Oscar Gift Bag: ‘ఆస్కార్’ గిఫ్ట్ బ్యాగ్‌లో అన్ని విలువైన గిఫ్టులు ఉంటాయా? భలే ఛాన్సులే!
‘ఆస్కార్’ సందడి ముగిసింది. మరి ఆస్కార్ గ్రహీతలకు, నామినీలకు లభించేవి ఏమిటో తెలుసుకోవాలని ఉందా? చూసేయండి మరి.
‘ఆస్కార్’ అవార్డుల వేడుకలో ‘‘నాటు నాటు’’ అందరి దృష్టిని ఆకట్టుకుంది. ఇప్పుడు ఎక్కడ చూసినా.. ఇప్పుడు ‘RRR’ గురించే చర్చ. అయితే, కేవలం ‘‘నాటు నాటు’’కే కాకుండా మరికొన్ని హాలీవుడ్ మూవీస్‌కు కూడా ఈ అవార్డులు దక్కాయి. అయితే, వీరికి ఎలాంటి ప్రైజ్ మనీ లభిచందు. కేవలం ఒక డాలర్ విలువ చేసే ఆస్కార్ అవార్డు ప్రతిమ (ట్రోఫీ) మాత్రమే లభిస్తుంది. దానితోపాటు ప్రత్యేకంగా ఒక గిఫ్ట్ బ్యాగ్ కూడా ఇస్తారు. ఇది కేవలం విన్నర్లకు మాత్రమే ఇస్తారని అనుకుంటే పొరపాటే. నామినేషన్స్‌లో ఉన్న ప్రతి టీమ్‌కు ఈ గిఫ్ట్ బ్యాగ్ లభిస్తుంది.
లాస్ ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్‌లో 95వ అకాడమీ అవార్డులను సోమవారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా అవార్డులు గెలుచుకున్నా, నామినేషన్లో నిలిచినవారికి ‘ఆస్కార్’ గిఫ్ట్ బ్యాగ్‌లను అందించారు. ఇందులో 1,26,000 డాలర్లు (రూ.1.03 కోట్లు) విలువ చేసే గిఫ్ట్ బ్యాగ్ లభిస్తుందని తెలిసింది. ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటి, ఉత్తమ నటుడు, ఉత్తమ సహాయ నటుడు, ఉత్తమ సహాయ నటి, ఉత్తమ దర్శకుడు వంటి ప్రధాన విభాగాల్లో నామినేట్ చేయబడిన వారికి మాత్రమే ఈ గిఫ్ట్ బ్యాగ్ ఇస్తారట. లాస్-ఏంజిల్స్‌కు చెందిన Distinctive Assets అనే సంస్థ ఈ గూడీ బ్యాగ్‌లను పంపిణీ చేస్తుంది. ఈ మార్కెటింగ్ కంపెనీకి ఆస్కార్‌తో అనుబంధం లేదు. కానీ 2002 నుంచి ఈ బహుమతి బ్యాగ్‌ను అందిస్తోంది. అయితే విజేతలకు సైతం ఈ గిఫ్టులు ఇస్తారా లేదా అనేది స్పష్టత లేదు. ఎందుకంటే.. ఆస్కార్ అవార్డును దక్కించుకోని సినీ దిగ్గజాలకు ఓదార్పు ఇవ్వడం కోసమే ఈ గిఫ్ట్ బ్యాగ్‌ల ఉద్దేశమట.
గిఫ్ట్ బ్యాగ్‌లో ఏయే బహుమతులు ఉంటాయి?
ఆస్కార్ గిఫ్ట్ బ్యాగ్‌లో జపనీస్ మిల్క్ బ్రెడ్, ఇటాలిలోని ఒక దీవికి కాస్మెటిక్ ట్రీట్‌మెంట్ ట్రిప్, ఆస్ట్రేలియాలోని ప్లాట్ వంటివి ఉంటాయి. ఇలా ఆ బ్యాగ్‌లో సుమారు 60 వరకు బహుమతులు ఉంటాయి. ఇటలీ దీవిలో గల లైట్‌హౌస్‌లో ఉండేందుకు $9,000 (దాదాపు ₹ 7.3 లక్షలు) విలువ చేసే కూపన్ ఉంటుంది. ఎనిమిది మంది ఆస్కార్ నామినీలు మూడు రాత్రులు ఇక్కడ బస చేయొచ్చు. అలాగే ‘ది లైఫ్‌స్టైల్’ అనే 10 ఎకరాల కెనడియన్ ఎస్టేట్‌కు వెళ్లే అవకాశం కూడా ఉంది. ఈ ట్రిప్ విలువ $40,000 (రూ. 32.7 లక్షలు) వరకు ఉంటుంది. ఇంకా మైసన్ కన్స్ట్రక్షన్స్ ద్వారా గృహ ఆధునీకరణ ప్రాజెక్ట్‌ల కోసం $25,000 (రూ.20.5 లక్షలు) వరకు రాయితీలు ఇస్తారట. $41,000 (రూ.33.7 లక్షలు) విలువైన కాస్మెటిక్ ట్రీట్మెంట్ కూపన్స్ కూడా ఈ బ్యాగ్‌లో ఉంటాయి. వీటిలో లిపో ఆర్మ్ స్కల్ప్టింగ్, హెయిర్ రిస్టోరేషన్, ఫేస్‌లిఫ్ట్ వంటివి ఉన్నాయి.
మరి, 'బెస్ట్ ఒరిజినల్ సాంగ్' (ఉత్తమ పాట) విభాగంలో అవార్డు గెలుచుకున్న సంగీత దర్శకుడు కీరవాణి, పాటల రచయిత చంద్రబోస్‌లకు ఏం లభించాయనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఎందుకంటే.. విజేతలకు ఈ గిఫ్టు బ్యాగులు లభించవట. అయితే వారికి అంతర్జాతీయ స్థాయిలో హాలీవుడ్ తదితర సినీ పరిశ్రమల నుంచి అవకాశాలు క్యూ కడతాయి. అలాగే, వారి రెమ్యునరేషన్ కూడా ఇప్పుడు ఉన్నదాని కంటే 20 శాతం పెరుగుతుందట. విజేతలకు ఇంకా చాలా బెనిఫిట్స్ ఉంటాయట.
ఆస్కార్ నామినీలకు ఆస్ట్రేలియాలో భూమి
ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా ఆస్కార్ నామినీలకు ఆస్ట్రేలియాలో భూమిని గిఫ్ట్ గా ఇచ్చినట్లు తెలిసింది. అయితే, ఆ భూమి వలన ఆస్కార్ నామినీలకు ఎలాంటి ఉపయోగం ఉండదట. వారు ఆ భూమిని తమ ఆధీనంలోకి తీసుకోలేరట. అయితే, ఆ భూమి మాత్రం ఆస్కార్ నామినీల పేరుతో వారికి గుర్తుగా అక్కడ ఉండబోతోందట. నిజానికి ఆస్కార్ నామినీలకు బహుమతలు అందించేందుకు ఆకాడమీతో సంబంధం లేకుండా పలు వ్యాపార సంస్థలు ముందుకు వస్తాయి. ఇందు కోసం పలు సంస్థలు పోటీ పడుతాయి. అందులో భాగంగానే ఒకటి ‘పీసెస్ ఆఫ్ ఆస్ట్రేలియా’ అనే రియల్ ఎస్టేట్ కంపెనీ. ఆస్కార్ నామినీలకు ఇచ్చే గిఫ్ట్ హాంపర్‌లో చోటు దక్కించుకోవడానికి ఏకంగా అకాడమీ సంస్థకు 4 వేల డాలర్లు చెల్లించింది. నామీనీల గిఫ్ట్ బ్యాగ్ లో పీసెస్ ఆఫ్ ఆస్ట్రేలియా సంస్థ తమ ఆస్సీ మేట్ కన్జర్వేషన్ ప్యాక్స్ ను చేర్చింది. దీని ద్వారా కలిగే ఉపయోగం ఏంటంటే.. క్వీన్స్ ల్యాండ్ లోని వెస్ట్రన్ డౌన్స్ ప్రాంతంలో ఉన్న ఎన్విరోషియన్ ఎస్టేట్ లో ఒక చదరపు మీటర్ జాగా, ఆస్కార్ నామినీల పేరు మీద ఉండబోతోంది. ఈ భూమికి సంబంధించిన లైసెన్స్ సర్టిఫికెట్‌ను ఆస్కార్ గ్రహీతలకు అందిస్తారు.
Also Read : ఆస్కార్ గొడవ - ఎన్టీఆర్ ఫోటో మాత్రమే ఎందుకు, రామ్ చరణ్ ఎక్కడ? మెగా ఫ్యాన్స్ ఫైర్