అన్వేషించండి

Jawan: షారుక్ ఖాన్ కోసం ‘కెప్టెన్ అమెరికా’ స్టంట్ మాస్టర్ - హాలీవుడ్ రేంజ్‌లో ‘జవాన్’ స్టంట్స్

బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ అట్లీ కుమార్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న 'జవాన్' సినిమాలో ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ ని హాలీవుడ్ స్టంట్ కొరియోగ్రాఫర్ డిజైన్ చేసినట్లు తెలుస్తోంది.

బాలీవుడ్ స్టార్ షారుక్ ఖాన్ హీరోగా కోలీవుడ్ యంగ్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం 'జవాన్'. ఇండియాస్ మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్స్ లో ఇది కూడా ఒకటి. 'పఠాన్' వంటి భారీ సక్సెస్ తర్వాత షారుక్ ఖాన్ నటించిన సినిమా కావడంతో అటు అభిమానుల్లోనూ, ప్రేక్షకుల్లోనూ ఈ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి. రీసెంట్ గా 'జవాన్' రివ్యూ పేరుతో రిలీజ్ అయిన టీజర్ ఆ అంచనాలను తారస్థాయికి చేర్చింది. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఇక మూవీ టీం సినిమాపై ఎప్పటికప్పుడు వరుస అప్డేట్స్ ఇస్తూ మరింత హైప్ క్రియేట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్ బయటకు వచ్చింది.

'జవాన్' సినిమాలో యాక్షన్ సీన్స్ ఏ రేంజ్ లో ఉండబోతున్నాయో ఇప్పటికే శాంపిల్ గా టీజర్ లో చూపించారు. అయితే తాజాగా ఈ సినిమాలో ఓ భారీ యాక్షన్స్ సీక్వెన్స్ ని హాలీవుడ్ బిగ్గెస్ట్ యాక్షన్ డైరెక్టర్ స్పిరో రజటోస్ డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. 'ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్', 'కెప్టెన్ అమెరికా', 'వెనమ్' లాంటి హాలీవుడ్ సినిమాలకు యాక్షన్ కొరియోగ్రాఫర్ గా పనిచేసిన స్పిరో రజటోస్ ఆధ్వర్యంలో షారుఖ్ ఖాన్ ఓ భారీ రిస్కీ ఫైట్ సీక్వెన్స్ ని చేశారట. ఈ రిస్కీ ఫైట్ సీక్వెన్స్ సినిమాలో ఓ విజువల్ ట్రీట్ లో ఉంటుందని తాజాగా చిత్ర యూనిట్ పేర్కొంది. ఇక ఈ అప్డేట్ తో షారుఖ్ ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. 'జవాన్' కోసం ఏకంగా హాలీవుడ్ స్టంట్ మాస్టర్ ఫైట్స్ డిజైన్ చేశారనే విషయంతో సినిమాలో యాక్షన్ సీన్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయని స్పష్టం అవుతుంది.

మరోవైపు సినిమాలో తలపతి విజయ్ సేతుపతి కూడా గెస్ట్ రోల్ చేశారని, షారుక్, విజయ్.. ఇద్దరు కలిసి చేసే ఓ ఫైట్ సీక్వెన్స్ కూడా నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందని చెబుతున్నారు. మొత్తం మీద 'జవాన్' సినిమాలో దర్శకుడు అట్లీ కుమార్ ఎక్కువగా యాక్షన్ సీన్స్ పైనే దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. కాగా సుమారు రూ.200 కోట్లకు పైగా భారీ బడ్జెట్ తో షారుక్ ఖాన్ భార్య గౌరీ ఖాన్ రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ఈ సినిమాని నిర్మిస్తున్నారు. సినిమాలో షారుక్ ఖాన్ సరసన నయనతార హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాతోనే నయన్ బాలీవుడ్ కి ఎంట్రీ ఇస్తోంది.

అలాగే తమిళ విలక్షణ నటుడు విజయ్ సేతుపతి ఓ కీలక పాత్ర పోషిస్తుండగా.. బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకోన్ అతిధి పాత్రలో కనిపించనుంది. వీరితో పాటు ప్రియమణి, సానియా మల్హోత్ర, సంజిత బట్టచార్య, సునీల్ గ్రోవర్ తదితరులు ఇతర పాత్రలు పోషించారు. అనిరుద్ రవిచంద్రన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. త్వరలోనే ప్రమోషన్ కార్యక్రమాలను మొదలుపెట్టనున్న ఈ సినిమా సెప్టెంబర్ 7న ప్రపంచవ్యాప్తంగా హిందీ, తమిళ తెలుగు భాషల్లో విడుదల కానుంది. మరి 'పఠాన్' లాంటి భారీ విజయం తర్వాత త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ 'జవాన్' షారుక్ ఖాన్ కి ఎలాంటి సక్సెస్‌ను అందిస్తుందో చూడాలి.

Also Read : ప్రభాస్ ఫ్యాన్స్‌కు షాకిచ్చిన ‘కల్కి 2898 ఏడీ’ మేకర్స్ - మూవీ రిలీజ్ డేట్ మారిపోయిందా?

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

టాప్ హెడ్ లైన్స్

Nandamuri Alekhya: మోడలింగ్‌లోకి నందమూరి అలేఖ్య... కెరీర్ రీస్టార్ట్ చేసిన తారకరత్న భార్య
మోడలింగ్‌లోకి నందమూరి అలేఖ్య... కెరీర్ రీస్టార్ట్ చేసిన తారకరత్న భార్య
GDN Release : మిరాకిల్ మ్యాన్ మాధవన్ - ఎడిసన్ ఆఫ్ ఇండియా GDN రియల్ స్టోరీ... ఇండియన్ సినిమాల్లో టాప్ ప్లేస్‌
మిరాకిల్ మ్యాన్ మాధవన్ - ఎడిసన్ ఆఫ్ ఇండియా GDN రియల్ స్టోరీ... ఇండియన్ సినిమాల్లో టాప్ ప్లేస్‌
Bhari Movie: 'బరి'లో తండ్రీ కొడుకులు... తొలిసారి నాగబాబు, వరుణ్ తేజ్ కలిసి
'బరి'లో తండ్రీ కొడుకులు... తొలిసారి నాగబాబు, వరుణ్ తేజ్ కలిసి
Makutam Trailer: శుక్రవారమే మకుటం ట్రైలర్ రిలీజ్... విశాల్ ఏం చేస్తాడో?
శుక్రవారమే మకుటం ట్రైలర్ రిలీజ్... విశాల్ ఏం చేస్తాడో?

వీడియోలు

Prediction For World Cup 2027 India Squad | వరల్డ్ కప్ 2027 టీమ్ ప్రిడిక్షన్స్ చెప్పిన గవాస్కర్
Rahane Comments On Indian Test Team | టీమిండియా టెస్ట్ టీమ్ పై రహానే కామెంట్స్
Mike Hussey & Eric Simons Leaving CSK | CSKకు గుడ్‌బై చెప్పనున్న మరో కోచ్
BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
తెలంగాణ విద్యుత్ భద్రతకు సింగరేణి చారిత్రక ముందడుగు - ఒడిశా నైనీ నుంచి తొలి బొగ్గు రైల్వే రేక్ రాక!
తెలంగాణ విద్యుత్ భద్రతకు సింగరేణి చారిత్రక ముందడుగు - ఒడిశా నైనీ నుంచి తొలి బొగ్గు రైల్వే రేక్ రాక!
సీనియర్లు లేకపోతే కష్టమే టెస్ట్ టీమ్ పై రహానే సంచలనం
సీనియర్లు లేకపోతే కష్టమే టెస్ట్ టీమ్ పై రహానే సంచలనం
రూ.2.87 లక్షల నుంచి రూ.4.05 లక్షల వరకు KTM 390 అడ్వెంచర్.. ఒక్కో వేరియంట్‌ది ఒక్కో ప్రత్యేకత
KTM 390 అడ్వెంచర్‌లో ఏ వేరియంట్ బెస్ట్? నాలుగు మోడళ్ల మధ్య పూర్తి తేడాలు ఇవే
YCP Vs TDP: విజయవాడలో టీడీపీ - వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ
విజయవాడలో టీడీపీ - వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ
Pregnancy Test : పీరియడ్స్ ఆగిన ఎన్ని రోజులకు ఇంట్లో ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవాలి? డాక్టర్‌ను ఎప్పుడు సంప్రదించాలి?
పీరియడ్స్ ఆగిన ఎన్ని రోజులకు ఇంట్లో ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవాలి? డాక్టర్‌ను ఎప్పుడు సంప్రదించాలి?
భువీకి ఛాన్స్.. పంత్కి నో వన్డే వరల్డ్ కప్ 2027 టీమ్ ఇదేనా ?
భువీకి ఛాన్స్.. పంత్కి నో వన్డే వరల్డ్ కప్ 2027 టీమ్ ఇదేనా ?
ప్లెమింగ్ మాస్టర్ ప్లాన్ తో సీఎస్ కే కి డబుల్ షాక్
ప్లెమింగ్ మాస్టర్ ప్లాన్ తో సీఎస్ కే కి డబుల్ షాక్
Vishnu Priya Bhimeneni: శారీలో విష్ణుప్రియ... ట్రెడిషనల్ ఫోటోషూట్ చేసిన వైరల్ బోల్డ్ లేడీ
శారీలో విష్ణుప్రియ... ట్రెడిషనల్ ఫోటోషూట్ చేసిన వైరల్ బోల్డ్ లేడీ
Embed widget