అన్వేషించండి

KA Movie OTT: ‘క’ స్ట్రీమింగ్ రైట్స్ ఆ ఓటీటీ చేతికే, ప్రేక్షకుల ముందుకు వచ్చేది ఎప్పుడంటే?

యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న భారీ పీరియాడిక్ థ్రిల్లర్ ‘క’. దీపావళి కానుకగా ఈ నెల 31న విడుదలకానున్నది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన స్ట్రీమింగ్ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ సంస్థ దక్కించుకుంది.

KA OTT Platform Locked: టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన తాజా చిత్రం ‘క’. పీరియాడికల్ డ్రామా రూపొందిన ఈ మూవీ రేపు(గురువారం) దేశ వ్యాప్తంగా పలు భాషల్లో విడుదలకానుంది. దుల్కర్ సల్మాన్ ‘లక్కీ భాస్కర్’,  శివ కార్తికేయన్ ‘అమరన్’ సినిమాలతో పాటు ‘క’ మూవీ దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. కిరణ్ అబ్బవరం నటిస్తున్న తొలి పాన్ ఇండియా మూవీ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

‘క’ ఓటీటీ రైట్స్ దక్కించుకున్న ప్రముఖ స్ట్రీమింగ్ ఫ్లాట్ ఫారమ్

కిరణ అబ్బవరం కెరీర్ లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ‘క’ సినిమాకు సంబంధించి ఓటీటీ  డీల్ పూర్తయినట్లు తెలుస్తోంది. ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ దక్కించుకున్నట్లు సమాచారం. ఇందుకోసం ఫ్యాన్స్ అమౌంట్ చెల్లించినట్లు తెలుస్తోంది. ఈ సినిమా ఓటీటీ రైట్స్ కొనుగోలు చేసేందు తెలుగు ఓటీటీ సంస్థ ఆహా కూడా తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. గత కొద్ది కాలంగా నిర్మాణ సంస్థలు తమ సినిమాలను పలు ఓటీటీ సంస్థలకు అమ్ముతున్నాయి. రీసెంట్ గా సుధీర్ బాబు హీరోగా నటించిన ‘హరోమ్ హర’ సినిమాను మేకర్స్ మూడు ఓటీటీ ఫ్లాట్ ఫారమ్స్ కు అమ్మారు. ప్రస్తుతం ఈ సినిమా ఆహా, అమెజాన్ ప్రైమ్ తో పాటు సన్ నెక్ట్స్ లో అందుబాటులో ఉంది. ‘క’ సినిమా రైట్స్ ను కూడా నెట్ ఫ్లిక్స్ తో పాటు ఆహాకు అమ్మాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.  

పోస్ట్ మ్యాన్ పాత్రలో నటిస్తున్న కిరణ్ అబ్బవరం

‘క’ సినిమా కథ పల్లెటూరు నేపథ్యంలో కొనసాగుతుంది. ఈ సినిమాలో కిరణ్ పోస్టుమ్యాన్ పాత్రలో కనిపిస్తున్నారు. తనకంటూ ఓ ఫ్యామిలీ లేని కిరణ్, ఊరి వాళ్లకు వచ్చిన లెటర్స్ ను చదువుతూ ఎంజాయ్ చేసేవాడు. అనుకోకుండా ఆ ఊరికి పెద్ద ఆపద వస్తుంది. ఆ సమస్యను ఎదుర్కొనేందుకు కిరణ్ ఎలాంటి ప్రయత్నం చేశారు? ఆ ప్రయత్నంలో తను ఎలాంటి ఇబ్బందులు పడ్డారు? అనే విషయాలను ఈ సినిమాలో చూపించనున్నారు.  ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషనల్ కంటెంట్ మూవీపై భారీగా అంచనాలు పెంచింది.  ఎప్పుడెప్పుడు ఈ సినిమా చూడాలా? అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

‘క’ సినిమా గురించి..

క’ సినిమాలో కిరణ్ అబ్బవరం హీరోగా నటిస్తుండగా నయన్ సారిక, తన్వీ రామ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.  చింతా వరలక్ష్మి సమర్పణలో శ్రీ చక్రాస్ ఎంటర్‌ టైన్‌ మెంట్స్ బ్యానర్‌ పై చింతా గోపాలకృష్ణ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సుజీత్, సందీప్ జంటగా విలేజ్ బ్యాక్ డ్రాప్ యాక్షన్ థ్రిల్లర్ స్టోరీతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా దీనపావళి కానుకగా ఈ నెల 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగుతో పాటు తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో ఈ సినిమా విడుదల అవుతోంది.  

Read Also: ‘క‘ బాగాలేదనిపిస్తే సినిమాలు వదిలేస్తా... ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో కిరణ్ అబ్బవరం ఎమోషనల్ స్పీచ్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YSRCP: విజయమ్మ ఇచ్చిన షాక్‌తో వైసీపీలో డైలమా - ఎలా స్పందించాలో అర్థం కాని నేతలు ! సైలెంట్
విజయమ్మ ఇచ్చిన షాక్‌తో వైసీపీలో డైలమా - ఎలా స్పందించాలో అర్థం కాని నేతలు ! సైలెంట్
SSMB 29: సింహాన్నిచూపిస్తూ హింట్... రాజమౌళి కొత్త పోస్ట్ వైరల్ - మహేష్ బాబు పాత్ర ఇదేనా?
సింహాన్నిచూపిస్తూ హింట్... రాజమౌళి కొత్త పోస్ట్ వైరల్ - మహేష్ బాబు పాత్ర ఇదేనా?
Telangana News: తెలంగాణలో కేసీఆర్ ఫినిష్ అన్న రేవంత్‌- నువ్వా! ఆ పేరు తుడిచేది అంటూ కేటీఆర్ ఫైర్!
తెలంగాణలో కేసీఆర్ ఫినిష్ అన్న రేవంత్‌- నువ్వా! ఆ పేరు తుడిచేది అంటూ కేటీఆర్ ఫైర్!
Free Gas Cylinders: ఉచిత సిలిండర్ల పథకం, పెట్రోలియం సంస్థలకు రూ.894 కోట్లు చెక్ అందజేసిన చంద్రబాబు
Free Gas Cylinders: ఉచిత సిలిండర్ల పథకం, పెట్రోలియం సంస్థలకు రూ.894 కోట్లు చెక్ అందజేసిన చంద్రబాబు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

వివాదంలో సాయి పల్లవి, పాత వీడియో తీసి విపరీతంగా ట్రోల్రతన్‌ టాటా వీలునామాలో శంతను పేరు, ఏమిచ్చారంటే?మహేశ్ రాజమౌళి సినిమాకు సంబంధించి కొత్త అప్డేట్ | ABP DesamNara Lokesh Met Satya Nadella | మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనాదెళ్లతో లోకేశ్ భేటీ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YSRCP: విజయమ్మ ఇచ్చిన షాక్‌తో వైసీపీలో డైలమా - ఎలా స్పందించాలో అర్థం కాని నేతలు ! సైలెంట్
విజయమ్మ ఇచ్చిన షాక్‌తో వైసీపీలో డైలమా - ఎలా స్పందించాలో అర్థం కాని నేతలు ! సైలెంట్
SSMB 29: సింహాన్నిచూపిస్తూ హింట్... రాజమౌళి కొత్త పోస్ట్ వైరల్ - మహేష్ బాబు పాత్ర ఇదేనా?
సింహాన్నిచూపిస్తూ హింట్... రాజమౌళి కొత్త పోస్ట్ వైరల్ - మహేష్ బాబు పాత్ర ఇదేనా?
Telangana News: తెలంగాణలో కేసీఆర్ ఫినిష్ అన్న రేవంత్‌- నువ్వా! ఆ పేరు తుడిచేది అంటూ కేటీఆర్ ఫైర్!
తెలంగాణలో కేసీఆర్ ఫినిష్ అన్న రేవంత్‌- నువ్వా! ఆ పేరు తుడిచేది అంటూ కేటీఆర్ ఫైర్!
Free Gas Cylinders: ఉచిత సిలిండర్ల పథకం, పెట్రోలియం సంస్థలకు రూ.894 కోట్లు చెక్ అందజేసిన చంద్రబాబు
Free Gas Cylinders: ఉచిత సిలిండర్ల పథకం, పెట్రోలియం సంస్థలకు రూ.894 కోట్లు చెక్ అందజేసిన చంద్రబాబు
Nara Lokesh: డిజిటల్ గవర్నెన్స్‌కు సహకరించండి- అమెజాన్‌ను కోరిన లోకేష్‌   
డిజిటల్ గవర్నెన్స్‌కు సహకరించండి- అమెజాన్‌ను కోరిన లోకేష్‌   
Hyderabad News: మోకిల పోలీస్ స్టేషన్‌కు వచ్చిన రాజ్‌ పాకాల- జన్వాడ ఫామ్‌ హౌస్‌ కేసులో విచారణకు హాజరు
మోకిల పోలీస్ స్టేషన్‌కు వచ్చిన రాజ్‌ పాకాల- జన్వాడ ఫామ్‌ హౌస్‌ కేసులో విచారణకు హాజరు
Nandamuri Taraka Ramarao First Darshan: నందమూరి ఫ్యామిలీ నుంచి మరో వారసుడు ఎంట్రీ... ఎన్టీఆర్ స్పెషల్ విషెస్, హరికృష్ణ మనవణ్ణి చూశారా?
నందమూరి ఫ్యామిలీ నుంచి మరో వారసుడు ఎంట్రీ... ఎన్టీఆర్ స్పెషల్ విషెస్, హరికృష్ణ మనవణ్ణి చూశారా?
Best Car Under Rs 8 Lakh: రూ.8 లక్షల్లో బెస్ట్ కారు ఇదే - మంచి మైలేజీ, సూపర్ సేఫ్టీ!
రూ.8 లక్షల్లో బెస్ట్ కారు ఇదే - మంచి మైలేజీ, సూపర్ సేఫ్టీ!
Embed widget