Manchu Vishnu: మా అధ్యక్షుడిపై తప్పుడు ప్రచారం - మేము ఎలాంటి ప్రకటన ఇవ్వలేదు, మంచు విష్ణు నిర్మాణ సంస్థ
మంచు యూట్యూబ్ ఛానళ్లపై రద్దు చేయించడంపై కొందరు తప్పుడ ప్రచారం చేస్తున్నారు. ఈ విషయంపై ఆయన నిర్మాణ సంస్థ స్పందిస్తూ అసలు విషయం వెల్లడించింది. అలాగే వారిపై చర్యలు తీసుకున్నట్టు వెల్లడించింది.
24 Frames Factory Reacts on Fake News on Manchu Vishnu: మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (MAA) అధ్యక్షుడు మంచు ఇటీవల పలు యూట్యూబ్ ఛానళ్లపై చర్యలు తీసుకున్న సంగతి తెలిసిందే. నటీనటలను ట్రోల్ చేస్తూ చేసిన వీడియోలు, పోస్ట్‌లు తొలగించాలని లేదంటే ఆయా ఛానళ్లను పూర్తిగా రద్దు చేస్తామంటూ హెచ్చరించారు. అయినా పోస్ట్స్ తొలగించకపోవడంతో సైబర్ సెల్‌తో కలిసి యూట్యూబ్ ఛానళ్లను రద్దు చేశారు. దాదాపు 30 యూట్యూబ్ ఛానళ్లను పూర్తిగా తొలగిస్తూ 'మా' అసోషియేషన్ అధికారిక ప్రకటన ఇచ్చిన సంగతి తెలిసిందే.
నటీనటుల వ్యక్తిగత జీవితాలను ఇబ్బందికరమైన కంటెంట్తో ట్రోల్ చేస్తే ఖచ్చితంగా యూట్యూబ్ ఛానల్స్ ని నిర్మూలించే ప్రయత్నం చేస్తామని హెచ్చరించింది. అయితే దీనిపై కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. 24 ఎఫ్ ఎఫ్ అఫీషియల్ ('TwentyFour FFOfficial') అనే ఒక యూట్యూబ్ ఛానల్ నిర్వాహకుడు మంచు విష్ణు కన్నప్ప కంటెంట్ గురించి పాజిటివ్ కంటెంట్ వేస్తే యూట్యూబ్ ఛానల్ మీద వేసిన స్ట్రైక్ తీసేస్తామని తమతో బేరానికి దిగినట్లుగా ప్రచారం చేయడం మొదలుపెట్టారు. ఈ మేరకు ఒక వీడియో కూడా రిలీజ్ చేశాడు. అయితే దీనిపై మంచు విష్ణుకు చెందిన నిర్మాణ సంస్థ 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ అధికారికంగా స్పందించింది.
"మా ప్రొడక్షన్ కంపెనీకి సంబంధం లేని తప్పుడు ఈ-మెయిల్ (TwentyFour FFOfficial) పేరుతో పలువురు అసత్య ప్రచార చేస్తున్నారు. ఇది మా దృష్టికి వచ్చింది. మా అధికారిక ఈ-మెయిల్ "info@24FramesFactory.com" కాకుండా వచ్చే ఏ సమాచారాన్ని నమ్మొద్దు. ఫేక్ ఈ-మెయిల్ ఐడీలతో అసత్య సమాచారాన్ని పంపిస్తున్న వారిపై అతిత్వరలోనే చర్యలు తీసుకుంటాం. ప్రస్తుతం ఈ విషయమై 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, కన్నప్పు ఎగ్జక్యూటివ్ ప్రొడ్యూసర్ విజయ్ కుమార్ సైబర్ క్రైంకు ఫిర్యాదు చేయనున్నారు. మా అధ్యక్షుడిగా మంచు విష్ణు నటుల గౌరవం కోసం 'మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్' ద్వారా పోరాటం చేస్తున్నారు. కానీ ఇది ఆయన సొంత ప్రయోజం కోసం చేస్తున్నారంటూ, కేవలం తన ఫ్యామిలీని ట్రోల్ చేసిన యూట్యూబ్ ఛానళ్లపైనే చర్యలు తీసుకున్నాం.
This guy @iVishnuManchu strike youtube channels n when asked 4 review here is his reply,
— బాపు బొమ్మ (@bapu_bomma) July 26, 2024
Create positive videos about the movie "Kannappa," and then get back to us. We will remove the claim, and we look forward to collaborating with you in the future.
Konchamanna siggu undalira pic.twitter.com/mZwbfrvHBh
ఇది ఆయన గౌరవానికి భంగం కలిగేలా కొందరు కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఇది ఆయన యత్నాలను అడ్డుకోవడానికి జరుగుతున్న ప్రయత్నమని స్పష్టమవుతుంది. ఇలాంటి తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దని ప్రజలను విజ్ఞప్తి చేస్తున్నాం. నిజమైన సినిమా ప్రేమికులు ఎల్లప్పుడూ సినిమాను ప్రేమిస్తారు, ఈ విషయం పరిష్కరించుకునేందుకు మేము చేస్తున్న ప్రయత్నాలకు మీ మద్దతు కోరుతున్నాం" అంటూ తాజాగా 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ తన ప్రకటనలో పేర్కొంది. అంతేకాదు మంచు విష్ణుకు వ్యతిరేకంగా చేస్తున్న వారిని పట్టుకునేందుకు చర్యలు తీసుకుంటామని, దీనిపై సైబర్ సెల్‌కు ఫిర్యాదు చేస్తామన్నారు. ఈ విషయమై ఫేక్ ప్రచారం చేస్తున్న వారికి గట్టిగానే బుద్ది చెబుతామని పేర్కొన్నారు.