Malaika Arora: వర్జినిటీ ఎప్పుడు కోల్పోయావ్? కొడుకును ప్రశ్నించిన మలైక అరోరా - ఊహించని సమాధానంతో షాక్!
తాజా ఇంటర్వ్యూలో బాలీవుడ్ నటి మలైకా అరోరా ఆమె కొడుకు అర్హాన్ ఖాన్ ను అడిగిన ప్రశ్న అందరినీ ఆశ్చర్యానికి గురించి చేసింది. కొడుకు అడిగిన క్వశ్చన్ కు తల్లి కూడా షాక్ అయ్యింది.
Malaika Arora asks son Arhaan when he lost his virginity: బాలీవుడ్ బ్యూటీ మలైకా అరోరా గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. హిందీ చిత్ర పరిశ్రమతో పాటు తెలుగులోనూ పలు సినిమాల్లో కనిపించింది. ‘గబ్బర్ సింగ్’ సినిమాలో ‘కెవ్వు కేక’ అంటూ కుర్రాళ్ల ఒంట్లో సెగలు పుట్టించింది. ఆ తర్వాత కూడా పలు సినిమాల్లో ఐటెం సాంగ్స్ తో అలరించింది. ప్రస్తుతం హిందీ పరిశ్రమలో రాణిస్తోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె కొడుకు అర్హాన్ ఖాన్‌ను అడిగిన ఓ ప్రశ్న సంచలనం అయ్యాయి. ఇంతకీ ఆమె ఏం అడిగిందంటే?
మలైకా కొడుకు అర్హాన్ ఖాన్ ఓ పాడ్ కాస్ట్ చేస్తున్నాడు. దీనికి ‘దమ్ బిర్యానీ’ అని పేరు పెట్టాడు. బిర్యానీ అనే పేరుకు తగ్గట్టుగానే మాంచి మసాలా దట్టించిన ప్రశ్నలతో గెస్టులను తిప్పలు పెడుతున్నాడు. తన షో ఫస్ట్ ఎపిసోడ్ లో తండ్రి అర్బాజ్ ఖాన్ గెస్టుగా రాగా, రెండో ఎపిసోడ్‌కు తన తల్లి మలైకా అరోరా వచ్చింది. తాజాగా ఈ ఎపిసోడ్ కు సంబంధించిన టీజర్‌ను విడుదల చేశారు. ఇందులో తల్లి కొడుకుల మధ్య ప్రశ్నలు అందరినీ ఆశ్చర్యపరిచాయి.
వర్జినిటీ ఎప్పుడు కోల్పోయావ్ అర్హాన్?- మలైకా
తాజా ఎపిసోడ్ లో తల్లి మలైకానే హోస్ట్ గా మారినట్లు కనిపిస్తోంది. ఇందులో భాగంగా నువ్వు వర్జినిటీ ఎప్పుడు కోల్పోయావ్? అని అర్హాన్ ను అడిగింది. ఈ ప్రశ్నకు అతడు షాక్ అయ్యాడు. వెంటనే తను, తల్లికి ఓ షాకింగ్ క్వశ్చన్ వేశాడు. అమ్మా, ముందు నాకు ఈ విషయం చెప్పు.. నువ్వు పెళ్లి ఎప్పుడు చేసుకోబోతున్నావ్? అని అడిగాడు. ఆ ప్రశ్నకు మలైకా ఎలాంటి సమాధానం చెప్పింది? అనే విషయం మాత్రం చూపించలేదు. ప్రస్తుతం ఈ టీజర్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. తల్లీ కొడుకులు మాట్లాడుకోవాల్సిన మాటలేనా ఇవి? అంటూ మండిపడ్డుతున్నారు. మరికొంత మంది మాత్రం ఇద్దరు భలే సరదాగా మాట్లాడుకుంటున్నారు? అని కామెంట్స్ పెడుతున్నారు.
View this post on Instagram
2017లో విడాకులు తీసుకున్న అర్జాన్, మలైకా
బాలీవుడ్ బ్యూటీ మలైకా అరోరా, నటుడు అర్బాజ్ ఖాన్ 1998లో ప్రేమ వివాహం చేసుకున్నారు. 2002లో వీరికి అర్హాన్ పుట్టాడు. 2008లో మలైకా తన భర్త అర్బాజ్ ఖాన్‌తో కలిసి అర్బాజ్ ఖాన్ ప్రొడక్షన్స్ అనే చిత్ర నిర్మాణ సంస్థను కూడా ప్రారంభించింది. ఈ సంస్థ ‘దబాంగ్’ లాంటి పలు బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలను నిర్మించింది. చాలా కాలం పాటు ఎంతో సంతోషంగా సంసార జీవితాన్ని కొనసాగించిన అర్బాజ్, మలైకా 2016 నుంచి విడిపోయారు. 2017లో విడాకులు తీసుకున్నారు. కొద్ది కాలం క్రితమే అర్బాజ్ ఖాన్ మేకప్ ఆర్టిస్ట్ షురా ఖాన్ ను పెళ్లి చేసుకున్నాడు. అటు నటుడు అర్జున్ కపూర్ తో మలైకా అరోరా డేటింగ్ చేస్తుంది. వీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు చాలా కాలంగా వినిపిస్తున్నాయి.
Also Read: బిడ్డను బిర్యానీ చేసి ఊళ్లోవాళ్లకు విందుగా పెడితే? ఈ మూవీ పెద్దలకు మాత్రమే.. పిల్లలతో అస్సలు చూడలేరు