అన్వేషించండి

Pavithra Gowda: కిరాణా షాప్‌ to హీరోయిన్‌ స్థాయికి - భర్తను వదిలి దర్శన్‌తో ప్రేమ.. పవిత్ర గౌడ్ గురించి రాస్తే ఒక పుస్తకం అవుతాది!

Pavithra Gowda: రేణుకా స్వామి అనే వ్యక్తి హత్య కేసులో స్టార్ హీరో దర్శన్‌తో పాటు మరో నిందితురాలిగా నిలిచింది పవిత్ర గౌడ. దీంతో అసలు ఈ పవిత్ర గౌడ ఎవరు అని ప్రేక్షకులు తెలుసుకోవడం మొదలుపెట్టారు.

Who Is Pavithra Gowda: ఒక స్టార్ హీరో అయ్యిండి ఒక మర్డర్ కేసులో నిందితుడిగా నిలవడంతో ప్రస్తుతం దర్శన్ గురించే అన్నీ భాషల పరిశ్రమల్లో చర్చలు నడుస్తున్నాయి. పైగా దర్శన్‌కు ఇదివరకే పెళ్లయినా కూడా పవిత్ర గౌడ అనే నటితో రిలేషన్‌షిప్‌లో ఉండడం, తనకోసం ఒక మర్డర్ చేయడం అనేది మరింత సంచలనంగా మారింది. ప్రస్తుతం ఈ కేసులో ఇంకా విచారణ జరుగుతుండగా అసలు ఈ పవిత్ర గౌడ ఎవరు అని ప్రేక్షకులు తెలుసుకోవడం మొదలుపెట్టారు. నటిగా పవిత్రకు అంతగా గుర్తింపు రాకపోయినా.. కేవలం దర్శన్‌తో ప్రేమ వ్యవహరం వల్లే తను శాండిల్‌వుడ్‌లో ఒక రేంజ్‌లో పాపులారిటీ సంపాదించుకుందని నెటిజన్లు అంటున్నారు.

మిడిల్ క్లాస్ ఫ్యామిలీ..

పవిత్ర గౌడ.. మోడలింగ్‌తో తన కెరీర్‌ను ప్రారంభించి ఆ తర్వాత హీరోయిన్‌గా మారింది. వెండితెరపైకి వచ్చిన తర్వాత పవిత్ర గురించి ప్రేక్షకులకు తెలుసు. కానీ అసలైతే తను ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుండి వచ్చిందనే విషయం తాజాగా బయటపడింది. పవిత్ర గౌడ తండ్రి ఒక కిరాణా షాప్ ఓనర్ అని సమాచారం. కొన్నాళ్లు ఆమె దాని బాధ్యతలు చూసుకుందని, ఆ తర్వాత యాక్టింగ్ మీద ప్యాషన్‌తో మోడల్‌గా తన కెరీర్‌ను ప్రారంభించిందని తెలిసింది. ఈ క్రమంలో ఆమెకు మిస్ బెంగుళూరు కిరీటం కూడా దక్కింది. దీంతో ఆమెకు వెండితెరపై హీరోయిన్‌గా అవకాశాలు రావడం మొదలయ్యింది. ముందుగా 2016లో ‘54321’ అనే తమిళ చిత్రంలో హీరోయిన్‌గా ఛాన్స్ దక్కించుకుంది పవిత్ర.

పెళ్లయ్యి విడాకులు..

తమిళంలో హీరోయిన్‌గా నటించిన సినిమా హిట్ అవ్వకపోయినా.. పవిత్ర గౌడకు కన్నడలో బ్యాక్ టు బ్యాక్ ఆఫర్లు వచ్చాయి. ‘చత్రిగలు సార్ చత్రిగలు’, ‘అగమ్య’, ‘ప్రీతి కితాబు’ వంటి చిత్రాల్లో హీరోయిన్‌గా నటించింది. అదే సమయంలో తనకు స్టార్ హీరో దర్శన్‌తో పరిచయం ఏర్పడింది. అప్పటికే పవిత్రకు పెళ్లయ్యి ఒక కూతురు కూడా ఉన్నా మొదటి భర్తతో విడాకులు తీసుకొని ఒంటరిగా ఉంటోంది. అప్పుడే దర్శన్‌తో పరిచయం ప్రేమగా మారింది. ఆ తర్వాత కొన్నిరోజులకే వీరిద్దరూ కలిసి లివిన్ రిలేషన్‌షిప్‌లో ఉండడం మొదలుపెట్టారు. పవిత్రకు విడాకులు అయినా దర్శన్ మాత్రం తన భార్య విజయలక్ష్మితో కలిసుంటూనే పవిత్రతో కూడా రిలేషన్‌లో ఉన్నాడు.

గిఫ్ట్‌గా ఇల్లు, కారు..

దర్శన్‌తో కలిసున్న ఫోటోలు, వీడియోలను ఓపెన్‌గానే సోషల్ మీడియాలో షేర్ చేసేది పవిత్ర గౌడ. సినిమాలు తనకు అంతగా వర్కవుట్ అవ్వకపోయినా ప్రస్తుతం తను చాలా విలాసవంతమైన జీవితం గడుపుతోంది. దానికి కారణం దర్శనే అని కన్నడ ప్రేక్షకులు అనుకుంటున్నారు. ఆర్ఆర్ నగర్‌లో పవిత్రకు ఒక ఇల్లు ఉంది. ఆ ఇంటిని కూడా దర్శనే తనకు గిఫ్ట్‌గా ఇచ్చాడని వార్తలు వినిపిస్తున్నాయి. అంతే కాకుండా పవిత్ర దగ్గర ఉన్న లగ్జరీ కారు కూడా ఆయన కొనిచ్చిందేనట. ఈ రిలేషన్‌షిప్ వల్ల దర్శన్‌కు, ఆయన భార్య విజయలక్ష్మికి పలుమార్లు గొడవలు కూడా అయ్యాయట. కానీ దర్శన్ ఇలా చేయడాన్ని తట్టుకోలేకపోయిన ఫ్యాన్స్ మాత్రం పవిత్ర పోస్టులపై నెగిటివ్ కామెంట్స్ చేస్తూనే ఉన్నారు.

Also Read: ప్రైవేట్ పార్ట్స్‌పై కొట్టి, కరెంట్ షాక్ పెట్టి.. రేణుకా స్వామిని అంత దారుణంగా చంపారా? పోస్ట్ మార్టం రిపోర్ట్‌లో ఏముంది?

టాప్ హెడ్ లైన్స్

Anna Lezhneva : పవన్ బాటలోనే అన్నా కొణిదెల - వన్యప్రాణుల దత్తత
పవన్ బాటలోనే అన్నా కొణిదెల - వన్యప్రాణుల దత్తత
Anupama Parameswaran : నా సోషల్ మీడియా... ఏదైనా పోస్ట్ చేస్తా - అనుపమ పరమేశ్వరన్ స్ట్రాంగ్ రియాక్షన్
నా సోషల్ మీడియా... ఏదైనా పోస్ట్ చేస్తా - అనుపమ పరమేశ్వరన్ స్ట్రాంగ్ రియాక్షన్
Korean Kanakaraju Trailer : అలర్ట్... కొరియన్ కనకరాజు వచ్చేశాడు - కొరియన్ ఆత్మతో హీరో వార్... ఇంట్రెస్టింగ్‌గా ట్రైలర్
అలర్ట్... కొరియన్ కనకరాజు వచ్చేశాడు - కొరియన్ ఆత్మతో హీరో వార్... ఇంట్రెస్టింగ్‌గా ట్రైలర్
Lenin OTT : ఓటీటీలోకి అఖిల్ అక్కినేని కొత్త మూవీ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి అఖిల్ అక్కినేని కొత్త మూవీ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?

వీడియోలు

Minor Apologises to PM Modi | పీఎంపై వ్యాఖ్యలకు క్షమాపణ కోరిన మైనర్
Modi on abuses by youth | ఆవేదన చెందా కానీ కోపంలేదు 'దారి తప్పిన వారిని సరైన దారిలో నడిపిద్దాం
Jasprit Bumrah Fitness Cleared For Tests | ఫిట్‌నెస్ టెస్ట్ పాసైన జస్ప్రీత్ బుమ్రా
Serial Actress Vandana Gollu Real Life Story | బుల్లితెర నటి వందన గొల్లు రియల్ లైఫ్ స్టోరీ
Will Shami Play World Cup 2027? | గంగూలీ ప్లాన్ రిపీట్ చేయనున్న గిల్ ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
NEET UG Counselling 2026 షెడ్యూల్ విడుదల.. ఆగస్టు 5న ప్రారంభం కానున్న రిజిస్ట్రేషన్లు- ఈ డాక్యుమెంట్స్ తప్పనిసరి
NEET UG Counselling 2026 షెడ్యూల్ విడుదల.. ఆగస్టు 5న ప్రారంభం కానున్న రిజిస్ట్రేషన్లు
Revanth Reddy On Uppal Nalla Cheruvu: ఉప్పల్ నల్లచెరువుకు జలకళ.. హైడ్రాపై సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు
ఉప్పల్ నల్లచెరువుకు జలకళ.. హైడ్రాపై సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు
Liquor Shops Closed: మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. హైదరాబాద్‌లో 2 రోజులపాటు వైన్స్ షాపులు, బార్ల మూసివేత
మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. హైదరాబాద్‌లో 2 రోజులపాటు వైన్స్ షాపులు, బార్ల మూసివేత
CWG Boxing Gold: రింగ్ లో పంచ్ ల వర్షం.. గ్లాస్గో గేమ్స్ లో జైస్మిన్, ప్రీతి మైండ్ బ్లాకింగ్ గోల్డ్ మెడల్స్, బాక్సింగ్ లో పతకాల పంట!
రింగ్ లో పంచ్ ల వర్షం.. గ్లాస్గో లో జైస్మిన్, ప్రీతికి గోల్డ్ మెడల్స్- బాక్సింగ్ లో పతకాల పంట!
Telangana Police Jobs 2026: తెలంగాణ పోలీస్ ఉద్యోగాల భర్తీ- దరఖాస్తుల తేదీలు, పోస్టుల పూర్తి వివరాలు
తెలంగాణ పోలీస్ ఉద్యోగాల భర్తీ- దరఖాస్తుల తేదీలు, పోస్టుల పూర్తి వివరాలు
Anantapur Crime News: అనంతపురంలో భయంకరమైన ఘటన - కూతురిపై కన్నేశాడని ప్రియుడి మర్మాంగం కోసేసిన మహిళ
అనంతపురంలో భయంకరమైన ఘటన - కూతురిపై కన్నేశాడని ప్రియుడి మర్మాంగం కోసేసిన మహిళ
PV Sunil Kumar Letter to CBI: డిప్యూటీ స్పీకర్ RRRపై సీబీఐకి మాజీ సీఐడీ చీఫ్ లేఖ - సాక్ష్యాల తారుమారు, బెదిరింపులు పై పీవీ సునీల్ కుమార్ సంచలన ఫిర్యాదు!
డిప్యూటీ స్పీకర్ RRRపై సీబీఐకి మాజీ సీఐడీ చీఫ్ లేఖ - సాక్ష్యాల తారుమారు, బెదిరింపులు పై పీవీ సునీల్ కుమార్ సంచలన ఫిర్యాదు!
PM Modi At Bhogapuram Airport: ఉత్తరాంధ్ర ప్రగతికి నూతన శకం.. స్వర్ణాంధ్ర విజన్‌కు మైలురాయి భోగాపురం ఎయిర్‌పోర్ట్: ప్రధాని మోదీ
ఉత్తరాంధ్ర ప్రగతికి నూతన శకం.. స్వర్ణాంధ్ర విజన్‌కు మైలురాయి భోగాపురం ఎయిర్‌పోర్ట్: ప్రధాని మోదీ
Embed widget