By: ABP Desam | Updated at : 07 Mar 2022 11:38 AM (IST)
లిజు కృష్ణ
దర్శకుడిగా తొలి సినిమా చిత్రీకరణలో ఉండగా... మాలీవుడ్ డైరెక్టర్ లిజు కృష్ణ (Director Liju Krishna) పై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. ఆయన వివాదంలో చిక్కుకున్నారు. అసలు, ఏమైంది? ఏంటి? అనే వివరాల్లోకి వెళితే...
నివిన్ పౌలి కథానాయకుడిగా మలయాళంలో 'పడవెట్టు' (Malayalam Film Padavettu) సినిమా రూపొందుతోంది. ఈ సినిమాతో లిజు కృష్ణ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ప్రస్తుతం సినిమా అండర్ ప్రొడక్షన్‌లో ఉంది. లిజు కృష్ణ తనపై అత్యాచారం చేశాడని, లైంగికంగా వేధించారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో కక్కండ్ ఇన్ఫో పార్క్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఐపీసీ 376 సెక్షన్ అనుసరించి... కన్నూర్ లో షూటింగ్ చేస్తున్నప్పుడు లీజు కృష్ణను పోలీసులు అరెస్ట్ చేయడం (Mollywood Film Director Liju Krishna Accused Of Rape, Arrested) మలయాళ సినీ పరిశ్రమలో కలకలం సృష్టించింది.
లిజు కృష్ణ అరెస్టును ధృవీకరించిన పోలీసులు, అతను మించి ఇతర వివరాలు వెల్లడించలేమని చెప్పారు. సోమవారం (ఈ రోజు, ఫిబ్రవరి 7న) కొచ్చిలోని కోర్టులో ఆయన్ను హాజరు పరచనున్నారు. కేరళలో మరో లైంగిక వేధింపుల కేసులో టాటూ ఆర్టిస్ట్ సుజీత్ పీఎస్ కూడా అరెస్ట్ అయ్యారు. ఆయనపై ఆరుగురు మహిళలు కేసు పెట్టినట్టు సమాచారం.
'పడవెట్టు' సినిమాలో నివిన్ పౌలితో పాటు మంజూ వారియర్, అదితి బాలన్ తదితరులు నటిస్తున్నారు. లిజు కృష్ణ కథ అందించడంతో పాటు దర్శకత్వం వహిస్తున్నారు. సన్నీ వేన్ నిర్మిస్తున్నారు. దర్శకుడి అరెస్టుతో సినిమా షూటింగ్ వాయిదా పడింది.
Also Read: 67 ఏళ్ల వయస్సులోనూ కండలు తిరిగిన దేహంతో అనుపమ్ ఖేర్
'పడవెట్టు' సినిమాలో నివిన్ పౌలి
Sarkaru Vaari Paata: 'సర్కారు వారి పాట' డైలాగ్ ఎఫెక్ట్ - భక్తులకు క్షమాపణలు చెప్పిన పరశురామ్
NTR31: క్రేజీ రూమర్ - ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమాలో కమల్ హాసన్?
Pooja Hegde: ‘కేన్స్’లో పూజా హెగ్డేకు చేదు అనుభవం, ఆమె కోసం వారు నిద్రాహారాలు మానేశారట!
NTR: మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను - ఎన్టీఆర్ థాంక్యూ లెటర్
Vikram Trailer: 'విక్రమ్' తెలుగు ట్రైలర్ వచ్చేసింది - ఫ్యాన్స్ కు యాక్షన్ ట్రీట్
Russia Ukraine War : ఉక్రెయిన్పై గెలిచాం - ప్రకటించేసుకున్న రష్యా !
Begumbazar Honor Killing : నా అన్నలే హత్య చేశారు, వారిని ఉరితీయాలి - మృతుని భార్య సంజన డిమాండ్
Monkeypox: శృంగారంతో మంకీపాక్స్ వ్యాప్తి? వేగంగా వ్యాపిస్తున్న వైరస్, ఎక్కువ ప్రమాదం వీరికే!
Complaint On Avanti Srinivas : "ఒరేయ్ పంతులూ .." అన్నారు - మాజీ మంత్రిపై పోలీసులకు ఫిర్యాదు !