అన్వేషించండి

Nani: ఆ షోకు రమ్మన్నా వెళ్లలేదు, ‘కాఫీ విత్‌ కరణ్‌’ పై నాని షాకింగ్ కామెంట్స్

పాపులర్ షో ‘కాఫీ విత్ కరణ్’పై టాలీవుడ్ స్టార్ హీరో నాని కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ షోకు రమ్మని ఆహ్వానం వచ్చినా వెళ్లలేదని చెప్పారు.

గత కొంతకాలంగా సినీ అభిమానులను బాగా అలరిస్తున్న షో ‘కాఫీ విత్ కరణ్’. ఈ షోకు సౌత్, నార్త్ అనే తేడా లేకుండా అన్ని సినిమా పరిశ్రమలకు సంబంధించిన నటీ నటులను ఆహ్వానిస్తున్నారు నిర్వహకులు. తెలుగు నుంచి కూడా పలువురు స్టార్స్  పాల్గొన్నారు. హోస్ట్ కరణ్ అడిగే ప్రశ్నలు ఆడియెన్స్ ను బాగా అలరిస్తాయి. సెలబ్రిటీలు చెప్పే వ్యక్తిగత విషయాలతో పాటు  సినీ కెరీర్ కు సంబంధించిన అంశాలు అందరిలోనూ ఆసక్తి కలిగిస్తాయి. ఇప్పటి వరకు ఈ షో 7 సీజన్లను సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేసుకుంది. ప్రస్తుతం 8వ సీజన్ టెలీకాస్ట్ అవుతోంది. తాజా సీజన్ లో పాల్గొనాల్సిందిగా టాలీవుడ్ నేచురల్ స్టార్ నానికి ‘కాఫీ విత్ కరణ్’ షో నిర్వాహకులు ఆహ్వానం పంపించారట. కానీ, ఆయన రాలేనని చెప్పారట.

బాలీవుడ్ అడుగు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నా- నాని

వాస్తవానికి ఈ షోలో పాల్గొనాలని చాలా మంది నటీనటులు భావిస్తారు. ఈ షో తమ కెరీర్ కు మంచి బూస్టింగ్ ఇస్తుందని ఆశపడే వారు కూడా ఉన్నారు. ఈ షోలో పాల్గొంటే బాగా పాపులర్ కావడంతో పాటు నేషనల్ రేంజిలో గుర్తింపు దక్కుతుంది అనుకుంటారు. కానీ, ఆ షోలో పాల్గొనడం తనకు ఇష్టం లేదంటున్నారు నటుడు నాని. రీసెంట్ గా ఓ ఛానెల్ నిర్వహించిన చర్చలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా తన కెరీర్ కు సంబంధించిన పలు విషయాలను వెల్లడించారు. సౌత్ లో రాణిస్తున్న తాను బాలీవుడ్ లోనూ అడుగు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. ఇకపై తాను నటించే సౌత్ సినిమాలను బాలీవుడ్ లోనూ రిలీజ్ చేయాలని భావిస్తున్నట్లు వెల్లడించారు.   

ఆ షోలో పాల్గొనను- నాని

ఈ సందర్భంగా బాలీవుడ్ దర్శక, నిర్మాత కరణ్ జోహార్ గురించి కూడా నాని ప్రస్తావించారు. ఆయన తనకు ఫోన్ చేస్తుంటారని చెప్పారు. అయితే, ఆయనను కలిసే సందర్భం రాలేదన్నారు. వస్తే కచ్చితంగా కలుస్తానని చెప్పారు. కరణ్  హోస్ట్ చేసే షోలో పాల్గొంటారా? అనే ప్రశ్నకు నాని ఆసక్తికర సమాధానం చెప్పారు. “ఆయన కలిస్తే హ్యాపీగా సినిమా ముచ్చట్లు చెప్పుకుంటాను. కానీ, కెమెరా ముందు తనతో కలిసి మాట్లాడేది లేదు” అంటూ నవ్వారు. నిజానికి కరణ్ తన షోలో పాల్గొన్న గెస్టులకు సంబంధించిన కాంట్రవర్సీ విషయాలను ప్రస్తావిస్తారు. పాత విషయాలను మళ్లీ గుర్తు చేస్తుంటారు. అందుకే, ఆయన షోకు వెళ్లేందుకు చాలా మంది సెలబ్రిటీలు ఆసక్తి చూపించరు.  

డిసెంబర్ 7న ‘హాయ్ నాన్న’ విడుదల

అటు నాని ‘హాయ్ నాన్న’ సినిమాతో ప్రేక్షకుల ముందుక రాబోతున్నారు. నూతన దర్శకుడు శౌర్యువ్ తెరకెక్కిస్తున్న ఈ పాన్ ఇండియన్ మూవీలో హీరోయిన్ గా మృణాల్‌ ఠాకూర్ నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. వైరా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై మోహన్ చెరుకూరి, డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా బేబీ కియారా కన్నా ఇందులో నాని కుమార్తెగా కనిపించనుంది. హేషమ్ అబ్దుల్ వాహబ్ సంగీతం అందిస్తున్నారు. డిసెంబర్ 7న తెలుగు, హిందీ తమిళ కన్నడ మలయాళ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది.

Read Also: రష్మిక వేసుకునే డ్రెస్సులు, ఎక్స్‌పోజింగ్ కంటే పెద్దగా ఏమీ లేదు - ‘డీప్‌ఫేక్’పై మాధవీ లత కామెంట్స్

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

టాప్ హెడ్ లైన్స్

Allu Arjun On Chiranjeevi Birthday: కట్టె కాలే వరకు... చిరు బర్త్‌డేకు అల్లు అర్జున్ చేసిన ట్వీట్‌లో మీనింగ్ తెలుసా?
కట్టె కాలే వరకు... చిరు బర్త్‌డేకు అల్లు అర్జున్ చేసిన ట్వీట్‌లో మీనింగ్ తెలుసా?
Mugguru Kothulu: ముగ్గురు కోతులు ఫస్ట్ లుక్... ఫుల్ లెంగ్త్ కామెడీ సినిమా... కిటికీ లోనుంచి ఏం చూస్తున్నారు?
ముగ్గురు కోతులు ఫస్ట్ లుక్... ఫుల్ లెంగ్త్ కామెడీ సినిమా... కిటికీ లోనుంచి ఏం చూస్తున్నారు?
Naga Babu: భవిష్యత్ తరాలకు ప్రాణవాయువు ఇద్దాం... చిరు పుట్టినరోజున మొక్కలు నాటిన తమ్ముడు నాగబాబు
భవిష్యత్ తరాలకు ప్రాణవాయువు ఇద్దాం... చిరు పుట్టినరోజున మొక్కలు నాటిన తమ్ముడు నాగబాబు
Deepika Padukone : ప్రభాస్ స్పిరిట్ కాంట్రవర్సీపై దీపికా పదుకోన్ రియాక్షన్ - ఒక్క లైక్‌తో...
ప్రభాస్ స్పిరిట్ కాంట్రవర్సీపై దీపికా పదుకోన్ రియాక్షన్ - ఒక్క లైక్‌తో...

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Job Calendar: 10,060 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. ఏపీ జాబ్‌ క్యాలెండర్‌ వచ్చేసింది
10,060 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. ఏపీ జాబ్‌ క్యాలెండర్‌ వచ్చేసింది
CM Chandrababu: వచ్చే నెలలో అనకాపల్లి, విశాఖకు గోదావరి జలాలు! ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!
వచ్చే నెలలో అనకాపల్లి, విశాఖకు గోదావరి జలాలు! ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!
Veligonda Project: వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
Sheik Sadiq Khan Arrest: పంచాయతీరాజ్ ఏఈ కుటుంబ ఆత్మహత్య కేసులో కీలక ముందడుగు! ఢిల్లీలో చిక్కిన రైఫిల్ షూటింగ్ కోచ్‌ సాధిక్ ఖాన్!
పంచాయతీరాజ్ ఏఈ కుటుంబ ఆత్మహత్య కేసులో కీలక ముందడుగు! ఢిల్లీలో చిక్కిన రైఫిల్ షూటింగ్ కోచ్‌ సాధిక్ ఖాన్!
Lok Sabha Delimitation Freeze: డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
iPhone Crimes India: ఐఫోన్ మోజులో ముక్కలవుతున్న భారతీయ కుటుంబాలు! రోజురోజుకు పెరుగుతున్న హత్యలు, ఆత్మహత్యలు!
ఐఫోన్ మోజులో ముక్కలవుతున్న భారతీయ కుటుంబాలు! రోజురోజుకు పెరుగుతున్న హత్యలు, ఆత్మహత్యలు!
Revanth Reddy US Tour Cancellation : రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
Deepika Padukone : ప్రభాస్ స్పిరిట్ కాంట్రవర్సీపై దీపికా పదుకోన్ రియాక్షన్ - ఒక్క లైక్‌తో...
ప్రభాస్ స్పిరిట్ కాంట్రవర్సీపై దీపికా పదుకోన్ రియాక్షన్ - ఒక్క లైక్‌తో...
Embed widget