా తెలిపారు. అంతేకాకుండా ఇలాంటి గందరగోళ పరిస్థితుల్లో సినిమాను విడుదల చేయడం కరెక్ట్ కాదని భావిస్తున్నాడు. స్పై మూవీ పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ కాబోతోంది. కాబట్టి అందుకు తగ్గ ప్రమోషన్స్ కూడా చేయాల్సి ఉంటుంది. పాన్ ఇండియా స్థాయిలో ప్రమోషన్ చేయాలంటే అందుకు పక్కా ప్రచార ప్రణాళికలు ఉండాలని నిర్మాతలను కోరారట. నిర్మాత ఇందుకు వ్యతిరేకించడంతో నిఖిల్ స్పై మూవీ రిలీజ్ డేట్ ని వాయిదా వేయాలని కోరినట్లు తెలుస్తోంది. దీంతో ఆలోచనలో పడ్డ నిర్మాతలు స్పై సినిమా వాయిదా వేయనున్నట్లు తెలుస్తోంది అంతేకాదు త్వరలోనే కొత్త విడుదల తేదీని ప్రకటించాలని మేకర్స్ భావిస్తున్నారట.

ఇక స్పై మూవీ విషయానికొస్తే.. ఇప్పటికే విడుదలైన టీజర్ మంచి స్పందనను దక్కించుకుంది. ఈడి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రాజశేఖర్ రెడ్డి, చరణ్ తేజ్ ఉప్పలపాటి ఈ సినిమాని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో నిఖిల్ సరసన ఐశ్వర్య మీనన్ హీరోయిన్గా నటిస్తోంది. ఆర్యన్ రాజేష్, జిస్సు సేన్ గుప్తా, మకరందేశ్ పాండే, సన్యా ఠాకూర్, అభినవ్ గోమాటం ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Also Read : అమెరికాలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణకు అడ్డం పడిన తెలుగు కమ్యూనిటీ

టాప్ హెడ్ లైన్స్

Pradeep Rawat Passes Away: ప్రముఖ నటుడు ప్రదీప్‌ రావత్‌ కన్నుమూత.. తొలి సినిమాతోనే ఇండస్ట్రీలో గుర్తింపు
ప్రముఖ నటుడు ప్రదీప్‌ రావత్‌ కన్నుమూత.. తొలి సినిమాతోనే ఇండస్ట్రీలో గుర్తింపు
Vanda Devullu OTT: వంద దేవుళ్ళు ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది... Zee5లో విజయ్ ఆంటోనీ సినిమా స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
వంద దేవుళ్ళు ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది... Zee5లో విజయ్ ఆంటోనీ సినిమా స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Ichi Padeddam Song Lyrics: 'పళ్ళబురుసు'లో బారాత్ సాంగ్... ఇచ్చి పడేశారంతే... లిరిసిస్ట్ సురేష్ గంగుల ఏం రాశారంటే?
'పళ్ళబురుసు'లో బారాత్ సాంగ్... ఇచ్చి పడేశారంతే... లిరిసిస్ట్ సురేష్ గంగుల ఏం రాశారంటే?
Mary Rivera: 'స్పైడర్ మ్యాన్' నటి మృతి... మూడున్నర నెలల తర్వాత వెలుగులోకి
'స్పైడర్ మ్యాన్' నటి మృతి... మూడున్నర నెలల తర్వాత వెలుగులోకి

వీడియోలు

Jaya Chiravuri Serials and US Life | జయ చిరవూరి రోజుకి ఎంత సంపాదిస్తుందో తెలుసా?
Changes In Team India Support Staff | టీమిండియా సపోర్ట్ స్టాఫ్‌పై బిసిసిఐ వేటు
India Fielding Coach T Dilip Emotional Post | ఫీల్డింగ్ కోచ్‌గా ముగిసిన దిలీప్ ప్రయాణం
Virat Kohli World Record | వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసిన విరాట్ కోహ్లీ
Bumrah Ruled Out Of Test Series | శ్రీలంక టెస్ట్ సిరీస్‌ నుంచి బుమ్రా అవుట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Cabinet Expansion 2026: కర్ణాటక కేబినెట్ అలకల సీన్‌తో రేవంత్ రెడ్డి ప్లాన్ బీ - తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై కొత్త వ్యూహం!?
2026: కర్ణాటక కేబినెట్ అలకల సీన్‌తో రేవంత్ రెడ్డి ప్లాన్ బీ - తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై కొత్త వ్యూహం!?
The Story of Vizag Old Airport : విశాఖ నుంచి చివరి కమర్శియల్ ఫ్లైట్ -
విశాఖ నుంచి చివరి కమర్శియల్ ఫ్లైట్ - "INS డేగ" ఇక జ్ఞాపకమేనా !!
Supreme Court On Vehicle Insurance:బీమా లేని వాహనాలకు పెట్రోల్‌ బంకుల్లో నో పెట్రోల్‌, భారీ జరిమానాలు! కేంద్రానికి సుప్రీంకోర్టు సంచలన ప్రతిపాదన!
బీమా లేని వాహనాలకు పెట్రోల్‌ బంకుల్లో నో పెట్రోల్‌, భారీ జరిమానాలు! కేంద్రానికి సుప్రీంకోర్టు సంచలన ప్రతిపాదన!
Udhayanidhi Stalin: నా అరెస్ట్ పెద్ద కామెడీ- ఎవరికీ భయపడను, మళ్లీ మళ్లీ మాట్లాడతాను: ఉదయనిధి స్టాలిన్
నా అరెస్ట్ పెద్ద కామెడీ- ఎవరికీ భయపడను, మళ్లీ మళ్లీ మాట్లాడతాను: ఉదయనిధి స్టాలిన్
Telangana Police Vehicle Rapido: పోలీసు వాహనాన్ని ర్యాపిడో బైక్‌గా వాడేస్తున్నారు - సోషల్ మీడియాలో వీడియో వైరల్.. విచారణకు ఆదేశం!
పోలీసు వాహనాన్ని ర్యాపిడో బైక్‌గా వాడేస్తున్నారు - సోషల్ మీడియాలో వీడియో వైరల్.. విచారణకు ఆదేశం!
మయామి 'లాంజెవిటీ' పెంట్‌హౌస్: ఆయుష్షును పెంచుతుందా? వాస్తు ఏం చెబుతోంది?
మయామి 'లాంజెవిటీ' పెంట్‌హౌస్: ఆయుష్షును పెంచుతుందా? వాస్తు ఏం చెబుతోంది?
Khanapur MLA Wedma Bojju: ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు హెచ్చరికతో దిగొచ్చిన ఫారెస్ట్ అధికారులు - రేంజ్ ఆఫీసర్ సస్పెన్షన్ -జన్నారంలో సడలిన ఉద్రిక్తత!!
ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు హెచ్చరికతో దిగొచ్చిన ఫారెస్ట్ అధికారులు - రేంజ్ ఆఫీసర్ సస్పెన్షన్ -జన్నారంలో సడలిన ఉద్రిక్తత!!
AP High Court Rejects CBI Probe on Mega DSC: మెగా డీఎస్సీపై వైఎస్సార్‌సీపీకి హైకోర్టు షాక్ - సీబీఐ విచారణకు నిరాకరణ - పిల్ వ్యవస్థను రాజకీయం చేయొద్దని ఘాటు వ్యాఖ్యలు!
మెగా డీఎస్సీపై వైఎస్సార్‌సీపీకి హైకోర్టు షాక్ - సీబీఐ విచారణకు నిరాకరణ - పిల్ వ్యవస్థను రాజకీయం చేయొద్దని ఘాటు వ్యాఖ్యలు!
Embed widget