అన్వేషించండి

సైలెంట్​గా ఓటీటీలోకి వచ్చేసిన ఛత్రపతి హిందీ రిమేక్ - స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Chatrapathi : బెల్లంకొండ సాయి శ్రీనివాస్ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తూ నటించిన ఛత్రపతి హిందీ రీమేక్ తాజాగా ఓటీటీ స్ట్రీమింగ్​కి అందుబాటులోకి వచ్చింది.

Chatrapathi OTT Release : టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఇటీవల బాలీవుడ్​లో ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ప్రభాస్ నటించిన 'ఛత్రపతి'(Chathrapathi) మూవీ రీమేక్ తో బాలీవుడ్ లో అడుగు పెట్టాడు ఈ యంగ్ హీరో. భారీ అంచనాలతో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఇక తాజాగా ఎటువంటి చడీ చప్పుడు లేకుండా ఓటీటీలోకి వచ్చేసింది. డీటెయిల్స్ లోకి వెళ్తే.. ప్రస్తుతం తెలుగు సినిమా ప్రపంచ స్థాయికి చేరిన విషయం తెలిసిందే. ఇప్పుడు మన తెలుగు హీరోలతో పరభాష దర్శకులు సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. అలాగే ఇతర భాషల హీరోలు టాలీవుడ్ డైరెక్టర్స్ తో సినిమాలు చేస్తున్నారు.

ఇప్పటికే తమిళ స్టార్ హీరోలైన ధనుష్, కార్తికేయన్ స్ట్రైట్ తెలుగు మూవీస్ చేశారు. వీళ్ళతోపాటు మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ కూడా తెలుగులో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నారు. ఇక మన టాలీవుడ్ నుంచి యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్వరలోనే బాలీవుడ్ ప్రెస్టేజియస్ మూవీ 'వార్ 2' లో నటిస్తున్నాడు. ఈ క్రమంలోనే రీసెంట్ గా టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ బాలీవుడ్లో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. 'అల్లుడు శీను' సినిమాతో తెలుగు వెండితెరకి హీరోగా పరిచయమైన సాయి శ్రీనివాస్ మొదటి సినిమాతోనే డాన్స్, నటనతో ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత కొన్ని కమర్షియల్ సినిమాలు చేసినా అవి పెద్దగా ఆడలేదు. దాంతో బాలీవుడ్ బాటపట్టాడు.

రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ నటించిన బ్లాక్ బస్టర్ మూవీ 'ఛత్రపతి' హిందీ రీమేక్ తో సాయి శ్రీనివాస్ బాలీవుడ్ కి హీరోగా ఎంట్రీ ఇవ్వడం గమనార్హం. ఇక ఈ రీమేక్ ని మన టాలీవుడ్ మాస్ డైరెక్టర్ వివి వినాయక్ డైరెక్ట్ చేశారు. ఇందులో సాయి శ్రీనివాస్ సరసన బాలీవుడ్ బ్యూటీ నుస్రత్ హీరోయిన్ గా నటించింది. భారీ అంచనాలతో రిలీజ్ అయిన ఈ మూవీ డిజాస్టర్ అయింది. సుమారు రూ.25 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా కనీసం బాక్స్ ఆఫీస్ వద్ద కోటి రూపాయల షేర్ ను కూడా రాబట్టలేక పోయింది. అంత దారుణమైన రిజల్ట్ అందుకుంది ఈ చిత్రం.

నిజానికి ప్రభాస్ నటించిన ఛత్రపతి మూవీ యూట్యూబ్ లో హిందీలో డబ్ అవడంతో దాన్ని అందరూ ముందే చూసేసారు. అందుకే బెల్లంకొండ శ్రీనివాస్ చేసిన ఛత్రపతి రిమేక్ పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. రిలీజ్ అయి చాలా రోజులు అవుతున్నా ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ పై ఎటువంటి అప్డేట్ రాలేదు. అయితే తాజాగా ఎటువంటి హడావుడి లేకుండా ఈ మూవీ సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ లో ఛత్రపతి హిందీ రీమేక్ స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్స్ లోనే అతి కష్టంగా చూసిన ఈ సినిమాకి ఇప్పుడు ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.

Also Read : ఎన్టీఆర్​ 'దేవర'లో మరో బాలీవుడ్ యాక్టర్?

టాప్ హెడ్ లైన్స్

Ranveer Deepika Welcomes Second Baby: రెండోసారి తల్లైన దీపికా పదుకోన్ - రణవీర్ సింగ్ దంపతులు... మళ్ళీ అమ్మాయి పుట్టిందోచ్
రెండోసారి తల్లైన దీపికా పదుకోన్ - రణవీర్ సింగ్ దంపతులు... మళ్ళీ అమ్మాయి పుట్టిందోచ్
Sunday OTT Movies : ఆదివారం ఓటీటీ మూవీస్ - ధనుష్ మెచ్చిన సినిమా డోంట్ మిస్... వీకెండ్ సూపర్ థ్రిల్ పంచే టాప్ 10 సినిమాలు
ఆదివారం ఓటీటీ మూవీస్ - ధనుష్ మెచ్చిన సినిమా డోంట్ మిస్... వీకెండ్ సూపర్ థ్రిల్ పంచే టాప్ 10 సినిమాలు
The Paradise : మీరు విగ్గు పెట్టుకుని చెప్తే మేము ఎలా వింటాం? - మహిళా జర్నలిస్ట్ కౌంటర్‌కు నాని స్పాంటేనియస్ రియాక్షన్
మీరు విగ్గు పెట్టుకుని చెప్తే మేము ఎలా వింటాం? - మహిళా జర్నలిస్ట్ కౌంటర్‌కు నాని స్పాంటేనియస్ రియాక్షన్
Romantic Comedy OTT : సాయంత్రం 6 తర్వాత లవర్‌ను చూడకూడదు - ఓటీటీలోకి రొమాంటిక్ కామెడీ... తెలుగులోనూ స్ట్రీమింగ్
సాయంత్రం 6 తర్వాత లవర్‌ను చూడకూడదు - ఓటీటీలోకి రొమాంటిక్ కామెడీ... తెలుగులోనూ స్ట్రీమింగ్

వీడియోలు

Yuvraj Singh's Emotional Post for Abhishek Sharma | యువరాజ్ సింగ్ ఎమోషనల్ పోస్ట్
Yuvi Advice to Abhishek Sharma | అఫ్గానిస్థాన్‌పై అభిషేక్ శర్మ విధ్వంసకర సెంచరీ
Aryavir Sehwag & Anvay Dravid Debut | సెహ్వాగ్, ద్రవిడ్ కుమారుల అరంగేట్రం
Gundenininda Gudigantalu Serial September 11
India vs Afghanistan T20I Series 2026 | అఫ్గానిస్తాన్‌ సిరీస్‌కు ముందు టీమ్ ఇండియాకు బిగ్ రిలీఫ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Janasena Politics: జనసేన సంస్థాగతంగా బలంగా లేదు.. కూటమిలో ఇబ్బందులు సహజం..! నాదెండ్ల మనోహర్
జనసేన సంస్థాగతంగా బలంగా లేదు.. కూటమిలో ఇబ్బందులు సహజం..! నాదెండ్ల మనోహర్
KTR Janwada Farmhouse: నాలా కబ్జా చేసి జన్వాడ ఫామ్‌హౌస్‌ కట్టారు, హైడ్రా చర్యలు తీసుకోవాలి: ఎంపీ చామల
నాలా కబ్జా చేసి జన్వాడ ఫామ్‌హౌస్‌ కట్టారు, హైడ్రా చర్యలు తీసుకోవాలి: ఎంపీ చామల
CM Chandrababu In Vizag: పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు, 28,445 కుటుంబాలకు లబ్ధి
పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు, 28,445 కుటుంబాలకు లబ్ధి
Dorothy Trailer: మగాళ్ళు ఏడ్చారు... కీర్తీ సురేష్ ఎంట్రీతో ఫ్రెండ్స్ మధ్య గొడవ - తమిళ్ సినిమా 'డోరతీ' ట్రైలర్ రివ్యూ
మగాళ్ళు ఏడ్చారు... కీర్తీ సురేష్ ఎంట్రీతో ఫ్రెండ్స్ మధ్య గొడవ - తమిళ్ సినిమా 'డోరతీ' ట్రైలర్ రివ్యూ
MS Subbulakshmi: భారతరత్న అందుకున్న తొలి కర్ణాటక సంగీతకారిణి... భర్త మరణంతో కచేరీలు ఫుల్ స్టాప్... ఎవరీ ఎంఎస్ సుబ్బలక్ష్మి?
భారతరత్న అందుకున్న తొలి కర్ణాటక సంగీతకారిణి... భర్త మరణంతో కచేరీలు ఫుల్ స్టాప్... ఎవరీ ఎంఎస్ సుబ్బలక్ష్మి?
iPhone 3 Whats App Accounts: ఐఫోన్ వాట్సాప్ యూజర్లకు బిగ్ అప్‌డేట్.. ఒకే యాప్‌లో 3 వాట్సాప్ అకౌంట్స్!
ఐఫోన్ వాట్సాప్ యూజర్లకు బిగ్ అప్‌డేట్.. ఒకే యాప్‌లో 3 వాట్సాప్ అకౌంట్స్!
Viral Video: మహిళను కొట్టి, జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లిన కానిస్టేబుల్.. హైదరాబాద్‌లో దారుణం
మహిళను కొట్టి, జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లిన కానిస్టేబుల్.. హైదరాబాద్‌లో దారుణం
Romantic Comedy OTT : సాయంత్రం 6 తర్వాత లవర్‌ను చూడకూడదు - ఓటీటీలోకి రొమాంటిక్ కామెడీ... తెలుగులోనూ స్ట్రీమింగ్
సాయంత్రం 6 తర్వాత లవర్‌ను చూడకూడదు - ఓటీటీలోకి రొమాంటిక్ కామెడీ... తెలుగులోనూ స్ట్రీమింగ్
Embed widget