అన్వేషించండి

Nayanthara: ‘జవాన్’ కంటే ముందే షారుఖ్‌తో నటించేందుకు నయన్‌కు అవకాశం - ఆ కారణంతోనే రిజక్ట్ చేసిందా?

‘జవాన్’ కంటే ముందు షారుఖ్ హీరోగా నటించిన ‘చెన్నై ఎక్స్‌ప్రెస్’లో కూడా నయన్‌కు ఛాన్స్ అందిందట. కానీ అది దీపికా పదుకొనె రోల్‌కు కాదు. స్టోరీలో అసలైన ట్విస్ట్ ఇదే.

నటీనటులకు ఇండస్ట్రీలోకి రాకముందు మాత్రమే కాదు.. వచ్చిన తర్వాత కూడా కొన్ని పాలసీలు ఉంటాయి. ఆ పాలసీలకు తగినట్టుగానే సినిమాలు, పాత్రలు ఎంపిక చేసుకుంటారు. అందుకే సౌత్‌లో ఎన్ని సినిమాలు చేసినా కూడా బాలీవుడ్‌లో అడుగుపెట్టడానికి ఇప్పటివరకు ఇష్టపడలేదు నయనతార. ఇప్పటివరకు తనకు బాలీవుడ్‌లో ఎన్ని ఆఫర్లు వచ్చినా.. రిజెక్ట్ చేస్తూ వచ్చిన నయనతార.. ‘జవాన్’తో గ్రాండ్ డెబ్యూ ఇచ్చింది. అయితే ఇంతకు ముందు కూడా షారుఖ్ సినిమాలో నయనతారకు ఛాన్స్ వచ్చిందట. కానీ అప్పట్లో పలు పర్సనల్ కారణాల వల్ల ఆ ఛాన్స్‌ను నయన్ రిజెక్ట్ చేసిందని వార్తలు వినిపిస్తున్నాయి. 

‘జవాన్’కంటే ముందు ‘చెన్నై ఎక్స్‌ప్రెస్’లో..
మామూలుగా సౌత్‌లో హీరోయిన్‌గా డెబ్యూ చేసిన తర్వాత.. హిందీ నుంచి ఛాన్సులు వస్తే క్షణం కూడా ఆలోచించకుండా గ్రీన్ సిగ్నల్ ఇస్తారు చాలామంది నటీమణులు. కానీ నయనతార మాత్రం డిఫరెంట్. సౌత్‌లో లేడీ సూపర్‌స్టార్ లాంటి క్రేజ్‌ను కూడా సంపాదించుకుంది నయనతార.. అయినా కూడా బాలీవుడ్ నుంచి ఆఫర్లను సంపాదించుకోవాలని ఎప్పుడూ ఆలోచించలేదు. ఇన్నేళ్లు ఎదురుచూసినందుకు ‘జవాన్’తో తనకు కావాల్సిన సక్సెస్‌ను అందుకుంది. అయితే ‘జవాన్’ కంటే ముందు షారుఖ్ హీరోగా నటించిన ‘చెన్నై ఎక్స్‌ప్రెస్’లో కూడా నయన్‌కు ఛాన్స్ అందిందట. కానీ అది దీపికా పదుకొనె రోల్‌కు కాదు. స్టోరీలో అసలైన ట్విస్ట్ ఇదే.

ప్రభుదేవాతో బ్రేకపే కారణం..
2013లో రోహిత్ శెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన ‘చెన్నై ఎక్స్‌ప్రెస్’.. నార్త్‌లోనే కాదు.. సౌత్‌లో కూడా పెద్ద హిట్‌గా నిలిచింది. ఈ మూవీలో దీపికా పదుకొనె హీరోయిన్‌గా నటించగా.. ప్రియమణి ఒక స్పెషల్ సాంగ్‌లో కనిపించింది. ‘1234’ అంటూ ప్రియమణి వేసిన స్టెప్పులు బాలీవుడ్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. ముందుగా ఆ సాంగ్‌కు షారుఖ్‌తో కలిసి స్టెప్పులేసే ఛాన్స్.. నయనతారకు వచ్చిందట. అది కేవలం ఐటెమ్ సాంగ్ కావడంతో నయనతార రిజెక్ట్ చేసిందని అందరూ అనుకున్నారు. కానీ అసలు కారణం వేరే ఉందట. ‘1234’లో సాంగ్‌కు రాజు సుందరం.. డ్యాన్స్ మాస్టర్‌గా వ్యవహరించారు. రాజు సుందరం.. ప్రభుదేవ సోదరుడు. అప్పట్లో నయనతార, ప్రభుదేవా రిలేషన్‌లో ఉన్నారన్న విషయంలో అందరికీ తెలిసిందే. ‘చెన్నై ఎక్స్‌ప్రెస్’ సినిమా సమయంలోనే నయన్, ప్రభుదేవా విడిపోయారు. అలా విడిపోయిన వెంటనే ప్రభుదేవా సోదరుడితో కలిసి పనిచేయడం నయన్‌కు ఇష్టం లేక.. ఆ ఛాన్స్‌ను రిజెక్ట్ చేసిందని సమాచారం.

సినిమా కాదు.. పండగ..
సెప్టెంబర్ 7న విడుదలయిన ‘జవాన్’ స్పెషల్ స్క్రీనింగ్‌లో నయనతార.. తన భర్త విగ్నేష్ శివన్‌తో కలిసి పాల్గొన్నది. ఆ స్క్రీనింగ్ అయిన తర్వాత ముంబాయ్ ఎయిర్‌పోర్టులో భర్తతో కలిసి కనిపించింది. అక్కడ ఉన్న మీడియా అంతా ‘జవాన్’ సినిమాను, అందులో తన పాత్రను తెగ ప్రశంసించారు. అంతే కాకుండా ‘జవాన్ సినిమా కాదు అది ఒక పండగ’ అన్న ప్రశంసను విన్న నయనతార.. మురిసిపోయింది. ముఖ్యంగా ‘జవాన్’ కోసం ఇన్‌స్టాగ్రామ్‌లో అకౌంట్ కూడా క్రియేట్ చేసుకుంది నయన్. ఇన్‌స్టాగ్రామ్‌లోకి ఎంటర్ అయిన కొన్నిరోజులకే 3.6 మిలియన్ ఫాలోవర్స్‌ను సొంతం చేసుకుంది. ఇటీవల దర్శకుడు అట్లీతో కలిసి ముంబాయ్‌లోని గేటీ గ్యాలక్సీ సినిమాకు సర్‌ప్రైజ్ విజిట్‌కు వెళ్లింది నయనతార.

Also Read: నా హెల్త్ కండీషన్ చాలా క్రిటికల్ గా ఉంది- షాకింగ్ న్యూస్ చెప్పిన గాయత్రి గుప్త

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

టాప్ హెడ్ లైన్స్

Objection My Lord Web Series Review - 'అబ్జెక్షన్ మై లార్డ్' రివ్యూ: శ్రీకాంత్ vs ముఖేష్ రుషి - Zee5 ఓటీటీలో కోర్టు రూమ్ సిరీస్ ఎలా ఉందంటే?
'అబ్జెక్షన్ మై లార్డ్' రివ్యూ: శ్రీకాంత్ vs ముఖేష్ రుషి - Zee5 ఓటీటీలో కోర్టు రూమ్ సిరీస్ ఎలా ఉందంటే?
Crime Thriller OTT : గ్రామంలో దారుణ హత్యలు... సైకో కిల్లర్ మిస్టరీ - ఓటీటీలో ట్రెండింగ్ థ్రిల్లర్... తెలుగులోనూ స్ట్రీమింగ్
గ్రామంలో దారుణ హత్యలు... సైకో కిల్లర్ మిస్టరీ - ఓటీటీలో ట్రెండింగ్ థ్రిల్లర్... తెలుగులోనూ స్ట్రీమింగ్
Surekha vani : మీ అమ్మాయి మీకు సెకండ్ మ్యారేజ్ చేస్తానన్నారు? - సురేఖా వాణి ఏం చెప్పారంటే?
మీ అమ్మాయి మీకు సెకండ్ మ్యారేజ్ చేస్తానన్నారు? - సురేఖా వాణి ఏం చెప్పారంటే?
Ram Gopal Varma : ఊర్మిళతో వర్మ పెళ్లి? - RGV బండారం బయటపెట్టిన చిరంజీవి!?
ఊర్మిళతో వర్మ పెళ్లి? - RGV బండారం బయటపెట్టిన చిరంజీవి!?

వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Visakhapatnam Trolley Bag Murder : పెళ్లి చేసుకోమంటుందని చంపేసి ట్రాలీ బ్యాగ్‌లో కుక్కేసి పక్క రాష్ట్రంలో పడేశాడు - విశాఖలో దారుణం!
పెళ్లి చేసుకోమంటుందని చంపేసి ట్రాలీ బ్యాగ్‌లో కుక్కేసి పక్క రాష్ట్రంలో పడేశాడు - విశాఖలో దారుణం!
Ram Gopal Varma : ఊర్మిళతో వర్మ పెళ్లి? - RGV బండారం బయటపెట్టిన చిరంజీవి!?
ఊర్మిళతో వర్మ పెళ్లి? - RGV బండారం బయటపెట్టిన చిరంజీవి!?
Vizag Dhimsa Dance Guinness Record: చరిత్ర సృష్టించిన గిరిజన సాంస్కృతిక వైభవం - 13 వేల మందితో థింసా డ్యాన్స్.. గిన్నిస్ వరల్డ్ రికార్డు కైవసం!
చరిత్ర సృష్టించిన గిరిజన సాంస్కృతిక వైభవం - 13 వేల మందితో థింసా డ్యాన్స్.. గిన్నిస్ వరల్డ్ రికార్డు కైవసం!
"మావిగన్" కి పోటీగా "అవిగన్" చంద్రబాబు మనసులో ఏముంది
Price Hike August 2026: ఆగస్టు నుంచి ధరలు పెరిగే వస్తువులు, ధరలు తగ్గే వస్తువులు ఇవే! 
ఆగస్టు నుంచి ధరలు పెరిగే వస్తువులు, ధరలు తగ్గే వస్తువులు ఇవే! 
Breaking News:రిటైర్మెంట్‌ రోజే ఆంధ్ర యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొ.ప్రసాద్‌రెడ్డి సస్పెండ్!
రిటైర్మెంట్‌ రోజే ఆంధ్ర యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొ.ప్రసాద్‌రెడ్డి సస్పెండ్!
Surekha vani : మీ అమ్మాయి మీకు సెకండ్ మ్యారేజ్ చేస్తానన్నారు? - సురేఖా వాణి ఏం చెప్పారంటే?
మీ అమ్మాయి మీకు సెకండ్ మ్యారేజ్ చేస్తానన్నారు? - సురేఖా వాణి ఏం చెప్పారంటే?
Panchadarla Land Issue: పంచదార్ల కొండలో అక్రమ మైనింగ్‌పై ప్రభుత్వం సీరియస్‌- అనకాపల్లి అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సస్పెండ్‌
పంచదార్ల కొండలో అక్రమ మైనింగ్‌పై ప్రభుత్వం సీరియస్‌- అనకాపల్లి అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సస్పెండ్‌
Embed widget