అన్వేషించండి

Janhvi Kapoor: ‘టెన్నిస్ బాల్’కే అంటూ నెటిజన్ వెకిలి కామెంట్ - ఇచ్చి పడేసిన జాన్వీ కపూర్, ‘సారీ’ చెప్పి సైలెంట్ అయ్యాడుగా!

తన క్రికెట్ ప్రాక్టీస్ వీడియోకు వెకిలిగా కామెంట్ పెట్టిన ఓ నెటిజన్ కు అదిరిపోయే సమాధానం చెప్పింది జాన్వీ కపూర్. ఊహించని కౌంటర్ తో సదరు నెటిజన్ ‘సారీ’ చెప్పి చల్లగా జారుకున్నాడు.

Janhvi Kapoor Hurt by Tennis Ball Comments: బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ‘మిస్టర్‌ అండ్ మిసెస్ మహీ’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. క్రికెట్ కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా మే 31న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రాజ్ కుమార్ రావుతో కలిసి నటించిన ఈ సినిమాలో మహి పాత్ర పోషించింది జాన్వీ. ప్రస్తుతం ఈ సినిమాకు ఆడియెన్స్ నుంచి పాజిటివ్ రివ్యూలు వస్తున్నాయి. ప్రేక్షకులు కూడా ఈ సినిమాను చూసేందుకు పెద్ద సంఖ్యలో థియేటర్లకు వస్తున్నారు.

క్రికెట్ ప్రాక్టీస్ వీడియో షేర్ చేసిన జాన్వీ

అటు సినిమా ప్రమోషన్ లో భాగంగా జాన్వీ క్రికెట్ ప్రాక్టీస్ చేస్తున్న వీడియోను షేర్ చేసింది. అందులో ఆమె భుజానికి గాయాలు అయినట్లు కనిపించింది. నిజానికి ఈ సినిమా కోసం ఆమె చాలా కష్టపడింది. సుమారు 150 గంటలకు పైగా క్రికెట్ ట్రైనింగ్ తీసుకుంది. ఆ సమయంలోనే రెండు గాయాలు అయ్యాయి. ఈ నేపథ్యంలో సినిమాపై అంచనాలు పెంచేందుకు ఆమె తన ప్రాక్టీస్ కు సంబంధించిన వీడియోను అభిమానులతో పంచుకుంది. ఆమె కష్టాన్ని చూసి చాలా మంది నెటిజన్లు ప్రశంసలు కురిపించగా, మరికొంత మంది మాత్రం ట్రోల్ చేశారు. అయితే, మరీ చీప్ కామెంట్ చేసిన ఓ నెటిజన్ కు జాన్వీ అదిరిపోయే కౌంటర్ ఇచ్చి నోరు మూయించింది.

నెటిజన్ కామెంట్ కు జాన్వీ కౌంటర్

భుజానికి గాయమైన వీడియో చూసి ఓ నెటిజన్‌ జాన్వీ కపూర్‌ను ట్రోల్ చేశాడు. టెన్నిస్‌ బాల్‌‌తో ఆడిన క్రికెట్‌ లో మీకు దెబ్బలు తగిలాయా? అంటూ హేళన చేశాడు. నవ్వు ఎమోజీలు పెట్టాడు. ఈ కామెంట్ కు జాన్వీ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. “నాకు క్రికెట్ బాల్ తో ఆడుతున్నప్పుడే గాయాలు అయ్యాయి. అందుకే టెన్నిస్ బాల్ తో ఆడాల్సి వచ్చింది. నా భుజానికి ఉన్న బ్యాండేజ్ చూస్తే మీకు ఆ విషయం అర్థం అవుతుంది. ఇలాంటి కామెంట్స్ చేసే ముందు ఓసారి అసలు వీడియో మొత్తం చూస్తే బాగుంటుంది. అప్పుడు మీరు వేసే జోక్స్ కు నేను కూడా నవ్వుతాను” అంటూ రిప్లై ఇచ్చింది. ఈ కౌంటర్ తో నెటిజన్ షాక్ అయ్యాడు. ‘సారీ మేడం’ అని చెప్పి సైలెంట్ అయ్యాడు. ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Janhvi Kapoor (@janhvikapoor)

సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్న 'మిస్టర్ అండ్ మిసెస్ మహి'

'మిస్టర్ అండ్ మిసెస్ మహి' చిత్రానికి కరణ్ శర్మ దర్శకత్వం వహించారు. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా చూసిన ప్రేక్షకులు పాజిటివ్ రివ్యూలు ఇస్తున్నారు. సినిమా బాగుందని చెప్తున్నారు. అటు జాన్వీ కపూర్ తెలుగులో జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి ‘దేవర’ అనే సినిమాలో నటిస్తుంది. ఈ సినిమాతోనే ఆమె తెలుగు తెరకు పరిచయం అవుతోంది. అటు రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న ‘RC 16’లో హీరోయిన్ గా నటిస్తోంది. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ మొదలుకానుంది.

Read Also: పెళ్లికి ముందే ఒకే రూమ్ లో ఉండేవాళ్లం, నాకు ఆ భయం అస్సలు ఉండేది కాదు: జీవిత

టాప్ హెడ్ లైన్స్

Don't Trouble The Trouble Teaser - డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ టీజర్ రివ్యూ: నవ్వుల మేజిక్... ఫాంటసీ కథతో ఫహద్ ఫాజిల్ సినిమా
డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ టీజర్ రివ్యూ: నవ్వుల మేజిక్... ఫాంటసీ కథతో ఫహద్ ఫాజిల్ సినిమా
Sanjay Dutt: బాలయ్య సినిమాలో సంజయ్ దత్... షూటింగ్ షురూ!
బాలయ్య సినిమాలో సంజయ్ దత్... షూటింగ్ షురూ!
Jr NTR Political Entry: జులై 18న Jr NTR పొలిటికల్ ఎంట్రీపై ప్రకటన చేస్తారా? ఇదిగో క్లారిటీ
జులై 18న Jr NTR పొలిటికల్ ఎంట్రీపై ప్రకటన చేస్తారా? ఇదిగో క్లారిటీ
Nag Ashwin: 'కల్కి' క్లైమాక్స్‌పై విమర్శలు... రిప్లై ఇచ్చిన నాగ్ అశ్విన్ - నేను ఏం చేస్తున్నానో నాకు తెలుసు
'కల్కి' క్లైమాక్స్‌పై విమర్శలు... రిప్లై ఇచ్చిన నాగ్ అశ్విన్ - నేను ఏం చేస్తున్నానో నాకు తెలుసు

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jr NTR Political Entry: జులై 18న Jr NTR పొలిటికల్ ఎంట్రీపై ప్రకటన చేస్తారా? ఇదిగో క్లారిటీ
జులై 18న Jr NTR పొలిటికల్ ఎంట్రీపై ప్రకటన చేస్తారా? ఇదిగో క్లారిటీ
One Nation One Election Bill: దేశ రాజకీయాల్లో మహా మార్పులు! వన్ నేషన్-వన్ ఎలక్షన్, 850 లోక్‌సభ సీట్లు.. మహిళా రిజర్వేషన్ల అసలు కథ!
దేశ రాజకీయాల్లో మహా మార్పులు! వన్ నేషన్-వన్ ఎలక్షన్, 850 లోక్‌సభ సీట్లు.. మహిళా రిజర్వేషన్ల అసలు కథ!
virat Kohli Records: 6 నెలల తరువాత బ్లూ జెర్సీలో విరాట్ కోహ్లీ.. రికార్డుల వేటకు కింగ్ రెడీ
6 నెలల తరువాత బ్లూ జెర్సీలో విరాట్ కోహ్లీ.. రికార్డుల వేటకు కింగ్ రెడీ
Jagan Mohan Reddy Lone Battle: మిత్రుల వేటలో అలసిపోతున్న జగన్‌ - వైసీపీ ఒంటరి పోరాటం - కూటమి కట్టే ఆప్షన్ లేదా?
మిత్రుల వేటలో అలసిపోతున్న జగన్‌ - వైసీపీ ఒంటరి పోరాటం - కూటమి కట్టే ఆప్షన్ లేదా?
26/11 ఉగ్రదాడి కాంగ్రెస్, ISI ల మ్యాచ్ ఫిక్సింగ్.. UPA హయాంలోనే హిందూ ఉగ్రవాదం! మాజీ అండర్ సెక్రటరీ సంచలన ఆరోపణలు
26/11 ఉగ్రదాడి కాంగ్రెస్, ISI ల మ్యాచ్ ఫిక్సింగ్.. UPA హయాంలోనే హిందూ ఉగ్రవాదం! మాజీ అండర్ సెక్రటరీ ఆరోపణలు
187km రేంజ్‌తో కొత్త Vida VX2 Plus లాంచ్‌ - ఆంధ్రప్రదేశ్ & తెలంగాణలో ఆన్‌రోడ్ ధర వివరాలు ఇవే!
సింగిల్‌ ఛార్జ్‌తో దాదాపు 190km జర్నీ- భారీ బ్యాటరీతో Vida VX2 Plus లాంచ్‌, తెలుగు రాష్ట్రాల్లో ధర ఎంత?
Bangkok Pub Fire Accident: థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్‌లో ఘోర ప్రమాదం.. పబ్‌లో మంటలు చెలరేగి 27 మంది మృతి
థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్‌లో ఘోర ప్రమాదం.. పబ్‌లో మంటలు చెలరేగి 27 మంది మృతి
Vikarabad Crime News: అనంతగిరి కొండల్లో ట్రెక్కింగ్‌కు వెళ్లి హైదరాబాద్ మహిళ మృతి.. వికారాబాద్ జిల్లాలో ఘటన
అనంతగిరి కొండల్లో ట్రెక్కింగ్‌కు వెళ్లి హైదరాబాద్ మహిళ మృతి.. వికారాబాద్ జిల్లాలో ఘటన
Embed widget