Fahadh Faasil: ప్రొద్దుటూరులో ఫహద్ ఫాజిల్ సందడి - సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్
Vettaiyan: సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటిస్తున్న ‘వెట్టయాన్’లో ఫహద్ ఫాజిల్ ఒక కీలక పాత్రలో కనిపించనున్నాడు. ఇక ఈ సినిమా షూటింగ్ కోసం ఆంధ్రప్రదేశ్‌లోకి ఎంటర్ అయ్యాడు.

‘వెట్టయాన్’ కోసం ఆంధ్రప్రదేశ్‌కు..
మాలీవుడ్‌లో స్టార్ స్టేటస్ సంపాదించుకున్న నటీనటులలో ఫహద్ ఫాజిల్ ఒకరు. మలయాళం, తమిళంలో ఎన్నో సినిమాల్లో నటించిన తర్వాత ‘పుష్ప’తో మొదటిసారి తెలుగు ప్రేక్షకులను పలకరించాడు ఫహద్. ఈ మూవీలో బన్వర్ సింగ్ షెకావత్ అనే పోలీస్ ఆఫీస్ పాత్రలో కనిపించాడు. ఈ సినిమాలో తను కనిపించి కాసేపే అయినా కామెడీతో పాటు వైలెంట్ పోలీస్ ఆఫీసర్‌గా ప్రేక్షకులను మెప్పించాడు. ‘పుష్ప 2’లో మాత్రం ఫహద్ చాలాసేపు కనిపిస్తాడని, తన నటనతో ప్రేక్షకులను మరింతగా మెప్పిస్తాడని మేకర్స్ ఇప్పటికే రివీల్ చేశారు. ఈ నటుడు ప్రస్తుతం సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటిస్తున్న ‘వెట్టయాన్’లో కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇక ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతోంది.
ప్రొద్దుటూరులోని హోటల్‌లో షూటింగ్..
ఆంధ్ర ప్రదేశ్ ప్రొద్దుటూరులోని ఒక చిన్న హోటల్‌లో ‘వెట్టయాన్’ షూటింగ్ జరుగుతోంది. ఈ సినిమాలో రజినీకాంత్ హీరో అయినా కూడా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న షెడ్యూల్‌లో ఆయన పాల్గొనడం లేదు. ఫహద్ ఫాజిల్, రితికా సింగ్‌తో మాత్రమే ఈ షెడ్యూల్‌లో సన్నివేశాలను చిత్రీకరిస్తున్నాడు దర్శకుడు టీజీ జ్ఞానవేల్. షూటింగ్ జరుపుకొని హోటల్ నుండి బయటికి రాగానే ఫహద్‌ను ఫోటోలు తీయడం మొదలుపెట్టారు ఫ్యాన్స్. వారు తీసిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇందులో ఫహద్‌తో పాటు రితికా సింగ్ కూడా కనిపిస్తోంది. ఈ ఫోటోల్లో హోటల్ నుండి బయటికి వస్తున్న ఫహద్.. చాలా సరదాగా కనిపించాడు.
#fahadhfaasil a small glance travelling in Auto being viral.#Pushpa2 #Vettaiyan #PushpaTheRule #FAFA#Rajnikanth #AlluArjun #Sukumar #Rashmika #rithikasingh #proddatur #AndhraPradesh pic.twitter.com/enuIB1Jti9
— Rajesh Kumar Reddy E V (@rajeshreddyega) January 31, 2024
భారీ క్యాస్టింగ్..
‘వెట్టయాన్’ సినిమాను భారీ క్యాస్టింగ్‌తో తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు జ్ఞానవేల్. ఇందులో రజినీకాంత్ హీరోగా నటిస్తుండగా.. ఫహద్ ఫాజిల్, అమితాబ్ బచ్చన్, అర్జున్ లాంటి ఇతర హీరోలు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. వీరితో పాటు హీరో రానా కూడా ఇందులో మరో కీలక పాత్రలో నటిస్తున్నాడు. 2024లోనే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ ప్రయత్నాలు చేస్తున్నారు. రజినీకాంత్ చివరిగా నటించిన ‘జైలర్’ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కాగా.. ప్రస్తుతం ‘లాల్ సలామ్’ అనే మరో మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. ఇక ఫహద్ ఫాజిల్ విలన్‌గా నటిస్తున్న ‘పుష్ప 2’ కూడా ఆగస్ట్ 15న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది.
Also Read: వివాదాలకు చిరునామా పూనమ్ పాండే, ఆమె కెరీర్‌లో టాప్ 10 కాంట్రవర్సీలు ఇవే
Before You Go
Trinayani Serial Actress Ashika Padukone | 'త్రినయని' ఆషికా రియల్ లైఫ్ సీక్రెట్స్
ట్రెండింగ్ వార్తలు






















