Nag99 అప్డేట్: కింగ్ వస్తున్నాడు.. కత్తి పట్టుకొని సైకిల్ మీద సరికొత్తగా రాబోతున్న నాగ్!
రేపు అక్కినేని నాగార్జున బర్త్ డే స్పెషల్ గా 'Nag 99' సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన రాబోతోంది. 'కింగ్ వస్తున్నాడు' అంటూ ఈ విషయాన్ని మేకర్స్ ఓ పోస్టర్ ద్వారా తెలిపారు.

అక్కినేని ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఆతృతగా ఎదురుచూస్తున్న అప్డేట్ వచ్చేసింది. కింగ్ నాగార్జున కొత్త సినిమా ప్రకటన రాబోతోంది. రేపు ఆగస్టు 29 పుట్టినరోజును పురష్కరించుకొని, చాన్నాళ్లుగా వార్తలకే పరిమితమైన 'Nag 99' ప్రాజెక్ట్ ని అధికారికంగా అనౌన్స్ చేయబోతున్నారు. ఈ విషయాన్ని మేకర్స్ తాజాగా సోషల్ మీడియా వేదికగా తెలియజేసారు. అంతేకాదు ఈ క్రమంలో ఓ ఆసక్తికరమైన పోస్టర్ ను కూడా వదిలారు.
నాగార్జున నెక్స్ట్ మూవీని శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ లో చేయనున్న సంగతి తెలిసిందే. అక్కినేని అగ్ర హీరోకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ, రేపు ఉదయం గం 10. 27 నిమిషాలకు స్టెల్లార్ అప్డేట్ ఉంటుందని సోమవారం సాయంత్రం నిర్మాతలు ప్రకటించారు. 'కింగ్ వస్తున్నాడు' అంటూ ఓ పోస్టర్ ను రిలీజ్ చేసారు. ఇందులో హీరో సైకిల్ మరియు దాని మీద ఒక పెద్ద కత్తి, బ్యాగ్రౌండ్ లో విలేజ్ సెటప్ చూస్తుంటే.. నాగ్ ఈసారి ఊర మాస్ రూరల్ యాక్షన్ ఎంటర్టైనర్ తో రాబోతున్నాడని తెలుస్తోంది. ఇటీవల కాలంలో ఆయన లాంగ్ హెయిర్, రఫ్ గడ్డం మెయింటైన్ చేయడాన్ని బట్టి చూస్తే.. ఈ సినిమాలో కింగ్ వింటేజ్ లుక్ లో కనిపించబోతున్నారనే విషయం స్పష్టం అవుతుంది.
𝐊𝐢𝐧𝐠 👑𝐎𝐬𝐭𝐡𝐮𝐧𝐧𝐚𝐝𝐮
— Srinivasaa Silver Screen (@SS_Screens) August 28, 2023
Set your ⏲️ Ready For Stellar Update Tomorrow at🔟:2⃣7⃣AM ⭐️🔊#KingOsthunnadu #HBDKingNagarjuna @SS_Screens @srinivasaaoffl pic.twitter.com/8IqGRIu8dc
'ది ఘోస్ట్' సినిమా ప్లాప్ అయిన తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న నాగార్జున.. 'పొరింజు మరియం జోస్' అనే మలయాళ చిత్రాన్ని తెలుగులోకి రీమేక్ చేయడానికి ఆసక్తి కనబరస్తున్నారని చాలా రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. బెజవాడ ప్రసన్న కుమార్ దర్శకత్వంలో ఈ మూవీ ఉంటుందని టాక్ నడిచింది. అయితే చివరకు ఈ చిత్రంతో కొరియోగ్రాఫర్ విజయ్ బిన్నీ ని డైరెక్టర్ గా లాంచ్ చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం అందుతోంది. లేటెస్టుగా రిలీజ్ చేసిన పోస్టర్ లో సినిమా డైరెక్టర్ ఎవరనేది మేకర్స్ వెల్లడించలేదు. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాస చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.
రేపు మంగళవారం అన్ని వివరాలతో Nagarjuna 99 టైటిల్ అనౌన్స్ మెంట్ చేయడంతో పాటుగా ఓ టీజర్ ను కూడా రిలీజ్ చేయనున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన షూటింగ్ పూర్తి చేసి, కంటెంట్ ను రెడీగా పెట్టారని సమాచారం. దీనికి 'గలాటా' 'భలే రంగడు' అనే టైటిల్స్ ను పరిశీలించిన తర్వాత, ఫైనల్ గా 'నా సామి రంగా' అనే టైటిల్ కే నాగ్ ఓకే చెప్పినట్లు టాక్ వినిపిస్తోంది. ఇందులో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తారని వార్తలు ఉన్నాయి. అంతేకాదు 2024 సంక్రాంతికి సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ఫిక్స్ అయ్యారని అంటున్నారు.
ఏదేమైనా కింగ్ బర్త్ డే సెలబ్రేషన్స్ కోసం అక్కినేని అభిమానులు ఇప్పటికే గ్రాండ్ గా ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన కెరీర్ లో కల్ట్ క్లాసిక్ గా నిలిచిన 'మన్మథుడు' చిత్రాన్ని 4K ఫార్మాట్ లో రీ-రిలీజ్ చేస్తున్నారు. ఫ్యాన్స్ ఉత్సాహాన్ని రెట్టింపు చేయడానికి నాగార్జున న్యూ సినిమా అప్డేట్ ను అందిస్తున్నారు. ఇదంతా చూస్తుంటే ఈసారి నాగ్ పుట్టినరోజు మరింత స్పెషల్ గా మారే అవకాశం ఉందని భావించవచ్చు. మరి Nag 99 ఫస్ట్ లుక్ అండ్ టైటిల్ టీజర్ ఎలా ఉంటుందో చూడాలి.
Also Read: KA Paul X Naveen Polishetty: పోలిశెట్టి ప్రమోషన్లలో కేఏ పాల్‌ను కలిసిన నవీన్ - ఏం జరిగిందంటే?
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

