అన్వేషించండి

Cinema exhibitors: జూన్ 1న థియేటర్ల మూసివేత నిర్ణయం వాయిదా - నిర్మాతల హామీతో వెనక్కి తగ్గిన ఎగ్జిబిటర్లు

Tollywood: జూన్ ఒకటి నుంచి ధియేటర్లు బంద్ చేయాలన్న నిర్ణయాన్ని ఎగ్జిబిటర్లు ఉపసంహరించుకున్నారు. సమస్యలపై నిర్మాతలతో చర్చిస్తున్నారు.

Exhibitors withdraw decision to close theaters from June 1: వచ్చే నెల ఒకటో తేదీ నుంచి ధియేటర్లను మూసేయాలన్న నిర్ణయాన్ని తాత్కాలికంగా ఎగ్జిబిటర్లు వాయిదా వేసుకున్నారు. ఎగ్జిబిటర్ల సమస్యలపై తెలుగు ఫిలిం ఛాంబర్ లో ఉదయం నుంచి వాడి వేడి చర్చలు జరిగాయి. జూన్ 1 నుంచి థియేటర్లు మూసివేయాలని ఎగ్జిబిటర్ల నిర్ణయంపై చర్చలు జరిపారు. ఉదయం 11 గంటలకు తెలుగు రాష్ట్రాలలోని డిస్ట్రిబ్యూటర్స్ తో సమావేశమైన తెలుగు ఫిలిం ఛాంబర్ ఎగ్జిబిటర్ల సమస్యలపై చర్చించింది. ఈ సమావేశానికి   40 మంది హాజరయ్యారు. 

నిర్మాతలు, ఎగ్జిటర్లు, డిస్ట్రిబ్యూటర్లతో చర్చలు జరిపిన ఫిల్మ్ చాంబర్           

సాయంత్రం 4 గంటలకు తెలుగు ప్రొడ్యూసర్స్ తో  తెలుగు ఫిలిం ఛాంబర్ సమావేశమయింది. డిస్ట్రిబ్యూటర్లు, ప్రొడ్యూసర్లలో మెజారిటీ సభ్యులు సమ్మె వద్దు, థియేటర్లు రన్ చేస్తూనే సమస్య పరిష్కరించే విధంగా కృషి చేయాలని నిర్ణయం తీసుకున్నారు. గతంలో క్యూబ్ సమస్యలపై కొన్ని రోజులు థియేటర్లు మూసిేశారు. ఆర్టిస్టుల రెమ్యునరేషన్లపై షూటింగుల నిలిపివేశారు. ఈ రెండు విషయాల్లోనూ సత్ఫలితాలు రాకపోవడంతో, ఈ సారి థియేటర్లు మూతపడకుండా, సినిమాలు రన్ చేస్తూనే సమస్య పరిష్కరించే విధంగా కృషి చేయాలని  స్ట్రిబ్యూటర్లు, నిర్మాతలు తెలిపారు.              

ధియేటర్లకు తగ్గిన ప్రేక్షకుల రాక              

ఇప్పటికే పైరసీ, ఐపిఎల్, ఓటీటీ రూపంలో ప్రేక్షకులు థియేటర్లకు రావడం చాలా తగ్గింది. మే 30 నుంచి వరుస సినిమాలు ఉండటంతో మరింత ఇబ్బంది అవుతుంది కాబట్టి, థియేటర్ల మూసివేత కార్యక్రమాన్ని పునరాలోచించుకుని తెలుగు ఇండస్ట్రీ అభివృద్ధికి సహకరించే విధంగా తోడ్పడాలని ఎగ్జిబిటర్లకు   డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలు కోరారు. దీంతో వారు తమ నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నారు.

ధియేటర్లు మూసేస్తే ఇంకా ఎక్కువ నష్టం                    

ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్స్ మధ్య ఆదాయ పంపిణీపై వివాదం కొొనసాగుతోంది.   రెంటల్ విధానంలో  సినిమాలను  ప్రదర్శించడం  సాధ్యం కాదని ఎగ్జిబిటర్స్ అంటున్నారు.   వారికి పర్సంటేజీలు ఇవ్వలేమని డిస్ట్రిబ్యూటర్స్ తేల్చిచెప్పారు. దీంతో ఇరువురి మధ్య ఆ సమస్య అలాగే ఉండిపోయింది.  జూన్‌లో భారీ  సినిమాలు రిలీజ్ కు రెడీగా ఉన్నాయి.   

రిలీజ్ కు రెడీ అవుతున్న భారీ సినిమాలు      

పవర్ స్టార్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న లేటెస్ట్ పీరియాడిక్ యాక్షన్ అడ్వెంచర్ 'హరిహర వీరమల్లు' జూన్ 12న రిలీజ్ కానుంది. అటు.. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్, నాగార్జున, రష్మిక ప్రధాన పాత్రలు పోషించిన అవెయిటెడ్ మూవీ 'కుబేర' జూన్ 20న రిలీజ్ కానుంది. ఇక మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ 'కన్నప్ప' సైతం జూన్ 27న రిలీజ్ కానున్నట్లు ఇప్పటికే ప్రకటించారు.  ఈ భారీ సినిమాల సీజన్ ను మిస్సయితే ఎగ్జిబిటర్లు కూడా నష్టపోతారు. అందుకే ఇప్పుడున్న విధానంలో ప్రస్తుతం  కంటిన్యూ చేస్తూ భవిష్యత్ లో చర్చలు జరపాలన్న సలహాలు ఇచ్చారు. దానికి ఎగ్జిబిటర్లు అంగీకరించారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Vijay Deverakonda Car Collection: విజ‌య్ దేవ‌రకొండ వద్ద లగ్జరీ కార్ల క‌లెక్ష‌న్.. రౌడీ హీరో నెట్ వర్త్ ఎంత?
విజ‌య్ దేవ‌రకొండ వద్ద లగ్జరీ కార్ల క‌లెక్ష‌న్.. రౌడీ హీరో నెట్ వర్త్ ఎంత?
Vishwanath And Sons Teaser : విశ్వనాథ్ అండ్ సన్స్ టీజర్ ట్రీట్ రెడీ - సంజయ్ విశ్వనాథ్ రాకకు డేట్ అండ్ టైమ్ ఫిక్స్
విశ్వనాథ్ అండ్ సన్స్ టీజర్ ట్రీట్ రెడీ - సంజయ్ విశ్వనాథ్ రాకకు డేట్ అండ్ టైమ్ ఫిక్స్
Ustaad Bhagat Singh Trailer : ఉస్తాద్ భగత్ సింగ్ ట్రైలర్ - ఇచ్చిపడేసే గోత్రం... ఇరగదీసే నక్షత్రం... పెర్ఫార్మెన్స్ బద్దలయ్యే డైలాగ్స్
ఉస్తాద్ భగత్ సింగ్ ట్రైలర్ - ఇచ్చిపడేసే గోత్రం... ఇరగదీసే నక్షత్రం... పెర్ఫార్మెన్స్ బద్దలయ్యే డైలాగ్స్
Dhanush : శంకర్ 'వేల్పారి'లో ధనుష్ ఫిక్స్! - వరుస ప్రాజెక్టులు... అంత రిస్క్ చేస్తారా?
శంకర్ 'వేల్పారి'లో ధనుష్ ఫిక్స్! - వరుస ప్రాజెక్టులు... అంత రిస్క్ చేస్తారా?

వీడియోలు

Pawan Kalyan Paderu Tour | పాడేరులో పర్యటించి గిరిజనులతో గడిపిన పవన్ కళ్యాణ్ | ABP Desam
Yuvraj Singh Mentoring Rishabh Pant | స్పైడీ రిషభ్ పంత్ కు అండగా యువరాజ్ సింగ్ | ABP Desam
RCB Acquisition Race | కోహ్లీ కోసం 17వేల కోట్లు పెట్టడానికైనా ఆ సంస్థ సిద్ధం | ABP Desam
Salman Agha Run out Controversy | బాల్ ఇద్దామనుకున్నాడు..రనౌట్ అయిపోయాడు | ABP Desam
MS Dhoni Crafting Bat | ధోని క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదుగా | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం ఓ డ్రామా.. వాస్తవాలను వెల్లడించిన హైదరాబాద్ పోలీస్ శాఖ
కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం ఓ డ్రామా.. వాస్తవాలను వెల్లడించిన హైదరాబాద్ పోలీస్ శాఖ
Jeevan Reddy To joins BRS: బీఆర్ఎస్‌లో చేరే యోచనలో కాంగ్రెస్ సీనియర్ నేత - ఫిరాయింపు ఎమ్మెల్యేతో పొసగకపోవడం వల్లే!
బీఆర్ఎస్‌లో చేరే యోచనలో కాంగ్రెస్ సీనియర్ నేత - ఫిరాయింపు ఎమ్మెల్యేతో పొసగకపోవడం వల్లే!
Deputy CM Pawan Kalyan: గిరిపుత్రుల గడపకు ఉప ముఖ్యమంత్రి - అల్లూరి జిల్లాలో పవన్ కళ్యాణ్ ‘మాటా-మంతి’
గిరిపుత్రుల గడపకు ఉప ముఖ్యమంత్రి - అల్లూరి జిల్లాలో పవన్ కళ్యాణ్ ‘మాటా-మంతి’
Fake Ranker: సివిల్స్‌లో ర్యాంక్ వచ్చిందని పోలీసులు, రాజకీయ నేతలతో సన్మానాలు చేయించుకున్నాడు - నిజం తెలిసే సరికి జంప్!
సివిల్స్‌లో ర్యాంక్ వచ్చిందని పోలీసులు, రాజకీయ నేతలతో సన్మానాలు చేయించుకున్నాడు - నిజం తెలిసే సరికి జంప్!
IntrCity SmartBus: భారత్‌లో తొలి AQI ఇంటర్‌సిటీ బస్సు సర్వీస్ విజయవాడలో ప్రారంభించిన ఇంట్రసిటీ స్మార్ట్‌బస్
భారత్‌లో తొలి AQI ఇంటర్‌సిటీ బస్సు సర్వీస్ విజయవాడలో ప్రారంభించిన ఇంట్రసిటీ స్మార్ట్‌బస్
Dhanush : శంకర్ 'వేల్పారి'లో ధనుష్ ఫిక్స్! - వరుస ప్రాజెక్టులు... అంత రిస్క్ చేస్తారా?
శంకర్ 'వేల్పారి'లో ధనుష్ ఫిక్స్! - వరుస ప్రాజెక్టులు... అంత రిస్క్ చేస్తారా?
Indian Ships Stuck In Hormuz: హర్మూజ్ జలసంధిలో ఎన్ని భారత ఓడలు చిక్కుకున్నాయి, వాటిలో ఏమేం ఉన్నాయి?
హర్మూజ్ జలసంధిలో ఎన్ని భారత ఓడలు చిక్కుకున్నాయి, వాటిలో ఏమేం ఉన్నాయి?
BCCI Naman Awards: శుభ్‌మన్ గిల్‌కు అత్యున్నత పురస్కారం ప్రకటించిన BCCI.. స్మృతీ మంధానా ఏకంగా 5వసారి
శుభ్‌మన్ గిల్‌కు అత్యున్నత పురస్కారం ప్రకటించిన BCCI.. స్మృతీ మంధానా ఏకంగా 5వసారి
Embed widget