అన్వేషించండి

Nagarjuna: నాగార్జున 100వ చిత్రానికి ఆ దర్శకుడు ఖరారు - నాగార్జున రిస్క్ చేస్తున్నారా?

టాలీవుడ్ కింగ్ నాగార్జున 100వ చిత్రానికి దాదాపు మూడేళ్ల నుండి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఓ అప్‌కమింగ్ తమిళ దర్శకుడితో నాగ్ రిస్క్ తీసుకోనున్నట్టు సమాచారం.

ప్రతీ హీరో కెరీర్‌లో ఒక ల్యాండ్‌మార్క్ సినిమా ఉంటుంది. ఆ ల్యాండ్‌మార్క్ సినిమాతో ఎలాగైనా తమ కెరీర్‌లో పెద్ద బ్రేక్ అందుకోవాలని ఆశిస్తారు. అలాగే టాలీవుడ్‌లో కింగ్‌గా పేరు తెచ్చుకున్న నాగార్జున కూడా తన 100వ సినిమా కోసం చాలా కన్ఫ్యూజన్‌లో ఉన్నట్టు అనిపిస్తోంది. దాదాపు మూడు సంవత్సరాల నుండి తన 100వ సినిమాను ఎవరితో చేయాలి, ఏ కథను ఎంచుకోవాలి అనే అయోమయంలో ఉన్నారు నాగార్జున. అంతే కాకుండా ఈ మూవీ గురించి అనేక రూమర్స్ కూడా వైరల్ అవుతున్నాయి. తాజాగా నాగ్.. 100వ చిత్రానికి డైరెక్టర్ ఫిక్స్ అయ్యాడని వార్తలు ఫిల్మ్ సర్కిల్లో చక్కర్లు కొడుతున్నాయి.

మోహన్ రాజా కాకుండా మరో తమిళ దర్శకుడు..

నాగార్జున 100వ చిత్రాన్ని తమిళ దర్శకుడు మోహన్ రాజా డైరెక్ట్ చేస్తున్నాడని ఇప్పటికీ చాలాసార్లు వార్తలు వచ్చాయి. కానీ ఆ ప్రాజెక్ట్‌పై ఇప్పటికీ క్లారిటీ లేదు. మోహన్ రాజా దర్శకత్వంలో నాగ్ చేయనున్న 100వ చిత్రంలో అఖిల్ కూడా ఉంటానని, ఇది వీరిద్దరి మల్టీ స్టారర్‌గా తెరకెక్కుతుందని కూడా రూమర్స్ వచ్చాయి. కానీ గత కొన్నిరోజులుగా ఈ రూమర్స్ కూడా వినిపించడం ఆగిపోవడంతో మోహన్ రాజాతో నాగార్జున చిత్రం ఆగిపోయిందని తెలుస్తోంది. అందుకే తన 100వ సినిమా కోసం మరో తమిళ దర్శకుడిని లైన్‌లో పెట్టారట నాగ్. రెండు సినిమాల అనుభవం ఉన్న ఒక యంగ్ డైరెక్టర్‌తో నాగ్ 100వ సినిమా ఉండబోతుందని కొత్తగా వార్తలు మొదలయ్యాయి.

రెండే సినిమాల అనుభవం..

యాక్టర్‌గా, డైరెక్టర్‌గా, ప్రొడ్యూసర్‌గా తన మల్టీ టాలెంట్స్‌ను నిరూపించుకుంటూ కోలీవుడ్‌లో ఒక గుర్తింపు కోసం ప్రయత్నాలు చేస్తున్నాడు నవీన్. ఇప్పటికీ తను దర్శకుడిగా తెరకెక్కించింది రెండు సినిమాలే. 2013లో ‘మూడర్ కూడుమ్’ అనే చిత్రంతో కేవలం దర్శకుడిగానే కాదు, నిర్మాతగా, నటుడిగా కూడా తమిళ సినీ పరిశ్రమలో అడుగుపెట్టాడు నవీన్. కానీ తన రెండో సినిమాను డైరెక్ట్ చేయడానికి మాత్రం తనకు దాదాపు ఎనిమిదేళ్లు పట్టింది. ‘మూడర్ కూడమ్’ తర్వాత 2021లో ‘అగ్ని సిరగుగల్’ అనే చిత్రాన్ని ప్రారంభించాడు. సమస్య ఏంటో తెలియదు కానీ ఇప్పటికీ ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాలేదు. నాగార్జున తలచుకుంటే స్టార్ డైరెక్టర్లు సైతం తన 100వ చిత్రాన్ని తెరకెక్కించడానికి ముందుకొస్తారు. కానీ నాగ్ మాత్రం ఏరికోరి ఈ దర్శకుడిని ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. దీంతో రిస్క్ చేస్తున్నారేమో ఒకసారి ఆలోచించండి.. అని ఫ్యాన్స్ అంటున్నారు.

‘నా సామిరంగ’..

ప్రస్తుతం నాగార్జున.. విజయ్ బిన్ని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘నా సామిరంగ’ చిత్రంతో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే ఈ మూవీ నుండి విడుదలయిన గ్లింప్స్ చూస్తుంటే.. చాలాకాలం తర్వాత నాగ్.. ఫుల్ లెన్త్ మాస్ రోల్ చేయనున్నాడని అర్థమవుతోంది. గ్లింప్స్‌తో ఆకట్టుకున్న ‘నా సామిరంగ’ 2024 సంక్రాంతికి విడుదల కానుంది. శ్రీనివాస చిత్తూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. అల్లరి నరేశ్ ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నట్టు సమాచారం. ‘నా సామిరంగ’ అప్డేట్‌తో అక్కినేని ఫ్యాన్స్ కాస్త ఖుషీ అయినా కూడా నాగ్ 100వ చిత్రానికి సంబంధించిన అప్డేట్ బయటికొస్తే బాగుంటుందని, ఈ విషయంపై హీరో ఒక క్లారిటీ ఇస్తే బాగుంటుందని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

Also Read: 'బలగం' వేణు బాటలో మరో కమెడియన్, దిల్ రాజు మరో ప్రయోగం?

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

టాప్ హెడ్ లైన్స్

Dose OTT : ఒకేసారి ఐదు ఓటీటీల్లో సైకలాజికల్ మెడికల్ థ్రిల్లర్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఒకేసారి ఐదు ఓటీటీల్లో సైకలాజికల్ మెడికల్ థ్రిల్లర్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Hrudhayam Murali Trailer : 20 ఏళ్ల తర్వాత నటుడిగా తమన్ - 'హృదయం మురళి' ట్రైలర్‌లో ఇది వెరీ స్పెషల్
20 ఏళ్ల తర్వాత నటుడిగా తమన్ - 'హృదయం మురళి' ట్రైలర్‌లో ఇది వెరీ స్పెషల్
OG Sequel : పవన్ కల్యాణ్ OG సీక్వెల్ - ఫ్యాన్స్ గెట్ రెడీ... తమన్ బిగ్ అప్డేట్
పవన్ కల్యాణ్ OG సీక్వెల్ - ఫ్యాన్స్ గెట్ రెడీ... తమన్ బిగ్ అప్డేట్
Sing Geetham OTT : ఓటీటీలోకి ముందుగానే సింగ్ గీతం - ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ అవుతుందో తెలుసా?
ఓటీటీలోకి ముందుగానే సింగ్ గీతం - ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ అవుతుందో తెలుసా?

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
FIFA World Cup Dispute: ఈజిప్ట్‌-అర్జెంటీనా మ్యాచ్ ఫిక్సింగ్ అంటూ మోస్తఫా జికో సంచలన వ్యాఖ్యలు, కన్నీళ్లు పెట్టుకున్న లియోనెల్ మెస్సి!
ఈజిప్ట్‌-అర్జెంటీనా మ్యాచ్ ఫిక్సింగ్ అంటూ మోస్తఫా జికో సంచలన వ్యాఖ్యలు, కన్నీళ్లు పెట్టుకున్న లియోనెల్ మెస్సి!
US Attacks Iran: ఇరాన్‌పై మెరుపుదాడులు చేసిన అమెరికా సైన్యం.. చమురు విక్రయాల లైసెన్స్ రద్దు, ఆంక్షలు కఠినతరం
ఇరాన్‌పై మెరుపుదాడులు చేసిన అమెరికా సైన్యం.. చమురు విక్రయాల లైసెన్స్ రద్దు, ఆంక్షలు కఠినతరం
Pawan Kalyan Fan Dies: పవన్ కళ్యాణ్ వీరాభిమాని నిరంజన్‌ మృతి.. ఆ కోరిక తీరకుండానే..!
పవన్ కళ్యాణ్ వీరాభిమాని నిరంజన్‌ మృతి.. ఆ కోరిక తీరకుండానే..!
Viral Video: ఆదోని శివాలయం గర్భగుడిలో సిగరెట్‌ వెలిగించి అపచారం, నిందితుడి అరెస్ట్
ఆదోని శివాలయం గర్భగుడిలో సిగరెట్‌ వెలిగించి అపచారం, నిందితుడి అరెస్ట్
IND vs ENG Highlights: మూడో T20లో టీమ్ ఇండియా చరిత్రలోనే అతిపెద్ద ఓటమి! వైభవ్ , అభిషేక్ సహా ప్రధాన బ్యాటర్లు విఫలం! 
మూడో T20లో టీమ్ ఇండియా చరిత్రలోనే అతిపెద్ద ఓటమి! వైభవ్ , అభిషేక్ సహా ప్రధాన బ్యాటర్లు విఫలం! 
Kadiri Crime News: కదిరి ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ హత్య.. కత్తితో భార్య గొంతు కోసిన భర్త
కదిరి ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ హత్య.. కత్తితో భార్య గొంతు కోసిన భర్త
ఒక్క ఫోన్ కాల్‌ చేయండి! ఫుడ్ కల్తీ భరతం పడతాం : ABP దేశంతో టాస్క్ ఫోర్స్ డీసీపీ వైభవ్ గైక్వాడ్
ఒక్క ఫోన్ కాల్‌ చేయండి! ఫుడ్ కల్తీ భరతం పడతాం : ABP దేశంతో టాస్క్ ఫోర్స్ డీసీపీ వైభవ్ గైక్వాడ్
Hyderabad Crime News: హైదరాబాద్‌లో భర్తను చంపి మహారాష్ట్ర బోర్డర్‌లోపడేసి మిస్సింగ్ కేసు పెట్టిన భార్య!7 నెలల తర్వాత ఛేదించిన పోలీసులు!
హైదరాబాద్‌లో భర్తను చంపి మహారాష్ట్ర బోర్డర్‌లో పడేసి మిస్సింగ్ కేసు పెట్టిన భార్య!7 నెలల తర్వాత ఛేదించిన పోలీసులు!
Embed widget