(Source: ECI/ABP News/ABP Majha)
Lakshmi Manchu: లక్ష్మీ మంచు సినిమా సెన్సార్ పూర్తి - పీరియాడిక్ డ్రామా రిలీజ్ ఎప్పుడంటే?
Adiparvam Movie: వెర్సటైల్ యాక్ట్రెస్, ఫైర్ బ్రాండ్ లక్ష్మీ మంచు ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'ఆదిపర్వం'. సెన్సార్ కార్యక్రమాలు పూర్తి అయ్యాయి. సినిమాకు వచ్చిన సర్టిఫికెట్ ఏంటి? అనేది చూస్తే...
సుమారు ఎనిమిది వందల సంవత్సరాల క్రితం తెలుగు రాష్ట్రాల్లోని ఒక అమ్మవారి గుడి చుట్టూ జరిగిన వాస్తవ సంఘటనల స్ఫూర్తితో తెరకెక్కిన సినిమా 'ఆదిపర్వం' (Adiparvam Movie). అమ్మవారిని నమ్ముకున్న ఒక భక్తురాలు, ఆ భక్తురాల్ని దుష్ట శక్తుల నుండి భద్రంగా సంరక్షించే క్షేత్రపాలకుడి నేపథ్యంలో కథ సాగుతుంది. ఇందులో వెర్సటైల్ యాక్ట్రెస్, ఫైర్ బ్రాండ్ లక్ష్మీ మంచు (Lakshmi Manchu) ప్రధాన పాత్రలో నటించారు. క్షేత్రపాలకుడిగా శివ కంఠమనేని (Shiva Kantamaneni) కనిపించనున్నారు. లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే?
'ఆదిపర్వం' సెన్సార్ పూర్తి... రిపోర్ట్ ఏమిటంటే?
'ఆదిపర్వం' చిత్రానికి సంజీవ్ మేగోటి దర్శకత్వం వహించారు. రావుల వెంకటేశ్వర్ రావు సమర్పణలో అన్వికా ఆర్ట్స్, ఎఐ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్త నిర్మాణంలో తెరకెక్కింది. తెలుగుతో పాటు కన్నడ, హిందీ, తమిళం, మలయాళం... ఈ సినిమా ఐదు భాషల్లో రూపొందింది. లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే... సెన్సార్ కార్యక్రమాలు పూర్తి అయ్యాయి.
'ఆదిపర్వం' చిత్రానికి సెన్సార్ బోర్డు యు/ఎ సర్టిఫికెట్ ఇచ్చింది. భక్తి నేపథ్యంలో ఇటీవల కాలంలో ఈ తరహా సినిమా రాలేదని, మైథాలజీని చాలా చక్కగా చెప్పారని దర్శక నిర్మాతలను సెన్సార్ సభ్యులు ప్రశంసించినట్టు తెలిసింది.
Also Read: మూడు రోజులు... రోజుకు ఐదు గంటలు... బుజ్జి ఈవెంట్ కోసం ప్రభాస్ కష్టం!
'ఆదిపర్వం' కథ 1974 నుంచి 1992 మధ్య జరుగుతుంది. పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా ద్వారా దాదాపు 200 మందికి పైగా నటీనటులు వెండితెరకు పరిచయం అవుతున్నారు. సినిమా గురించి సంజీవ్ మేగోటి మాట్లాడుతూ... "ఈ సినిమా ఎంతో అద్భుతంగా రావడానికి సహకరించిన మా ఫైర్ బ్రాండ్ లక్ష్మీ మంచు గారికి ఎప్పటికీ రుణపడి ఉంటాం. ట్రైలర్, పాటలకు మంచి స్పందన లభించింది. సెన్సార్ సభ్యుల ప్రశంసలు మా నమ్మకాన్ని మరింత పెంచాయి. త్వరలో రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తాం'' అని అన్నారు.
లక్ష్మీ మంచు, శివ కంఠమనేనితో పాటు ఆదిత్య ఓం, ఎస్తర్ నోరోనా, శ్రీజిత ఘోష్, వెంకట్ కిరణ్, సత్యప్రకాష్, సుహాసిని, హ్యారీ జోష్, సమ్మెట గాంధీ, యోగి కత్రి, 'గడ్డం' నవీన్, ఢిల్లీ రాజేశ్వరి, 'జెమినీ' సురేష్ తదితరులు నటించిన 'ఆదిపర్వం' చిత్రానికి సమర్పణ: రావుల వెంకటేశ్వర రావు, ఛాయాగ్రహణం: ఎస్ఎన్ హరీష్, కళా దర్శకత్వం: కెవి రమణ, సంగీతం: మాధవ్ సైబా - సంజీవ్ మేగోటి - బి. సుల్తాన్ వలి - ఓపెన్ బనానా - లుబెక్ లీ మార్విన్, సాహిత్యం: సాగర్ నారాయణ్ - రాజాపురం శ్రీనాథ్ - ఊటుకూరు రంగారావు - మనేకుర్తి మల్లికార్జున - రాజ్ కుమార్ సిరా, కూర్పు: పవన్ శేఖర్ పసుపులేటి, యాక్షన్ సీక్వెన్సులు: నటరాజ్, నృత్య దర్శకత్వం: సన్ రేస్ మాస్టర్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: ఘంటా శ్రీనివాస రావు, సహ నిర్మాతలు: గోరెంట శ్రావణి - ప్రదీప్ కాటుకూటి - రవి దశిక - రవి మొదలవలస - శ్రీరామ్ వేగరాజు, నిర్మాత: ఎమ్.ఎస్.కె, రచన - దర్శకత్వం: సంజీవ్ మేగోటి.