అన్వేషించండి

Kajal Aggarwal: 'సత్యాభామ' నాకు సెకండ్‌ ఇన్నింగ్స్‌ కాదు - ప్రెస్‌ మీట్‌లో కాజల్‌ అగర్వాల్‌ ఆసక్తికర వ్యాఖ్యలు 

Kajal Aggarwal Satyabhama Press Meet: కాజల్‌ అగర్వాల్‌ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం సత్యభామ. యాక్షన్, క్రైం థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమా జూన్‌ 7న విడుదల కాబోతుంది.

Kajal Aggarwal Satyabhama Press Meet: 'క్వీన్ ఆఫ్ మాసెస్' కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా 'సత్యభామ'. హీరో నవీన్ చంద్ర కీలక పాత్ర పోషిస్తున్న ఈ మూవీని అవురమ్ ఆర్ట్స్ పతాకంపై బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపల్లి నిర్మిస్తున్నారు. 'మేజర్' చిత్ర దర్శకుడు శశికిరణ్ తిక్క సమర్పకులుగా వ్యవహరిస్తూ స్క్రీన్ ప్లే అందించారు. క్రైం థ్రిల్లర్ కథతో దర్శకుడు సుమన్ చిక్కాల తెరకెక్కించిన ఈ సినిమా జూన్ 7న ప్రేక్షకులు ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో నేడు మూవీ టీం హైదరాబాద్‌లో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హీరోయిన్‌ కాజల్‌, డైరెక్టర్‌, నిర్మాతలు పాల్గొన్ని మూవీ విశేషాలను పంచుకున్నారు. 

ఈ సందర్భంగా హీరోయిన్‌ కాజల్‌ మాట్లాడుతూ.. " ఈ సినిమాతో నా కెరీర్‌లో  కొత్త ప్రయత్నం చేశా. ఇలాంటి క్యారెక్టర్, మూవీ చేయడం ఇదే తొలిసారి. ఈ సినిమా కథ వినగానే నచ్చింది కొత్తగా అనిపించింది. అందుకే సినిమా చేసేందుకు ముందుకొచ్చాను. నేను ఇలాంటి కథలోనే, క్యారెక్టర్సే చేయాలని ఎప్పుడు మైండ్ లో పెట్టుకోలేదు. మంచి కంటెంట్ ఉంటే ఏ జానర్ అయినా చేస్తాను. 'సత్యభామ' కంటే ముందు ఫీమేల్ ఓరియెంటెడ్ మూవీస్ కోసం ఆఫర్స్ చాలా వచ్చాయి. అయితే నేను ఆ మూవీస్ చేసేంత కాన్ఫిడెంట్ గా ఉన్నప్పుడే ఒప్పుకోవాలని అనుకున్నా. లేడీ ఓరియెంటెడ్ మూవీస్ చేస్తున్నప్పుడు నా మీద ప్రెజర్ ఉంది అనుకోవడం కంటే రెస్పాన్సిబిలిటీ ఉందని అనుకుంటా. ఈ సినిమాలో చాలా కొత్త ఎమోషన్స్ ఉన్నాయి. 

ఫస్ట్ టైమ్ నా కెరీర్ లో యాక్షన్, భారీ స్టంట్స్ చేశాను. వాటి కోసం చాలా కష్టపడ్డాను. "సత్యభామ" నా సెకండ్ ఇన్నింగ్స్ కాదు నా కెరీర్ మరో కొత్త దిశలో వెళ్తుందని అనుకోవచ్చు. యాక్టింగ్ నా ప్యాషన్ అందుకే నా పర్సనల్ లైఫ్ లోకి వెళ్లిన తర్వాత మళ్లీ సినిమాల్లోకి వచ్చాను. ఈ సినిమాలో నా క్యారెక్టర్ పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్ రెండూ బ్యాలెన్స్ చేస్తూ ఉంటుంది. ఈ సినిమా మేకింగ్ టైమ్ లో ఓ పెద్ద పోలీస్ ఆఫీసర్ ను కలిసినప్పుడు ఆయన నేడు క్రిమినల్స్ గేమింగ్, వర్చువల్ రియాలిటీ వంటి టెక్నాలజీ ద్వారా క్రైమ్స్ ఎలా చేస్తున్నారో వివరించారు. ఆయన చెప్పిన అంశాలు మాకు చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించాయి. వాటిని కథలో పార్ట్ చేశాం. నేను ఫుల్ లెంగ్త్ యాక్షన్ మూవీ చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నా. 'సత్యభామ' ఆ కోరిక తీరిందని అనుకుంటున్నా" అన్నారు.

దర్శకుడు సుమన్ చిక్కాల మాట్లాడుతూ .. "సత్యభామ" కథలో యాక్షన్ తో పాటు ఎమోషన్ ఉంటుంది. పోలీస్ ఆఫీసర్ అంటే కేవలం ఒక యూనిఫామ్ వేసుకుని యాక్షన్ చేయడం కాదు కాజల్ క్యారెక్టర్ లో ఎమోషన్ ఉంటుంది. ఒక కేసు విషయంలో తను పర్సనల్ గా తీసుకుని ఇన్వెస్టిగేట్ చేస్తుంటుంది. యాక్షన్, ఎమోషన్ రెండు చేయగలదు కాబట్టే కాజల్ ను ఎంచుకున్నాం. ప్రతి పోలీస్ ఆఫీసర్ జర్నీలో ఒక స్పెషల్ కేసు ఉంటుంది వాళ్లు హ్యాండిల్ చేసింది. ఈ సినిమాలో కాజల్ కూడా ఒక కేసును పర్సనల్ గా తీసుకుంటుంది. ఆ కేసు విషయంలో ఎమోషనల్ అవుతుంది. ఆ కేసులో జస్టిస్ చేయగలిగిందా లేదా అనేది "సత్యభామ" కథ అన్నారు.

టాప్ హెడ్ లైన్స్

Uppal Balu Request : 'ప్లీజ్... నన్ను బిగ్ బాస్‌కు తీసుకోండి' - ఉప్పల్ బాలు రిక్వెస్ట్... లాస్ట్ వీడియో అంటూ...
'ప్లీజ్... నన్ను బిగ్ బాస్‌కు తీసుకోండి' - ఉప్పల్ బాలు రిక్వెస్ట్... లాస్ట్ వీడియో అంటూ...
Eshwar Sai Madhuri Rathod Songs : మాధురి రాథోడ్ హిట్ సాంగ్స్ విత్ ఈశ్వర్ సాయి - రాతిరి రాతిరి రాతిరిలో, సీటీ చీర... ఫోక్ డ్యాన్సర్స్ ట్రెండింగ్ పాటలివే
మాధురి రాథోడ్ హిట్ సాంగ్స్ విత్ ఈశ్వర్ సాయి - రాతిరి రాతిరి రాతిరిలో, సీటీ చీర... ఫోక్ డ్యాన్సర్స్ ట్రెండింగ్ పాటలివే
Brahmanandam Brother Video: అన్నయ్యకు ఇల్లు కట్టించాడు... ఆడబిడ్డల పెళ్లిళ్లు చేశాడు... బ్రహ్మానందం గొప్పతనం చెప్పిన శ్రీవదన్
అన్నయ్యకు ఇల్లు కట్టించాడు... ఆడబిడ్డల పెళ్లిళ్లు చేశాడు... బ్రహ్మానందం గొప్పతనం చెప్పిన శ్రీవదన్
Rathiri Rathiri Rathirilo Song : ఒక్క రాత్రిలోనే ఫోక్ సాంగ్ మరింత ట్రెండ్ - రాతిరి రాతిరి రాతిరిలో... రొమాంటిక్ లిరిక్స్ చూశారా?
ఒక్క రాత్రిలోనే ఫోక్ సాంగ్ మరింత ట్రెండ్ - రాతిరి రాతిరి రాతిరిలో... రొమాంటిక్ లిరిక్స్ చూశారా?

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Lucknow Crime News: లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
Hyderabad ACB Raids: ఏసీబీ వలలో ఇబ్రహీంపట్నం ఆర్డీవో ఆఫీస్‌ ఏవో శ్రీనివాస రెడ్డి! 15 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు! 
ఏసీబీ వలలో ఇబ్రహీంపట్నం ఆర్డీవో ఆఫీస్‌ ఏవో శ్రీనివాస రెడ్డి! 15 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు! 
Vande Mataram Controversy: వందేమాతరం చుట్టూ రాజకీయ దుమారం! కాంగ్రెస్ తీర్మానంపై బీజేపీ ఆగ్రహం! ఆ 4 చరణాల్లో ఏం ఉంది?
వందేమాతరం చుట్టూ రాజకీయ దుమారం! కాంగ్రెస్ తీర్మానంపై బీజేపీ ఆగ్రహం! ఆ 4 చరణాల్లో ఏం ఉంది?
Telangana 22A Land Dispute:22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
AB Venkateswara Rao: టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
Rathiri Rathiri Rathirilo Song : ఒక్క రాత్రిలోనే ఫోక్ సాంగ్ మరింత ట్రెండ్ - రాతిరి రాతిరి రాతిరిలో... రొమాంటిక్ లిరిక్స్ చూశారా?
ఒక్క రాత్రిలోనే ఫోక్ సాంగ్ మరింత ట్రెండ్ - రాతిరి రాతిరి రాతిరిలో... రొమాంటిక్ లిరిక్స్ చూశారా?
Pooja Hegde : రెడ్ డ్రెస్‌లో బుట్టబొమ్మ - టాలీవుడ్ బ్యూటీ క్యూట్ లుక్
రెడ్ డ్రెస్‌లో బుట్టబొమ్మ - టాలీవుడ్ బ్యూటీ క్యూట్ లుక్
IPL Hardik Trade :  హార్దిక్ ట్రేడింగ్ రూమ‌ర్స్ పై స్పందించిన గావ‌స్క‌ర్.. ఆ నిబంధ‌న‌లు పాటించాల‌ని సూచ‌న‌
హార్దిక్ ట్రేడింగ్ రూమ‌ర్స్ పై స్పందించిన గావ‌స్క‌ర్.. ఆ నిబంధ‌న‌లు పాటించాల‌ని సూచ‌న‌
Embed widget