అన్వేషించండి

Hanu Man: ఆఫ్‌ స్క్రీన్‌ లో 'హను-మాన్‌' సూపర్ విలన్‌ విన్యాసాలు చూశారా?

Hanu Man: ‘హనుమాన్‌’ సినిమాలో మైఖేల్‌ అనే సూపర్ విలన్‌ గా నటించిన వినయ్‌ రాయ్‌.. ఆఫ్‌ స్క్రీన్‌ లోనూ జనాలను భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారు.

Hanu Man: తేజ సజ్జ హీరోగా ప్రశాంత్‌ వర్మ దర్శకత్వంలో తెరకెక్కించిన పాన్ ఇండియా చిత్రం ‘హను-మాన్‌’. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద సంచలన విజయం సాధించింది. ఇందులో నటించిన నటీనటులందరికీ ఈ సూపర్ హీరో సినిమా మంచి పేరు తెచ్చిపెట్టింది. హీరోయిన్ గా అమృత అయ్యర్.. కీలక పాత్రల్లో వరలక్ష్మీ శరత్‌కుమార్‌, సముద్రఖని అలరించారు. సూపర్ విలన్ గా నటించిన వినయ్‌ రాయ్‌ మెప్పించారు. అయితే బిగ్ స్క్రీన్ మీద భయపెట్టిన ఈ మాస్క్ మ్యాన్ ఇప్పుడు ఆఫ్ స్క్రీన్ లోనూ సందడి చేస్తున్నారు.

'వాన' మూవీ ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన వినయ్ రాయ్.. ‘హనుమాన్‌’ సినిమాలో మైఖేల్‌ అనే క్రూరమైన సూపర్ విలన్ పాత్రలో నటించారు. బ్యాట్ మ్యాన్ కు జోకర్ లా, సూపర్ మ్యాన్ కోసం లెక్స్ లూథర్ లాగా.. ఇక్కడ హను మ్యాన్ కు సూపర్ విలన్ మైఖేల్ గా ఆకట్టుకున్నాడు. హాలీవుడ్ మూవీస్ లో విలన్స్ మాదిరిగానే కస్టమ్ మేడ్ సూట్ ధరించి, గ్యాస్ మాస్క్ - పైరేట్ ఐ ప్యాచ్ పెట్టుకొని సరికొత్త లుక్ లో కనిపించారు. అయితే ఇప్పుడు బయట కూడా అదే గెటప్ తో తిరుగుతూ అందరినీ ఆశ్చర్యపరిస్తున్నారు వినయ్.

"హనుమాన్ సూపర్ విలన్ మైఖేల్ ఆఫ్ స్క్రీన్ షెనానిగాన్స్" అంటూ వినయ్ రాయ్ ఒక హోటల్ లో సందడి చేసిన వీడియోని డైరెక్టర్ ప్రశాంత్ వర్మ 'ఎక్స్‌'లో పోస్ట్‌ చేశారు. ఇందులో వినయ్ అచ్చం సినిమాలో మాదిరిగా ఫేస్ కి మాస్క్‌ కలిగిన బ్లాక్‌ డ్రెస్‌ ధరించి, హోటల్ సిబ్బందిని షాక్ అయ్యేలా చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

Also Read: హీరో రామ్ పోతినేనితో శర్వానంద్ కు ఉన్న బంధుత్వం ఏంటో తెలుసా?

హను-మాన్ కథేంటంటే.. సౌరాష్ట్రలో ఉండే మైఖేల్‌ (వినయ్‌ రాయ్‌)కు చిన్నప్పటినుంచి సూపర్ హీరో అవ్వాలని బలమైన కోరిక ఉంటుంది. అందుకు అడ్డు వచ్చిన తల్లిదండ్రుల్ని చిన్నతనంలోనే చంపేస్తాడు. సూపర్ హీరో అయ్యేందుకు రకరకాల ప్రయోగాలు చేస్తుంటాడు. అయితే అతని ప్రయత్నాలన్నీ విఫలమవడంతో, అసలు సిసలు సూపర్‌ పవర్స్‌ కనిపెట్టేందుకు వేట మొదలుపెడతాడు. మైఖేల్ అంజనాద్రి లోకానికి ఎలా వచ్చాడు? అతీత శక్తులు కలిగిన హనుమంతును ఎలా ఢీకొట్టాడు? అనేది సినిమాలో ఆసక్తికరంగా తెరకెక్కించారు. ఈ సినిమా మహా శివరాత్రి స్పెషల్ గా ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతున్నట్లు తెలుస్తోంది.

తెలుగు చలనచిత్ర పరిశ్రమ చరిత్రలో ఎపిక్ బ్లాక్‌ బస్టర్‌లలో ఒకటిగా నిలిచిన హను-మాన్.. బాక్సాఫీసు దగ్గర 300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. దీంతో డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ప్రస్తుతం 'జై హనుమాన్' చిత్రాన్ని తెరకెక్కించే పనిలో బిజీగా వున్నారు. ఇటీవల హనుమాన్‌ 50 డేస్‌ ఈవెంట్ లో సీక్వెల్‌ గురించి అప్‌డేట్‌ ఇచ్చారు. ఇందులో హనుమంతుడే హీరో అని, త్వరలోనే ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ విడుదల చేస్తామని అన్నారు. ‘హనుమాన్‌’ క్లైమాక్స్‌ లా రెండున్నర గంటల పాటు థ్రిల్‌ కు గురిచేసేలా ఈ సినిమా వుంటుందని, కచ్చితంగా మీరు గర్వపడేలా సినిమా తీస్తానని ప్రశాంత్ చెప్పుకొచ్చారు.

Also Read: ఇటలీ బీచ్‌లో డార్లింగ్ ఆట పాట.. క్రేజీ అప్డేట్‌తో వచ్చిన 'కల్కి' టీమ్!

టాప్ హెడ్ లైన్స్

NTR God Of War : ఎన్టీఆర్ త్రివిక్రమ్ గాడ్ ఆఫ్ వార్ - షూటింగ్ అప్డేట్ చెప్పేసిన నాగవంశీ... రూమర్స్‌కు చెక్
ఎన్టీఆర్ త్రివిక్రమ్ గాడ్ ఆఫ్ వార్ - షూటింగ్ అప్డేట్ చెప్పేసిన నాగవంశీ... రూమర్స్‌కు చెక్
Romantic Drama OTT : ఓటీటీలోకి బ్లాక్ బస్టర్ మూవీ సడన్ స్ట్రీమింగ్ - 3 కోట్లు పెడితే 150 కోట్లు వచ్చాయ్... తెలుగులోనూ చూడొచ్చు
ఓటీటీలోకి బ్లాక్ బస్టర్ మూవీ సడన్ స్ట్రీమింగ్ - 3 కోట్లు పెడితే 150 కోట్లు వచ్చాయ్... తెలుగులోనూ చూడొచ్చు
Teja Sajja Engagement : ఘనంగా హీరో తేజ సజ్జా నిశ్చితార్థం - ఆయనకు కాబోయే భార్య ఎవరో తెలుసా?
ఘనంగా హీరో తేజ సజ్జా నిశ్చితార్థం - ఆయనకు కాబోయే భార్య ఎవరో తెలుసా?
This Week OTT Releases : ఈ వారం ఓటీటీ మూవీస్ - క్రేజీ కల్యాణం To హైకూ... శుక్రవారం ఒక్క రోజే 10 సినిమాలు స్ట్రీమింగ్
ఈ వారం ఓటీటీ మూవీస్ - క్రేజీ కల్యాణం To హైకూ... శుక్రవారం ఒక్క రోజే 10 సినిమాలు స్ట్రీమింగ్

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rahul Gandhi Fake Name: మారు పేరుతో రాహుల్ గాంధీని చదివించా.. రాజీవ్ గాంధీ హత్య రోజులను గుర్తుచేసుకున్న సోనియా గాంధీ
మారు పేరుతో రాహుల్ గాంధీని చదివించా.. రాజీవ్ గాంధీ హత్య రోజులను గుర్తుచేసుకున్న సోనియా గాంధీ
Cyclone Akvan: తుపానుగా బలపడిన తీవ్ర వాయుగుండం, పలు జిల్లాలకు మరో ముప్పు.. మత్స్యకారులకు వార్నింగ్
తుపానుగా బలపడిన తీవ్ర వాయుగుండం, పలు జిల్లాలకు మరో ముప్పు.. మత్స్యకారులకు వార్నింగ్
Lakshya Raichandani Reply: ఆసియా కప్ ఫైనల్ సంబరాలపై విమర్శలకు భారత కెప్టెన్ దిమ్మతిరిగే సమాధానం, కుర్రాళ్లకు అండగా నిలిచిన బీసీసీఐ
ఆసియా కప్ ఫైనల్ సంబరాలపై విమర్శలకు భారత కెప్టెన్ దిమ్మతిరిగే సమాధానం, కుర్రాళ్లకు అండగా నిలిచిన బీసీసీఐ
Bigg Boss Season 10 Today November 16th: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: అపూర్వ పాయింట్స్ హైలెట్! వంశీని పొడిచేసిన త్రిగుణ్‌! 'మబ్బు' లేనిదే 'వర్షం' లేదు?
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: అపూర్వ పాయింట్స్ హైలెట్! వంశీని పొడిచేసిన త్రిగుణ్‌! 'మబ్బు' లేనిదే 'వర్షం' లేదు?
సింగిల్‌ ఛార్జ్‌తో Kia Syros EV నిజంగా ఎంత దూరం వెళ్తుంది? సిటీలో అదరగొట్టినా హైవేపై తగ్గిన రేంజ్!
Kia Syros EV రియల్‌ రేంజ్ టెస్ట్.. కంపెనీ చెప్పినట్లు నిజంగానే 526 కి.మీ. ప్రయాణించిందా?
AP Special TET Results: ఏపీ స్పెషల్ టెట్‌ ఫలితాలు విడుదల.. 96.06 శాతం ఉత్తీర్ణత- రిజల్ట్స్ ఇలా చెక్ చేసుకోండి
ఏపీ స్పెషల్ టెట్‌ ఫలితాలు విడుదల.. 96.06 శాతం ఉత్తీర్ణత- రిజల్ట్స్ ఇలా చెక్ చేసుకోండి
BJP on Rahul Gandhi: భారత్ సమ్మిట్ వేదికగా దేశ ప్రతిష్ఠను దెబ్బతీశారు - రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలని బీజేపీ డిమాండ్
భారత్ సమ్మిట్ వేదికగా దేశ ప్రతిష్ఠను దెబ్బతీశారు - రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలని బీజేపీ డిమాండ్
Crime News: పోలీసు జీపు నుంచి లాగి మరీ చితక్కొట్టిన గ్రామస్తులు.. అంత దారుణం చేశాడు మరి!
పోలీసు జీపు నుంచి లాగి మరీ చితక్కొట్టిన గ్రామస్తులు.. అంత దారుణం చేశాడు మరి!
Embed widget