Bad Girlz: కత్తి పట్టి బెదిరించి రాయించిన పాట... నీలి నీలి ఆకాశానికి సీక్వెల్... 'బ్యాడ్ గాళ్స్'లో సాంగ్ విన్నారా?
Neeli Neeli Aakasam Song Sequel: మున్నా దర్శకత్వం వహించిన '30 రోజుల్లో ప్రేమించడం ఎలా?'లో 'నీలి నీలి ఆకాశం...' ఎంత పెద్ద హిట్ అయ్యిందో తెలిసిందే. ఆ సాంగ్ సీక్వెల్ 'ఇలా చూసుకుంటానే...'ను విడుదల చేశారు.

యాంకర్ ప్రదీప్ మాచిరాజు కథానాయకుడిగా మున్నా దర్శకత్వం వహించిన '30 రోజుల్లో ప్రేమించడం ఎలా' విజయం సాధించింది. ఆ సినిమాలోని 'నీలి నీలి ఆకాశం' అంత పదింతలు విజయం సాధించింది. ఇప్పుడు ఆ పాటకు సీక్వెల్ వచ్చింది. 'నీలి నీలి ఆకాశం...' రాసిన ఆస్కార్ విన్నర్ చంద్రబోస్ చేత కొత్త పాట 'ఇలా చూసుకుంటానే' కూడా రాయించారు. 'నీలి నీలి ఆకాశం...'కు మంచి బాణీ అందించిన అనూప్ రూబెన్స్, ఆ పాట పాడిన సిద్ శ్రీరామ్ మరోసారి ఈ కొత్త పాటకు పని చేశారు.
కత్తి పట్టి బెదిరించి మరీ రాయించిన పాట...
నీలి నీలి ఆకాశానికి సీక్వెల్ ఎలా ఉందో విన్నారా?
'30 రోజుల్లో ప్రేమించడం ఎలా'తో దర్శకుడు మున్నా ధులిపూడిమంచి విజయాన్ని అందుకున్నారు. ఆయన దర్శకత్వంలో వస్తున్న తాజా సినిమా 'బ్యాడ్ గాళ్స్'. కానీ చాలా మంచోళ్లు... ఉపశీర్షిక. ఈ సినిమాలో అంచల్ గౌడ, పాయల్ చెంగప్ప, రోషిణి, యష్ణ, రోహన్ సూర్య, మొయిన్ ముఖ్య తారాగణం. నీలి నీలి ఆకాశం క్రియేషన్స్, ప్రశ్విత ఎంటర్‌టైన్‌మెంట్, ఎన్‌వీఎల్ క్రియేషన్స్ సంస్థలపై శశిధర్ నల్ల, ఇమ్మడి సోమ నర్సయ్య, రామిశెట్టి రాంబాబు, రావుల రమేష్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
చంద్రబోస్ చేత పట్టుబట్టి మరీ నీలి నీలి ఆకాశం పాటకు సీక్వెల్ కావాలని అంటూ కత్తి పట్టి బెదిరించి మరీ 'ఇలా చూసుకుంటానే' పాటను రాయించారు దర్శకుడు మున్నా. ఈ పాటను రానా దగ్గుబాటి తన సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా విడుదల చేశారు.
Also Read: పవన్ కళ్యాణ్ ఇంట్రడక్షన్ వీడియో... ఫ్రీగా హరిహర వీరమల్లు ఫస్ట్ ఫైట్ చూడొచ్చు... లింక్ క్లిక్ చేయండి
'ఇలా చూసుకుంటానే...' పాట విడుదలైన సందర్భంగా దర్శక నిర్మాతలు మాట్లాడుతూ... ''మా 'బ్యాడ్ గాళ్స్'లో మొదటి పాట విడుదల చేసిన రానా దగ్గుబాటి గారికి థాంక్స్. ఇదొక అద్భుతమైన మెలోడీ పాట. 'నీలి నీలి ఆకాశం...' కంటే గొప్పగా ఉంటుందీ పాట. దీనిని జమ్మూ కాశ్మీర్, మలేషియాలో షూట్ చేశాం. అనూప్ రూబెన్స్ సంగీతానికి సిద్ శ్రీరామ్ ప్రాణం పోశారు. చంద్రబోస్ గారు అద్భుతంగా రాశారు. ఇదొక ఫన్ ఫిల్మ్. యూత్, ఫ్యామిలీ ఆడియన్స్... అందరూ చూడొచ్చు. పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అని కార్యక్రమాలు పూర్తి చేసి త్వరలో చిత్రాన్ని విడుదల చేస్తాం'' అని చెప్పారు.
Bad Girlz Movie Cast And Crew: అంచల్ గౌడ, పాయల్ చెంగప్ప, రోషిణి, యష్ణ, రోహన్ సూర్య, మొయిన్ ప్రధాన పాత్రల్లో నటించిన 'బ్యాడ్ గాళ్స్' సినిమాకు ఛాయాగ్రహణం: ఆర్తి గణేష్, కూర్పు: బొంతల నాగేశ్వరరెడ్డి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: కెఎమ్ కుమార్, సంగీతం: అనూప్ రూబెన్స్, సాహిత్యం: ఆస్కార్ విన్నర్ చంద్ర బోస్, నిర్మాణ సంస్థ: ప్రశ్విత ఎంటర్‌టైన్‌మెంట్ - నీలి నీలి ఆకాశం క్రియేషన్స్ - ఎన్‌వీఎల్ క్రియేషన్స్, నిర్మాతలు: శశిధర్ నల్ల - ఇమ్మడి సోమ నర్సయ్య - రామిశెట్టి రాంబాబు - రావుల రమేష్, దర్శకుడు: మున్నా ధులిపూడి.
Also Read: పరదా వర్సెస్ శుభం కలెక్షన్లు... ఓపెనింగ్ డే రిజల్ట్ క్లియర్... సమంత క్రేజ్ ముందు అనుపమ వెలవెల!





















