SSMB29 First Look: మహేష్ బాబు సినిమా పబ్లిసిటీ కోసం హాలీవుడ్ లెజెండ్ - రాజమౌళి ప్లాన్ మామూలుగా లేదుగా
SSMB29 Updates: 'SSMB29'లో ఇటీవల మహేష్ బాబు ప్రీ లుక్‌తో భారీ హైప్ క్రియేట్ చేశారు రాజమౌళి. నవంబరులో బిగ్ అప్డేట్ రానుండగా... దాని కోసం అంతర్జాతీయ స్థాయిలో జక్కన్న ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.

James Cameron To Launch Globe Trotter First Look: సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీరుడు రాజమౌళి కాంబోలో వస్తోన్న విజువల్ వండర్ 'SSMB29' కోసం ప్రపంచవ్యాప్తంగా మూవీ లవర్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇప్పటివరకూ రాజమౌళి అండ్ టీం ఈ మూవీకి సంబంధించి ఏ విషయాన్ని కూడా రివీల్ చేయలేదు. భారీ ప్రాజెక్టుకు సంబంధించి ప్రతీ విషయాన్నీ గోప్యంగా ఉంచారు. చివరకు బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా నటిస్తోన్న విషయం కూడా అధికారికంగా ప్రకటించలేదు.
ఇటీవల మహేష్ బాబు బర్త్ డే సందర్భంగా 'SSMB29'లో మహేష్ బాబు ప్రీ లుక్‌ను రిలీజ్ చేసి భారీ హైప్ క్రియేట్ చేశారు. 'Globe Trotter' అంటూ ఓ చిన్న హింట్ ఇచ్చి నవంబర్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తామంటూ బిగ్ అప్డేట్ ఇచ్చారు. ఫస్ట్ టైం నోరు విప్పిన జక్కన్న... మహేష్ లుక్, స్టోరీ గురించి చెబుతూనే ప్రీ లుక్‌తోనే ఆసక్తిని పదింతలు పెంచేశారు. మరి ఆ ఫస్ట్ లుక్ రిలీజ్ గ్లింప్స్ కూడా దర్శక ధీరుడు భారీగానే ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
పెద్ద ప్లానింగే ఇది
రాజమౌళి పాన్ వరల్డ్ స్థాయిలో ఈ మూవీని తెరకెక్కిస్తుండగా అందుకు తగ్గట్లుగానే ప్రతీ అప్డేట్‌కు భారీ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. నవంబరులోనే జక్కన్న ఎందుకు ఫస్ట్ లుక్ రిలీజ్ కోసం షెడ్యూల్ చేశారనే దానిపై ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ చక్కర్లు కొడుతోంది. ఈ మూవీలో మహేష్ బాబు ఫస్ట్ లుక్‌ను... టైటానిక్, అవతార్, ది టెర్మినేటర్ వంటి వండర్స్ తెరకెక్కించిన హాలీవుడ్ లెజెండరీ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ చేతుల మీదుగా రిలీజ్ చేయాలని చూస్తున్నారట.
కామెరూన్ తెరకెక్కించిన 'అవతార్: ది ఫైర్ అండ్ యాష్' డిసెంబర్ 19న రిలీజ్ కానుంది. నవంబరులో అయితే ఆయన ఈ మూవీ ప్రమోషన్స్ కోసం ఇండియాలోనే ఉంటారని తెలుస్తోంది. దీంతో ఆయన చేతుల మీదుగా ఈ ఫస్ట్ లుక్ రిలీజ్ చేయించాలని రాజమౌళి భావిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. కామెరూన్ తన ఇండియా పర్యటన సందర్భంగా 'Globe Trotter' టైటిల్‌తో పాటు ఫస్ట్ లుక్ రిలీజ్ చేయనున్నారని సమాచారం. ఒకవేళ ఇదే నిజమైతే మహేష్ బాబు, రాజమౌళి 'Globe Trotter' ప్రాజెక్ట్ ప్రపంచస్థాయిలో ప్రమోట్ కావడం మరింత ఈజీ అవుతుంది. మూవీ ఫస్ట్ లుక్ ప్రపంచ సినిమా చరిత్రలో అతిపెద్ద పేర్లలో ఒకరితో ముడిపడి ఉంటుంది.
Also Read: ఆ ఫ్యామిలీ దాచిన సీక్రెట్ ఏంటి? - రెండు ఓటీటీల్లో మలయాళ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్
కామెరూన్ మెచ్చిన రాజమౌళి
జేమ్స్ కామెరూన్‌కు రాజమౌళి బిగ్ ఫ్యాన్. గతంలో లాస్ ఏంజెల్స్‌లో జరిగిన అవార్డుల ఈవెంట్‌లో కామెరూన్‌ను కలిసిన జక్కన్న ఆ వీడియోను షేర్ చేయగా వైరల్ అయ్యింది. 'RRR' మూవీని ప్రశంసించిన కామెరూన్... 'మీరు ఎప్పుడైనా ఇక్కడ సినిమా తీయాలని అనుకుంటే మాట్లాడుకుందాం.' అంటూ చెప్పారు.
ఈ సినిమా స్టోరీ, స్కోప్ చాలా పెద్దదని... ఒక్క సమావేశంలో వివరించేది కాదంటూ రాజమౌళి ప్రీ లుక్ రిలీజ్ సందర్భంగా రాసుకొచ్చారు. తాము సృష్టిస్తోన్న ప్రపంచాన్ని చూపించేందుకు ఓ అద్భుతాన్ని ప్లాన్ చేస్తున్నానని... నవంబర్ వరకూ వెయిట్ చేయాలంటూ రాజమౌళి చెప్పారు. అందుకు తగ్గట్లుగానే ఆ అద్భుతాన్ని లాంచ్ చేసేందుకు సిల్వర్ స్క్రీన్‌పై అద్భుతాలు క్రియేట్ చేసిన లెజెండరీ డైరెక్టర్‌నే జక్కన్న ఎంచుకున్నారు.
ఈ మూవీలో మహేష్ బాబు ప్రధాన పాత్రలో నటిస్తుండగా... ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్, ఆర్.మాధవన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో సాగే ఓ సాహస యాత్ర అని తెలుస్తోంది. 2027లో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.





















