Niharika NM: అప్పుడు మహేష్ వెంట పడింది... ఇప్పుడు హాలీవుడ్ హీరో దగ్గరకు వెళ్ళింది
Niharika NM - Tom Cruise: సోషల్ మీడియా నుంచి సౌత్ సినిమాల్లో హీరోయిన్‌గా చేసే వరకు ఎదిగిన అమ్మాయి నిహారికా ఎన్ఎం. ఇప్పుడు ఆమె ఏకంగా టామ్ క్రూజ్ సినిమా ప్రీమియర్‌కు వెళ్ళింది.

సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే నెటిజనులకు నిహారికా ఎన్ఎం (Niharika NM) తెలిసే ఉంటుంది. కంటెంట్ క్రియేటర్‌గా ఆవిడ చేసిన వీడియోలు చాలా అంటే చాలా పాపులర్. సోషల్ మీడియా వీడియోస్ నుంచి సినిమాలు ప్రమోట్ చేసే ఇన్‌ఫ్లూయెన్స్‌గా ఎదిగారు.
'మేజర్' సినిమా రిలీజ్ టైంలో నిహారిక ఎన్ఎం చేసిన ప్రమోషనల్ వీడియో వైరల్ అయ్యింది. మూవీ టికెట్స్ కోసం క్యూలో నిలబడిన టైంలో అడివి శేష్ వస్తే ఆమె తిడుతుంది. తర్వాత మహేష్ బాబు వస్తే లైన్ ఇస్తుంది. ఆయన ఫోన్ నంబర్ కోసం వెంట పడే అమ్మాయిగా కనిపించింది. దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ టైపు ప్రమోషనల్ వీడియోలు కొన్ని చేశారు నిహారిక. ఆల్రెడీ తమిళ సినిమాల్లో యాక్ట్ చేశారు. ఇప్పుడు తెలుగు సినిమాలు చేస్తున్నారు. లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే...
హాలీవుడ్ టాప్ స్టార్ టామ్ క్రూజ్ (Tom Cruise) హీరోగా రూపొందిన లేటెస్ట్ యాక్షన్ ఫిల్మ్ 'మిషన్ ఇంపాజిబుల్: ది ఫైనల్ రికనింగ్' (Mission Impossible The Final Reckoning). ఈ సినిమా వరల్డ్ ప్రీమియర్ షోకి నిహారికా ఎన్ఎం అటెండ్ అయ్యారు. అంతే కాదు... టామ్ క్రూజ్‌తో కలిసి ఫోటోలు దిగారు. తన సోషల్ మీడియా అకౌంటులో షేర్ చేశారు. అది వైరల్ అయ్యింది.
Also Read: మిస్టిక్ థ్రిల్లర్ 'వృష కర్మ'లో హీరో నాగ చైతన్య రోల్ తెలుసా... హీరోయిన్ మీనాక్షి చౌదరి రోల్ ఏమిటంటే?
View this post on Instagram
ఇండియన్ ఆడియన్స్, టాలీవుడ్ హీరోయిన్లతో పాటు చాలా మంది స్టార్ హీరోస్ పిల్లలు టామ్ క్రూజ్‌తో నీహారికా ఎన్ఎం తీసుకున్న వీడియోను లైక్ చేయడంతో పాటు కామెంట్లు చేస్తున్నారు. దాంతో నిహారిక ఎన్ఎం సోషల్ మీడియాలో మరోసారి వైరల్ అయ్యారు. మహేష్ బాబు వెంట పడినట్టు నటించిన అమ్మాయి టామ్ క్రూజ్ మూవీ ప్రీమియర్ వరకు వెళ్లడం గ్రేట్ కదూ!
Also Read: 'థగ్ లైఫ్' ట్రైలర్ రివ్యూ... షాక్ ఇచ్చిన త్రిష రోల్ - కమల్ & శింబు రోల్స్ రివీల్ చేశారుగా
Luckiest Girl 🤌 https://t.co/M7TObagKzl pic.twitter.com/TV8B4LAAMN
— Ethan Hunt (@NameisAvinashJ) May 16, 2025





















