Dhanush OM Release Date : ఎర్రచందనం స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్‌లో ధనుష్ కొత్త మూవీ - మల్టీ చాప్టర్‌గా ఓం... రిలీజ్ ఎప్పుడంటే?
OM First Strike Teaser : కోలీవుడ్ స్టార్ ధనుష్ హీరోగా నటిస్తోన్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ఓం. తాజాగా ఈ మూవీ ఫస్ట్ స్ట్రైక్ టీజర్‌తో పాటు రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు మేకర్స్.

Dhanush's OM Release Date First Strike Video Review : కోలీవుడ్ స్టార్ ధనుష్ హీరోగా రాజ్ కుమార్ పెరియసామి దర్శకత్వంలో రాబోతోన్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ఓం (OM) : చాప్టర్ 1 - ఉదిరం. ఇప్పటికే రిలీజ్ చేసిన లుక్స్ మూవీపై అంచనాలు అమాంతం పెంచేశాయి. తాజాగా రిలీజ్ డేట్ సహా ఫస్ట్ స్ట్రైక్ టీజర్ వీడియోను రిలీజ్ చేశారు మేకర్స్. ఇందులో మూవీ స్టోరీ బ్యాక్ డ్రాప్ రివీల్ చేశారు.
ఎర్రచందనం స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్‌తో...
అడవి నేపథ్యంలో ఎర్రచందనం స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్‌లో ఈ స్టోరీ సాగనున్నట్లు వీడియోను బట్టి తెలుస్తోంది. అడివిలో ఎర్రచందనం స్మగ్లర్స్‌ను పోలీసులు రౌండప్ చేయగా... అందరినీ షూట్ చేసే సమయానికి వారిని కాపాడేందుకు హీరో ఎంట్రీ అదిరిపోయింది. ధనుష్‌ను అరుణాచలేశ్వరునితో పోలుస్తూ వారంతా నినాదాలు చేయడం హైప్ క్రియేట్ చేస్తోంది.
ఎర్రచందనం స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ అంటే మనకు గుర్తొచ్చేది అల్లు అర్జున్ పుష్ప ఫ్రాంచైజీ. మరి అదే బ్యాక్ డ్రాప్ స్టోరీగా రాబోతోన్న ఓం కూడా అంతే స్థాయిలో సక్సెస్ అవుతుందని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ మూవీని దసరా సందర్భంగా వరల్డ్ వైడ్‌గా అక్టోబర్ 16న రిలీజ్ చేయనున్నారు. ఈ హై ఓల్టేజ్ యాక్షన్ మూవీ మల్టీ చాప్టర్ ప్రాజెక్టుగా రూపుదిద్దుకుంటోంది.
ఈ మూవీలో ధనుష్ సరసన సాయి పల్లవి, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్నారు. అలాగే, మలయాళ స్టార్ మమ్ముట్టి కీలకపాత్ర పోషిస్తున్నారు. సాయి అభ్యంకర్ మ్యూజిక్ అందిస్తుండగా... వండర్ బార్ ఫిల్స్మ్, ఆర్ టేక్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. త్వరలోనే మిగిలిన అప్డేట్స్ రానున్నాయి.
Before You Go
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
ట్రెండింగ్ వార్తలు























