అన్వేషించండి

Mahesh Babu: మహేష్ బాబు మరో కీలక నిర్ణయం - ఆ మూవీ థియేటర్‌కు మహార్దశ, ఏకంగా 7 స్క్రీన్స్‌తో!

Mahesh Babu: సూపర్ స్టార్ మహేశ్ బాబు తన ఏఎమ్‌బీ సినిమాస్‌ను వ్యాప్తి చేయాలని నిర్ణయించుకున్నారు. అందుకే సుదర్శన్ 70 ఎమ్ఎమ్‌కు కొత్త మెరుగులు దిద్దడానికి సిద్ధమవుతున్నట్టు సమాచారం.

Mahesh Babu Buys Sudarshan 70 MM: సినీ సెలబ్రిటీలు చాలావరకు కేవలం సినిమాలపైనే దృష్టి పెట్టకుండా అందులో నుండి వచ్చే లాభాలతో ఇతర వ్యాపారాలలో కూడా పెట్టుబడులు పెడుతుంటారు. ఇప్పటికే టాలీవుడ్‌లోని చాలామంది స్టార్ హీరోలకు రెస్టారెంట్స్, థియేటర్లు, క్లోత్ బ్రాండ్స్.. ఇలా చాలా వ్యాపారాలు ఉన్నాయి. అలాంటి హీరోలలో సూపర్ స్టార్ మహేశ్ బాబు కూడా ఒకరు. మహేశ్‌కు ఉన్న బిజినెస్‌లలో మల్టీప్లెక్స్ కూడా ఒకటి. ‘ఏఎమ్‌బీ సినిమాస్’ అనే పేరుతో ఇప్పటికే గచ్చిబౌలిలో తనకంటూ సొంత మల్టీప్లెక్స్‌ను ప్రారంభించారు మహేశ్. ఇప్పుడు అదే బిజినెస్‌ను మరింత ముందుకు తీసుకువెళ్లే ప్రయత్నాలు మొదలుపెట్టారు.

7 స్క్రీన్ మల్టీప్లెక్స్..

2018లో శరత్ సిటీ క్యాపిటల్ మాల్‌లో ఏఎమ్‌బీ సినిమాస్ ప్రారంభమయ్యింది. 7 స్క్రీన్ మల్టీప్లెక్స్‌గా ప్రారంభమయిన ఈ థియేటర్ సూపర్ సక్సెస్‌ను సాధించింది. మిగతా థియేటర్లకంటే ఇందులో టికెట్ ధరలు ఎక్కువగా ఉన్నా.. స్క్రీన్ క్వాలిటీ కూడా అదే రేంజ్‌లో ఉండడంతో ప్రేక్షకులు ఇందులో సినిమాలు చూడడానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇక మల్టీప్లెక్స్‌లో తన మొదటి అడుగు సక్సెస్ అవ్వడంతో ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఏఎమ్‌బీ సినిమాస్‌ను ప్రారంభించాలని మహేశ్ బాబు నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. అంతే కాకుండా హైదరాబాద్‌లో కూడా మరొక బ్రాంచ్ ఓపెన్ చేయడానికి సన్నాహాలు మొదలయినట్టు సమాచారం.

నిరాశలో మాస్ ఆడియన్స్..

ఏషియన్ సినిమాస్‌తో చేతులు కలిపి మహేశ్ బాబు ప్రారంభించిన ఏఎమ్‌బీ సినిమాస్ థియేటర్ల రూపురేఖలనే మార్చేసింది. అందుకే హైదరాబాద్‌లో ఒకటి, వైజాగ్‌లో మరొకటి స్క్రీన్స్‌ను ఏర్పాటు చేయాలని మహేశ్ నిర్ణయించుకున్నారట. ఇప్పటికే హైదరాబాద్‌లోనే క్లాసిక్ థియేటర్‌గా పేరు తెచ్చుకున్న సుదర్శన్ 70 ఎమ్ఎమ్ థియేటర్‌ను ఏఎమ్‌బీ సినిమాస్‌గా మార్చడానికి సన్నాహాలు మొదలయ్యాయి. ఆర్టీసీ క్రాస్ రోడ్స‌లో ఉన్న ఈ థియేటర్ ఎన్నో ఏళ్లుగా మాస్ ఆడియన్స్‌కు చాలా దగ్గరయ్యింది. దీన్ని ఇప్పుడు క్లాస్ ఆడియెన్స్‌కు కూడా అందుబాటులోకి తెచ్చేలా పనులు జరుగుతున్నాయి. త్వరలోనే ప్రారంభోత్సవ తేదీని కూడా ప్రకటించనున్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో మొదటిసారి..

వైజాగ్‌లో ఇప్పటికే ఏఎమ్‌బీ సినిమాస్ కన్‌స్ట్రక్షన్‌కు పనులు ప్రారంభమయ్యాయని సమాచారం. అంతే కాకుండా త్వరలోనే ఈ కొత్త బ్రాంచ్‌లు ఎప్పుడు ప్రారంభమవుతాయో అప్డేట్ రానుందని తెలుస్తోంది. దీంతో ఆంధ్రప్రదేశ్‌లో కూడా తన ఏఎమ్‌బీ సినిమాస్ సామ్రాజ్యాన్ని ప్రారంభించడానికి మహేశ్ బాబు సిద్ధమయ్యారు. ఇక సూపర్ స్టార్ సినిమాల విషయానికొస్తే.. ఇటీవల మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌తో కలిసి ‘గుంటూరు కారం’తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా మిక్స్‌డ్ టాక్ అందుకున్నా కూడా కలెక్షన్స్ విషయంలో మాత్రం భారీ వసూళ్లను సాధించింది. ఇక ఈ మూవీ ఓటీటీలో విడుదలయిన తర్వాత ఫ్యామిలీ ఆడియన్స్ దగ్గర నుండి బ్లాక్‌బస్టర్ టాక్ అందుకుంటోంది. ప్రస్తుతం రాజమౌళితో కలిసి చేయనున్న సినిమాపై ఫోకస్ పెట్టారు మహేశ్. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రారంభమయ్యాయి. త్వరలోనే మూవీ సెట్స్‌పైకి కూడా వెళ్లనున్నట్టు సమాచారం.

Also Read: కాబోయే భర్త 'VD' లాగా ఉండాలన్న రష్మిక - పరోక్షంగా హింట్ ఇచ్చిందంటున్న ఫ్యాన్స్!

టాప్ హెడ్ లైన్స్

Akhil Akkineni : తండ్రి కాళ్లపై పడిన హీరో అఖిల్ - అయ్యగారితో కింగ్ ఎమోషనల్ మూమెంట్
తండ్రి కాళ్లపై పడిన హీరో అఖిల్ - అయ్యగారితో కింగ్ ఎమోషనల్ మూమెంట్
Double Occupancy OTT : పగలు అమ్మాయి... రాత్రి అబ్బాయి - ఓటీటీలోకి సడన్‌గా తమిళ రొమాంటిక్ కామెడీ... తెలుగులోనూ స్ట్రీమింగ్
పగలు అమ్మాయి... రాత్రి అబ్బాయి - ఓటీటీలోకి సడన్‌గా తమిళ రొమాంటిక్ కామెడీ... తెలుగులోనూ స్ట్రీమింగ్
Korean Kanakaraju Release Date: ఆగస్టు రేసులో వరుణ్ తేజ్ హారర్ సినిమా... 'కొరియన్ కనకరాజు' రిలీజ్ ఎప్పుడంటే?
ఆగస్టు రేసులో వరుణ్ తేజ్ హారర్ సినిమా... 'కొరియన్ కనకరాజు' రిలీజ్ ఎప్పుడంటే?
Roshan Kanakala : సుమ కొడుకు రోషన్ సరికొత్త ప్రయోగం - సైన్స్ ఫిక్షన్ జానర్... స్పెషాలిటీ ఏంటంటే?
సుమ కొడుకు రోషన్ సరికొత్త ప్రయోగం - సైన్స్ ఫిక్షన్ జానర్... స్పెషాలిటీ ఏంటంటే?

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy Khammam Sabha: కాచుకో కేసీఆర్! 2029లో 182 సీట్లు.. 117 స్థానాల్లో కాంగ్రెస్ గెలుపు ఖాయం - సీఎం రేవంత్ రెడ్డి సంచలన జోస్యం!
కాచుకో కేసీఆర్! 2029లో 182 సీట్లు.. 117 స్థానాల్లో కాంగ్రెస్ గెలుపు ఖాయం - సీఎం రేవంత్ రెడ్డి సంచలన జోస్యం!
Akhil Akkineni : తండ్రి కాళ్లపై పడిన హీరో అఖిల్ - అయ్యగారితో కింగ్ ఎమోషనల్ మూమెంట్
తండ్రి కాళ్లపై పడిన హీరో అఖిల్ - అయ్యగారితో కింగ్ ఎమోషనల్ మూమెంట్
Kagaznagar Thief Caught: ఇంత అమాయకంగా దొంగతనం చేస్తారా? అడ్డంగా దొరికాక ఒళ్లు హూనం కాకుండా ఉంటుందా?
ఇంత అమాయకంగా దొంగతనం చేస్తారా? అడ్డంగా దొరికాక ఒళ్లు హూనం కాకుండా ఉంటుందా?
Double Occupancy OTT : పగలు అమ్మాయి... రాత్రి అబ్బాయి - ఓటీటీలోకి సడన్‌గా తమిళ రొమాంటిక్ కామెడీ... తెలుగులోనూ స్ట్రీమింగ్
పగలు అమ్మాయి... రాత్రి అబ్బాయి - ఓటీటీలోకి సడన్‌గా తమిళ రొమాంటిక్ కామెడీ... తెలుగులోనూ స్ట్రీమింగ్
Roshan Kanakala : సుమ కొడుకు రోషన్ సరికొత్త ప్రయోగం - సైన్స్ ఫిక్షన్ జానర్... స్పెషాలిటీ ఏంటంటే?
సుమ కొడుకు రోషన్ సరికొత్త ప్రయోగం - సైన్స్ ఫిక్షన్ జానర్... స్పెషాలిటీ ఏంటంటే?
Breaking News: 2029 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 117 సీట్లతో తెలంగాణలో అధికారలోకి వస్తుంది: రేవంత్ రెడ్డి
2029 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 117 సీట్లతో తెలంగాణలో అధికారలోకి వస్తుంది: రేవంత్ రెడ్డి
Supreme Court Litigant Hurls Abuses Judges: సుప్రీంకోర్టులో కలకలం! జడ్జీలపైకి ఫైళ్లు విసిరి, బూతులు తిట్టిన పిటిషనర్.. బయటకు గెంటేసిన సెక్యూరిటీ!
సుప్రీంకోర్టులో కలకలం! జడ్జీలపైకి ఫైళ్లు విసిరి, బూతులు తిట్టిన పిటిషనర్.. బయటకు గెంటేసిన సెక్యూరిటీ!
Youtuber Ravan: యూట్యూబర్ రావణ్‌ తరఫున వాదిస్తున్న పొన్నవోలు సుధాకర్! వైసీపీతో సంబంధం లేదని వివరణ!
యూట్యూబర్ రావణ్‌ తరఫున వాదిస్తున్న పొన్నవోలు సుధాకర్! వైసీపీతో సంబంధం లేదని వివరణ!
Embed widget