Naga Chaitanya-Sobhita Dhulipala: సమంత ప్రపోజ్ చేసిన రోజే శోభితతో నిశ్చితార్థం - మాజీ భార్యపై చై ఇలా రివేంజ్ తీసుకున్నాడా? పోస్ట్ వైరల్
Samantha and Naga Chaitanya: నాగ చైతన్య-శోభిత ధూళిపాళ నిశ్చితార్థం తేదీ ఓ ట్విస్ట్ బయటకు వచ్చింది. ఇదే రోజున సమంత చైకి ప్రపోజ్ చేసింది. ఇదే రోజు కావాలనే చై, శోభితతో ఎంగేజ్‌మెంట్ ఫిక్స్ చేయించాడు..
![Naga Chaitanya-Sobhita Dhulipala: సమంత ప్రపోజ్ చేసిన రోజే శోభితతో నిశ్చితార్థం - మాజీ భార్యపై చై ఇలా రివేంజ్ తీసుకున్నాడా? పోస్ట్ వైరల్ Is Naga Chaitanya get Engaged Sobhita Dhulipala on Same Day Ex Wife Samantha proposed to him Naga Chaitanya-Sobhita Dhulipala: సమంత ప్రపోజ్ చేసిన రోజే శోభితతో నిశ్చితార్థం - మాజీ భార్యపై చై ఇలా రివేంజ్ తీసుకున్నాడా? పోస్ట్ వైరల్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/08/08/319ede9f4486a8c3c93d94973b27e2171723123823050929_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Chaitanya Engaged Sobhita on Same of Samantha proposed: అక్కినేని హీరో నాగ చైతన్య, నటి శోభిత ధూళిపాళ ఎంగేజ్‌మెంట్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా నిలిచింది. సమంతతో విడాకులు తర్వాత నాగచైతన్య తన పర్సనల్ లైఫ్‌ని చాలా గోప్యంగా ఉంచుతున్నాడు. తనకు సంబంధించి ఎలాంటి అప్‌డేట్ ఇవ్వడం లేదు. ఈ క్రమంలో అతడు శోభితాతో రిలేషన్ ఉన్నాడంటూ కొంతకాలంగా రూమర్స్ వినిపిస్తున్నాయి. ఇవే నిజం అన్నట్టుగా చై-శోభితలు జంటగా వెకేషన్‌కు వెళ్లిన ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారేవి. దీంతో వీరి డేటింగ్ వార్తలు మరింత పుంజుకునేవి.
ఇటీవల జర్మనీ వీరిద్దరు జంటగా కనిపించిన సంగతి తెలిసిందే. దీనిపై కూడా ఇద్దరు పెదవి విప్పలేదు. కానీ సైలెంట్‌గా నిశ్చితార్థానికి ముహుర్తం పెట్టుకుని, ఇద్దరు రింగులు మార్చుకున్నారు. ఆగస్ట్ 8, 2024న నాగచైతన్య-శోభితలు తమ రిలేషన్ అఫీషియల్ చేశారు. ఇక డేట్ ఓ ప్రత్యేకత కూడా ఉంది. ఈ రోజు అన్ని ఆల్ 8's కలిసి వచ్చేలా తమ స్పెషల్ డే మరింత స్పెషల్ చేసుకున్నారు. ఈ రోజు చాలా స్పెషల్ అని, ఈ తేదిన 8.8.8(2024)తో అన్‌లిమిటెడ్ లవ్ వాళ్లమధ్య ఉందంటూ నాగార్జున చై ఎంగేజ్‌మెంట్ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ డేట్ మరో ప్రత్యేకత కూడా ఉందట. ఈ రోజునే చై మాజీ భార్య, స్టార్ హీరోయిన్ సమంత నాగచైతన్యకు ప్రపోజ్ చేసింది. ఇందుకు సంబంధించిన అప్‌డేట్ నెట్టింట చక్కర్లు కొడుతుంది.
It's the date sam proposed him.
— Loga (@Loga_70) August 8, 2024
They wait for same date and engaged. pic.twitter.com/snVDeyR1zB
ఓ నెటిజన్ ట్వీట్ చేస్తూ ఇదే రోజు సమంత నాగచైతన్యకు ప్రపోజ్ చేసిందని, అందుకే కావాలనే నాగచైతన్య ఇదే తేదిన శోభితతో నిశ్చితార్థానికి ముహుర్తం పెట్టించుకున్నాడంటూ తన పోస్ట్‌లో పేర్కొన్నారు. దీనిపై నెటిజన్ల రకరకాలుగా స్పందిస్తున్నారు. అయితే ఇందులో నిజం లేదని కొందరు అంటుంటే మరికొందరు నిజమే అంటున్నారు. అంతేకాదు మొదట దీనిపై తమిళ మీడియాలో ప్రచారం జరిగింది. దాంతో ఈ అంశంలో క్షణాల్లో వైరల్‌గా మారింది. ఏదేమైన నాగచైతన్య శోభితతో పెళ్లికి రెడీ అవ్వడంతో చై-సామ్ ఫ్యాన్స్ నిరాశ వ్యక్తం చేస్తున్నారు. విడాకులైన మళ్లీ వీరిద్దరు కలవాలని ఈ మాజీ జంట ఫ్యాన్స్ ఆశపడ్డారు. కానీ, ఇలా శోభితని ఎంగేజ్‌మెంట్ చేసుకుని అందరికి షాకిచ్చాడు ఈ అక్కినేని హీరో.
కాగా ఏం మాయ చేశావే సినిమాతో నాగ చైతన్య-సమంతలు ప్రేమలో పడ్డారు. ఈ సినిమాలో వీరిద్దరి జోడికి మంచి మార్కులు పడ్డాయి. జెస్సీ, కార్తీక్‌గా వీరిద్దరి పెయిర్ అభిమానుల గుండెల్లో నిలిచిపోయింది. తొలి సినిమాతోనే ప్రేమలో పడ్డ వీరిద్దరు దాదాపు పదేళ్ల పాటు ప్రేమలో మునిగితేలారు. ఫైనల్ ఇరు కుటుంబ సభ్యుల అంగీకారం 2017లో అక్టోబర్ 6న హిందూ సంప్రదాయం ప్రకారం సామ్ మేడలో మూడుమూళ్లు వేశాడు చై. ఆ మరసటి రోజు అక్టోబర్ 7న క్రిస్టియన్ సంప్రదాయం ప్రకారం చర్చిలో సామ్ చేతికి ఉంగరం తొడిగాడు. పెళ్లి తర్వాత ఎంతో అన్యోన్యంగా ఈ జంట వైవాహిక జీవితంలో కలతలు మొదలయ్యాయి. దీంతో పెళ్లయిన నాలుగేళ్లకు ఈ జంట అక్టోబర్ 2, 2021న విడాకులు ప్రకటన ఇచ్చి ఫ్యాన్స్‌కి షాకిచ్చారు.
Also Read: నాగచైతన్య-శోభితా ఎంగేజ్‌మెంట్ - నెట్టింట సమంత రియాక్షన్, హార్ట్ బ్రేకింగ్ అంటూ పోస్ట్...
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)