అన్వేషించండి

Nandamuri Balakrishna: అందరికీ బాలయ్యే కావాలి - అంత డిమాండ్ ఏంది సామి?

Nandamuri Balakrishna: నందమూరి బాలకృష్ణ హ్యాట్రిక్ విజయాలతో ఎన్నడూ లేనంత ఫుల్ ఫార్మ్ లో ఉన్నారు. ఇప్పుడు NBK109 చిత్రంలో నటిస్తున్న బాలయ్య.. పలు క్రేజీ ప్రాజెక్ట్స్ లోనే పెట్టే పనిలో ఉన్నారు. 

Nandamuri Balakrishna: కరోనా పాండమిక్ తర్వాత నందమూరి బాలకృష్ణ కెరీర్ గ్రాఫ్ పూర్తిగా మారిపోయిందని చెప్పాలి. అప్పటి వరకూ ఫ్లాపుల్లో ఉన్న బాలయ్య.. 'అఖండ' చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి సక్సెస్ ట్రాక్ ఎక్కాడు. అప్పటి నుంచీ అదే కంటిన్యూ చేస్తున్నారు. ఆహా ఓటీటీ కోసం చేసిన 'అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే' టాక్ షో హిట్టయిన తర్వాత, ఆయన నటించిన 'వీర సింహా రెడ్డి' & 'భగవంత్ కేసరి' సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించాయి. హ్యాట్రిక్ హిట్స్ కొట్టడంతో నటసింహం క్రేజ్ మారిపోయింది.. మార్కెట్ పెరిగిపోయింది. దీంతో ఫిలిం మేకర్స్ అందరూ ఆయనతో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. సీనియర్ డైరెక్టర్స్ నుంచి కుర్ర దర్శకుల వరకూ.. బాలయ్యతో సినిమాలు చేయడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. 

NBK109లో బిజీ బిజీ..

బాలకృష్ణ ప్రస్తుతం 'వాల్తేరు వీరయ్య' ఫేమ్ బాబీ దర్శకత్వంలో NBK109 సినిమాలో నటిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్, శ్రీకర స్టూడియోస్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ సినిమాని దసరా లేదా దీపావళి సీజన్ లో రిలీజ్ చేసే అవకాశం ఉంది. సరికొత్త కథాంశంతో తెరకెక్కుతున్న ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ కోసం ఫ్యాన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. దీని తర్వాత బాలయ్య చేయబోయే సినిమా ఏంటనేది ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.

ప్రశాంత్ వర్మతో సినిమా?

బోయపాటి శ్రీను దర్శకత్వంలో 'అఖండ 2' మూవీ చేస్తారని చాలా రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ ఈ ప్రాజెక్ట్ తెరకెక్కనుంది. అలానే 'భగవంత్ కేసరి' దర్శకుడు అనిల్ రావిపూడి బాలయ్యతో మరో సినిమా చేసే ఆలోచనలో ఉన్నారని తెలుస్తోంది. ఇక 'హను-మాన్' చిత్రంతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్న ప్రశాంత్ వర్మ.. నటసింహంతో సినిమా చేయాలని చాలా కాలంగా వేచి చూస్తున్నారు. 'జై హనుమాన్' తర్వాత ఈ కాంబినేషన్ సెట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీన్ని చెరుకూరి సుధాకర్ నిర్మిస్తారని టాక్.

లైన్‌లో ‘ఆదిత్య 999 Max’

'ఆదిత్య 369' చిత్రానికి సీక్వెల్ గా 'ఆదిత్య 999 Max' అనే సినిమా చేయనున్నట్లు బాలకృష్ణ చాన్నాళ్ల క్రితమే ప్రకటించారు. దీనికి ఆయనే సొంతంగా కథ కూడా సిద్ధం చేసుకున్నారు. కుదిరితే మరోసారి మెగా ఫోన్ పట్టుకోవాలని అనుకున్న సీనియర్ హీరో.. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ కోసం డైరెక్టర్ ను వెతుకుతున్నారని టాక్. ఈ క్రమంలో 'శ్యామ్ సింగరాయ్' డైరెక్టర్ రాహుల్ సంకృత్యాన్ తో చర్చలు జరుపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అంతా ఓకే అనుకుంటే ఇది మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో సెట్స్ మీదకి వెళ్లనుంది.

త్రివిక్రమ్‌తోనూ మూవీ?

ఇలా బాలయ్య సినిమాల గురించి రకరకాల వార్తలు వినిపిస్తుండగా.. ఇప్పుడు కొత్తగా త్రివిక్రమ్ శ్రీనివాస్ పేరు కూడా తెర మీదకు వచ్చింది. బాలకృష్ణ కోసం అగ్ర దర్శకుడు ఓ స్క్రిప్ట్ రెడీ చేయనున్నట్లు రూమర్స్ వినిపిస్తున్నాయి. ఒక సినిమా సెట్స్ మీద ఉన్నప్పుడే, మ‌రొక ప్రాజెక్ట్ ను లైన్‌లో పెట్టడం బాలకృష్ణకు అల‌వాటు. ఇప్పుడు NBK 109 షూటింగ్ శరవేగంగా జరుగుతోంది కాబట్టి, త్వరలోనే ఆయన నెక్స్ట్ మూవీపై క్లారిటీ రావొచ్చు. కాకపోతే పైన చెప్పుకున్న దర్శకులలో ఆయన ఎవరికి ముందు ఓటు వేస్తారనేది ఆసక్తికరంగా మారింది.

Also Read: 'చిరంజీవి సినిమా అయినా బాగాలేకపోతే మ్యాట్నీ షో కూడా ఎవరూ చూడరు'

టాప్ హెడ్ లైన్స్

Sonu Sood Reaction : ఆ మాట అని ఉంటే చాలా సిగ్గుచేటు - కంగనా కామెంట్స్ సోనూ సూద్ రియాక్షన్
ఆ మాట అని ఉంటే చాలా సిగ్గుచేటు - కంగనా కామెంట్స్ సోనూ సూద్ రియాక్షన్
Azadi 501 Series OTT : ఇండియాలోనే బిగ్గెస్ట్ స్కామ్ స్టోరీ - 6 ఎపిసోడ్స్‌తో 'ఆజాదీ 501' సిరీస్ స్ట్రీమింగ్... ఎందుకు చూడాలంటే?
ఇండియాలోనే బిగ్గెస్ట్ స్కామ్ స్టోరీ - 6 ఎపిసోడ్స్‌తో 'ఆజాదీ 501' సిరీస్ స్ట్రీమింగ్... ఎందుకు చూడాలంటే?
Pallaburusu Teaser Review : టూత్ బ్రష్ కోసం తండ్రీ కొడుకుల వార్ - లెనిన్ తర్వాత చిన్న సినిమా టీజర్ వచ్చేసింది
టూత్ బ్రష్ కోసం తండ్రీ కొడుకుల వార్ - లెనిన్ తర్వాత చిన్న సినిమా టీజర్ వచ్చేసింది
Korean Horror Thriller OTT : దెయ్యాల కోసం వేట... వెంటాడే మృత్యువు - ఓటీటీలోకి సెన్సేషనల్ హారర్ థ్రిల్లర్... తెలుగులోనూ స్ట్రీమింగ్
దెయ్యాల కోసం వేట... వెంటాడే మృత్యువు - ఓటీటీలోకి సెన్సేషనల్ హారర్ థ్రిల్లర్... తెలుగులోనూ స్ట్రీమింగ్

వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
West Bengal Birbhum Police Raid: బెంగాల్‌లో షాకింగ్ రైడ్ - బస్సు డ్రైవర్ ఇంట్లో రూ.20 కోట్ల నగదు, 15 కిలోల బంగారం స్వాధీనం!
బెంగాల్‌లో షాకింగ్ రైడ్ - బస్సు డ్రైవర్ ఇంట్లో రూ.20 కోట్ల నగదు, 15 కిలోల బంగారం స్వాధీనం!
Tamil Nadu Head Shaving Scam: ప్రభుత్వ పథకం పేరిట వింత మోసం - గుండు గీయించుకుంటే రూ.15 వేలంటూ మహిళలకు బురిడీ!
ప్రభుత్వ పథకం పేరిట వింత మోసం - గుండు గీయించుకుంటే రూ.15 వేలంటూ మహిళలకు బురిడీ!
Ram Charan : ఆస్పత్రి నుంచి రామ్ చరణ్ డిశ్చార్జ్ - ఉపాసనతో కలిసి అయ్యప్ప ఆలయానికి మెగా పవర్ స్టార్
ఆస్పత్రి నుంచి రామ్ చరణ్ డిశ్చార్జ్ - ఉపాసనతో కలిసి అయ్యప్ప ఆలయానికి మెగా పవర్ స్టార్
Vaibhav Sooryavanshi News: వైభవ్ సూర్యవంశీకి ప్ర‌మోష‌న్.. ఆజ‌ట్టుకు  వైస్ కెప్టెన్ గా వ్య‌వ‌హ‌రించ‌నున్న 15 ఇయ‌ర్స్ కిడ్
వైభవ్ సూర్యవంశీకి ప్ర‌మోష‌న్.. ఆ జ‌ట్టుకు  వైస్ కెప్టెన్ గా వ్య‌వ‌హ‌రించ‌నున్న 15 ఇయ‌ర్స్ కిడ్
Maruti Suzuki Victoris EMI calculator: హైదరాబాద్‌లో మారుతి విక్టోరిస్‌ కొనాలి అంటే నెలకు చెల్లించాల్సిన EMI ఎంత?
హైదరాబాద్‌లో మారుతి విక్టోరిస్‌ కొనాలి అంటే నెలకు చెల్లించాల్సిన EMI ఎంత?
Inter Student Commits Suicide: నువ్వేమైనా మంత్రి కొడుకువా? మహిళా లెక్చరర్ అవమానించడంతో ఇంటర్ టాపర్ ఆత్మహత్య- గద్వాలలో ఘటన
నువ్వేమైనా మంత్రి కొడుకువా? మహిళా లెక్చరర్ అవమానించడంతో ఇంటర్ టాపర్ ఆత్మహత్య- గద్వాలలో ఘటన
Korean Horror Thriller OTT : దెయ్యాల కోసం వేట... వెంటాడే మృత్యువు - ఓటీటీలోకి సెన్సేషనల్ హారర్ థ్రిల్లర్... తెలుగులోనూ స్ట్రీమింగ్
దెయ్యాల కోసం వేట... వెంటాడే మృత్యువు - ఓటీటీలోకి సెన్సేషనల్ హారర్ థ్రిల్లర్... తెలుగులోనూ స్ట్రీమింగ్
GHMC Indiramma Housing Scheme: KCR డబుల్ బెడ్‌రూం ఇళ్ల ఫార్ములాతోనే కాంగ్రెస్ ఇందిరమ్మ బెట్ - దరఖాస్తులతో ఓట్లు రాలుతాయా?
డబుల్ బెడ్‌రూం ఇళ్ల ఫార్ములాతోనే కాంగ్రెస్ ఇందిరమ్మ బెట్ - దరఖాస్తులతో ఓట్లు రాలుతాయా?
Embed widget