అన్వేషించండి

Hanuman Ansh Collections : హనుమాన్ అంశ్ వరల్డ్ వైడ్ 400 కోట్లు - తెలుగు వెర్షన్ ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే?

Hanuman Ansh Day 1 Collections : హనుమాన్ అంశ్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ పరంగా దూసుకెళ్తున్నా తెలుగులో మాత్రం ఊహించినంత రెస్పాన్స్ రాలేదు. తొలి రోజు 22 శాతం మాత్రమే ఆక్యుపెన్సీ నమోదైంది.

Vishal Chaturvedi's Hanuman Ansh Telugu Version Day 1 Collections : కేవలం రూ.2 కోట్ల బడ్జెట్‌తో చిన్న సినిమాగా రిలీజై బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించిన మూవీ హనుమాన్ అంశ్. హిందీలో ఇప్పటివరకూ రూ.328.58 కోట్ల నెట్ కలెక్షన్స్ సాధించింది. ఈ క్రేజ్ దృష్ట్యా ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ ఈ మూవీ తెలుగు వెర్షన్ శుక్రవారం రిలీజ్ చేసింది. అయితే, అనుకున్నంతగా టాలీవుడ్ ఆడియన్స్‌కు మూవీ రీచ్ కాలేదు.

ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే?

ఈ మూవీ ఫస్ట్ డే దాదాపు రూ.60 లక్షల నెట్ కలెక్షన్స్ సాధించినట్లు సినీ వర్గాలు వెల్లడించాయి. తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 703 షోలు వేయగా కేవలం 22 శాతం మాత్రమే ఆక్యుపెన్సీ నమోదైంది. హిందీలో విడుదలై ఇప్పటికే రెండు నెలలు కావడం, చాలా మందికి కంటెంట్ ముందే తెలియడంతో తెలుగులో ఆశించినంత రెస్పాన్స్ రాలేదనే చర్చ సాగుతోంది. అయితే, వరల్డ్ వైడ్ ఈ మూవీ ఇప్పటివరకూ రూ.428 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించింది. వీకెండ్ కావడంతో తెలుగు రాష్ట్రాల్లో కొంచెం పెరగొచ్చని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Also Read : Poonam Kaur Trivikram Srinivas : నా ఫ్యామిలీ బలహీనతను ఆసరాగా చేసుకున్నారు - MAA ఎందుకు ప్రశ్నించడం లేదు?... త్రివిక్రమ్‌పై పూనమ్ మరోసారి ఫైర్

1900 - 73 మధ్య కాలంలో ఆధ్యాత్మిక గురువు, హనుమాన్ భక్తుడు నీమ్ కరోలి బాబా జీవిత కథ, ఆయన చేసిన బోధనల ఆధారంగా విశాల్ చతుర్వేది 'హనుమాన్ అంశ్' రూపొందించారు. 'డివైన్ డిటూర్' అనే బుక్ ఆధారంగా ఈ మూవీని తెరకెక్కించారు. శోభిత్ శ్రీవాత్సవ ప్రధాన పాత్ర పోషించగా చందన్ ఆనంద్, పూర్ణిమ తివారి తదితరులు కీలకపాత్రల్లో పోషించారు. రాగిణి సోనా, నమ్రతా జి. సింగ్, అనుప్రియా నగర్, డా. విశాల్ చతుర్వేది నిర్మించారు. చిన్న సినిమాగా రిలీజై వరల్డ్ వైడ్ సంచలన విజయం సాధించింది.

నీమ్ కరోలి బాబా ఎవరు?

నీమ్ కరోలి బాబాను (Neem Karoli Baba) లక్ష్మణ్ నారాయణ్ శర్మ అని పిలుస్తారు. యూపీలోని అక్బర్‌పూర్ ప్రాంతంలో జన్మించిన ఈయనలో చిన్న వయసులోనే... ఆధ్యాత్మిక చింతన మొదలవుతుంది. 'మనిషి ఎందుకు పుడతాడు?', 'మరణం అంటే ఏమిటి?', 'మనిషి ఎందుకు బాధపడతాడు?', 'అసలు ఈ జీవితానికి అర్థం పరమార్థం ఏంటి?' 'జీవితంలో బంధాలు ఏంటి?' అనే ప్రశ్నలు మొదలవుతాయి. వీటికి సమాధానాలు వెతుక్కుంటూ తన ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ప్రారంభిస్తారు.

అసలు ఆయనకు 'నీమ్ కరోలి బాబా' అనే పేరు ఎందుకు వచ్చింది? బాబా జీవితంతో అత్యంత అనుబంధం ఉన్న ప్రదేశం కైన్చీ ధామ్ (Kainchi Dham), ఉత్తరాఖండ్. 1964లో అక్కడ ఆశ్రమం, హనుమాన్ ఆలయం ఏర్పడింది. తర్వాత కైన్చీ ధామ్ ఆయన భక్తులకు ప్రముఖ కేంద్రంగా మారింది. యాపిల్ సంస్థల అధినేత స్టీవ్ జాబ్స్, ప్రముఖ క్రికెటర్ విరాట్ కోహ్లి, అనుష్క శర్మ లాంటి వ్యక్తులు ఆయన్ను కలవడం ప్రపంచవ్యాప్తంగా బాబా పేరు మరింత ప్రసిద్ధి చెందింది.

Also Read : Romantic Action Thriller OTT : చిన్నారుల కిడ్నాప్... మాఫియాను ఎలా పట్టుకున్నారు? - ఓటీటీ టాప్ ట్రెండింగ్‌లో రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్

NOTE : మరిన్ని సినిమా వార్తలు, గాసిప్స్, ఓటీటీ అప్డేట్స్, వెబ్ సిరీస్‌లు, టాలీవుడ్, బాలీవుడ్ హీరోయిన్స్ లేటెస్ట్ సోషల్ మీడియా అప్డేట్స్, టీవీ సీరియల్స్ లేటెస్ట్ ఎపిసోడ్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Aadarsha Kutumbam OTT : ఆదర్శ కుటుంబం ఓటీటీ రిలీజ్ డేట్ - వెంకీ త్రివిక్రమ్ మూవీ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఆదర్శ కుటుంబం ఓటీటీ రిలీజ్ డేట్ - వెంకీ త్రివిక్రమ్ మూవీ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Aakasamlo Oka Tara Vs Dear Astronatu : ఆకాశంలో ఒక తార Vs డియర్ ఆస్ట్రోనాట్ - ఒకే రోజు రెండు సినిమాలు... స్టోరీ వివాదం ఏంటి?
ఆకాశంలో ఒక తార Vs డియర్ ఆస్ట్రోనాట్ - ఒకే రోజు రెండు సినిమాలు... స్టోరీ వివాదం ఏంటి?
Suriya Upcoming Movie : DC డైరెక్టర్‌తో సూర్య నెక్స్ట్ మూవీ? - ఫ్యాన్స్ మరో ట్రీట్ కన్ఫర్మేనా!
DC డైరెక్టర్‌తో సూర్య నెక్స్ట్ మూవీ? - ఫ్యాన్స్ మరో ట్రీట్ కన్ఫర్మేనా!
NTR God Of War : ఎన్టీఆర్ త్రివిక్రమ్ గాడ్ ఆఫ్ వార్ - షూటింగ్ అప్డేట్ చెప్పేసిన నాగవంశీ... రూమర్స్‌కు చెక్
ఎన్టీఆర్ త్రివిక్రమ్ గాడ్ ఆఫ్ వార్ - షూటింగ్ అప్డేట్ చెప్పేసిన నాగవంశీ... రూమర్స్‌కు చెక్
Advertisement

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Harish Rao: కాంగ్రెస్ మేనిఫెస్టోకు మూడేళ్లు.. అభయహస్తం మొండి హస్తంగా మారింది- హరీష్ రావు విమర్శలు
కాంగ్రెస్ మేనిఫెస్టోకు మూడేళ్లు.. అభయహస్తం మొండి హస్తంగా మారింది- హరీష్ రావు విమర్శలు
US Federal Court Visa Ruling: ట్రంప్‌నకు బిగ్ షాక్.. విదేశీ విద్యార్థులు, జర్నలిస్టులకు భారీ ఊరట.. వీసా ఆంక్షలు ఆర్డర్ కొట్టివేసిన ఫెడరల్ కోర్టు!
ట్రంప్‌నకు బిగ్ షాక్.. విదేశీ విద్యార్థులు, జర్నలిస్టులకు భారీ ఊరట.. వీసా ఆంక్షలు ఆర్డర్ కొట్టివేసిన ఫెడరల్ కోర్టు!
Shubman Gill Strategy:  కివీస్ తో తొలి టెస్టుకు కెప్టెన్ గిల్ మాస్టర్ ప్లాన్.. ఆ ఫార్ములాతో బరిలోకి టీమిండియా,  పంత్ ఫామ్‌పై కీలక ప్రకటన
కివీస్ తో తొలి టెస్టుకు కెప్టెన్ గిల్ మాస్టర్ ప్లాన్.. ఆ ఫార్ములాతో బరిలోకి టీమిండియా,  పంత్ ఫామ్‌పై కీలక ప్రకటన
Amaravati Financial Plan: అమరావతి నిర్మాణానికి 20 ఏళ్ల ఆర్థిక ప్రణాళిక.. రూ. 27,954 కోట్ల ఆర్థిక లోటు.. నిధుల కోసం ఉన్నత స్థాయి కమిటీ!
అమరావతి నిర్మాణానికి 20 ఏళ్ల ఆర్థిక ప్రణాళిక.. రూ. 27,954 కోట్ల ఆర్థిక లోటు.. నిధుల కోసం ఉన్నత స్థాయి కమిటీ!
Khairatabad By-Election Suspense: ఖైరతాబాద్ ఉపఎన్నిక ఉంటుందా, ఉండదా? విజయారెడ్డి పిటిషన్‌కు చింతల రామచంద్రారెడ్డి చెక్ పెడతారా?
ఖైరతాబాద్ ఉపఎన్నిక ఉంటుందా, ఉండదా? విజయారెడ్డి పిటిషన్‌కు చింతల రామచంద్రారెడ్డి చెక్ పెడతారా?
Rahul Gandhi Fake Name: మారు పేరుతో రాహుల్ గాంధీని చదివించా.. రాజీవ్ గాంధీ హత్య రోజులను గుర్తుచేసుకున్న సోనియా గాంధీ
మారు పేరుతో రాహుల్ గాంధీని చదివించా.. రాజీవ్ గాంధీ హత్య రోజులను గుర్తుచేసుకున్న సోనియా గాంధీ
Cyclone Akvan: తుపానుగా బలపడిన తీవ్ర వాయుగుండం, పలు జిల్లాలకు మరో ముప్పు.. మత్స్యకారులకు వార్నింగ్
తుపానుగా బలపడిన తీవ్ర వాయుగుండం, పలు జిల్లాలకు మరో ముప్పు.. మత్స్యకారులకు వార్నింగ్
Lakshya Raichandani Reply: ఆసియా కప్ ఫైనల్ సంబరాలపై విమర్శలకు భారత కెప్టెన్ దిమ్మతిరిగే సమాధానం, కుర్రాళ్లకు అండగా నిలిచిన బీసీసీఐ
ఆసియా కప్ ఫైనల్ సంబరాలపై విమర్శలకు భారత కెప్టెన్ దిమ్మతిరిగే సమాధానం, కుర్రాళ్లకు అండగా నిలిచిన బీసీసీఐ
Embed widget