అన్వేషించండి

సాయి తేజ్ నెక్స్ట్ మూవీకి ఇంట్రెస్టింగ్ టైటిల్ - డైరెక్టర్ ఎవరంటే!

'విరూపాక్ష' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత సాయి ధరం తేజ్ తన తదుపరిచిత్రాన్ని మాస్ చిత్రాల దర్శకుడు సంపత్ నందితో చేయబోతున్నాడు. తాజాగా మేకర్స్ ఈ సినిమాకి టైటిల్ ని కూడా ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది.

మెగా మేనల్లుడు, సుప్రీం హీరో సాయి ధరంతేజ్ రీసెంట్గా 'విరూపాక్ష' సినిమాతో కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ హిట్ను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమా సాయి తేజ్ కెరీర్ కి మంచి బూస్ట్ ఇచ్చింది. ఇక ఈ మూవీ సక్సెస్ తో తన తదుపరి సినిమాలపై దృష్టి సారించారు సాయి తేజ్. విరూపాక్ష తర్వాత సాయి ధరమ్ తేజ్ ఇప్పటికే రెండు ప్రాజెక్ట్స్ ని కమిట్ అయినట్టు తెలుస్తోంది. ఈ రెండూ కూడా కమర్షియల్ ఎంటర్టైనర్స్ కావడం విశేషం. ఈ క్రమంలోనే తన తదుపరి చిత్రాన్ని సంపత్ నంది దర్శకత్వంలో చేయబోతున్నాడట మెగా మేనల్లుడు. ఈ మూవీ పక్కా మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా ఉండబోతుందట. మాస్ కథలు ప్రిపేర్ చేయడంలో సంపత్ నందికి మంచి పట్టు ఉంది. 'సిటీ మార్' తర్వాత సంపత్ నంది దర్శకత్వంలో ఇప్పటివరకు మరో సినిమా రాలేదు. ఇక తాజాగా సాయి తేజ్ కోసం ఓ అదిరిపోయే కథను రెడీ చేసి అతన్ని మెప్పించడంతో ఈ ప్రాజెక్టు ఓకే అయినట్లు సమాచారం.

త్వరలోనే ఈ ప్రాజెక్టు సేటిస్ఫైకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా వచ్చే నెలలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ ఉండబోతుందట. ఇదొక మాస్ ఎంటర్టైనర్ మూవీ అని చెబుతున్నారు. ఇక తాజాగా ఈ చిత్రానికి టైటిల్ కూడా మేకర్స్ ఫిక్స్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సాయి తేజ్ - సంపత్ నంది కాంబోలో తెరకెక్కుతున్న ఈ మూవీకి 'గోలి శంకర్' అనే టైటిల్ ని ఫిక్స్ చేశారట. దాదాపు ఇదే టైటిల్ ని ఫైనల్ చేసే అవకాశం ఉందని అంటున్నారు. అయితే ఈ టైటిల్ హీరో సాయిధరమ్ తేజ్ కి ఓ సెంటిమెంట్. ఈ టైటిల్లో శంకర్.. అంటే తన మామయ్య చిరంజీవి పేరు. ఆ పేరుతో వచ్చిన 'శంకర్ దాదా MBBS' సినిమా సూపర్ హిట్ అయింది. ఇలా అన్ని రకాలుగా ఈ పేరు తనకు కలిసి వస్తుందని సాయి తేజ్ భావిస్తున్నాడట. త్వరలోనే మేకర్స్ ఈ ప్రాజెక్టుకు సంబంధించి అఫీషియల్ గా టైటిల్ అనౌన్స్ చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మూవీ యూనిట్ నటీనటులు, సాంకేతిక నిపుణుల ఎంపికలో బిజీగా ఉన్నట్లు సమాచారం.

సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై నాగ వంశీ ఈ సినిమాను నిర్మించబోతున్నారట. ఇక ఈ సినిమాతో పాటు జయంత్ అనే నూతన దర్శకుడి తోనూ మరో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు సాయిధరమ్ తేజ్. ఇంకా టైటిల్ ఫిక్స్ చేయని ఈ సినిమాని ప్రముఖ నిర్మాత బి వి ఎస్ ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ నెలలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. కాగా తాజాగా సాయిధరమ్ తేజ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో కలిసి 'బ్రో' అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. సముద్రఖని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా రీసెంట్ గానే షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. ప్రస్తుతం డబ్బింగ్ పనులు జరుగుతున్నాయి. తమిళంలో హిట్ అయిన 'వినోదయ సీతం' అనే సినిమాకి ఇది అఫీషియల్ రీమేగా రూపొందుతోంది. జి స్టూడియోస్ సంస్థతో కలిసి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్నారు. ఎస్. ఎస్ తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా జూలై 28న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Also Read: లైవ్‌లోనే కపిల్ శర్మ సహనటుడి ఆత్మహత్య యత్నం

టాప్ హెడ్ లైన్స్

Ajay Arasada: పవన్ కళ్యాణ్ గారు పిలిచారు... PKCWలో ఛాన్స్? యువ సంగీత దర్శకుడు అజయ్ అరసాడ ఇంటర్వ్యూ
పవన్ కళ్యాణ్ గారు పిలిచారు... PKCWలో ఛాన్స్? యువ సంగీత దర్శకుడు అజయ్ అరసాడ ఇంటర్వ్యూ
Shravan Reddy: శ్రవణ్ రెడ్డి కెరీర్‌కు గేమ్ ఛేంజర్... 'అగధ'తో తెలుగబ్బాయికి ప్రశంసలు
శ్రవణ్ రెడ్డి కెరీర్‌కు గేమ్ ఛేంజర్... 'అగధ'తో తెలుగబ్బాయికి ప్రశంసలు
Vijay Son Jason Sanjay: గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
Bigg Boss Winner Wedding: తమిళ నటుడిగా బిగ్ బాస్ విన్నర్ పెళ్లి... సింపుల్‌గా గురువాయూర్ టెంపుల్‌లో!
తమిళ నటుడిగా బిగ్ బాస్ విన్నర్ పెళ్లి... సింపుల్‌గా గురువాయూర్ టెంపుల్‌లో!

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
National Sports Awards: గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
Telangana 22A Lands Issue: తెలంగాణలో 22ఏ భూప్రకంపనలు! పొంగులేటిని టార్గెట్ చేస్తున్న విపక్షాలు!
తెలంగాణలో 22ఏ భూప్రకంపనలు! పొంగులేటిని టార్గెట్ చేస్తున్న విపక్షాలు!
India Dominates Galle Test:  విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
Peddi Sudarshan Reddy Wife Crying: నర్సంపేటలో అర్ధరాత్రి హైడ్రామా! మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపు! కంటతడి పెట్టిన భార్య!
నర్సంపేటలో అర్ధరాత్రి హైడ్రామా! మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపు! కంటతడి పెట్టిన భార్య!
KBR Park Traffic Rules:కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
Konaseema Fishermen Missing:కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
Vijay Son Jason Sanjay: గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
Embed widget