అన్వేషించండి

అనుష్కతో కలిసి నటిస్తానని చిన్నప్పుడే కల వచ్చింది - అది ఇప్పుడు నిజమైంది: నవీన్ పొలిశెట్టి

'మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి' టీం సోమవారం రోజు విశాఖలో సందడి చేశారు. అక్కడ ఓ ప్రముఖ హోటల్లో మూవీ టీం మీడియా సమావేశం నిర్వహించగా.. ఈ సమావేశంలో నవీన్ పొలిశెట్టి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నవీన్ పోలిశెట్టి, అనుష్క జంటగా నటిస్తున్న తాజా చిత్రం 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి'. UV క్రియేషన్స్ నిర్మాణంలో మహేష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం సెప్టెంబర్ 7న తెలుగుతోపాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదలవుతోంది. రిలీజ్ అయిన దగ్గర పడటంతో మూవీ టీం ప్రమోషన్స్ వేగం పెంచారు. ఇందులో భాగంగా ఇప్పటికే ఇంటర్వ్యూస్ తో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రధాన నగరాలకు వెళ్లి చిత్ర బృందం ప్రమోషన్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే సోమవారం రోజు మూవీ యూనిట్ విశాఖలో సందడి చేశారు. విశాఖపట్నంలోని హోటల్ గ్రీన్ పార్క్ లో మీడియా సమావేశాన్ని నిర్వహించారు.

ఈ సమావేశంలో హీరో నవీన్ పోలిశెట్టి మాట్లాడుతూ.. "ఇప్పటికే రిలీజ్ చేసిన ట్రైలర్, ప్రోమోస్ కి మంచి రెస్పాన్స్ రావడం ఎంతో సంతోషంగా ఉంది. సినిమాలో నేను స్టాండ్ అప్ కామెడీ పాత్ర చేశాను. నెల్లూరు, విజయవాడ, గుంటూరు జిల్లాల్లో మూవీ ప్రమోషన్ వర్క్ ఇప్పటికే ఫినిష్ చేశాం. విశాఖపట్నంలో ప్రమోషన్ లో భాగంగా CMR షాపింగ్ మాల్ లో ఈవెంట్, ఆర్కే బీచ్ ప్రాంతాల్లో చేసిన ప్రమోషన్ కు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇంకా కాకినాడ, వరంగల్, రాజమండ్రి ప్రాంతాల్లో ప్రమోషన్ వర్క్ ఉంది. మా డైరెక్టర్ మహేష్ కూడా విశాఖపట్నంకి చెందినవాడే. సినిమాలో అనుష్క నుంచి డబుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ఇది ఫ్యామిలీ అంతా కలిసి చూసే సినిమా. కృష్ణాష్టమి పండుగ రోజు విడుదలై అందర్నీ అలరిస్తుంది. నాకు హీరో ప్రభాస్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవాలని ఎప్పటినుంచో ఉంది. ఇక హీరోయిన్ అనుష్కతో కలిసి సినిమా చేస్తానని చిన్నప్పుడు  కల కూడా వచ్చింది. ఇప్పుడు ఆ కల నిజమైంది" అని అన్నారు నవీన్ పోలిశెట్టి.

అనంతరం దర్శకుడు మహేష్ మాట్లాడుతూ.. "వైజాగ్ కి చెందిన వాడిగా ఇక్కడ సినిమా ప్రమోషన్ కోసం రావడం సంతోషంగా ఉంది. హీరో నవీన్ పోలిశెట్టి ఎనర్జీ చూపించే సినిమా ఇది. మంచి కంటెంట్ ఉన్న సినిమాలకు మన వైజాగ్ లో మంచి ఆదరణ ఉంటుంది. పెళ్లి కాకుండా గర్భిణీ అవ్వాలి అనుకునే అమ్మాయి, ఆమెకు సహకరించిన అబ్బాయి కథే ఈ సినిమా. కథ డిమాండ్ ప్రకారం ఈ సినిమా హైదరాబాద్, లండన్ నగరాల్లో షూటింగ్ చేశాం. అనుష్క మధ్యలో 25 కథలు విన్నా సరే నా కథ విని సినిమా అంగీకరించడం ఎంతో సంతోషంగా ఉంది. నిర్మాతలు, వంశీ ప్రమోద్ మంచి సినిమా చేశారు" అంటూడైరెక్టర్ మహేష్ చెప్పుకొచ్చాడు.

కాగా ఇప్పటికే విడుదలైన ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. చాలా గ్యాప్ తర్వాత అనుష్క నటిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా కోసం ఆడియన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అనుష్క చివరగా 2020లో 'నిశ్శబ్దం' అనే సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చింది. కానీ ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. మళ్లీ మూడేళ్ల విరామం తర్వాత అనుష్క నటిస్తున్న 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' ఆమెకి ఎలాంటి సక్సెస్ అందిస్తుందో చూడాలి.

Also Read : 'చూడాలని ఉంది' మూవీకి ముందుగా వేరే టైటిల్ అనుకున్నాం, కానీ చిరంజీవి అలా చేశారు: గుణశేఖర్

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

టాప్ హెడ్ లైన్స్

Vishnu Priya Bhimeneni: సబ్‌స్క్రిప్షన్ రేటు తగ్గించేది లేదు... వెళ్ళి చదువుకోమ్మా - విష్ణుప్రియ కామెంట్స్ వైరల్
సబ్‌స్క్రిప్షన్ రేటు తగ్గించేది లేదు... వెళ్ళి చదువుకోమ్మా - విష్ణుప్రియ కామెంట్స్ వైరల్
Arya: హైదరాబాద్‌లో ఆర్యపై క్రిమినల్ కేసు... ఫైనాన్షియల్ ఇష్యూలో తమిళ హీరో?
హైదరాబాద్‌లో ఆర్యపై క్రిమినల్ కేసు... ఫైనాన్షియల్ ఇష్యూలో తమిళ హీరో?
Lenin Box Office Collection Day 2: 'లెనిన్' కలెక్షన్స్ పెరిగాయ్... రెండో రోజు బాక్సాఫీస్ దుమ్ము దులిపిన అఖిల్
'లెనిన్' కలెక్షన్స్ పెరిగాయ్... రెండో రోజు బాక్సాఫీస్ దుమ్ము దులిపిన అఖిల్
Tribute To Singer S Janaki: సింగర్ ఎస్. జానకి మృతి పట్ల ఏపీ, తెలంగాణ సీఎంలు సహా ప్రముఖులు దిగ్భ్రాంతి
సింగర్ ఎస్. జానకి మృతి పట్ల ఏపీ, తెలంగాణ సీఎంలు సహా ప్రముఖులు దిగ్భ్రాంతి

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mancherial Police Operation: మంచిర్యాలలో అర్ధరాత్రి పోలీసుల భారీ సెర్చ్ ఆపరేషన్: 171 వాహనాలు, అక్రమ మద్యం స్వాధీనం
మంచిర్యాలలో అర్ధరాత్రి పోలీసుల భారీ సెర్చ్ ఆపరేషన్: 171 వాహనాలు, అక్రమ మద్యం స్వాధీనం
POCSO Case: కుషాయిగూడలో ఇద్దరు బాలికల మిస్సింగ్ కేసు సుఖాంతం.. బంధువైన యువకుడి అరెస్ట్, పోక్సో కేసు
కుషాయిగూడలో ఇద్దరు బాలికల మిస్సింగ్ కేసు సుఖాంతం.. బంధువైన యువకుడి అరెస్ట్, POCSO కేసు
Hyderabad Crime News: హైదరాబాద్‌లోని వనస్థలిపురంలో వ్యక్తి దారుణహత్య కలకలం!
Hyderabad Crime News: హైదరాబాద్‌లోని వనస్థలిపురంలో వ్యక్తి దారుణహత్య కలకలం!
Shabad Mass Killing News: ఆరు హత్యల ఘటనలో షాబాద్ సీఐ సస్పెండ్..! నిందితుడ్ని పట్టిస్తే రూ.2 లక్షల బహుమతి
ఆరు హత్యల ఘటనలో షాబాద్ సీఐ సస్పెండ్..! నిందితుడ్ని పట్టిస్తే రూ.2 లక్షల బహుమతి
Vietnam Boat Tragedy: వియత్నాం బోటు ప్రమాదం.. మరణించిన 15 మంది భారతీయులు వీరే.. ఏపీ నుంచి ముగ్గురు
వియత్నాం బోటు ప్రమాదం.. మరణించిన 15 మంది భారతీయులు వీరే.. ఏపీ నుంచి ముగ్గురు
Arya: హైదరాబాద్‌లో ఆర్యపై క్రిమినల్ కేసు... ఫైనాన్షియల్ ఇష్యూలో తమిళ హీరో?
హైదరాబాద్‌లో ఆర్యపై క్రిమినల్ కేసు... ఫైనాన్షియల్ ఇష్యూలో తమిళ హీరో?
Tribute To Singer S Janaki: సింగర్ ఎస్. జానకి మృతి పట్ల ఏపీ, తెలంగాణ సీఎంలు సహా ప్రముఖులు దిగ్భ్రాంతి
సింగర్ ఎస్. జానకి మృతి పట్ల ఏపీ, తెలంగాణ సీఎంలు సహా ప్రముఖులు దిగ్భ్రాంతి
IND VS ENG 5th T20 Result Update: క‌థ మార‌లేదు.. ఐదో టీ20లోనూ టీమిండియా ఘోర ప‌రాజ‌యం.. 4-0తో ఇంగ్లాండ్ క్లీన్ స్వీప్..  
క‌థ మార‌లేదు.. ఐదో టీ20లోనూ టీమిండియా ఘోర ప‌రాజ‌యం.. 4-0తో ఇంగ్లాండ్ క్లీన్ స్వీప్..  రాణించిన ఇషాన్, తిలక్
Embed widget