అన్వేషించండి

Mr Pregnant: అఖిల్ డెలివరీ టైమ్‌లో అలా చేశాను: 'మిస్టర్ ప్రెగ్నెంట్' ట్రైలర్ లాంచ్‌లో నాగార్జున

బిగ్ బాస్‌లోని ఒక సాధారణ కంటెస్టెంట్‌గా ఎంటర్ అయ్యి బయటికి వచ్చేసరికి విపరీతమైన పాపులారిటీని సంపాదించుకున్నాడు సోహైల్. ఇక తను హీరోగా తెరకెక్కిన ‘మిస్టర్ ప్రెగ్నెంట్’ ట్రైలర్ తాజాగా విడుదలయ్యింది.

సోహైల్ హీరోగా తెరకెక్కిన ‘మిస్టర్ ప్రెగ్నెంట్’ చిత్ర ట్రైలర్ తాజాగా విడుదలయ్యింది. ఈ ట్రైలర్ లాంచ్‌కు ముఖ్య అతిథిగా హాజరయిన కింగ్ నాగార్జున్ ట్రైలర్ చూసి మూవీ టీమ్‌ను ప్రశంసించారు. అబ్బాయి ప్రెగ్నెంట్ అయితే ఎలా ఉంటుంది అనే డిఫరెంట్ కాన్సెప్ట్‌పై ఈ చిత్రం తెరకెక్కింది.

‘మిస్టర్ ప్రెగ్నెంట్’ ట్రైలర్..
డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ‘మిస్టర్ ప్రెగ్నెంట్‌’లో యంగ్ హీరో సోహైల్‌కు జోడీగా ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ ఫేమ్ రూపా కొడవయూర్ నటించింది. ఈ మూవీని మైక్ మూవీస్ బ్యానర్‌పై అప్పి రెడ్డి, రవి రెడ్డి సజ్జల, వెంకట్ అన్నపరెడ్డి నిర్మించారు. శ్రీనివాస్ వింజనంపాటి ఈ మూవీని డైరెక్ట్ చేశారు. ఆగస్ట్ 18న ‘మిస్టర్ ప్రెగ్నెంట్’ విడుదలకు సిద్ధమవుతోంది. విడుదల సమయం దగ్గర పడుతుండడంతో మూవీ టీమ్ ట్రైలర్ లాంచ్‌తో ప్రమోషన్స్‌ను ప్రారంభించింది. కింగ్ నాగార్జున చేతుల మీదుగా ‘మిస్టర్ ప్రెగ్నెంట్’ ట్రైలర్ విడుదలయ్యింది. కొత్త వాళ్లను ఎంకరేజ్ చేయడంలో నాగార్జున ఎప్పుడూ ముందుంటారని, తమ చిత్ర ట్రైలర్ ఆయన చేతుల మీదుగా విడుదల అవ్వడం చాలా సంతోషంగా ఉందంటూ మూవీ నిర్మాత రవిరెడ్డి సజ్జల నాగార్జునకు కృతజ్ఞత తెలిపారు.

నిర్మాతల సంతోషం..
‘మిస్టర్ ప్రెగ్నెంట్’ ప్రమోషన్స్ కోసం అమెరికా నుంచి వచ్చానంటూ మరో నిర్మాత వెంకట్ అన్నపరెడ్డి అన్నారు. మరో నిర్మాత అన్నపరెడ్డి.. ‘మిస్టర్ ప్రెగ్నెంట్’ తన మనసుకు దగ్గరయిన సినిమా అని చెప్పుకొచ్చారు. యూఎస్‌లో తన భార్య ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు 9 నెలలు ఆమె పడే కష్టాన్ని చూశానని అన్నపరెడ్డి తెలిపారు. అప్పుడే ప్రెగ్నెన్సీ బాధను తట్టుకునే శక్తి మహిళలకే ఉందని తనకు అనిపించింది అన్నారు. ముఖ్యంగా ఈ చిత్రాన్ని మహిళా ప్రేక్షకులు ఆదరిస్తానని కోరుకుంటున్నట్టు తెలిపారు. ఇలా నిర్మాతలు సినిమా తెరకెక్కించాలనే కలను నెరవేర్చుకున్నందుకు, అది కూడా ‘మిస్టర్ ప్రెగ్నెంట్’లాంటి డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీని తెరకెక్కించినందుకు సంతోషం వ్యక్తం చేశారు.

నాగార్జున సినిమాలను చూస్తూ పెరిగి, ఆయన పక్కన కూర్చుని తన సినిమా ట్రైలర్ రిలీజ్ చేసుకోవడం గర్వంగా ఉందంటూ దర్శకుడు శ్రీనివాస్ వింజనంపాటి సంతోషం వ్యక్తం చేశారు. డెలివరీ కోసం అమ్మ పడే కష్టాన్ని తీసుకున్న ఓ నాన్న కథ ఇది అని భయటపెట్టారు. హీరోయిన్ రూపా కొడవయూర్ కూడా ఇలాంటి డిఫరెంట్ కాన్సెప్ట్ చిత్రంలో భాగమయినందుకు సంతోషం వ్యక్తం చేసింది. అసలు ప్రాజెక్ట్ కోసం తనను అప్రోచ్ అయినప్పుడు ఇలాంటి సినిమా చేయడం సాధ్యమేనా అనిపించిందని ఆశ్చర్యపోయినట్టు తెలిపింది. ‘మిస్టర్ ప్రెగ్నెంట్‌’ను తప్పకుండా థియేటర్లలో చూడమని కోరింది. ఇక హీరో సోహైల్ కూడా ట్రైలర్ లాంచ్‌లో చాలా కాన్ఫిడెంట్‌గా తన సినిమా గురించి చెప్పుకొచ్చాడు.

నాగార్జున ప్రశంసలు..
నాగార్జున తమను ఎప్పుడూ సొంతవారిలా చూసుకుంటారని సోహైల్ చెప్పుకొచ్చారు. నాగ్ సార్‌కు ఎంత థ్యాంక్స్ చెప్పినా తక్కువే అంటూ ఆయనను ప్రశంసల్లో ముంచేశాడు. ఇక ‘మిస్టర్ ప్రెగ్నెంట్’ గురించి చెప్తూ.. తొమ్మిది నెలలు బిడ్డను మోసి కనేందుకు తల్లి ఎంత కష్టపడుతుందో మనం వింటుంటాం, కానీ ఆ కష్టాన్ని ఒక అబ్బాయిగా నా పాత్ర ద్వారా చూపించబోతున్నాను అని తెలిపాడు. ఇక నాగార్జున కూడా ‘మిస్టర్ ప్రెగ్నెంట్’పై, సోహైల్‌పై ప్రశంసలు కురిపించారు. బిగ్ బాస్‌లో సోహైల్ పర్ఫార్మెన్స్‌ను గుర్తుచేసుకున్నారు. మిస్టర్ ప్రెగ్నెంట్ అనగానే మగవాళ్లు ప్రెగ్నెంట్ ఎలా అవుతారు, అది సినిమాలో ఎలా చూపించారు అనే ఆసక్తి కలిగిందన్నారు. ట్రైలర్ చాలా బాగుంది, ఎమోషనల్‌గా ఉందనిని ప్రశంసించారు. మొదటికే ఇలాంటి కష్టమైన స్క్రిప్ట్ రాసి తెరకెక్కించినందకు దర్శకుడు శ్రీనివాస్‌ను కొనియాడారు. డెలివరీ అంటే ఒక ప్రాణం పోయడం, అఖిల్ డెలివరీ టైమ్‌లో ఆరు నెలలు ఏ షూటింగ్స్ పెట్టుకోకుండా అమలతోనే ఉన్నానని నాగ్ గుర్తుచేసుకున్నారు.

Also Read: కోలీవుడ్‌లో గోల్డెన్ ఛాన్స్ కొట్టేసిన మృణాల్ - ఆ స్టార్ హీరో‌తో రొమాన్స్‌కు రెడీ!

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

టాప్ హెడ్ లైన్స్

Sunday OTT Movies : సండే టాప్ 10 ఓటీటీ మూవీస్ - యూత్‌ను అట్రాక్ట్ చేసే రొమాంటిక్ డ్రామా సిరీస్... ఇవి డోంట్ మిస్
సండే టాప్ 10 ఓటీటీ మూవీస్ - యూత్‌ను అట్రాక్ట్ చేసే రొమాంటిక్ డ్రామా సిరీస్... ఇవి డోంట్ మిస్
AK47 Second Single: అక్టోబర్ 19న రెండో సాంగ్... ఆదర్శ కుటుంబం విడుదలపై సస్పెన్స్‌కు ఫుల్ స్టాప్
అక్టోబర్ 19న రెండో సాంగ్... ఆదర్శ కుటుంబం విడుదలపై సస్పెన్స్‌కు ఫుల్ స్టాప్
Horror Thrilelr OTT : ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్ - 7 కోట్లతో తీస్తే 2,500 కోట్ల కలెక్షన్స్... ఫ్రీగా స్ట్రీమింగ్ అయ్యేది ఎప్పుడంటే?
ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్ - 7 కోట్లతో తీస్తే 2,500 కోట్ల కలెక్షన్స్... ఫ్రీగా స్ట్రీమింగ్ అయ్యేది ఎప్పుడంటే?
Aadarsha Kutumbam : ఆదర్శ కుటుంబం రిలీజ్ డేట్ ఫిక్స్? - నిర్మాత నాగవంశీ రియాక్షన్
ఆదర్శ కుటుంబం రిలీజ్ డేట్ ఫిక్స్? - నిర్మాత నాగవంశీ రియాక్షన్

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
RTC Special Buses: జేబీఎస్‌, ఎంజీబీఎస్‌లో దసరా పండగ రద్దీ.. బస్సుల కోసం గంటల పాటు ప్రయాణికుల పడిగాపులు
జేబీఎస్‌, ఎంజీబీఎస్‌లో దసరా పండగ రద్దీ.. బస్సుల కోసం గంటల పాటు ప్రయాణికుల పడిగాపులు
TDP Second List of Candidates: పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు.. టీడీపీ అభ్యర్థుల రెండో జాబితా విడుదల
పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు.. టీడీపీ అభ్యర్థుల రెండో జాబితా విడుదల
Horror Thrilelr OTT : ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్ - 7 కోట్లతో తీస్తే 2,500 కోట్ల కలెక్షన్స్... ఫ్రీగా స్ట్రీమింగ్ అయ్యేది ఎప్పుడంటే?
ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్ - 7 కోట్లతో తీస్తే 2,500 కోట్ల కలెక్షన్స్... ఫ్రీగా స్ట్రీమింగ్ అయ్యేది ఎప్పుడంటే?
Jadeja ODI Exit?: రెస్ట్ అంటూనే స్టార్ ఆల్ రౌండర్ కు శాశ్వత గుడ్ బై..!! వరల్డ్ కప్ ప్రణాళికల నుంచి  జడేజా ఔట్, అక్షర్  కు పట్టం కట్టిన సెలెక్టర్లు!
రెస్ట్ అంటూనే స్టార్ ఆల్ రౌండర్ కు శాశ్వత గుడ్ బై..!! వరల్డ్ కప్ ప్రణాళికల నుంచి  జడేజా ఔట్, అక్షర్  కు పట్టం కట్టిన సెలెక్టర్లు!
Dachepalli YCP Candidate Arrest: దాచేపల్లి వైసీపీ ఛైర్మన్‌ అభ్యర్థి కొప్పుల రవి అరెస్ట్‌.. ఇంట్లో 429 సీసాల తెలంగాణ లిక్కర్ సీజ్!
దాచేపల్లి వైసీపీ ఛైర్మన్‌ అభ్యర్థి కొప్పుల రవి అరెస్ట్‌.. ఇంట్లో 429 సీసాల తెలంగాణ లిక్కర్ సీజ్!
Amaravati News: అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు, ఏడీబీ నుంచి మరో రూ.15,000 కోట్ల లోన్!
అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు, ఏడీబీ నుంచి మరో రూ.15,000 కోట్ల లోన్!
Jabardasth Emmanuel : హీరోగా జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్ - క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్‌తో ఎంట్రీ... ఫస్ట్ లుక్ చూశారా?
హీరోగా జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్ - క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్‌తో ఎంట్రీ... ఫస్ట్ లుక్ చూశారా?
APPSC Jobs: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్: ఏపీపీఎస్సీ నుంచి 302 ఉద్యోగాలకి నోటిఫికేషన్లు విడుదల
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్: ఏపీపీఎస్సీ నుంచి 302 ఉద్యోగాలకి నోటిఫికేషన్లు విడుదల
Embed widget