Karthi First Look - PS 1: రాజ్యం లేని చోళ యువరాజు - వంతియతేవన్ వచ్చాడోచ్
ప్రముఖ దర్శకుడు మణిరత్నం రూపొందిస్తున్న సినిమా 'పొన్నియన్ సెల్వన్'. ఇందులో కార్తీ ఫస్ట్ లుక్ ఈ రోజు విడుదల చేశారు.
Karthi As Vanthiyathevan In Ponniyin Selvan 1: ప్రముఖ దర్శకుడు మణిరత్నం తెరకెక్కిస్తున్న దృశ్యకావ్యం 'పొన్నియన్ సెల్వన్'. రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. మొదటి భాగాన్ని ఈ ఏడాది సెప్టెంబర్ 30న విడుదల చేస్తున్నారు.
'పొన్నియన్ సెల్వన్'లో చియాన్ విక్రమ్, జయం రవి, కార్తీ, ఐశ్వర్యా రాయ్ బచ్చన్, త్రిష, ఐశ్వర్య లక్ష్మి, శోభితా ధూళిపాళ తదితరులు నటిస్తున్న సంగతి తెలిసిందే. ఒక్కొక్కరి ఫస్ట్ లుక్స్ విడుదల చేస్తున్నారు. ఆల్రెడీ విక్రమ్ లుక్ విడుదల చేశారు. ఈ రోజు కార్తీ లుక్ విడుదల చేశారు.
''రాజ్యం లేని యువరాజు... గూఢచారి... సాహసి... అతడే వంతియతేవన్'' అని కార్తీ పాత్ర గురించి వివరించారు.
Also Read : గన్స్ అండ్ యాక్షన్ - కళ్యాణ్ రామ్ కొత్త ఫిల్మ్
View this post on Instagram
'పొన్నియన్ సెల్వన్'ను మద్రాస్ టాకీస్, లైకా ప్రొడక్షన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. తమిళంతో పాటు తెలుగు, మలయాళం, హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు. మణిరత్నం దర్శకత్వ ప్రతిభకు తోడు స్టార్ కాస్ట్ ఉండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
Also Read : సీరియస్‌గా తీసుకోవద్దు శోభు - 'ఆర్ఆర్ఆర్' గే లవ్ స్టోరీ కామెంట్స్‌కు ఇక ఫుల్ స్టాప్ పడుతుందా?
View this post on Instagram