అన్వేషించండి

Game Changer : యాక్షన్ మోడ్‌లో రామ్ చరణ్ - రామోజీ ఫిల్మ్ సిటీలో 'గేమ్ ఛేంజర్' నయా షెడ్యూల్!

Game Changer : రామ్ చరణ్ 'గేమ్ చేంజర్' తాజా షెడ్యూల్ ని రామోజీ ఫిలిం సిటీ లో ప్లాన్ చేశారు. అక్కడ ప్రత్యేక సెట్ లో యాక్షన్ సీన్స్ షూట్ చేస్తున్నారు.

Ram charan's game changer shooting : సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'గేమ్ ఛేంజర్'.'RRR' సినిమా తర్వాత చరణ్ చేస్తున్న సినిమా కావడంతో సినిమాపై అభిమానులలో భారీగా అంచనాలు నెలకొన్నాయి. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ సినిమాను భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ మొదలై సుమారు ఏడాది మనకు పైగా కావస్తోంది. కానీ ఇప్పటిదాకా చిత్రీకరణ పూర్తవలేదు దర్శకుడు శంకర్ ఈ సినిమాతో పాటు 'ఇండియన్ 2' సినిమా షూటింగ్ లోనూ బిజీ అయ్యారు. రెండు సినిమాలు ఒకేసారి తెరకెక్కించడంతో 'గేమ్ ఛేంజర్' మరింత ఆలస్యం అవుతూ వచ్చింది. ఇక ఎట్టకేలకు షూటింగ్ పూర్తి చేసే పనిలో పడ్డ మూవీ టీం తాజాగా లేటెస్ట్ షెడ్యూల్ ని హైదరాబాద్ లో ప్లాన్ చేశారు.

రామోజీ ఫిల్మ్ సిటీలో 'గేమ్ ఛేంజర్' షూటింగ్

'గేమ్ చేంజర్' మూవీ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఇప్పటికే 70 నుంచి 80 శాతానికి పైగా చిత్రీకరణ పూర్తయినట్లు తెలుస్తోంది. డైరెక్టర్ శంకర్ ప్రస్తుతం పెండింగ్ వర్క్ ఫినిష్ చేసే పనిలో ఉన్నారట. ఈ క్రమంలోనే 'గేమ్ ఛేంజర్' షూటింగ్ కి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ బయటకు వచ్చింది. దాని ప్రకారం.. హైదరాబాద్లోని రామోజీ ఫిలిం సిటీ లో సినిమాకు సంబంధించి కీలక షెడ్యూల్ షూటింగ్ జరుగుతున్నట్లు సమాచారం. ఇక్కడ నిర్మించిన ఓ ప్రత్యేక సెట్ లో షూటింగ్ చేస్తున్నారట. ప్రముఖ స్టంట్ కొరియోగ్రాఫర్ అన్బరివ్ నేతృత్వంలో కీలకమైన యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. మార్చి తొలివారం వరకూ ఈ చిత్రీకరణ ఉంటుందని తెలిసింది. రీసెంట్ గానే ఈ షెడ్యూల్ ని స్టార్ట్ చేసిందట మూవీ టీం. 

'గేమ్ ఛేంజర్' దసరాకి కూడా కష్టమే

నిర్మాత దిల్ రాజు ఆ మధ్య ఓ ప్రెస్ మీట్ లో 'గేమ్ చేంజర్' సినిమాని సెప్టెంబర్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు తెలిపారు. వినాయక చవితి కానుగా విడుదల చేస్తామని ప్రకటించారు. అయితే, తాజా పరిస్థితుల నేపథ్యంలో ఈ సినిమా ఆ డేట్ కు విడుదలయ్యే అవకాశం కనిపించడం లేదు. పవన్ కల్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న 'OG' సినిమా సెప్టెంబర్ 27న విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో 'గేమ్ ఛేంజర్' విడుదల వాయిదా పడే అవకాశం ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. దసరాకి తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నట్లు ఇటీవల వార్తలు వినిపించగా.. ఆ సమయానికి ఎన్టీఆర్ 'దేవర' రిలీజ్ అవుతోంది. సో 'గేమ్ ఛేంజర్' దసరాకి రావడం కూడా కష్టంగానే కనిపిస్తోంది. మరి సినిమా రిలీజ్ డేట్ కు సంబంధించి మేకర్స్ నుంచి ఏమైనా అప్డేట్ వస్తుందేమో చూడాలి.

చెర్రీ డ్యూయల్ రోల్

పొలిటికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న 'గేమ్ ఛేంజర్' మూవీలో రామ్ చరణ్ డ్యూయల్ రోల్ పోషిస్తున్నారు. ఇప్పటికే 'నాయక్' సినిమాలో డ్యూయల్ రోల్ లో మెప్పించిన రామ్ చరణ్ ఇందులో మాత్రం తండ్రి, కొడుకులుగా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. కార్తిక్‌ సుబ్బరాజు కథను అందించిన ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. అంజలి, సముద్రఖని, ఎస్.జే సూర్య, శ్రీకాంత్, సునీల్, జయరాం, రాజీవ్ కనకాల కీలక పాత్రల్లో కనిపించనున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌ పై దిల్ రాజు ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.

Also Read : దిల్ రాజుకి భారీ షాక్ - వాళ్ళ చేతికి 'ఇండియన్ 2' నైజాం రైట్స్

టాప్ హెడ్ లైన్స్

Jailer 2 Trailer : యాక్షన్ అదిరింది తలైవా - అవెయిటెడ్ జైలర్ 2 ట్రైలర్ వచ్చేసింది
యాక్షన్ అదిరింది తలైవా - అవెయిటెడ్ జైలర్ 2 ట్రైలర్ వచ్చేసింది
This Week OTT Movies : అక్టోబర్ సెకండ్ వీక్ ఓటీటీ మూవీస్ - శుక్రవారం ఒక్క రోజే 10 సినిమాలు స్ట్రీమింగ్... ఈ నాలుగు సినిమాలు డోంట్ మిస్
అక్టోబర్ సెకండ్ వీక్ ఓటీటీ మూవీస్ - శుక్రవారం ఒక్క రోజే 10 సినిమాలు స్ట్రీమింగ్... ఈ నాలుగు సినిమాలు డోంట్ మిస్
Aadarsha Kutumbam : వెంకీ ఆదర్శ కుటుంబం మళ్లీ వాయిదా - అసలు రీజన్స్ ఏంటో చెప్పిన నిర్మాత నాగవంశీ
వెంకీ ఆదర్శ కుటుంబం మళ్లీ వాయిదా - అసలు రీజన్స్ ఏంటో చెప్పిన నిర్మాత నాగవంశీ
Sivakarthikeyan : నేను పీపుల్ మేడ్ స్టార్... ఫ్యాన్ మీట్‌లో శివకార్తికేయన్ - పాలిటిక్స్‌లోకి తమిళ హీరో ఎంట్రీ కన్ఫర్మేనా?
నేను పీపుల్ మేడ్ స్టార్... ఫ్యాన్ మీట్‌లో శివకార్తికేయన్ - పాలిటిక్స్‌లోకి తమిళ హీరో ఎంట్రీ కన్ఫర్మేనా?

వీడియోలు

India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్
Rohit Virat Final Match in Guwahati? | గౌహతి వేదికగా రోహిత్, కోహ్లీ చివరి మ్యాచ్?
Reason for Virat Kohli Test Retirement | విరాట్ టెస్ట్ రిటైర్మెంట్ వెనుక అసలు నిజం ఇదే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Medicine Nobel Prize: మెడిసిన్ విభాగంలో ముగ్గురికి నోబెల్ బహుమతి.. ఒక్కో విజేతకు ప్రైజ్ మనీ ఎంతంటే 
మెడిసిన్ విభాగంలో ముగ్గురికి నోబెల్ బహుమతి.. ఒక్కో విజేతకు ప్రైజ్ మనీ ఎంతంటే 
Supreme Court Notices To Gyanesh Kumar: సీఈసీపై పిటిషన్ల విచారణ.. కేంద్రంతో పాటు జ్ఞానేష్ కుమార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు
సీఈసీపై పిటిషన్ల విచారణ.. కేంద్రంతో పాటు జ్ఞానేష్ కుమార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు
Telangana Finances: బకాయిల సుడిగుండంలో తెలంగాణ: రూ. 65 వేల కోట్ల పెండింగ్ బిల్లులు - రేవంత్ ప్రభుత్వానికి ఆర్థిక సవాల్!
బకాయిల సుడిగుండంలో తెలంగాణ: రూ. 65 వేల కోట్ల పెండింగ్ బిల్లులు - రేవంత్ ప్రభుత్వానికి ఆర్థిక సవాల్!
Hyderabad Tank Bund Accident: ట్యాంక్ బండ్‌పై పెను విషాదం.. పుట్టినరోజు నాడే ఆరేళ్ల చిన్నారి మృతి
ట్యాంక్ బండ్‌పై పెను విషాదం.. పుట్టినరోజు నాడే ఆరేళ్ల చిన్నారి మృతి
Harish Rao Siddipet : సిరిసిల్ల తర్వాత సిద్ధిపేటపై రేవంత్ కన్ను - హరీష్ రావు కోటలో కాంగ్రెస్ రణభేరి ఫలిస్తుందా?
సిరిసిల్ల తర్వాత సిద్ధిపేటపై రేవంత్ కన్ను - హరీష్ రావు కోటలో కాంగ్రెస్ రణభేరి ఫలిస్తుందా?
YSRCP Local Elections Strategy: స్థానిక ఎన్నికల్లో జగన్ మార్క్ క్లాస్ - కూటమి విభేదాలపై వైఎస్సార్‌సీపీ పొలిటికల్ అటాక్ -
స్థానిక ఎన్నికల్లో జగన్ మార్క్ క్లాస్ - కూటమి విభేదాలపై వైఎస్సార్‌సీపీ పొలిటికల్ అటాక్ -
కియా కార్ల దసరా సేల్‌.. రూ.1.70 లక్షల వరకు ప్రయోజనాలు.. అక్టోబర్ ఆఫర్ల పూర్తి లిస్ట్
కియా కార్లపై దసరా ఆఫర్లు.. ఈ పండుగ టైమ్‌లో రూ.1.70 లక్షల వరకు ఆదా!
MLA Chintamaneni Prabhakar: వెదురుపావులూరు టోల్ ప్లాజా ఘటనలో ఎమ్మెల్యే చింతమనేని ఏ సంబంధం లేదు, అసలేం జరిగిందంటే
వెదురుపావులూరు టోల్ ప్లాజా ఘటనలో ఎమ్మెల్యే చింతమనేని ఏ సంబంధం లేదు, అసలేం జరిగిందంటే
Embed widget