అన్వేషించండి

Salman Khan Firing Case : పాక్ నుంచి ఆయుధాలు, 70 మందితో నిఘా - సల్మాన్ హత్యకు మాస్టర్ ప్లాన్

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పుల ఘటన కేసు విచారణలో షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి. సల్మాన్ ను హత్య చేసేందుకు గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ మాస్టర్ ప్లాన్ వేసినట్లు తేలింది.

Salman Khan Firing Case: బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్‌ ఇంటిపై కాల్పుల కేసు విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.  సల్మాన్ చంపేందుకు మాస్టర్ ప్లాన్ వేసినట్లు పోలీసు విచారణలో తేలింది. సల్మాన్ ఖాన్ ఇంటి నుంచి బయటకు రాగానే కారుపై AK 47 తుపాకులతో దాడి చేయాలని ప్లాన్ వేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఇందుకు ఏకంగా పాకిస్థాన్‌లోని ఓ ఆయుధ ముఠా నుంచి AK 47 తుపాకులు కొనుగోలు చేసినట్లు తెలిపారు. అత్యాధునిక AK 92 ఆయుధాలను సైతం సమకూర్చినట్లు వెల్లడించారు. సల్మాన్ కారులో వెళ్తుండగానే రౌండప్ చేసి కాల్పులు జరపాలని ప్లాన్ చేసినట్లు విచారణలో తేలినట్లు చెప్పారు. ఒక వేళ ఈ ప్లాన్ ఫెయిల్ అయితే, సల్మాన్ ఫామ్ హౌస్ లోకి దూరి కాల్పులు జరపాలని ప్లాన్ చేశారట. సల్మాన్ పై మైనర్లతో దాడి చేయించి, వారిని తమిళ నాడులోని కన్యాకుమారి నుంచి బోటులో శ్రీలంకకు పంపించాలనేది మరో ప్లాన్.

70 మందితో సల్మాన్ కదలికలపై నిఘా

తాజాగా ఈ కేసుకు సంబంధించి నేవీ ముంబైలోని పల్వెల్ పోలీసులు నలుగురు నిందితులను పట్టుకున్నారు. వీళ్లంతా గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ ముఠాకు చెందిన వారేనని వెల్లడైంది. ఈ నలుగురిని విచారిస్తే కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. వీరే సల్మాన్ ఖాన్ పై దాడికి ప్లాన్ చేసినట్లు తేలింది. ఈ నలుగురిని ధనంజయ్ అలియాస్ అజయ్ కశ్యప్, గౌరవ్ భాటియా అలియాస్ నహ్వీ, వాస్పీ ఖాన్ అలియాస్ వసీం చిక్నా, రిజ్వాన్ ఖాన్ అలియాస్ జావేద్ ఖాన్‌ గా పోలీసులు గుర్తించారు. ఈ గ్యాంగ్ కు చెందిన సుమారు  60 నుంచి 70 మంది వ్యక్తులు ముంబై, రాయగఢ్, నవీ ముంబై, థానే, పుణె, గుజరాత్ నుంచి వచ్చి సల్మాన్ ఖాన్‌పై నిఘా ఉంచినట్లు పోలీసులు తెలిపారు. సుమారు 20 మంది సల్మాన్ ఫామ్‌ హౌస్ చుట్టూ రెక్కీ నిర్వహించినట్లుగా ఆధారాలు  లభించినట్లు చెప్పారు. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ తో పాటు ఆయన సోదరుడు అన్మోల్‌, గోల్డీబ్రార్‌ సహా 17 మందిపై కేసు ఫైల్ చేశారు. వారిని పట్టుకునేందుకు పోలీసులు ప్రత్యేక బృందాల ద్వారా గాలిపు చర్యలు చేపట్టారు.   

సల్మాన్ ను హత్య చేస్తామని గతంలోనే హెచ్చరించిన బిష్ణోయ్ గ్యాంగ్

నిజానికి సల్మాన్ ఖాన్ ను చంపేస్తామని గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ ఇప్పటికే చాలాసార్లు హెచ్చరించాడు. కృష్ణ జింకలను వేటాడిన కేసు విచారణ జరిగే సమయం నుంచి సల్మాన్ కు వార్నింగ్స్ ఇస్తున్నాడు. బిష్ణోయ్ వర్గానికి చెందిన వాళ్లు కృష్ణ జింకలను దైవంగా భావిస్తారు. వాటిని చంపి తమ మనోభావాలను దెబ్బ తీసిన సల్మాన్ ను చంపేస్తామని బిష్ణోయ్ ఎప్పుడో చెప్పాడు. కృష్ణ జింకలను వేటాడిన కేసులో సల్మాన్ నిర్దోషిగా బయటపడినా, బిష్ణోయ్ గ్యాంగ్ మాత్రం అతడిని వదిలి పెట్టేది లేదని హెచ్చరిస్తోంది. ఆయన హత్యకు ప్లాన్లు వేస్తూనే ఉంది.  

Read Also: పెళ్లికి ముందే ఒకే రూమ్ లో ఉండేవాళ్లం, నాకు ఆ భయం అస్సలు ఉండేది కాదు: జీవిత

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

EVs Registration Fee: తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు
తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు
Andhra News: ఏపీలో తీవ్ర విషాదాలు - సెల్‌ఫోన్‌లో ఆడుతూ సాంబారులో పడి బాలుడు మృతి, రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బాలురు మృతి
ఏపీలో తీవ్ర విషాదాలు - సెల్‌ఫోన్‌లో ఆడుతూ సాంబారులో పడి బాలుడు మృతి, రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బాలురు మృతి
Devi Sri Prasad: ప్రతి ఫ్రేమ్‌లో వినిపించింది నేనే - ట్రైలర్ లాంచ్ అయ్యాక దేవిశ్రీ ట్వీట్!
ప్రతి ఫ్రేమ్‌లో వినిపించింది నేనే - ట్రైలర్ లాంచ్ అయ్యాక దేవిశ్రీ ట్వీట్!
Jio New Plan: ఒక్క రీఛార్జ్‌తో 98 రోజుల వ్యాలిడిటీ, 196 జీబీ డేటా - జియో సూపర్ ప్లాన్ ఇదే!
ఒక్క రీఛార్జ్‌తో 98 రోజుల వ్యాలిడిటీ, 196 జీబీ డేటా - జియో సూపర్ ప్లాన్ ఇదే!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సచ్చిపోదామని యాసిడ్ తాగినా!! ఇతని స్టోరీకి కన్నీళ్లు ఆగవు!బై నాన్నా.. వెక్కివెక్కి ఏడ్చిన నారా రోహిత్Nayanthara vs Dhanush Netflix Documentary | తమిళ్ సినీ ఇండస్ట్రీలో వివాదం..నయనతార vs ధనుష్ | ABP Desamరోహిత్ కి ధోని చేసిన మేలు, తిలక్ కి సూర్య చేస్తున్నాడు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
EVs Registration Fee: తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు
తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు
Andhra News: ఏపీలో తీవ్ర విషాదాలు - సెల్‌ఫోన్‌లో ఆడుతూ సాంబారులో పడి బాలుడు మృతి, రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బాలురు మృతి
ఏపీలో తీవ్ర విషాదాలు - సెల్‌ఫోన్‌లో ఆడుతూ సాంబారులో పడి బాలుడు మృతి, రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బాలురు మృతి
Devi Sri Prasad: ప్రతి ఫ్రేమ్‌లో వినిపించింది నేనే - ట్రైలర్ లాంచ్ అయ్యాక దేవిశ్రీ ట్వీట్!
ప్రతి ఫ్రేమ్‌లో వినిపించింది నేనే - ట్రైలర్ లాంచ్ అయ్యాక దేవిశ్రీ ట్వీట్!
Jio New Plan: ఒక్క రీఛార్జ్‌తో 98 రోజుల వ్యాలిడిటీ, 196 జీబీ డేటా - జియో సూపర్ ప్లాన్ ఇదే!
ఒక్క రీఛార్జ్‌తో 98 రోజుల వ్యాలిడిటీ, 196 జీబీ డేటా - జియో సూపర్ ప్లాన్ ఇదే!
Group 3 Exams: భార్యకు పరీక్ష, భర్తకు బాధ్యత - గ్రూప్ 3 పరీక్షా కేంద్రాల వద్ద వైరల్ 'సిత్రాలు'
భార్యకు పరీక్ష, భర్తకు బాధ్యత - గ్రూప్ 3 పరీక్షా కేంద్రాల వద్ద వైరల్ 'సిత్రాలు'
Pushpa 2 Trailer: మాసు డోసు పెరిగింది బాసూ - ‘పుష్ప 2’ ట్రైలర్ రిలీజ్ - సినిమా ఈ రేంజ్ అయితే ‘బాహుబలి 2’ అవుట్!
మాసు డోసు పెరిగింది బాసూ - ‘పుష్ప 2’ ట్రైలర్ రిలీజ్ - సినిమా ఈ రేంజ్ అయితే ‘బాహుబలి 2’ అవుట్!
Lagacherla News: వచ్చేది ఫార్మా ఇండస్ట్రీ కాదు, ఇండస్ట్రియల్ అండ్‌ టెక్స్‌టైల్ పార్కు- లగచర్ల వివాదంలో భారీ ట్విస్ట్
వచ్చేది ఫార్మా ఇండస్ట్రీ కాదు, ఇండస్ట్రియల్ అండ్‌ టెక్స్‌టైల్ పార్కు- లగచర్ల వివాదంలో భారీ ట్విస్ట్
Nara Rammurthy Naidu: సోదరుని పాడె మోసిన సీఎం చంద్రబాబు - అధికారిక లాంఛనాలతో రామ్మూర్తినాయుడు అంత్యక్రియలు పూర్తి
సోదరుని పాడె మోసిన సీఎం చంద్రబాబు - అధికారిక లాంఛనాలతో రామ్మూర్తినాయుడు అంత్యక్రియలు పూర్తి
Embed widget