అన్వేషించండి

Hanuman OTT Rights: 'హనుమాన్‌' ఓటీటీ పార్ట్‌నర్‌ ఫిక్స్-స్ట్రీమింగ్‌ అప్పుడేనా?

Hanuman OTT Partner: భారీ అంచనాల మధ్య నేడు థియేటర్లోకి వచ్చిన 'హనుమాన్‌' మూవీ థియేటర్లో పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతుంది. ప్రీమియర్‌ షోల నుంచే పాజిటివ్‌ బజ్‌ క్రియేట్‌ అయ్యింది.

Hanuman OTT Partner: భారీ అంచనాల మధ్య నేడు థియేటర్లోకి వచ్చిన హనుమాన్‌ మూవీ థియేటర్లో పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతుంది. టాలెంటెడ్‌ డైరెక్టర్‌ ప్రశాంత్‌ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా శుక్రవారం (జనవరి 12న) థియేటర్లోకి వచ్చింది. సూపర్‌ మ్యాన్‌ జానర్లో వచ్చిన ఈ మూవీకి ప్రీమియర్‌ షోల నుంచే పాజిటివ్‌ బజ్‌ క్రియేట్‌ అయ్యింది. తెలుగులో సూపర్‌ మ్యాన్‌ జానర్లో సినిమా వచ్చి హిట్‌ కొట్టడం  చాలా అరుదు. కానీ హనుమాన్‌తో ఆ లోటు తీర్చాడు ప్రశాంత్‌ వర్మ. 

అంతేకాదు సూపర్‌స్టార్‌ మహేష్‌ బాబు-త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ వంటి స్టార్‌ కాంబినేషన్‌కు పొటిగా 'హనుమాన్‌' రిలీజ్‌ చేసి భారీ హిట్‌ కొట్టాడు. ఫైనల్‌ ఆడియన్స్‌, సినీ విశ్లేషకుల నుంచి ప్రశంసలు అందుకుంటున్నాడు. ఇదిలా ఉంటే ఇప్పుడు హనుమాన్‌కు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్‌ అప్‌డేట్‌ సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుంది. థియేటర్లో సందడి చేస్తున్న ఈ సినిమా ఓటీటీ రైట్స్‌ చర్చనీయాంశంగా మారాయి. భారీ హిట్‌ కొట్టిన ఈసినిమా డిజిటల్‌ రైట్స్‌ ఎలా ఉన్నాయి, ఎప్పుడు ఓటీటీకి వస్తుందా అని చర్చించుకుంటున్నారు. 

భారీ ధర పలికిన హనుమాన్ ఓటీటీ రైట్స్‌!

క్రమంలో హనుమాన్‌ ఓటీటీ రైట్స్‌ సంబంధించిన ఓ అప్‌డేట్‌ నెట్టింట చక్కర్లు కొడుతుంది. హనుమాన్‌ ఓటీటీ రైట్స్‌ను జీ5(Zee5) సోంతం చేసుకుందని సమాచారం. 11 భాషల్లో పాన్‌ ఇండియా స్థాయిలో తెరకెక్కడంతో ఈ సినిమా డిజిటల్‌ రైట్స్‌ భారీ ధరకు అమ్ముడైనట్టు టాక్‌. దీనిక కోసం జీ5 సంస్థ నిర్మాతలకు భారీగానే చెల్లిందట. సాధారణం సినిమా రిజల్ట్‌ను బట్టి మూవీ ఓటీటీ రిలీజ్ డేట్‌ ఖరారు అవుతుంది. అయితే హనుమాన్ హిట్‌ టాక్‌ వచ్చింది కాబట్టి ఈ సినిమా డిజిటల్‌ స్ట్రీమింగ్‌ కోసం నిరీక్షించక తప్పదనిపిస్తోంది. సోషల్‌ మీడియా బజ్‌ ప్రకారం చూస్తే హనుమాన్‌ మార్చిలో ఓటీటీకి వచ్చే అవకాశం ఎక్కువగా ఉందట. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

ఇదిలా ఉంటే హనుమాన్‌కు సీక్వెల్‌ ఉండనుందని ఇప్పటికే మూవీ టీం క్లారిటీ ఇచ్చింది. మూవీ ప్రారంభంలో 'ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్' అని టైటిల్ కార్డు వేశారు. సినిమా విడుదలకు ముందు ఆ విషయం చెప్పారు. ఈ యూనివర్స్ / ఫ్రాంచైజీలో చాలా మంది సూపర్ హీరోలు ఉంటారని, వరుస సినిమాలు తీస్తానని చెప్పారు. 'హనుమాన్' ఎండింగ్‌లో సీక్వెల్ అనౌన్స్ చేశారు. అంతేకాదు సీక్వెల్‌ టైటిల్‌ను కూడా అప్పుడే రివీల్‌ చేశారు. ఈ మూవీ సీక్వెల్‌కు 'జై హనుమాన్' టైటిల్ ఖరారు చేశారు. వచ్చే ఏడాది 2025లో సినిమాను విడుదల చేస్తామని కూడా స్పష్టం చేశారు.

ఈ సినిమాలో ఓ సామాన్య యువకుడు సూపర్ హీరో ఎలా అయ్యాడు? అనేది కథ. 'జై హనుమాన్' సినిమాలో హనుమంతుడు వచ్చి ఏం చేశారనేదే కథ అని తెలుస్తోంది. ఈ సినిమాలో తేజ సజ్జ సరసన అమృతా అయ్యర్ హీరోయిన్‌గా నటించింది. వీళ్లిద్దరూ జంటగా నటించిన తొలి చిత్రమిది. ఇందులో తేజ సజ్జ సోదరిగా వరలక్ష్మీ శరత్ కుమార్ నటించగా.. వినయ్ రాయ్ విలన్ రోల్లో అలరించాడు. ఇతర కీలక పాత్రల్లో రాజ్ దీపక్ శెట్టి, గెటప్ శ్రీను, సత్య, జబర్దస్త్ రోహిణి, రాకేష్ మాస్టర్ కనిపించారు. దర్శక నటుడు సముద్రఖని విభీషణుడి పాత్ర పోషించారు. 

టాప్ హెడ్ లైన్స్

Jailer 2 OTT Release Date : జైలర్ 2 ఓటీటీ రిలీజ్ డేట్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
జైలర్ 2 ఓటీటీ రిలీజ్ డేట్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Thursday OTT Movies : గురువారం ఓటీటీ మూవీస్ - రొమాంటిక్ డ్రామా తెల్ల కాగితం To కామెడీ డ్రామా 'బత్తా'... నెల రోజుల్లోపే స్ట్రీమింగ్
గురువారం ఓటీటీ మూవీస్ - రొమాంటిక్ డ్రామా తెల్ల కాగితం To కామెడీ డ్రామా 'బత్తా'... నెల రోజుల్లోపే స్ట్రీమింగ్
Janhvi Kapoor : 'పెద్ది' వివాదం... అచ్చియమ్మ రోల్‌పై జాన్వీ కపూర్ షాకింగ్ కామెంట్స్
'పెద్ది' వివాదం... అచ్చియమ్మ రోల్‌పై జాన్వీ కపూర్ షాకింగ్ కామెంట్స్
Emotional Drama OTT: కడుపు మాడ్చుకున్న కూతురు... దొంగతనం చేసిందా? ETV Win ఓటీటీలోకి ఎమోషనల్ డ్రామా - స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
కడుపు మాడ్చుకున్న కూతురు... దొంగతనం చేసిందా? ETV Win ఓటీటీలోకి ఎమోషనల్ డ్రామా - స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

వీడియోలు

India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?
Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP vs TS Essential Commodities Subsidies: నిత్యావసర వస్తువుల ధరల మంట - ప్రజా వ్యతిరేకత ముప్పు - ప్రభుత్వాల మాస్టర్ ప్లాన్లు ఇవే !
నిత్యావసర వస్తువుల ధరల మంట - ప్రజా వ్యతిరేకత ముప్పు - ప్రభుత్వాల మాస్టర్ ప్లాన్లు ఇవే !
జియో జాక్‌పాట్..మార్కెట్‌లోకి వచ్చిన మొదటిరోజే దేశంలో రెండో అతిపెద్ద కంపెనీగా అవతరణ.. షేర్ ఎంత పెరిగిందంటే..
జియో జాక్‌పాట్..మార్కెట్‌లోకి వచ్చిన మొదటిరోజే దేశంలో రెండో అతిపెద్ద కంపెనీగా అవతరణ.. షేర్ ఎంత పెరిగిందంటే..
Balmoor Induja Complaint On KTR: కేటీఆర్‌పై సీపీకి బల్మూరి ఇందుజా ఫిర్యాదు - మార్ఫింగ్, కుల వివక్ష ఆరోపణలతో పొలిటికల్ రగడ!
కేటీఆర్‌పై సీపీకి బల్మూరి ఇందుజా ఫిర్యాదు - మార్ఫింగ్, కుల వివక్ష ఆరోపణలతో పొలిటికల్ రగడ!
Karnataka MLC Election Results 2026: కర్ణాటక ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం - అసెంబ్లీ ఎన్నికల్లో గడ్డు పరిస్థితి తప్పదా?
కర్ణాటక ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం - అసెంబ్లీ ఎన్నికల్లో గడ్డు పరిస్థితి తప్పదా?
DA Hike For Govt Employees: దీపావళికి ముందు ప్రభుత్వ ఉద్యోగులకు 3 శాతం DA పెంపును ప్రకటించిన కేంద్రం
దీపావళికి ముందు ప్రభుత్వ ఉద్యోగులకు 3 శాతం DA పెంపును ప్రకటించిన కేంద్రం
Paneer Ban: ఏపీలో కృత్రిమ పన్నీర్‌పై ప్రభుత్వం ఏడాది పాటు నిషేధం
ఏపీలో కృత్రిమ పన్నీర్‌పై ప్రభుత్వం ఏడాది పాటు నిషేధం
Telangana Congress: ఐదారు రోజులు చూసి పర్మిషన్ నిరాకరించడం కుట్రే! ఢిల్లీకి బస్సుల్లో తరలివస్తాం: మహేష్ గౌడ్
ఐదారు రోజులు చూసి పర్మిషన్ నిరాకరించడం కుట్రే! ఢిల్లీకి బస్సుల్లో తరలివస్తాం: మహేష్ గౌడ్
Cyclone Arnab Damage: అర్నబ్ తుపాను బీభత్సం.. ఏపీలో ముగ్గురు మృతి.. గోదావరి జిల్లాల్లో తీవ్ర నష్టం!
అర్నబ్ తుపాను బీభత్సం.. ఏపీలో ముగ్గురు మృతి.. గోదావరి జిల్లాల్లో తీవ్ర నష్టం!
Embed widget