అన్వేషించండి

Minister Roja: రామ్ చరణ్‌ను హత్తుకున్న రోజులు గుర్తొచ్చాయి - మంత్రి రోజా ట్వీట్

చిరంజీవి కుటుంబంలోకి మెగా ప్రిన్సెస్ రావడంపై ఆంధ్రప్రదేశ్ మంత్రి రోజా కూడా స్పందించారు. ట్వీట్ చేస్తూ తన శుభాకాంక్షలను తెలియజేశారు.

మెగాస్టార్ చిరంజీవి కుటుంబంలోకి మెగా ప్రిన్సెస్ రావడంపై సినీ ప్రముఖులు అందరి నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. రామ్ చరణ్ - ఉపాసన దంపతులకు పెళ్లైన 11 ఏళ్ల తర్వాత మొదటి సంతానంగా ఆడపిల్ల జన్మించింది. నిన్న (జూన్ 20) ఉదయం 6 గంటలకు ఉపాసన ఆడబిడ్డకు జన్మ ఇచ్చిందని స్వయంగా చిరంజీవి ప్రకటించారు. మంగళవారం పూట తమ ఇంట్లో ఆడపిల్ల పుట్టడం తాము అదృష్టంగా భావిస్తున్నట్లుగా చెప్పారు. ఈ వార్త బయటికి రాగానే మెగా అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. అంతేకాక, సినీ ప్రముఖులు వివిధ మాధ్యమాల ద్వారా ఉపాసన - రామ్ చరణ్ దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. తాత అయినందుకు చిరంజీవికి కూడా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ మంత్రి రోజా కూడా స్పందించారు. ట్వీట్ చేస్తూ తన శుభాకాంక్షలను తెలియజేశారు. ఈ సందర్భంగా రామ్ చరణ్ చిన్న తనంలో ఆయన్ను ఎత్తుకున్న రోజులను రోజా గుర్తు చేసుకున్నారు. చిరంజీవికి తాత అనే పేరు వచ్చినప్పటికీ ఆయనొక ఎవర్ గ్రీన్ హీరో అని కొనియాడారు.

‘‘తాత అయినందుకు చిరంజీవి గారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఎప్పుడూ యువకుడి తరహా మనసు, ఎనర్జీతో కూడిన వ్యక్తిత్వంగల మీ కుటుంబంలోకి ఒక లవ్లీ మెగా ప్రిన్సెస్‌ రావడం ఒక ఆశీర్వాదం. డియర్ రామ్ చరణ్.. నువ్వు చిన్న పిల్లాడిగా ఉన్నప్పుడు నిన్ను నా చేతులతో హత్తుకున్న రోజులు మర్చిపోలేను. ఆ రోజులు మళ్లీ గుర్తొచ్చాయి. అలాంటి నీకు ఇప్పుడు కూతురు పుట్టడం మరింత ఆనందకరం. చిరంజీవి సర్.. మీకు తాత అనే పేరు వచ్చినప్పటికీ మీరొక ఎవర్ గ్రీన్ హీరో. అలాగే ఉపాసన కొణిదెల, మీ ఇంటి చిట్టి మహాలక్ష్మికి నా ఆశీస్సులు’’ అని మంత్రి రోజా ట్వీట్ చేశారు.

టాప్ హెడ్ లైన్స్

Vishwanath And Sons Trailer: సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ ట్రైలర్ వచ్చేసిందోచ్... హిట్టు కళ కనబడుతోందిగా
సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ ట్రైలర్ వచ్చేసిందోచ్... హిట్టు కళ కనబడుతోందిగా
Korean Kanakaraju : కొరియన్ కనకరాజులో NTR డైలాగ్ - ట్రోలింగ్స్‌పై వరుణ్ తేజ్ రియాక్షన్
కొరియన్ కనకరాజులో NTR డైలాగ్ - ట్రోలింగ్స్‌పై వరుణ్ తేజ్ రియాక్షన్
DC Movie Review - డీసీ రివ్యూ: హీరోగా లోకేష్ కనగరాజ్ డెబ్యూ హిట్టేనా... అనిరుధ్ మ్యూజిక్‌తో చేసిన మేజిక్ ఎలా ఉందంటే?
డీసీ రివ్యూ: హీరోగా లోకేష్ కనగరాజ్ డెబ్యూ హిట్టేనా... అనిరుధ్ మ్యూజిక్‌తో చేసిన మేజిక్ ఎలా ఉందంటే?
Vijay Divorce Case: తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు- పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత!
తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు- పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత!

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
GHMC Elections: జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ : రామచందర్‌రావు కీలక ప్రకటన
జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ : రామచందర్‌రావు కీలక ప్రకటన
Mancherial News: ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
Anakapalle Latest News:
"అనకాపల్లిలోని కళ్యాణపులోవ రిజర్వాయర్‌ను నో మైనింగ్ జోన్‌గా ప్రకటించాలి" రైతులు, గిరిజనుల జల దీక్ష !
Double Lung Transplant : 47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
World Wonders: ప్రపంచ వింతలు అంటే ఏమిటి? 7 మాత్రమే ఎందుకున్నాయి, 8వ వింత ఏర్పడదా?
ప్రపంచ వింతలు అంటే ఏమిటి? 7 మాత్రమే ఎందుకున్నాయి, 8వ వింత ఏర్పడదా?
Divorce After Marriage : పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
Vijay Divorce Case: తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు- పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత!
తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు- పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత!
Nethanna Seva Lo: జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
Embed widget