అన్వేషించండి

Antony Ruben: ‘పుష్ప 2’ టీమ్‌కు బిగ్ షాక్? ఎడిటర్ రూబెన్.. మూవీ నుంచి తప్పుకున్నారా?

‘పుష్ప 2: ది రూల్’ మూవీ షూటింగ్ ఎండింగ్ కు చేరుకుంది. త్వరలో పోస్టు ప్రొడక్షన్ పనులు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలోనే చిత్రబృందానికి పెద్ద షాక్ తగిలినట్లు తెలుస్తోంది.

Editor Antony Ruben opts out of 'Pushpa 2’: అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తెరకెక్కిస్తున్న తాజాగా చిత్రం ‘పుష్ప: ది రూల్’. ఎప్పుడెప్పుడు చూడాలా అని దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు మేకర్స్. ఈ నేపథ్యంలోనే కీలక పరిణామం చోటు చేసుకుంది. ‘పుష్ప’ సినిమా సక్సెస్ లో కీలక పాత్ర పోషించిన ఎడిటర్ ఆంటోనీ రూబెన్ ఈ మూవీ నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది.

‘పుష్ప 2’ ఎడిటింగ్ బాధ్యతల నుంచి తప్పుకున్న ఆంటోనీ రూబెన్

‘పుష్ప ది రూల్’ మూవీపై రోజు రోజుకు హైప్ పెరుగుతోంది. ‘పుష్ప’ సినిమా అద్భుత విజయాన్ని అందుకున్న నేపథ్యంలో ఈ సినిమా అంతకు మించి ఉండేలా చిత్రబృందం  జాగ్రత్తలు తీసుకుంటోంది. అదిరిపోయే ఔట్ పుట్ కోసం టాప్ టెక్నీషియన్లతో పని చేయిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమాకు పని చేస్తున్న ఎడిటర్ ఆంటోనీ రూబెన్ వైదొలిగినట్టు సినిమా పరిశ్రమలో టాక్ వినిపిస్తోంది. వ్యక్తిగత కారణాలతో ఆయన ఈ సినిమా నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. రూబెన్ తీసుకున్న నిర్ణయంతో చిత్రబృందం షాక్ కు గురైనట్లు తెలుస్తోంది. రూబెన్ ‘బిగిల్’, ‘మెర్సల్’, ‘వివేగం’, ‘పుష్ప’, ‘జవాన్’ లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాలకు ఎడిటర్ గా చేశారు. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో నెంబర్ వన్ ఎడిటర్ గా కొనసాగుతున్న ఆయన ప్రస్తుతం అట్లీ, వరుణ్ ధావన్ కాంబోలో వస్తున్న’బేబీ జాన్’ సినిమాకు పని చేస్తున్నారు.

‘పుష్ప 2’ ఎడిటర్ గా నవీన్ నూలి?

ఈ నేపథ్యంలో చిత్రబృందం మరో ఎడిటర్‌‌ను వెతికే పనిలో పడినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా ప్రముఖ ఎడిటర్ నవీన్ నూలిని సంప్రదించినట్లు తెలుస్తోంది. ‘జెర్సీ’ సినిమాకు గాను ఉత్తమ ఎడిటర్ గా ఆయన జాతీయ చలనచిత్ర అవార్డు అవార్డును అందుకున్నారు. ‘నాన్నకు ప్రేమతో’, ‘రంగస్థలం’ లాంటి సక్సెస్ ఫుల్ సినిమాలకు నవీన్ ఎడిటర్ గా వ్యవహరించారు. ‘పుష్ప 2’ సినిమాకు నవీన్ న్యాయం చేయగలరని దర్శకుడు సుకుమార్ భావిస్తున్నారట. అన్నీ అనుకున్నట్లు జరిగితేనే ‘పుష్ప2’ ఆగష్టు 15న విడుదలయ్యే అవకాశం ఉంది. లేదంటే మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉంది.

కొత్త ఎడిటర్ పై త్వరలో అధికారిక ప్రకటన

అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాను  మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. ఈ చిత్రంలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాసిల్ విలన్‌ పాత్ర పోషిస్తున్నారు. సునీల్, అనసూయ కీలక పాత్రలు చేయనున్నారు. దేవీ శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ సినిమాకు కొత్త ఎడిటర్ ఎవరు అనే విషయంపై చిత్రబృందం త్వరలోనే వెల్లడించే అవకాశం ఉంది.

Read Also: అతడి కలలే నా కలలు - శిఖర్ పహారియాతో ప్రేమాయణంపై తొలిసారి నోరు విప్పిన బాలీవుడ్ నటి, శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్

టాప్ హెడ్ లైన్స్

Varun Tej : మెగా ప్రిన్స్‌కు ఏమైంది? - చేతికర్రతో ఈవెంట్‌కు వచ్చిన హీరో... వీడియో వైరల్
మెగా ప్రిన్స్‌కు ఏమైంది? - చేతికర్రతో ఈవెంట్‌కు వచ్చిన హీరో... వీడియో వైరల్
Jani Master : జానీ మాస్టర్‌కు బిగ్ రిలీఫ్ - మెగాస్టార్, బాలయ్య ఎంట్రీతో కాంట్రవర్సీకి చెక్
జానీ మాస్టర్‌కు బిగ్ రిలీఫ్ - మెగాస్టార్, బాలయ్య ఎంట్రీతో కాంట్రవర్సీకి చెక్
Objection My Lord Series OTT : లాయర్‌గా శ్రీకాంత్... ఓటీటీలోకి కోర్ట్ రూమ్ డ్రామా సిరీస్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
లాయర్‌గా శ్రీకాంత్... ఓటీటీలోకి కోర్ట్ రూమ్ డ్రామా సిరీస్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Allu Aravind : హీరోయిన్‌లా ఉన్నావ్... నెక్స్ట్ మూవీలో చేస్తావా? - యాంకర్‌కు అల్లు అరవింద్ క్రేజీ ఆఫర్... ఆమె ఎవరో తెలుసా?
హీరోయిన్‌లా ఉన్నావ్... నెక్స్ట్ మూవీలో చేస్తావా? - యాంకర్‌కు అల్లు అరవింద్ క్రేజీ ఆఫర్... ఆమె ఎవరో తెలుసా?

వీడియోలు

Washington Sundar Ruled Out, Harsh Dubey In | మ్యాచ్ ముందే మారిన టీమిండియా స్క్వాడ్
Ashwin Comments On Hitman Retirement | రోహిత్ రిటైర్మెంట్ రూమర్స్ పై అశ్విన్ కామెంట్స్
FIFA's Shocking Decision For World Cup Final | ఫిఫాలో వరల్డ్ కప్ ట్రోఫీతో పాటు బంగారు ఉంగరాలు
National Award for Committee Kurrollu | మెగా డాటర్ చిత్రానికి నేషనల్ అవార్డ్
Kohli vs Gambhir Fight Rumors ODI | గంభీర్‌తో గొడవపడి కోహ్లీ హోటల్ వీడాడా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Local Body Elections Coalition Conflict: ఏపీ లోకల్ పోల్స్ - కూటమికి కూటమితోనే పోటీ! టీడీపీ, జనసేన ద్వితీయ శ్రేణి నేతల టగ్ ఆఫ్ వార్ తప్పదా?
ఏపీ లోకల్ పోల్స్ - కూటమికి కూటమితోనే పోటీ! టీడీపీ, జనసేన ద్వితీయ శ్రేణి నేతల టగ్ ఆఫ్ వార్ తప్పదా?
UA Iran Conflict: ఒకర్ని అరెస్ట్ చేస్తే బెదరడానికి మాది వెనిజులా కాదు: ట్రంప్ దూతకు ఇరాన్ మంత్రి షాక్
ఒకర్ని అరెస్ట్ చేస్తే బెదరడానికి మాది వెనిజులా కాదు: ట్రంప్ దూతకు ఇరాన్ మంత్రి షాక్
Hyderabad Crime News: పోలీస్ అకాడమీలో లైంగిక వేధింపులు.. గదిలో బంధించి, కత్తితో బెదిరించి దారుణం
పోలీస్ అకాడమీలో లైంగిక వేధింపులు.. గదిలో బంధించి, కత్తితో బెదిరించి దారుణం
Tammineni Sitaram: నకిలీ డెత్ సర్టిఫికేట్‌తో భూ కబ్జాకు యత్నం.. మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంపై కేసు నమోదు
నకిలీ డెత్ సర్టిఫికేట్‌తో భూ కబ్జాకు యత్నం.. మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంపై కేసు నమోదు
Messi VS Spain Strategy: మెస్సిని కట్టడి చేయడానికి స్పెయిన్ సూప‌ర్బ్ వ్యూహం.. గతంలోని జర్మనీ మాస్టర్ ప్లాన్ ను అమలు చేయనున్న స్పెయిన్!
మెస్సిని కట్టడి చేయడానికి స్పెయిన్ సూప‌ర్బ్ వ్యూహం.. గతంలోని జర్మనీ మాస్టర్ ప్లాన్ ను అమలు చేయనున్న స్పానిష్ టీమ్!
Salman Khan : బాలీవుడ్ కండల వీరుడికి ఏమైంది? - అలా మారిపోయారేంటి?... వీడియో వైరల్
బాలీవుడ్ కండల వీరుడికి ఏమైంది? - అలా మారిపోయారేంటి?... వీడియో వైరల్
Asifabad News: భూములు లాక్కుంటే సుప్రీం కోర్టుకు.. అధికారులపై అట్రాసిటీ కేసులు పెడుతం: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
భూములు లాక్కుంటే సుప్రీం కోర్టుకు.. అధికారులపై అట్రాసిటీ కేసులు పెడుతం: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
PV Sindhu Wins Japan Open: టైటిల్ కరవుకు పీవీ సింధు ఎండ్ కార్డ్..  యామగూచిని చిత్తు చేసి హిస్టారికల్ విక్టరీ, జపాన్ ఓపెన్ కైవసం
టైటిల్ కరవుకు పీవీ సింధు ఎండ్ కార్డ్..  యామగూచిని చిత్తు చేసి హిస్టారికల్ విక్టరీ, జపాన్ ఓపెన్ కైవసం
Embed widget