అన్వేషించండి

Harish Shankar: నువ్వేమైనా నాకు పెగ్ కలిపావా? అన్నింటికీ తెగించే ఇక్కడ నిలబడ్డాం - హరీష్ శంకర్ ఫైర్

Eagle Movie Success Meet: ‘ఈగల్’ మూవీ సక్సెస్ మీట్‌లో పాల్గొన్న హరీష్ శంకర్ ట్రోలింగ్‌పై ఫైర్ అయ్యారు. దర్శకుడు కార్తిక్ ఘట్టమనేనిపై వస్తున్న ట్రోల్స్ చూసి బాధేసిందని పలువురిని ఉద్దేశించి మాట్లాడారు.

Harish Shankar: రవితేజ హీరోగా నటించిన ‘ఈగల్’.. తాజాగా విడుదలయ్యి మంచి సక్సెస్‌ను సాధించింది. దీంతో మూవీ టీమ్ సక్సెస్ మీట్‌ను ఏర్పాటు చేసింది. ఆ సక్సెస్ మీట్‌కు దర్శకుడు హరీష్ శంకర్ చీఫ్ గెస్ట్‌గా హాజరయ్యాడు. అందులో ఈ దర్శకుడు మాట్లాడిన మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి. తన వర్క్ గురించి విమర్శిస్తున్న వారికి, సినిమావారిపై రాళ్లు విసురుతున్న కొందరు జర్నలిస్టులకు, న్యూస్ వెబ్‌సైట్స్‌కు గట్టి సమాధానమిచ్చాడు హరీష్.

కార్తిక్ గురించే బాధ..

‘‘ఈగల్ రివ్యూలు చూస్తుంటే లవ్ స్టోరీ ఇంకా బాగా చేయొచ్చు అని ట్వీట్ చూశాను. టైటిల్ ఏమైనా ప్రేమ పావురాలు అని పెట్టారా లవ్ స్టోరీ ఆశించడానికి. తుపాకీ పట్టుకొని, గడ్డం పెంచుకొని, షూట్ చేసుకొని వెళ్తుంటే లవ్ స్టోరీ అంటారేంటని నాకు అర్థం కాలేదు. ఇప్పుడు ఏం మాట్లాడినా కాంట్రవర్సీ అవుతుంది. మీరు అనుకోవడం మానరు. నేను అనడం మానను. అన్ని సినిమాలు అందరికీ నచ్చాలని లేదు. విమర్శించే ముందు ఒక విషయం చెప్తున్నాను.. కార్తిక్ అదిరిపోయే కెమెరామ్యాన్. తను సినిమాటోగ్రాఫీ చేయాలనుకుంటే ఇప్పటికీ చేతిలో పది సినిమాలు ఉంటాయి. కానీ అక్కడితో సంతృప్తి పడకుండా అందరూ మెచ్చుకునేలా ఒక సినిమా తీశాడు. విమర్శించే ముందు అతను ఏంటి, అతని జర్నీ ఏంటి అని ఒకసారి ఆలోచించాలి కదా’’ అని కార్తిక్ ఘట్టమనేనిపై జాలి చూపించాడు హరీష్ శంకర్.

చాలా బాధేసింది..

‘‘అంత కష్టపడి సినిమా తీస్తే లవ్ స్టోరీ లేదు అంటారేంటి అనుకున్నాను. తర్వాత ఆరాతీస్తే తెలిసింది ఈ బ్యాచే ఆర్ఆర్ఆర్‌లో రొమాన్స్ లేదు అన్నారంట. నేనేదో గరికపాటి లాగా, చాగంటి లాగా ప్రవచనం మాత్రం ఇవ్వడం లేదు. సినిమా ఇండస్ట్రీ అంటే సినీ నిర్మాతలు, దర్శకులు, నటులు, సినీ జర్నలిస్టులు కూడా. మనమందరం ఒక ఇండస్ట్రీ. మీరు మా మీద, మేము మీ మీద రాళ్లు వేసుకోవడానికి మీరు ఆ గట్టున, మేము ఈ గట్టున లేము. సినీ జర్నలిస్టులు అంటే ఇండస్ట్రీలో భాగమే. ఎప్పటికీ అది మర్చిపోకండి. మనం కలిస్తేనే ఇండస్ట్రీ. మీరు పబ్లిసిటీ చేయనిదే నా సినిమాలు జనాల వరకు రీచ్ అయ్యాయా? సురేశ్ కొండేటి మీద కౌంటర్ వేసినందుకు నాకు 200 ఫోన్లు వచ్చాయి. గబ్బర్‌సింగ్‌కు ఎన్ని ఫోన్లు వచ్చాయో.. ఆరోజు అన్ని ఫోన్లు వచ్చాయి. నేను గొప్పగా మాట్లాడలేదు. అతను చాలా సందర్భాల్లో తప్పుగా మాట్లాడాడు. అది తర్వాత ఆలోచించుకుంటే చాలా బాధేసింది. మనమంతా ఒక ఇండస్ట్రీ కదా. సోషల్ మీడియా, జనాలు మనల్ని చూసి నవ్వుకోవడం ఏంటి అనిపించింది’’ అని వాపోయాడు.

Also Read: చాలామంది నన్ను తిట్టారు, కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్‌పై సందీప్ కిష‌న్ రియాక్ష‌న్

మా మీద సెటైర్లు వేయండి..

‘‘మేము వ్యాపారం చేస్తున్నాం. సినిమా అంటే ముందు కళ అయితే.. తర్వాత వ్యాపారం. అన్ని రాజకీయ పార్టీలు నా సినిమాలు చూడాలని అనుకుంటాను. డైరెక్టర్‌గా చేస్తున్నప్పుడు సినిమాపైనే దృష్టిపెట్టు అని పవన్ కళ్యాణ్ చెప్పారు. నా సినిమా ఎప్పుడూ హౌజ్‌ఫుల్ అవ్వాలి అనుకుంటాను. మేము ఉన్నాం కదా మీ మాటలకు, ట్రోలింగ్‌కు బండల్లాగా అయిపోయి.. మా మీద వేయండి సెటైర్లు మేము రెడీ. పాపం కార్తిక్ రెండో సినిమా తీస్తున్నాడు. వాడిని మీరు ఆకాశంలో పెట్టక్కర్లేదు. మన ఇండస్ట్రీ కదా, మన వ్యక్తి కదా. విమర్శ వేరు, ఎగతాలి వేరు. ఎవరో ట్రోల్ చేశారంటే ఒక అర్థం ఉంది. మన మనుషులు కూడా ట్రోలింగ్ స్థాయికి దిగజారిపోతున్నారు అక్కడ బాధేస్తుంది. ఇవన్నీ జరిగిన తర్వాత ఏమంటారంటే మళ్లీ మైక్ తీసుకున్నాడు, మళ్లీ గట్టిగా మాట్లాడాడు అంటారు. కచ్చితంగా గట్టిగా మాట్లాడతాను’’ అన్నాడు.

ట్రోలింగ్ కొత్త కాదు..

‘‘నాలుగేళ్లు అయ్యింది. సినిమా లేట్ అవుతుందని చెప్పి ఒక ప్రొడ్యూసర్ ఇంట్లో కూర్చొని మద్యం తాగిన ఒక డైరెక్టర్. ఇతడు పవన్ కళ్యాణ్‌తో ఇంతకు ముందు బ్లాక్‌బస్టర్ తీశాడు. ఇంకెవరు? వాడికి మొత్తం రాసేంత ధైర్యం ఉండదు. దమ్ముంటే నా ఫోటో వేసి.. హరీష్ శంకర్ తెల్లార్లు తాగాడని రాయి. దాని తర్వాత నేను కౌంటర్ ఇస్తాను. నువ్వేమైనా నాకు ఐస్ వేశావా? నాకు పెగ్ కలిపావా? ఏరా పెగ్ పట్రా అని నువ్వేమైనా పెగ్ తీసుకొచ్చావా? ఏంట్రా నీ సోర్స్? పోనీ ధైర్యం నా ఫోటో వేసి రాయి. రాయడు. మాట మాట్లాడితే గ్యాప్ వచ్చింది అంటున్నారు. ఇదేమైనా ప్రోగ్రెస్ రిపోర్టా? మా నాన్నలాగా మీరేమైనా నా స్కూల్ ఫీజ్ కట్టారా? విపరీతంగా పర్సనల్ అటాక్ చేస్తున్నారు. మేమేమైనా గాంధీ మహాత్ములం అని చెప్పామా మీకు? మాలో విషయం ఉన్నంత వరకు మేము నిలబడతాం. ప్రత్యేకంగా సదరు వెబ్‌సైట్‌కు చెప్తున్నా. ట్రోలింగ్ మీకు కొత్తేమో. ముందు ట్రోలింగ్ ప్రారంభించిందే మా అమ్మ, నాన్న. వీడి మొహానికి వీడు పెద్ద డైరెక్టర్. అన్నింటికి తెగించే ఇక్కడికి వచ్చాం’’ అని ఆర్టికల్స్ రాసిన తనకేం భయం లేదంటూ స్పీచ్‌ను ముగించాడు హరీష్ శంకర్.

Also Read: వెనక్కి తగ్గని ‘ఈగల్’ - మూడు రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందంటే?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Chandrababu meet: నాగబాబు ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు - పవన్, చంద్రబాబు భేటీలో పలు కీలక అంశాలపై చర్చ
నాగబాబు ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు - పవన్, చంద్రబాబు భేటీలో పలు కీలక అంశాలపై చర్చ
CM Revanth Reddy: తెలంగాణలో హరిత విప్లవం దిశగా సంస్కరణలు - సీఎం రేవంత్ పాలనలో విప్లవాత్మక నిర్ణయాలు
తెలంగాణలో హరిత విప్లవం దిశగా సంస్కరణలు - సీఎం రేవంత్ పాలనలో విప్లవాత్మక నిర్ణయాలు
Lava Blaze Duo 5G: రూ.15 వేలలోపే రెండు డిస్‌ప్లేల ఫోన్ - లావా బ్లేజ్ డ్యుయో 5జీ వచ్చేసింది!
రూ.15 వేలలోపే రెండు డిస్‌ప్లేల ఫోన్ - లావా బ్లేజ్ డ్యుయో 5జీ వచ్చేసింది!
Pawan Kalyan: పిఠాపురం ప్రజలకు మరో గుడ్ న్యూస్ - పవన్  కల్యాణ్ నిర్ణయంతో ప్రజలకు భారీగా ఖర్చు మిగులు
పిఠాపురం ప్రజలకు మరో గుడ్ న్యూస్ - పవన్ కల్యాణ్ నిర్ణయంతో ప్రజలకు భారీగా ఖర్చు మిగులు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అద్దె ఇంట్లో లిక్కర్ తయారీ, ఏ బ్రాండైనా చిటికెలో రెడీ!మనం దేశంలో మగాళ్లకు ఓ న్యాయం.. ఆడవాళ్లకు ఓ న్యాయమా?ఇళయరాజాకు ఘోర అవమానం!నాలుగు కాళ్ళ దెయ్యం దెబ్బకు   ఖాళీ అయిపోయిన గ్రామం..!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Chandrababu meet: నాగబాబు ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు - పవన్, చంద్రబాబు భేటీలో పలు కీలక అంశాలపై చర్చ
నాగబాబు ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు - పవన్, చంద్రబాబు భేటీలో పలు కీలక అంశాలపై చర్చ
CM Revanth Reddy: తెలంగాణలో హరిత విప్లవం దిశగా సంస్కరణలు - సీఎం రేవంత్ పాలనలో విప్లవాత్మక నిర్ణయాలు
తెలంగాణలో హరిత విప్లవం దిశగా సంస్కరణలు - సీఎం రేవంత్ పాలనలో విప్లవాత్మక నిర్ణయాలు
Lava Blaze Duo 5G: రూ.15 వేలలోపే రెండు డిస్‌ప్లేల ఫోన్ - లావా బ్లేజ్ డ్యుయో 5జీ వచ్చేసింది!
రూ.15 వేలలోపే రెండు డిస్‌ప్లేల ఫోన్ - లావా బ్లేజ్ డ్యుయో 5జీ వచ్చేసింది!
Pawan Kalyan: పిఠాపురం ప్రజలకు మరో గుడ్ న్యూస్ - పవన్  కల్యాణ్ నిర్ణయంతో ప్రజలకు భారీగా ఖర్చు మిగులు
పిఠాపురం ప్రజలకు మరో గుడ్ న్యూస్ - పవన్ కల్యాణ్ నిర్ణయంతో ప్రజలకు భారీగా ఖర్చు మిగులు
Prabhas : షూటింగ్​లో ప్రభాస్‌కు మళ్లీ గాయం.. జపాన్ ప్రేక్షకులకు సారీ చెప్పేశాడు, ఎందుకంటే
షూటింగ్​లో ప్రభాస్‌కు మళ్లీ గాయం.. జపాన్ ప్రేక్షకులకు సారీ చెప్పేశాడు, ఎందుకంటే
KTR: 'భూములు ఇవ్వని రైతులపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారు' - రైతుల తరఫున పోరాడతామన్న కేటీఆర్
'భూములు ఇవ్వని రైతులపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారు' - రైతుల తరఫున పోరాడతామన్న కేటీఆర్
Polavaram Project: 2026 అక్టోబర్ నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి - షెడ్యూల్ రిలీజ్ చేసిన సీఎం
2026 అక్టోబర్ నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి - షెడ్యూల్ రిలీజ్ చేసిన సీఎం
TDP:  జోగి రమేష్ నీడ టీడీపీపై ఎందుకు పడింది ? - గౌతు శిరీష, మంత్రి పార్ధసారధిపై లోకేష్ ఫైర్ !
జోగి రమేష్ నీడ టీడీపీపై ఎందుకు పడింది ? - గౌతు శిరీష, మంత్రి పార్ధసారధిపై లోకేష్ ఫైర్ !
Embed widget