అన్వేషించండి

Nani 32: ఆసక్తి పెంచుతున్న నాని కొత్త సినిమా పోస్టర్‌ - ఏ మూవీ అప్‌డేట్‌ ఇది! ఆఫీషియల్‌ అనౌన్స్‌మెంట్‌ ఆ రోజే

Nani 32 Poster Release: నాని అప్పుడే తన కొత్త సినిమాను ప్రకటించాడు. ఈ సందర్భంగా రిలీజ్‌ చేసిన పోస్టర్‌ ఫ్యాన్స్‌లో క్యూరియాసిటీ పెంచుతుంది. చేతికి రక్తం ఉన్న ఈ పోస్టర్‌ ఇంటెన్స్‌ క్రియేట్‌ చేస్తుంది. 

Nani Announced His 32 Movie: నేచురల్‌ స్టార్‌ నాని బ్యాక్‌ టూ బ్యాక్‌ హిట్స్‌తో దూసుకుపోతున్నాడు. గతేడాది దసరా, హాయ్‌ నాన్న సినిమాలతో వరుసగా బ్లాకబస్టర్స్‌ అందుకున్నాడు. ఈ ఏడాది సరిపోదా శనివారంతో మరో హిట్‌ కొట్టాడు. దీంతో నాని హ్యాట్రిక్‌ హిట్స్‌తో ఫుల్‌ జోష్‌ మీద ఉన్నాడు. రెండేళ్లుగా నాని ఒక సినిమా రిలీజ్‌ చేస్తూనే మరో సినిమాను ప్రకటిస్తున్నాడు. ఇప్పటికే నాని చేతిలో పలు ప్రాజెక్ట్స్‌ ఉన్నాయి. శ్రీకాంత్‌ ఓదేలతో ఓ సినిమాకు ఇప్పటికే కమిట్‌ అయ్యాడు.

అలాగే తన నిర్మాణంలో వస్తున్న 'హిట్‌2'కి సీక్వెల్‌ని కూడా ప్రకటించాడు. ఇక ఆయన లేటెస్ట్‌ మూవీ సరిపోదా శినివారం థియేటర్లో సక్సెస్‌ ఫుల్‌గా ఆడుతుంది. విడుదలై రెండోవారంలోకి అడుగుపెట్టిన బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపిస్తుంది. ఈ మూవీ థియేటర్లో ఉండగానే తాజాగా నాని మరో కొత్త సినిమాను ప్రకటించాడు. ఈ మూవీ రిలీజ్‌ అయ్యిందో లేదో అప్పుడే మరో చిత్రాన్ని పట్టాలెక్కించే పనిలో పడ్డాడు. తాజాగా నాని ఓ ఆసక్తికర పోస్టర్‌తో కొత్త సినిమాను ప్రకటించాడు. అయితే ఇది ఏ సినిమా గురించి అనేది క్లారిటీ ఇవ్వకుండ సస్పెన్స్‌లో ఉంచాడు. నాని నెక్ట్స్‌ నాని 32(Nani 32) అనే వర్కింగ్‌ టైటిల్‌తో సినిమాను అనౌన్స్‌చేశాడు.

ఈ ప్రాజెక్ట్‌ను సెప్టెంబర్‌ 5న అధికారంగా ప్రకటించబోతున్నట్టు ఈ సందర్భంగా పేర్కొన్నాడు. ఇది చూసి అతడి ఫ్యాన్స్‌ అంతా సర్‌ప్రైజ్‌ అవుతున్నారు. కాస్తా గ్యాప్‌ ఇవ్వు అన్న అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. ఇదిలా ఉంటే నాని ప్రకటించిన ఈ కొత్త ప్రాజెక్ట్‌ హిట్‌ మూవీకి సంబంధించింది అంటున్నారు. మరికొందరు శ్రీకాంత్‌ ఓదెల చిత్రం అయ్యింటుందంటున్నారు. ఇక ఇందులో నాని కారులో స్ట్రీరింగ్‌‌ పట్టుకుని ఉండగా.. చేతికి రక్తం అంటుకుని ఉంది. ఇక నాని చేతికి ఉన్న వాచ్‌ చూసి నెటిజన్లు ఇది 'హిట్‌ 3' మూవీ అప్‌డేట్‌ అయ్యి ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనా వరుస హిట్స్‌, మూవీ అప్డేట్స్‌తో నాని మాత్రం కెరీర్‌ పరంగా ఫుల్‌ స్పీడ్‌ మీద ఉన్నాడు. ఈ సందర్భంగా రిలీజ్‌ చేసిన కొత్త పోస్టర్‌ ఆసక్తిని పెంచుతుంది. 

కాగా ఇటీవల సరిపోదా శనివారం సక్సెస్‌ మీట్‌లో మాట్లాడుతూ నాని తన కొత్త సినిమాలపై ఆసక్తిర వ్యాఖ్యలు చేశాడు. దసరా సినిమా చూసి పిల్లలు తన చిత్రాన్ని చూడోచ్చా లేదా అని అని ఆలోచించానన్నాడు. "సరిపోదా శనివారం" ప్రెస్‌ మీట్‌లో మాట్లాడుతూ.. దసరా చిత్రంలో తలలు నరికే సన్నివేశాలు ఉన్నందున్న పిల్లలను సినిమాకి తీసుకెళ్లవచ్చా అని ఆలోచించాను. కానీ, సరిపోదా శనివారం సినిమాకు అలాంటి సమస్యే లేదు. ఈ సినిమాలో హింస ఉంది కానీ అది అందరూ చూసేలా ఉంటుంది. అయితే నా నెక్ట్స్‌ సినిమాలకు పిల్లలను దూరంగా ఉంచాలి" అని ఆసక్తికర కామెంట్స్‌ చేశాడు. అంటే తన నెక్ట్స్‌ సినిమాల్లో మూవీ ఫుల్‌ యాక్షన్‌ ఉంటుందని, హింస ఎక్కువగా ఉంటుందని ఈ హీరో హింట్‌ ఇచ్చేశాడు. దీంతో అందరిలో క్యూరియాసిటీ నెలకొంది. 

Also Read: తెలుగు రాష్ట్రాల్లో వరద భీభత్సం - రెండు రాష్ట్రాలకు బాలయ్య భారీ విరాళం, ఎంతంటే...

టాప్ హెడ్ లైన్స్

Mary Rivera: 'స్పైడర్ మ్యాన్' నటి మృతి... మూడున్నర నెలల తర్వాత వెలుగులోకి
'స్పైడర్ మ్యాన్' నటి మృతి... మూడున్నర నెలల తర్వాత వెలుగులోకి
Trisha: తమిళనాడులో త్రిష పోస్టర్స్ కలకలం... రాజకీయాల్లోకి రావాలంటూ మధురై ఫ్యాన్స్ హంగామా 
తమిళనాడులో త్రిష పోస్టర్స్ కలకలం... రాజకీయాల్లోకి రావాలంటూ మధురై ఫ్యాన్స్ హంగామా
Mrunal Thakur: లీగల్ యాక్షన్ తీసుకుంటా... డీప్ ఫేక్ వీడియోలపై మృణాల్ స్ట్రాంగ్ రియాక్షన్
లీగల్ యాక్షన్ తీసుకుంటా... డీప్ ఫేక్ వీడియోలపై మృణాల్ స్ట్రాంగ్ రియాక్షన్
Priyanka Chopra: సర్వ మంగళ మాంగళ్యే... అమ్మాయితో ప్రియాంక పూజలు... మంగళ శ్లోక పఠనంలో Varanasi హీరోయిన్
సర్వ మంగళ మాంగళ్యే... అమ్మాయితో ప్రియాంక పూజలు... మంగళ శ్లోక పఠనంలో Varanasi హీరోయిన్

వీడియోలు

Jaya Chiravuri Serials and US Life | జయ చిరవూరి రోజుకి ఎంత సంపాదిస్తుందో తెలుసా?
Changes In Team India Support Staff | టీమిండియా సపోర్ట్ స్టాఫ్‌పై బిసిసిఐ వేటు
India Fielding Coach T Dilip Emotional Post | ఫీల్డింగ్ కోచ్‌గా ముగిసిన దిలీప్ ప్రయాణం
Virat Kohli World Record | వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసిన విరాట్ కోహ్లీ
Bumrah Ruled Out Of Test Series | శ్రీలంక టెస్ట్ సిరీస్‌ నుంచి బుమ్రా అవుట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Air India Phuket Delhi Flight: ఆకాశంలోనే షేక్ అయిన ఎయిర్ ఇండియా ఫుకెట్-ఢిల్లీ విమానం, ప్రయాణికులకు గాయాలు!
ఆకాశంలోనే షేక్ అయిన ఎయిర్ ఇండియా ఫుకెట్-ఢిల్లీ విమానం, ప్రయాణికులకు గాయాలు!
Udhayanidhi Stalin Reaction: అరెస్టు చేసిన తర్వాత ఉదయనిధి స్టాలిన్ తొలి రియాక్షన్ ఏంటి?
అరెస్టు చేసిన తర్వాత ఉదయనిధి స్టాలిన్ తొలి రియాక్షన్ ఏంటి?
Crime News: 30 సెకన్లలో 34 కత్తిపోట్లు! స్కూల్‌లోనే టీచర్‌ను పొడిచిన ముసుగు వ్యక్తి!
30 సెకన్లలో 34 కత్తిపోట్లు! స్కూల్‌లోనే టీచర్‌ను పొడిచిన ముసుగు వ్యక్తి!
Udhayanidhi Arrest: ఉదయనిధి అరెస్టుకు కారణం ఏంటీ? టీవీకే చేసిన ఫిర్యాదులో ఏముంది?
ఉదయనిధి అరెస్టుకు కారణం ఏంటీ? టీవీకే చేసిన ఫిర్యాదులో ఏముంది?
Udhayanidhi Arrest: ఉదయనిధి వివాదంపై మద్రాసు హైకోర్టుకు డీఎంకే! కీలక ఆదేశాలు వచ్చేలోపే అరెస్టు!
ఉదయనిధి వివాదంపై మద్రాసు హైకోర్టుకు డీఎంకే! కీలక ఆదేశాలు వచ్చేలోపే అరెస్టు!
Indian Politics Instagram Reels Strategy: ఇన్‌స్టాగ్రామ్‌ రీల్స్‌తో మారిన రాజకీయం - జెన్ జీ ఓటర్ల పల్స్ పట్టుకునేందుకు నాయకుల బిగ్ స్విచ్!
ఇన్‌స్టాగ్రామ్‌ రీల్స్‌తో మారిన రాజకీయం - జెన్ జీ ఓటర్ల పల్స్ పట్టుకునేందుకు నాయకుల బిగ్ స్విచ్!
Trisha: తమిళనాడులో త్రిష పోస్టర్స్ కలకలం... రాజకీయాల్లోకి రావాలంటూ మధురై ఫ్యాన్స్ హంగామా 
తమిళనాడులో త్రిష పోస్టర్స్ కలకలం... రాజకీయాల్లోకి రావాలంటూ మధురై ఫ్యాన్స్ హంగామా
Andhra Pradesh And Telangana Weather: తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలు!హైదరాబాద్‌లో కుండపోత! శాంతించిన గోదావరి, పరవళ్లు తొక్కుతున్న కృష్ణ! 
తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలు!హైదరాబాద్‌లో కుండపోత! శాంతించిన గోదావరి, పరవళ్లు తొక్కుతున్న కృష్ణ! 
Embed widget