అన్వేషించండి

ఆ స్టార్ హీరోకి విలన్​గా సునీల్ - కన్నడ పాన్ ఇండియా మూవీలో ఛాన్స్ కొట్టేసిన కమెడియన్!

టాలీవుడ్ కమెడియన్ సునీల్ కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ 'మ్యాక్స్' సినిమాలో నటిస్తున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని మూవీ టీం పోస్టర్ ద్వారా కన్ఫార్మ్ చేసింది.

టాలీవుడ్​లో టాప్ కమెడియన్​గా పేరు తెచ్చుకున్న సునీల్ ఇప్పుడు తన సెకండ్ ఇన్నింగ్స్​లో ఫుల్ బిజీ అయిపోతున్నాడు. తెలుగుతో పాటు ఇతర భాషల్లో వరుస అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతున్నాడు. అగ్ర హీరోల సినిమాల్లో ఓవైపు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూనే మరోవైపు విలన్​గాను అదరగొడుతున్నాడు. ముఖ్యంగా తమిళ భాషలో సునీల్​కు అవకాశాలు వెల్లువలా వస్తున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా కన్నడ అగ్ర హీరో సినిమాలో సునీల్ నటించే ఛాన్స్ కొట్టేశాడు. డీటెయిల్స్​లోకి వెళ్తే.. 'పుష్ప' సినిమాతో విలన్ అవతారం ఎత్తాడు సునీల్. ఈ సినిమాలో మంగళం శ్రీనుగా సునీల్ విలక్షణ నటనకి మంచి గుర్తింపు లభించింది.

పుష్ప తర్వాత వెనక్కి తిరిగి చూసుకోకుండా ఇతర భాషల్లో అవకాశాలు తలుపు తట్టాయి. ముఖ్యంగా తమిళంలో అరడజనుకు పైగా సినిమాలు చేస్తున్నాడు. వాటిలో చాలా వరకు అగ్ర హీరోల సినిమాలు కావడం విశేషం. రీసెంట్ టైమ్స్ లో 'మహావీరుడు', 'జైలర్', 'మార్క్ ఆంటోనీ' వంటి సినిమాల్లో విలన్ పాత్రలతో మెప్పించిన సునీల్ కి ఇప్పుడు కన్నడ ఇండస్ట్రీ నుంచి పిలుపు వచ్చింది. కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ నటిస్తున్న 'మ్యాక్స్'(Max) మూవీలో సునీల్ నటిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ సినిమా 75 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం మహాబలిపురంలో చిత్రీకరణ జరుపుకుంటుంది.

కిచ్చా సుదీప్ తప్ప ఈ సినిమాలోని ఇతర నటీనటుల గురించి పెద్దగా సమాచారం ఏమీ బయటకి రాలేదు. అయితే ఈమధ్య సునీల్ ఈ సినిమాలో నటిస్తున్నట్లు చిత్ర నిర్మాత కలై పులి ఎస్ థాను అనౌన్స్ చేశారు. ఇక ఇప్పుడు తాజాగా మూవీ టీం స్వయంగా సునీల్ పోస్టర్ విడుదల చేస్తూ అఫీషియల్ గా కన్ఫర్మ్ చేసింది. కార్తికేయ విజయ్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ లో సునీల్ విలన్ గా కనిపించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సునీల్ నటించిన మొదటి కన్నడ ప్రాజెక్టు ఇది. ఇందులో సునీల్ పాత్ర కూడా చాలా స్పెషల్ గా ఉంటుందని తెలుస్తోంది. ఇప్పటికే తమిళ మేకర్స్ తనపై చూపిస్తున్న ప్రేమకి సునీల్ ఎంతో సంతోషంగా ఉన్నాడు.

తెలుగు, తమిళంలో వరుస సినిమాలు చేస్తున్న సునీల్ ఇప్పుడు కన్నడ నుంచి కూడా అవకాశం అందుకోవడంతో దాన్ని సద్వినియోగం చేసుకునే ప్రయత్నంలో ఉన్నాడు. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సునీల్ కూడా భాగమవడంతో తెలుగులోనూ ఈ మూవీపై ఆసక్తి నెలకొంది. ఎలాగో సుదీప్ కి తెలుగులోనూ మంచి క్రేజ్ ఉంది. ఈ మధ్య సుదీప్ నటిస్తున్న కన్నడ చిత్రాలన్నీ తెలుగులో రిలీజ్ అవుతున్నాయి. 'మ్యాక్స్' కూడా పాన్ ఇండియా లెవెల్ లో విడుదల కాబోతోంది. అంజనీష్ లోకనాథ్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో సుదీప్ సరసన సిమ్రత్, సంయుక్త హోర్నాడ్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. వచ్చే ఏడాది ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Also Read : 'అనుకున్నవన్నీ జరగవు కొన్ని' రివ్యూ : హీరో కాల్ బాయ్ అయితే?

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

టాప్ హెడ్ లైన్స్

Dose OTT : ఒకేసారి ఐదు ఓటీటీల్లో సైకలాజికల్ మెడికల్ థ్రిల్లర్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఒకేసారి ఐదు ఓటీటీల్లో సైకలాజికల్ మెడికల్ థ్రిల్లర్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Hrudhayam Murali Trailer : 20 ఏళ్ల తర్వాత నటుడిగా తమన్ - 'హృదయం మురళి' ట్రైలర్‌లో ఇది వెరీ స్పెషల్
20 ఏళ్ల తర్వాత నటుడిగా తమన్ - 'హృదయం మురళి' ట్రైలర్‌లో ఇది వెరీ స్పెషల్
OG Sequel : పవన్ కల్యాణ్ OG సీక్వెల్ - ఫ్యాన్స్ గెట్ రెడీ... తమన్ బిగ్ అప్డేట్
పవన్ కల్యాణ్ OG సీక్వెల్ - ఫ్యాన్స్ గెట్ రెడీ... తమన్ బిగ్ అప్డేట్
Sing Geetham OTT : ఓటీటీలోకి ముందుగానే సింగ్ గీతం - ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ అవుతుందో తెలుసా?
ఓటీటీలోకి ముందుగానే సింగ్ గీతం - ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ అవుతుందో తెలుసా?

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vizag Fishermen Missing: ముగిసిన రెస్క్యూ ఆపరేషన్‌- ఆరుగురు జాలర్లపై ఆశలు గల్లంతు, రూ.10 లక్షల పరిహారం
ముగిసిన రెస్క్యూ ఆపరేషన్‌- ఆరుగురు జాలర్లపై ఆశలు గల్లంతు, రూ.10 లక్షల పరిహారం
CM Revanth Reddy Soft Hindutva Strategy: బీజేపీ బలానికి రేవంత్ విరుగుడు ! తెలంగాణలో సాఫ్ట్ హిందూత్వ పాలిటిక్స్ వెనుక అసలు స్కెచ్ ఇదే!
బీజేపీ బలానికి రేవంత్ విరుగుడు ! తెలంగాణలో సాఫ్ట్ హిందూత్వ పాలిటిక్స్ వెనుక అసలు స్కెచ్ ఇదే!
FIFA World Cup Dispute: ఈజిప్ట్‌-అర్జెంటీనా మ్యాచ్ ఫిక్సింగ్ అంటూ మోస్తఫా జికో సంచలన వ్యాఖ్యలు, కన్నీళ్లు పెట్టుకున్న లియోనెల్ మెస్సి!
ఈజిప్ట్‌-అర్జెంటీనా మ్యాచ్ ఫిక్సింగ్ అంటూ మోస్తఫా జికో సంచలన వ్యాఖ్యలు, కన్నీళ్లు పెట్టుకున్న లియోనెల్ మెస్సి!
US Attacks Iran: ఇరాన్‌పై మెరుపుదాడులు చేసిన అమెరికా సైన్యం.. చమురు విక్రయాల లైసెన్స్ రద్దు, ఆంక్షలు కఠినతరం
ఇరాన్‌పై మెరుపుదాడులు చేసిన అమెరికా సైన్యం.. చమురు విక్రయాల లైసెన్స్ రద్దు, ఆంక్షలు కఠినతరం
E20 ఇంధనంపై మరో కొత్త చర్చ - పాత బైక్‌లు, కార్ల రబ్బర్‌ భాగాలు పాడయ్యే ఛాన్స్‌!
E20 పెట్రోల్‌తో పాత బండ్లకు ప్రమాదం! రబ్బర్ భాగాలు దెబ్బతినే అవకాశం ఉందని ARAI హెచ్చరిక
Pawan Kalyan Fan Dies: పవన్ కళ్యాణ్ వీరాభిమాని నిరంజన్‌ మృతి.. ఆ కోరిక తీరకుండానే..!
పవన్ కళ్యాణ్ వీరాభిమాని నిరంజన్‌ మృతి.. ఆ కోరిక తీరకుండానే..!
Viral Video: ఆదోని శివాలయం గర్భగుడిలో సిగరెట్‌ వెలిగించి అపచారం, నిందితుడి అరెస్ట్
ఆదోని శివాలయం గర్భగుడిలో సిగరెట్‌ వెలిగించి అపచారం, నిందితుడి అరెస్ట్
Best Mileage Cars: కిలోమీటరుకు కేవలం ₹2.68 మాత్రమే ఖర్చయ్యే కార్లు ఇవే! నెలవారీలో ఎంత ఆదా అవుతుంది? 
కిలోమీటరుకు కేవలం ₹2.68 మాత్రమే ఖర్చయ్యే కార్లు ఇవే! నెలవారీలో ఎంత ఆదా అవుతుంది? 
Embed widget