అన్వేషించండి

Mokshagna: ఎస్... మూవీస్ కోసమే ఆ లుక్ - ఇండస్ట్రీలోకి మోక్షజ్ఞ ఎంట్రీపై నారా రోహిత్

Nandamuri Mokshagna: నందమూరి నట వారసుడు మొక్షజ్ఞ ఎంట్రీ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆయన ఎంట్రీపై నారా రోహిత్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

Nara Rohith About Nandamuri Mokshagna Tollywood Entry: నందమూరి నట వారసుడు మోక్షజ్ఞ ఎంట్రీపై తాజాగా మరోసారి వార్తలు హల్చల్ చేసిన సంగతి తెలిసిందే. రీసెంట్‌గా ఓ ఫ్యామిలీ ఫంక్షన్‌లో ఆయన ట్రెడిషనల్ లుక్‌లో కనిపించగా వైరల్ అయ్యింది. డెబ్యూ మూవీ కోసం ఆయన ఆ లుక్ మెయింటెయిన్ చేస్తున్నారంటూ నందమూరి ఫ్యాన్స్‌తో పాటు నెటిజన్లు సైతం కామెంట్స్ చేశారు. తాజాగా మోక్షజ్ఞ రీసెంట్ లుక్‌పై నారా రోహిత్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. 

ఎస్... మూవీస్ కోసమే...

ఇండస్ట్రీలోకి వచ్చేందుకు నందమూరి వారసుడు మోక్షజ్ఞ చాలా ఉత్సాహం, ఆసక్తిగా ఉన్నారని నారా రోహిత్ తెలిపారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన... త్వరలోనే మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందని క్లారిటీ ఇచ్చారు. 'ఇటీవల మోక్షజ్ఞతో మాట్లాడినప్పుడు స్క్రిప్ట్ కోసం చూస్తున్నట్లు చెప్పాడు. ఓ ఫీల్ గుడ్ లవ్ స్టోరీ కోసం వెయిట్ చేస్తున్నట్లు తెలిపాడు. ఇండస్ట్రీకి రావడం కోసం మోక్షజ్ఞ ఎంతో ఆసక్తిగా ఉన్నాడు. గతంలో కంటే లుక్‌లో ఇప్పుడు చాలా మార్పు వచ్చింది. తాను కోరుకుంటున్నట్లు మంచి లవ్ స్టోరీ ఉంటే ఈ ఏడాదే ఎంట్రీ ఉండే ఛాన్స్ ఉంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ ఏడాది చివర్లో లేదా వచ్చే ఏడాది ప్రారంభంలో మోక్షజ్ఞ ఎంట్రీ ఇవ్వొచ్చు.' అని స్పష్టం చేశారు. 

Also Read: డిసప్పాయింట్ చేసినందుకు సారీ... 15 ఏళ్లు టైం ఉందిలెండి - ట్రోలర్స్‌కు ప్రొడ్యూసర్ నాగవంశీ స్ట్రాంగ్ కౌంటర్

గాడ్ ఆఫ్ మాసెస్ బాలయ్య తనయుడిగా మోక్షజ్ఞ ఎంట్రీ కోసం ఆయన ఫ్యాన్స్‌తో పాటు మూవీ లవర్స్ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గతంలో పూజా కార్యక్రమాల వరకూ వెళ్లిన ఆయన మూవీ కొన్ని కారణాలతో వాయిదా పడింది. 'హను మాన్' మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ప్రశాంత్ వర్మ ఈ మూవీని డైరెక్ట్ చేయబోతున్నారనే ప్రచారం సాగింది. మోక్షజ్ఞ హీరోగా 'ఆదిత్య 999' మూవీని తెరకెక్కిస్తారనే టాక్ వినిపించింది. అయితే, ప్రశాంత్ వర్మ వేరే ప్రాజెక్టుల్లో బిజీగా ఉండడంతో బాలయ్య పర్మిషన్ తీసుకుని మరీ... మోక్షజ్ఞను లాంచ్ చేయడానికి కాస్త టైం అడిగారట. ఈలోపు మోక్షజ్ఞ కూడా డ్యాన్స్, యాక్టింగ్ స్కిల్స్‌పై పూర్తిగా సంసిద్ధం కావడానికి టైం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీని వల్లే ఆ మూవీకి బ్రేక్ పడిందనే వార్తలు అప్పట్లో హల్చల్ చేశాయి.

తాజాగా మోక్షజ్ఞ కొత్త ట్రెడిషనల్ లుక్ వైరల్ కాగా... ఆయన ఎంట్రీ మళ్లీ హాట్ టాపిక్‌గా మారింది. తాజాగా నారా రోహిత్ మూవీస్ కోసమే ఆ లుక్ అంటూ క్లారిటీ ఇవ్వడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. త్వరలోనే సిల్వర్ స్క్రీన్‌పై యంగ్ లయన్‌ను చూడబోతున్నామంటూ కామెంట్స్ చేస్తున్నారు.

బాలయ్యతో మూవీపై నారా రోహిత్

దీంతో పాటే బాలకృష్ణతో మల్టీ స్టారర్‌పై నారా రోహిత్ తాజాగా ఇంటర్వ్యూలో స్పందించారు. కథ రెడీ అయ్యి ఇద్దరికీ లుక్ టెస్ట్ కూడా అయ్యిందని... అయితే, బాలయ్యకు వరుస సినిమాలు, ఎలక్షన్స్ ఉండడంతో ఆ ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదని చెప్పారు. 'బాలయ్య నటించిన మరో సినిమాలోనూ నేను గెస్ట్ రోల్ చేయాల్సి ఉంది. అది కూడా కొన్ని కారణాల వల్ల కుదరలేదు. భవిష్యత్తులో బాలయ్యతో కలిసి నటించే ఛాన్స్ వస్తే కచ్చితంగా చేస్తాను. ఆ రోజు కోసమే వెయిటింగ్.' అంటూ చెప్పారు. నారా రోహిత్ హీరోగా నటించిన లేటెస్ట్ ఫుల్ లెంగ్త్ లవ్ కామెడీ ఎంటర్టైనర్ 'సుందరకాండ' ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకు రానుంది.

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Pradeep Rawat Passes Away: ప్రముఖ నటుడు ప్రదీప్‌ రావత్‌ కన్నుమూత.. తొలి సినిమాతోనే ఇండస్ట్రీలో గుర్తింపు
ప్రముఖ నటుడు ప్రదీప్‌ రావత్‌ కన్నుమూత.. తొలి సినిమాతోనే ఇండస్ట్రీలో గుర్తింపు
Vanda Devullu OTT: వంద దేవుళ్ళు ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది... Zee5లో విజయ్ ఆంటోనీ సినిమా స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
వంద దేవుళ్ళు ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది... Zee5లో విజయ్ ఆంటోనీ సినిమా స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Ichi Padeddam Song Lyrics: 'పళ్ళబురుసు'లో బారాత్ సాంగ్... ఇచ్చి పడేశారంతే... లిరిసిస్ట్ సురేష్ గంగుల ఏం రాశారంటే?
'పళ్ళబురుసు'లో బారాత్ సాంగ్... ఇచ్చి పడేశారంతే... లిరిసిస్ట్ సురేష్ గంగుల ఏం రాశారంటే?
Mary Rivera: 'స్పైడర్ మ్యాన్' నటి మృతి... మూడున్నర నెలల తర్వాత వెలుగులోకి
'స్పైడర్ మ్యాన్' నటి మృతి... మూడున్నర నెలల తర్వాత వెలుగులోకి

వీడియోలు

Jaya Chiravuri Serials and US Life | జయ చిరవూరి రోజుకి ఎంత సంపాదిస్తుందో తెలుసా?
Changes In Team India Support Staff | టీమిండియా సపోర్ట్ స్టాఫ్‌పై బిసిసిఐ వేటు
India Fielding Coach T Dilip Emotional Post | ఫీల్డింగ్ కోచ్‌గా ముగిసిన దిలీప్ ప్రయాణం
Virat Kohli World Record | వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసిన విరాట్ కోహ్లీ
Bumrah Ruled Out Of Test Series | శ్రీలంక టెస్ట్ సిరీస్‌ నుంచి బుమ్రా అవుట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Udhayanidhi Stalin: నా అరెస్ట్ పెద్ద కామెడీ- ఎవరికీ భయపడను, మళ్లీ మళ్లీ మాట్లాడతాను: ఉదయనిధి స్టాలిన్
నా అరెస్ట్ పెద్ద కామెడీ- ఎవరికీ భయపడను, మళ్లీ మళ్లీ మాట్లాడతాను: ఉదయనిధి స్టాలిన్
Telangana Police Vehicle Rapido: పోలీసు వాహనాన్ని ర్యాపిడో బైక్‌గా వాడేస్తున్నారు - సోషల్ మీడియాలో వీడియో వైరల్.. విచారణకు ఆదేశం!
పోలీసు వాహనాన్ని ర్యాపిడో బైక్‌గా వాడేస్తున్నారు - సోషల్ మీడియాలో వీడియో వైరల్.. విచారణకు ఆదేశం!
Khanapur MLA Wedma Bojju: ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు హెచ్చరికతో దిగొచ్చిన ఫారెస్ట్ అధికారులు - రేంజ్ ఆఫీసర్ సస్పెన్షన్ -జన్నారంలో సడలిన ఉద్రిక్తత!!
ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు హెచ్చరికతో దిగొచ్చిన ఫారెస్ట్ అధికారులు - రేంజ్ ఆఫీసర్ సస్పెన్షన్ -జన్నారంలో సడలిన ఉద్రిక్తత!!
AP High Court Rejects CBI Probe on Mega DSC: మెగా డీఎస్సీపై వైఎస్సార్‌సీపీకి హైకోర్టు షాక్ - సీబీఐ విచారణకు నిరాకరణ - పిల్ వ్యవస్థను రాజకీయం చేయొద్దని ఘాటు వ్యాఖ్యలు!
మెగా డీఎస్సీపై వైఎస్సార్‌సీపీకి హైకోర్టు షాక్ - సీబీఐ విచారణకు నిరాకరణ - పిల్ వ్యవస్థను రాజకీయం చేయొద్దని ఘాటు వ్యాఖ్యలు!
Breastfeeding Diet : తల్లిపాలు ఇచ్చే సమయంలో అతిగా తినకూడదా? డైట్‌లో చేర్చుకోవాల్సిన, తీసేయాల్సిన ఫుడ్స్ ఇవే
తల్లిపాలు ఇచ్చే సమయంలో అతిగా తినకూడదా? డైట్‌లో చేర్చుకోవాల్సిన, తీసేయాల్సిన ఫుడ్స్ ఇవే
Harish Rao Black Magic Row: క్షుద్ర పూజల ఆరోపణలతో తెలంగాణ రాజకీయాల్లో కలకలం -కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మొదలైన అరుంధతి, పశుపతి వివాదం!
క్షుద్ర పూజల ఆరోపణలతో తెలంగాణ రాజకీయాల్లో కలకలం -కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మొదలైన అరుంధతి, పశుపతి వివాదం!
Crop Insurance Scheme: రూ. 84 చెల్లించి, నిశ్చింతగా ఉండండి.. ఏపీ రైతులకు ప్రభుత్వం కీలక సూచనలు
రూ. 84 చెల్లించి, నిశ్చింతగా ఉండండి.. ఏపీ రైతులకు ప్రభుత్వం కీలక సూచనలు
Udhayanidhi Stalin Bail: త్రిషపై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో ఉదయనిధి స్టాలిన్‌కు ఊరట! విడుదల చేయాలని కోర్టు ఆదేశం 
త్రిషపై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో ఉదయనిధి స్టాలిన్‌కు ఊరట! విడుదల చేయాలని కోర్టు ఆదేశం 
Embed widget