Kaantha First Single: దుల్కర్ సల్మాన్ 'కాంత' నుంచి ఫస్ట్ సింగిల్ - ఎవర్ గ్రీన్ మెలోడీ అదిరిపోయింది
Kaantha Song: దుల్కర్ సల్మాన్ లేటెస్ట్ పీరియాడికల్ డ్రామా 'కాంత' నుంచి ఫస్ట్ మెలోడి సాంగ్‌ను తాజాగా మేకర్స్ రిలీజ్ చేశారు. దుల్కర్, భాగ్యశ్రీ మధ్య స్టెప్పులు ఆ పాత మధురాలను తలపించాయి.

Dulquer Salmaan's Kaantha First Single Released: దుల్కర్ సల్మాన్, భాగ్యశ్రీ బోర్సే ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ పీరియాడికల్ డ్రామా 'కాంత' నుంచి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది. ఈ మూవీకి సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వం వహిస్తుండగా... రీసెంట్‌గా వచ్చిన టీజర్ ఆకట్టుకుంటోంది. ప్రమోషన్స్‌లో భాగంగా మెలోడీ సాంగ్‌ను రిలీజ్ చేశారు మేకర్స్.
ఆ పాత మధురంలా ఎవర్ గ్రీన్ సాంగ్...
'పసి మనసే... వినదసలే... మహిమిది నీదేలే...' అంటూ స్లోగా సాగే లిరిక్స్ ఆకట్టుకుంటున్నాయి. దుల్కర్, భాగ్యశ్రీ బోర్సే మధ్య స్టెప్పులు ఆ పాత మధురాల్ని గుర్తు చేస్తున్నాయి. ఓ భవనంలో ఇద్దరి మధ్య సాగే లవ్ సాంగ్ ట్రాక్ అదుర్స్ అనిపిస్తోంది. ఈ పాటకు జాను చంతర్ మ్యూజిక్ అందించగా... కృష్ణకాంత్ లిరిక్స్ రాశారు. ప్రదీప్ కుమార్, ప్రియాంక ఎన్‌కే పాడారు.
Love has a new soundtrack and it’s OUT NOW!❤
— Spirit Media (@SpiritMediaIN) August 9, 2025
Experience it with #PASIMANASE & groove along to this captivating rhythm with us, as we paint the town red with our first single of #KaanthaFilm https://t.co/XZOBgj6ClF
A @SpiritMediaIN and @DQsWayfarerFilm production 🎬#Kaantha… pic.twitter.com/thjZayd10j
Also Read: రామ్ చరణ్ 'పెద్ది' స్పెషల్ సాంగ్‌లో సమంత? - వైరల్ న్యూస్‌లో నిజమెంత?
ఈ మూవీలో దుల్కర్ సల్మాన్, భాగ్యశ్రీలతో పాటు సముద్రఖని కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. స్పిరిట్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్, వేఫేరర్ పిల్మ్స్ లిమిటెడ్ బ్యానర్లపై రానా దగ్గుబాటి, దుల్కర్ సల్మాన్, జోమ్ వర్గీస్, ప్రశాంత్ పొట్లూరి నిర్మిస్తున్నారు. సినిమాలో రానా డిటెక్టివ్ రోల్‌లో కనిపించనున్నారనే టాక్ వినిపిస్తోంది.
స్టోరీ ఏంటంటే?
1950 మద్రాస్ బ్యాక్ డ్రాప్‌లో ఓ మూవీ తీయడం వెనుక ఉన్న స్టోరీనే ప్రధానాంశంగా తీసుకున్నట్లు టీజర్‌ను బట్టి తెలుస్తోంది. ఆ సినిమాలో హీరో పాత్రలో దుల్కర్, డైరెక్టర్ పాత్రలో సముద్రఖని నటిస్తున్నారు. ఆ హీరోను డైరెక్టర్ పరిచయం చేయగా... ఒకరికొకరు ప్రేమతో ఉంటారు. యాక్టింగ్‌లో మెళకువలు నేర్పగా మంచి స్థాయికి వెళ్తారు ఆ హీరో. ప్రాణ స్నేహితులుగా ఉన్న వీరి మధ్య ఏం జరిగింది? బద్ధ శత్రువులుగా ఎందుకు మారారు? తనకు విద్య నేర్పిన గురువునే హీరో ఎందుకు తొక్కేయాలని చూశాడు? అనేది తెలియాలంటే మూవీ రిలీజ్ వరకూ ఆగాల్సిందే.
సెప్టెంబర్ 12న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మద్రాస్ బ్యాక్ డ్రాప్ అలనాటి పాత రోజుల్ని గుర్తు చేసేలా ఉన్న ఇంటెన్స్ లుక్స్, సెట్స్ ఆకట్టుకుంటున్నాయి. డిఫరెంట్ టైటిల్‌తో మరోసారి ఆడియన్స్‌ను ఎంటర్‌టైన్ చేసేందుకు వస్తున్నారు దుల్కర్. రీసెంట్‌గా 'లక్కీ భాస్కర్'తో బిగ్గెస్ట్ హిట్ అందుకున్నారు. సీతారామం, కురుప్, కనులు కనులు దోచాయంటే, జనతా హోటల్ మూవీస్‌తో మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు. అదే రేంజ్‌లో ఈ మూవీ కూడా హిట్ ఖాయమంటూ నెటిజన్స్ పోస్టులు పెడుతున్నారు.




















