Naga Chaitanya Samantha: ఇన్‌స్టాలో సమంతను ఇంకా ఫాలో అవుతున్న నాగచైతన్య, మరి సామ్?
నాగచైతన్య, సమంత విడాకులు తీసుకొని రెండు సంవత్సరాలు అవుతున్నా ఇంకా వీరు కలుస్తారేమో అని కొందరు ఫ్యాన్స్ ఆశగా ఎదురుచూస్తూనే ఉన్నారు.
సినీ రంగంలో పెళ్లి చేసుకున్న హీరోహీరోయిన్స్ చాలా తక్కువ సంఖ్యలో ఉన్నారు. ఆన్ స్క్రీన్‌పై ఒక హీరో, హీరోయిన్ కెమిస్ట్రీ బాగుంటే.. వారు ఆఫ్ స్క్రీన్ కపుల్ అయితే బాగుంటుందని చాలామంది ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. కానీ అలా కొందరి విషయంలోనే జరుగుతుంది. అలా నాగచైతన్య, సమంత విషయంలో కూడా జరిగింది. వీరిద్దరూ కలిసి పలు చిత్రాల్లో నటించారు. దీంతో ఈ జోడీకి ప్రేక్షకుల్లో మంచి మార్కులు పడ్డాయి. అయితే వీరిద్దరూ రియల్ లైఫ్ కపుల్ కూడా అయితే బాగుంటుందని చాలామంది ఫ్యాన్స్ భావించారు. చాలామంది అనుకున్నట్టుగానే వీరిద్దరూ రియల్ లైఫ్ కపుల్ అయినా చాలాకాలం కలిసి ఉండలేకపోయారు. విడాకులు తీసుకున్నారు. కానీ ఈ జంటకు సంబంధించిన సోషల్ మీడియా అకౌంట్లపై తమ ఫ్యాన్స్ దృష్టిపెట్టారు. తాజాగా వారు గమనించిన ఒక విషయాన్ని ప్రస్తుతం వైరల్ చేస్తున్నారు.
విడాకులు అయినా కూడా..
హీరో, హీరోయిన్ కెమిస్ట్రీ వెండితెరపై ఎంత బాగా వర్కవుట్ అయినా అందులో కొందరు మాత్రమే ఆఫ్ స్క్రీన్ కపుల్‌గా కూడా సక్సెస్ అవుతారు. నాగచైతన్య, సమంత కూడా అలా అనుకునే పెళ్లి చేసుకున్నారు. కానీ పెళ్లి తర్వాత కేవలం నాలుగు సంవత్సరాలు మాత్రమే కలిసి జీవించారు. ఆ తర్వాత విడాకులు తీసుకుంటున్నట్టు ఒకేసారి సోషల్ మీడియాలో ప్రకటించారు. విడాకులు తీసుకోవాలని ఫిక్స్ అయినప్పటి నుండే తన సోషల్ మీడియా రూపురేఖలను మార్చేసింది సమంత. ప్రతీ సోషల్ మీడియా అకౌంట్ నుండి అక్కినేని అనే ట్యాగ్‌ను తొలగించింది. అంతే కాకుండా నాగచైతన్యను కూడా అన్‌ఫాలో చేసింది. విడాకులు తీసుకొని రెండు సంవత్సరాలు అవుతున్నా.. చైతన్య సోషల్ మీడియా అకౌంట్స్‌కు దూరంగానే ఉంటుంది సామ్. కానీ నాగచైతన్య మాత్రం ఇంకా సమంతను ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అవుతున్నట్టు ఫ్యాన్స్ గమనించారు. దీంతో ఈ విషయం తెగ వైరల్ అవుతోంది.
అబ్బాయిల ప్రేమపై మీమ్స్..
ఇన్‌స్టాగ్రామ్‌లో సమంత.. నాగచైతన్యను ఫాలో అవ్వకపోయినా.. నాగచైతన్య మాత్రం సమంతను ఫాలో అవ్వడంపై అనేక మీమ్స్ వైరల్ అవుతున్నాయి. అబ్బాయి ఒకసారి ప్రేమిస్తే ఎప్పటికీ మర్చిపోడని, అమ్మాయిలు మాత్రం త్వరగా మూవ్ ఆన్ అయిపోతారని విమర్శలు చేస్తూ మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు మీమర్స్. అయితే విడాకుల తర్వాత నాగచైతన్య గురించి ఓపెన్‌గా మాట్లాడడానికి సమంత ఎప్పుడూ ఇష్టపడలేదు. కానీ చైతూ మాత్రం తనకు బెస్ట్ ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ అంటే సమంతతోనే అని స్టేట్‌మెంట్ ఇచ్చాడు. అంతే కాకుండా ఆమెకు పెద్ద కలలు ఉన్నాయని, అవన్నీ నెరవేరాలని కోరుకుంటున్నట్టు కూడా తెలిపాడు.
మాయ చేసిన కపుల్..
ముందుగా ‘ఏమాయ చేశావే’ చిత్రంలో సమంత, నాగచైతన్య కలిసి నటించారు. సమంతకు ఇది మొదటి సినిమానే అయినా చైతన్యతో కెమిస్ట్రీ మాత్రం అదరగొట్టేసింది. దీంతో సినిమా చూసిన ప్రేక్షకులు కేవలం సమంతకు మాత్రమే కాకుండా ఈ జంటకు కూడా ఫ్యాన్స్ అయ్యారు. అందుకే దర్శకులు కూడా మళ్లీ మళ్లీ వీరిద్దరిని కలిసి నటించేలా చేశారు. ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ వర్కవుట్ అవుతుంది అనుకున్న సమయంలోనే చై, సామ్.. బయట నుండి కలిసి కనిపించడం మొదలుపెట్టారు. దీంతో వీరిద్దరూ రిలేషన్‌లో ఉన్నారని ప్రేక్షకులు కన్ఫర్మ్ చేసుకున్నారు. పెళ్లి చేసుకొని ఇద్దరూ మరెన్నో సినిమాలతో అందరినీ అలరిస్తారని ఆశపడ్డారు. కానీ అలా జరగలేదు.
Also Read: భూమిక పారిపోయింది, ఆ డైరెక్టర్ కాళ్ల మీద పడ్డాను - శ్రీరామ్ షాకింగ్ కామెంట్స్