![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Megastar And Anchor Suma: ‘నా కోట్ సుమ ఎత్తుకొచ్చేసింది’.. భార్య సురేఖాకు చిరంజీవి ఫోన్, మెగాస్టార్ ఫన్కు ఫ్యాన్స్ ఫిదా
Megastar And Anchor Suma: చిరంజీవి.. ఏ ఈవెంట్ కి వచ్చినా చాలా సరదాగా ఉంటారు ఆయన. ముఖ్యంగా యాంకర్ సుమ ఉంటే ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు కూడా సుమతో ఆయన ఫన్ క్రియేట్ చేశారు.
![Megastar And Anchor Suma: ‘నా కోట్ సుమ ఎత్తుకొచ్చేసింది’.. భార్య సురేఖాకు చిరంజీవి ఫోన్, మెగాస్టార్ ఫన్కు ఫ్యాన్స్ ఫిదా Megastar Chiranjeevi Funny Comments on Anchor Suma Dress Megastar And Anchor Suma: ‘నా కోట్ సుమ ఎత్తుకొచ్చేసింది’.. భార్య సురేఖాకు చిరంజీవి ఫోన్, మెగాస్టార్ ఫన్కు ఫ్యాన్స్ ఫిదా](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/04/01/84f7f67e38d95b0a8273b0eca234e09c1711946304907932_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Megastar And Anchor Suma Fun At Digital Media Federation Event: యాంకర్ సుమ.. ఆమె లేనిదే టాలీవుడ్ లో ఏ పెద్ద ఈవెంట్ జరగదు అనేది ఎప్పటి నుంచో వినిపిస్తున్న మాట. అలా రోజుకు పదుల సంఖ్యలో బిజీ బిజీగా షోలు, ఈవెంట్లు చేస్తుంటారు సుమ. ఆమె చేసే ఈవెంట్లు కేవలం ప్రేక్షకులు మాత్రమే కాదు.. సెలబ్రిటీలు కూడా చాలా చాలా ఎంజాయ్ చేస్తుంటారు. వాళ్లలో మెగాస్టార్ చిరంజీవి ఒకరు. సుమ, ఆయన కలిసి పాల్గొనే ప్రతి ఈవెంట్ లో ఫన్ క్రియేట్ చేస్తుంటారు చిరు. ఆమెపై జోకులు వేస్తూ సరదాగా ఉంటారు. ఇక ఆదివారం జరిగిన డిజిటిల్ మీడియా ఫెడరేషన్ ఆరిజన్ డే ఈవెంట్ లో కూడా సుమతో ఫన్ క్రియేట్ చేశారు చిరంజీవి. ఆమె వేసుకొచ్చిన సూట్ కి సంబంధించి జోకులు పేలుస్తూ అందరినీ నవ్వించారు ఆయన.
సురేఖ నా సూట్ సుమ దగ్గర ఉంది..
డిజిటల్ మీడియా ఫెడరేషన్ ఆరిజన్ డే ఈవెంట్ కి సుమ యాంకరింగ్ చేశారు. ఆ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి, విజయ దేవరకొండ చీఫ్ గెస్ట్ లుగా హాజరయ్యారు. ఈవెంట్ కి సుమ ఫార్మల్ లుక్ లో వచ్చారు. బ్లాక్ ప్యాంట్, సూట్ లో డిఫరెంట్ గా కనిపించారు. దీంతో ఆమె లుక్ పై ఫన్ క్రియేట్ చేశారు చిరు. సురేఖకి ఫోన్ చేసి కామెడీ చేశారు. మాట్లాడేందుకు స్టేజ్ ఎక్కిన చిరు.. విజయ దేవరకొండ చేతిలో నుంచి మైక్ లాక్కుని.. అర్జంట్ గా సురేఖకు ఫోన్ చేయాలి అంటూ ఫోన్ తీసి ఆమెతో మాట్లాడారు. "సురేఖ మొన్న నా బ్లాక్ ప్యాంట్, ఇంకా సూట్ కనిపించడం లేదని బాధపడ్డావు కదా? ఏం బాధపడకు ఆ అమ్మాయి తెచ్చిచేస్తుందిలే. ఎవరా? మన సుమ. ఎప్పుడు చేతివాటం చూపించిందో మరి. తెచ్చి ఇచ్చేస్తుందిలే. ఈవెంట్ అయ్యాక తెచ్చి ఇచ్చేయ్. చాలా కాస్ట్ లీ అమ్మ.. కష్టార్జీతం ఎక్కడికి పోదు కచ్చితంగా దొరుకుతుంది. దొరికింది" అంటూ జోక్ చేశారు చేశారు చిరు. దానికి సుమ "సార్ నా కంటే కాస్ట్ ఎక్కువా సార్ మీకు? సరేలెండి సార్ ఇచ్చేస్తాను సార్.. ఇచ్చేస్తాను" అంటూ సమాధానం చెప్పారు. దీంతో అక్కడ ఉన్నవాళ్లంతా ఒక్కసారిగా నవ్వారు. హాల్ మొత్తం నవ్వులతో నిండిపోయింది.
డిజిటల్ క్రియేటర్స్ ని, కంటెంట్ క్రియేటర్స్ ని ఒక తాటిపైకి తెచ్చేందుకు, వాళ్లకు అండగా ఉండేందుకు ఐక్య వేదికను ప్రారంభించాలనే ఉద్దేశంతో డిజిటిల్ మీడియా ఫెడరేషన్ ను స్టార్ చేశారు ఇటీవల. దానికి సంబంధించి ఒక వెబ్ సైట్ ను కూడా ఈ మధ్యే చిరంజీవి లాంచ్ చేశారు. ఇక ఆదివారం దానికి సంబంధించి ఆరిజిన్ డే నిర్వహించారు. ఎంతోమంది సోషల్ మీడియా ఇన్ ప్ల్యూయన్సర్లు, డిజిటిల్ మీడియా కంటెంట్ క్రియేటర్లు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి విజయ దేవరకొండ, చిరంజీవి చీఫ్ గెస్ట్ లుగారాగా.. గంగవ్వ, కుమారీ ఆంటీ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచారు.
Also Read: హరీశ్ శంకర్ దర్శకత్వంలో బాలయ్య బాబు.. నిర్మాతలు ఎవరో తెలుసా?
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)