అన్వేషించండి

Nanda Kumar: ఫోన్ ట్యాపింగ్ దుమారం - దగ్గుబాటి ఫ్యామిలీపై నంద కుమార్ సంచలన వ్యాఖ్యలు

తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సంచలనం కలిగిస్తోంది. తన ఫోన్ ట్యాపింగ్ చేశారని ఎంఎల్ఏ కొనుగోలు కేసు నిందితుడు నందకుమార్ ఆరోపించారు. హీరో వెంకటేష్, నిర్మాత సురేష్ బాబు మీద తీవ్ర వ్యాఖ్యలు చేశారు

Nanda Kumar Shocking Comments On Daggubati Suresh Babu: గతంలో సంచలనం సృష్టించిన ఎంఎల్ఏ కొనుగోలు కేసులో నిందితుడిగా ఉన్న నంద కుమార్ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ప్రభుత్వం తన ఫోన్ ను ట్యాపింగ్ చేసిందని చెప్పడానికి పూర్తి ఆధారాలు తన దగ్గర ఉన్నాయన్నారు. తన ఫోన్ ను అప్పటి టీఆర్ఎస్ ప్రభుత్వం ట్యాపింగ్ చేస్తుందని చెప్పినా, ఎవరూ పట్టించుకోలేదని ఆయన వెల్లడించారు. తాజాగా డీజీపీ రవి గుప్తాను కలిసి నంద కుమార్, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో పాటు ఫిలిం నగర్ లోని తన డెక్కన్ కిచెన్ హోటల్ కూల్చివేతపై ఫిర్యాదు చేశారు. తన ఫోన్ ట్యాపింగ్ ఎప్పుడు? ఎక్కడ చేశారు? అనే పూర్తి వివరాలను డీజీపీకి అందించినట్లు తెలిపారు. ఈ కేసులో ఉన్న వారిని కఠినంగా శిక్షించాలని నందకుమార్ కోరారు.

సురేష్ బాబు, వెంకటేష్ పై సంచనల వ్యాఖ్యలు

హైదరాబాద్ ఫిలిం నగర్ లోని తన డెక్కన్ కిచన్ హోటల్ కూల్చివేత వ్యవహారంలో నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు, హీరో వెంకటేష్ పాత్రే కీలకం అని వెల్లడించారు. గత ప్రభుత్వ పెద్దలు కేసీఆర్, కేటీఆర్ తో ఉన్న దగ్గరి సంబంధాల కారణంగానే తన హోటల్ ను కూల్చేశారని ఆరోపించారు. కోర్టులో కేసు నడుస్తుండగానే జీహెచ్ ఎంసీ అధికారులకు నాటి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు తన హోటల్ ను కూల్చివేశారని చెప్పారు. బీఆర్ఎస్ పెద్దల అండతో దగ్గుబాటి ఫ్యామిలీ మిగతా బిల్డింగ్ ను కూడా కూల్చి వేసేందుకు ప్రయత్నించారని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వంలోనూ పట్టగలే బౌన్సర్ల నడుమ భవనం కూల్చివేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పలు కోర్టుల్లో వివాదం కొనసాగుతున్నా నిర్మాణాలను కూల్చివేయడం పట్ల ఆయన అభ్యంతరం తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి ఈ విషయంపై ఫోకస్ పెట్టాలని నంద కుమార్ విజ్ఞప్తి చేశారు.

దగ్గుబాటి ఫ్యామిలీతో నంద కుమార్ గొడవేంటంటే?

ఫిలిం నగర్ లో నిర్మాత సురేష్ బాబు కుటుంబానికి భూమి ఉంది. ఎంఎల్ఏ కొనుగోలు కేసులో నిందితుడిగా ఉన్న నంద కుమార్ గతంలో ఆ భూమిని లీజ్‌కు తీసుకున్నాడు. ఆ స్థలంలో డెక్కన్ కిచన్ పేరుతో హోటల్ నిర్మించారు. ఆ తర్వాత దగ్గుబాటి ఫ్యామిలీతో నంద కుమార్ కు గొడవలు జరిగినట్లు తెలిసింది. ఆ హోటల్ అక్రమంగా నిర్మించారని సురేష్ బాబు మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదుతో జీహెచ్ఎంసీ అధికారులు కూల్చి వేశారు. అగ్రిమెంట్ ఉన్నా, తన హోటల్ ను కూల్చివేశారని నంద కుమార్ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ వ్యవహారంపై అప్పట్లో కోర్టు సీరియస్ అయ్యింది. నిర్మాత సురేష్ బాబు కుటుంబానికి నోటీసులు జారీ చేసింది. ప్రస్తుతం ఈ కేసు కోర్టు పరిధిలో ఉన్నా, నిర్మాణాల కూల్చివేత కొనసాగుతుందని నంద కుమార్ వెల్లడించారు. కేసు కొనసాగుతుండగా కూల్చివేతలు ఏంటని ప్రశ్నించారు.  

ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కీలక నిందితుడు

అటు తెలంగాణలో ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నంద కుమార్ కీలక నిందితుడిగా ఉన్నారు. బీజేపీకి చెందిన ఆయన టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు చేయడానికి ప్రయత్నించాడని అప్పట్లో గులాబీ పార్టీ పెద్దలు ఆరోపించారు. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారానికి సంబంధించిన ఓ వీడియోను కూడా అప్పట్లో పోలీసులు విడుదల చేశారు. 

Read Also: సినిమా రికార్డులు సృష్టించాలన్నా నేనే, వాటిని తిరగరాయాలన్నా నేనే: బాలకృష్ణ

టాప్ హెడ్ లైన్స్

Musician Deva : ఇండస్ట్రీలో విషాదం... ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ దేవ కన్నుమూత
ఇండస్ట్రీలో విషాదం... ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ దేవ కన్నుమూత
Keerthy Suresh : లతా రెడ్డిగా కీర్తి సురేష్ - జనవరి 12 విడుదల నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్
లతా రెడ్డిగా కీర్తి సురేష్ - జనవరి 12 విడుదల నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్
Vijay Deverakonda New Movie : రొమాంటిక్ కామెడీ జానర్‌లో విజయ్ దేవరకొండ - ఆ డైరెక్టర్‌తో కొత్త మూవీ ఫిక్స్
రొమాంటిక్ కామెడీ జానర్‌లో విజయ్ దేవరకొండ - ఆ డైరెక్టర్‌తో కొత్త మూవీ ఫిక్స్
Nagarjuna : రిలీజ్ డేట్... సరైన ప్లానింగ్ ఉండాలి - వాయిదాలపై నాగ్ అసహనం... ఆ పెద్ద మూవీ అదేనా?
రిలీజ్ డేట్... సరైన ప్లానింగ్ ఉండాలి - వాయిదాలపై నాగ్ అసహనం... ఆ పెద్ద మూవీ అదేనా?

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Dachepalli YCP Candidate Arrest: దాచేపల్లి వైసీపీ ఛైర్మన్‌ అభ్యర్థి కొప్పుల రవి అరెస్ట్‌.. ఇంట్లో 429 సీసాల తెలంగాణ లిక్కర్ సీజ్!
దాచేపల్లి వైసీపీ ఛైర్మన్‌ అభ్యర్థి కొప్పుల రవి అరెస్ట్‌.. ఇంట్లో 429 సీసాల తెలంగాణ లిక్కర్ సీజ్!
Amaravati News: అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు, ఏడీబీ నుంచి మరో రూ.15,000 కోట్ల లోన్!
అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు, ఏడీబీ నుంచి మరో రూ.15,000 కోట్ల లోన్!
APPSC Jobs: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్: ఏపీపీఎస్సీ నుంచి 302 ఉద్యోగాలకి నోటిఫికేషన్లు విడుదల
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్: ఏపీపీఎస్సీ నుంచి 302 ఉద్యోగాలకి నోటిఫికేషన్లు విడుదల
Keerthy Suresh : లతా రెడ్డిగా కీర్తి సురేష్ - జనవరి 12 విడుదల నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్
లతా రెడ్డిగా కీర్తి సురేష్ - జనవరి 12 విడుదల నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్
కొత్త బైక్ కొనేవాళ్లకు అదిరిపోయే అప్‌డేట్.. క్విక్‌షిఫ్టర్, క్రూయిజ్ కంట్రోల్‌తో వచ్చిన Xtreme 250R Carbon
దసరా కానుకగా Hero Xtreme 250R Carbon.. TFT డిస్‌ప్లే, ట్రాక్షన్ కంట్రోల్‌తో కొత్త బైక్ లాంచ్‌
Dasara Holidays: ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు వరుసగా 4 రోజులు సెలవులు, ట్విస్ట్ ఏంటంటే..
ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు వరుసగా 4 రోజులు సెలవులు, ట్విస్ట్ ఏంటంటే..
Congress Politics: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్.. 77 మంది ఇంఛార్జిల నియామకం!
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్.. 77 మంది ఇంఛార్జిల నియామకం!
Ranabaali Day 1 Collections : రణబాలి ఫస్ట్ డే కలెక్షన్స్ - తెలుగు రాష్ట్రాల్లో ఫుల్ ఆక్యుపెన్సీ... విరోష్ కపుల్ మూవీ ఎంత కలెక్ట్ చేసిందంటే?
రణబాలి ఫస్ట్ డే కలెక్షన్స్ - తెలుగు రాష్ట్రాల్లో ఫుల్ ఆక్యుపెన్సీ... విరోష్ కపుల్ మూవీ ఎంత కలెక్ట్ చేసిందంటే?
Embed widget