Kota Srinivasa Rao Wife: కోట శ్రీనివాసరావు ఇంట మరో విషాదం - ఆయన భార్య కన్నుమూత
Kota Srinivasa Rao: దివంగత నటుడు కోట శ్రీనివాస రావు భార్య రుక్మిణి అనారోగ్యంతో కన్నుమూశారు. ఇటీవలే వృద్ధాప్య సమస్యలతో ఆయన మృతి చెందగా... ఇప్పుడు ఆయన భార్య కూడా కన్నుమూశారు.

Kota Srinivasa Rao Rukmini Passed Away: దివంగత నటుడు కోట శ్రీనివాసరావు ఇంట మరో విషాదం నెలకొంది. ఆయన భార్య రుక్మిణి అనారోగ్యంతో ఆదివారం రాత్రి ఒంటిగంట ప్రాంతంలో కన్నుమూశారు. ఆమె అంత్యక్రియలు సోమవారం మహా ప్రస్థానంలో పూర్తయ్యాయి. జులై 13న కోట వృద్ధాప్య సమస్యలతో కన్నుమూయగా... ఇప్పుడు ఆయన భార్య కూడా మరణించారు. దీంతో వారి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఆమె మృతి పట్ల పలువురు సెలబ్రిటీలు తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
తెలుగు చిత్ర పరిశ్రమలో తన విలక్షణ నటనతో చెరగని ముద్ర వేసిన కోట ఇటీవలే పరమపదించారు. ఆయన భార్య రుక్మిణి... ఆమె తల్లి చనిపోయిన షాక్‌తో మైండ్ డిస్టర్బ్ అయిపోయింది. ఆ తర్వాత 30 ఏళ్ల వరకూ ఆమె ఎవరినీ గుర్తు పట్టలేదు. ఈ విషయాన్ని తన సన్నిహితుల వద్ద చెప్పుకొని బాధ పడేవారు కోట శ్రీనివాసరావు. ఆ తర్వాత ఆమె క్రమంగా కోలుకుని ఇంటినీ, పిల్లలను చూసుకున్నట్లు చెప్పారు. తనకు తన భార్యతో పాటు కుటుంబ సభ్యుల సహకారం కూడా ఉండేదని కోట పలు సందర్భాల్లో పంచుకున్నారు. కోట శ్రీనివాసరావుకు ఓర్పు, సహనం ఎక్కువని... అందరితోనూ ఎంతో సరదాగా ఉంటారని ఆమె ఓ సందర్భంలో చెప్పారు. ఇటీవలే కోట మరణించగా... అది మరువక ముందే నెల రోజుల్లోపే ఆయన భార్య కన్నుమూయడం కుటుంబ సభ్యులను తీవ్రంగా కలిచివేస్తోంది.
Also Read: ఎన్టీఆర్‌పై అనుచిత వ్యాఖ్యల వివాదం ! టీడీపీ ఎమ్మెల్యేపై సీఎం చంద్రబాబు ఆగ్రహం






















