Bramayugam Movie Telugu Release: మార్చి 23న మమ్ముట్టి 'భ్రమయుగం' తెలుగు వెర్షన్ - టికెట్ ధరలపై మేకర్స్ కీలక నిర్ణయం?
Bramayugam Movie: మలయాళ స్టార్ మమ్ముట్టి డార్క్ పాంటసీ భ్రమయుగం మూవీ తెలుగు వెర్షన్ రిలీజ్ కు సిద్ధమైంది. ఈ క్రమంలో మూవీ టికెట్ రేట్స్ పై మేకర్స్ కీలక నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం..
Bramayugam Movie Ticket Prices: మలయాళ స్టార్ మమ్ముట్టి నటించిన లేటెస్ట్ మూవీ భ్రమయుగం. పాన్ ఇండియాగా డార్క్ ఫాంటసి హారర్ థ్రిల్లర్‌గా వచ్చిన ఈ సినిమాను భూతకాలం ఫేమ్ రాహుల్ సదాశివన్ పాన్ ఇండియాగా తెరకెక్కించారు. మలయాళంలో విడుదలైన ఈ చిత్రం అక్కడ మంచి హిట్ టాక్ తెచ్చుకుంది. ఫిబ్రవరి 15న థియేటర్లో రిలీజైన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద భారీ కలెక్షన్లతో దూసుకుపోతుంది. ఈ సినిమా విడుదలైన వారం రోజులు అవుతుండగా ఇప్పటిక వరకు దాదాపు రూ. 40 కోట్లపైగా వసూళ్లు చేసింది.
ఈ సినిమా ఆడియన్స్ భ్రమయుగంపై ప్రశంసలు కురిపిస్తున్నారు. మూవీ మంచి థ్రిల్ ఇస్తోందని, చాలా కాలం తర్వాత బ్లాక్ అండ్ వైట్‌లో మూవీ చూశామంటూ పాజిటివ్ రివ్యూస్ ఇస్తున్నారు. మలయాళంలో బ్లాక్‌బస్టర్ హిట్ తెచ్చుకున్న ఈ సినిమా ఇప్పుడు తెలుగు వెర్షన్ రిలీజ్‌కు రెడీ అవుతుంది. నిజానికి ఈ చిత్రం మలయాళంతో పాటు తెలుగులోనూ ఫిబ్రవరి 15నే థియేటర్లోకి రావాల్సి ఉంది. కానీ కొన్ని కారణాల వల్ల తెలుగు వెర్షన్ విడుదల వాయిదా పడింది. అయితే ఇప్పుడు ఈ డార్క్ పాంటసీ తెలుగు వెర్షన్ రిలీజ్ డేట్‌ను ఫిక్స్ చేసుకున్న సంగతి తెలిసిందే. మార్చి 23న భ్రమయుగం తెలుగులో విడుదల కానుంది. ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ తెలుగులో విడుదల చేస్తోంది.
ఈ క్రమంలో తాజాగా తెలుగు ఆడియన్స్‌ని థియేటర్లోకి రప్పించేందుకు టికెట్ ధరలపై మూవీ టీం కీలక నిర్ణయం తీసుకుంది. భ్రమయుగం మూవీ టికెట్స్ ధరలను తగ్గించినట్టు తెలుస్తోంది. ఈ మధ్య పాన్ ఇండియా చిత్రాల టికెట్ల రేట్లు రూ. 400 నుంచి రూ. 450 వరకు ఉంటున్న సంగతి తెలిసిందే. అయితే భ్రమయుగం టికెట్ల మాత్రం రీజనల్ ధరకు అందుబాటులో తెచ్చింది మూవీ టీం. సింగిల్ స్క్రీన్ థియేటర్లో రూ. 150గా సెలెక్టేడ్ మల్టీప్లెక్స్‌లలో రూ. 200లకే టికెట్లను కొనుగోఉ చేసుకునే అవకాశం కల్పించింది. కాగా భ్రమయుగం సినిమాను మలయాళంలో నైట్ షిప్ట్ స్టూడియోస్, వైనాట్ స్టూడియోస్ బ్యానర్స్ పై చక్రవర్తి రామచంద్ర, ఎస్. శశికాంత్ నిర్మించారు.
Enter into an enticing world for a cinematic experience you shouldn't miss! 🔥@mammukka's BLOCKBUSTER #Bramayugam Telugu Bookings in AP/TS are open now! 💥
— Sithara Entertainments (@SitharaEnts) February 21, 2024
Book your tickets now ▶️ https://t.co/AvisawELQH@rahul_madking @chakdyn @sash041075 @vamsi84 @allnightshifts… pic.twitter.com/UIO4ov7Mxl
భ్రమయుగం కథేంటంటే..
వన్ (అర్జున్ అశోకన్) జానపద గాయకుడు. తక్కువ కులానికి (పానన్) చెందినవాడు. తల్లి దగ్గరకు వెళుతూ అడవిలో తప్పిపోతాడు. ఆకలితో తిరిగి తిరిగి చివరకు ఓ పాడుబడ్డ ఇంటికి చేరుకుంటాడు. అందులో ఇద్దరు మాత్రమే ఉంటారు. ఒకరు వంటవాడు (సిద్ధార్థ్ భరతన్). మరొకరు యజమాని కుడుమోన్ పొట్టి (మమ్ముట్టి). తక్కువ కులానికి చెందిన వాడని తక్కువ చేయకుండా, ఇంటికి వచ్చిన అతిథి అంటూ తేవన్‌ను తనతో పాటు సమానంగా చూస్తాడు. అయితే... తనను కుడుమోన్ పొట్టి ట్రాప్ చేశారని తక్కువ సమయంలోనే తేవన్ తెలుసుకుంటాడు. ఆ ఇంటి నుంచి పారిపోవాలని ప్రయత్నిస్తాడు. అయితే... తాంత్రిక విద్యలతో అతడు మళ్లీ ఇంటికి వచ్చేలా చేస్తాడు కుడుమోన్ పొట్టి. అసలు అతని నేపథ్యం ఏమిటి? అతని గురించి తెలిసి వంటవాడు ఆ ఇంటిలో ఎందుకు ఉన్నాడు? చివరకు ఏమైంది? ఆ ఇంటి నుంచి తేవన్ తప్పించుకున్నాడా? లేదా? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.