అన్వేషించండి

అజయ్ దేవగన్‌కు చెల్లిగా దీపికా పదుకొనే - ‘బోళాశంకర్’ రీమేక్ కాదు, ఆ హిట్ మూవీ సీక్వెల్‌ కోసం!

రోహిత్ శెట్టి దర్శకత్వంలో అజయ్ దేవగన్ నటిస్తున్న తాజా చిత్రం 'సింగం అగైన్'. రణవీర్ సింగ్, అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాలో దీపికా పదుకొనే గెస్ట్ రోల్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్‌కు చెల్లిగా దీపికా పదుకొనే చెల్లిగా నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే, ఇదేదో ‘వెదాళం’ లేదా ‘భోళాశంకర్’ మూవీ రీమేక్ కోసం అనుకుంటున్నారా? కానే కాదు.. ‘సింగం’ సినిమా సీక్వెల్ కోసం.

బాలీవుడ్ లో 'సింగం' సిరీస్ కు ఎలాంటి క్రేజ్ ఉందో చెప్పనక్కర్లేదు. అజయ్ దేవగన్ హీరోగా ఇప్పటివరకు వచ్చిన 'సింగం', 'సింగం రిటర్న్స్' బాక్స్ ఆఫీస్ వద్ద మంచి సక్సెస్ అందుతున్నాయి. రోహిత్ శెట్టి తెరకెక్కించిన ఈ సీరిస్ నుంచి త్వరలోనే పార్ట్ 3 రాబోతుంది. 'సింగం అగైన్'(Singham Again) పేరుతో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈసారి అజయ్ దేవగన్ సరసన కరీనాకపూర్ నటిస్తుండగా.. బాలీవుడ్ స్టార్స్ రణవీర్ సింగ్, అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. భారీ తారాగణం ఈ సినిమాలో నటిస్తుండడంతో ఈ సినిమాపై ఓ రేంజ్ లో అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉన్న ఈ సినిమాపై మరింత హైప్ పెంచుతూ పలు బాలీవుడ్ వర్గాలు మరో విషయాన్ని తెలియజేశాయి.

అదేంటంటే..  ఈ సినిమా కోసం బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకొనేని ఓ పాత్ర కోసం ఎంచుకున్నారట. అంతేకాదు ఈ సినిమా కోసం దీపిక చాలా ఉత్సాహంగా ఉన్నట్టు తెలుస్తోంది. రోహిత్ శెట్టి తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో మొదటిసారి లేడి పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతోందట దీపికా పదుకొనే. సినిమాలో దీపిక లేడీ సింగంగా సందడి చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ యాక్షన్ ప్యాక్డ్ ప్రాజెక్టులో దీపిక పాత్ర కూడా చాలా పవర్ ఫుల్ గా ఉండబోతుందట. మరో ఆసక్తికర విషయం ఏంటంటే, ఇందులో దీపిక అజయ్ దేవగన్ కు చెల్లిగా కనిపించనున్నట్లు సమాచారం.  "సినిమాలో ఇదొక మంచి పాత్ర. అతిథి పాత్ర కంటే ఎక్కువ. సినిమాలో దీపిక పాత్రకి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ పాత్ర కోసం సుమారు 35 నుంచి 40 రోజులపాటు దీపిక పదుకొనే చిత్రీకరణలో పాల్గొననుంది" అంటూ పలు బాలీవుడ్ వర్గాలు తెలిపాయి.

కాగా ఈ సినిమాలో బాలీవుడ్ యంగ్ హీరో టైగర్స్ ష్రాఫ్ క్యామియో రోల్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాతోనే రోహిత్ శెట్టి 'సింగం యూనివర్స్' లోకి ఎంట్రీ ఇస్తున్నాడు ఈ హీరో. దీని తర్వాత రోహిత్ శెట్టి దర్శకత్వంలో టైగర్ ష్రాఫ్ సోలో హీరోగా అది కూడా 'సింగం' తరహా సినిమా చేసే అవకాశం ఉంది. సెప్టెంబర్ లో సెట్స్ పైకి వెళ్ళనున్న ఈ సినిమాని 2024 ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు తీసుకుని వచ్చేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. ఇక దీపికా పదుకొనే ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సరసన 'కల్కి 2898AD' సినిమాలో నటిస్తోంది. ఇటీవల విడుదలైన గ్లిమ్స్ సినిమాపై అంచనాలను ఒక్కసారిగా పెంచేసింది.

నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ లెజెండరీ యాక్టర్ అమితాబచ్చన్ తో పాటు సీనియర్ హీరో కమలహాసన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. అలాగే బాలీవుడ్ హీరోయిన్ దిశా పటాని కీ రోల్ ప్లే చేస్తోంది. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రం వచ్చే ఏడాది వేసవి కానుకగా విడుదల కానున్నట్లు సమాచారం. నిజానికి వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ సినిమాని విడుదల చేస్తున్నట్లు ముందుగా మేకర్స్ ప్రకటించారు. కానీ షూటింగ్, వీఎఫ్ఎక్స్ పనులు ఇంకా బ్యాలెన్స్ ఉండటంతో సినిమా రిలీజ్ సమ్మర్ కి షిఫ్ట్ అయ్యే ఛాన్స్ ఉందని అంటున్నారు.

Also Read : సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చేసిన 'ఆదిపురుష్' - ఈ సినిమా చూడాలంటే ఆ కండీషన్ తప్పనిసరి?

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

టాప్ హెడ్ లైన్స్

Rahul Sipligunj: విశాఖలో రాహుల్ సిప్లిగంజ్‌పై ఎఫ్‌ఐఆర్... బావమరిది కోసం యువతిని బెదిరించాడా?
విశాఖలో రాహుల్ సిప్లిగంజ్‌పై ఎఫ్‌ఐఆర్... బావమరిది కోసం యువతిని బెదిరించాడా?
Priyanka Chopra: సిద్ధి వినాయక టెంపుల్‌లో ప్రియాంక చోప్రా... Varanasi కోసం ఇండియా వచ్చి...
సిద్ధి వినాయక టెంపుల్‌లో ప్రియాంక చోప్రా... Varanasi కోసం ఇండియా వచ్చి...
Work From Home OTT : ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
Ajith Kumar Shankar : అజిత్‌తో శంకర్ మూవీ? - ఆ వార్తల్లో నిజమెంతంటే?
అజిత్‌తో శంకర్ మూవీ? - ఆ వార్తల్లో నిజమెంతంటే?

వీడియోలు

Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Rahane Saved Jaiswal From 4-Match Ban | జైస్వాల్‌ను గ్రౌండ్ నుంచి బయటకు పంపిన రహానే
Ganguly & Yuvraj Singh In Delhi Capitals Camp | ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి దాదా, యువి
PM Modi Meets CWG 2026 Medal Winners | ప్రధాని మోడీని కలిసిన గ్లాస్గో కామన్వెల్త్ విజేతలు
Gundenininda Gudigantalu Serial August 10 | రోహిణిని రోడ్డుపైకి నెట్టేసిన ప్రభావతి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rahul Sipligunj: విశాఖలో రాహుల్ సిప్లిగంజ్‌పై ఎఫ్‌ఐఆర్... బావమరిది కోసం యువతిని బెదిరించాడా?
విశాఖలో రాహుల్ సిప్లిగంజ్‌పై ఎఫ్‌ఐఆర్... బావమరిది కోసం యువతిని బెదిరించాడా?
Job Notifications Politics: ఉద్యోగాలు భర్తీ చేస్తే విజేతలు తప్ప అందర్నీ రెచ్చగొట్టడమే - నిరుద్యోగులతో రాజకీయ పార్టీల కొత్త రాజకీయం - ప్రభుత్వాలు రిస్క్ తీసుకుంటాయా?
ఉద్యోగాలు భర్తీ చేస్తే విజేతలు తప్ప అందర్నీ రెచ్చగొట్టడమే - నిరుద్యోగులతో రాజకీయ పార్టీల కొత్త రాజకీయం - ప్రభుత్వాలు రిస్క్ తీసుకుంటాయా?
West Bengal Politics : బెంగాల్‌లో తృణమూల్‌కు కరవైన రక్షణ - ఎక్కడికెళ్లినా దాడులు - బీజేపీ వచ్చినా పరిస్థితి మారలేదా?
బెంగాల్‌లో తృణమూల్‌కు కరవైన రక్షణ - ఎక్కడికెళ్లినా దాడులు - బీజేపీ వచ్చినా పరిస్థితి మారలేదా?
Colombia Earthquake: కొలంబియాలో 7.4 తీవ్రతతో భూకంపం! వేలల్లో ఇళ్లు ధ్వంసం, వంద మందికిపైగా మృతి! 
కొలంబియాలో 7.4 తీవ్రతతో భూకంపం! వేలల్లో ఇళ్లు ధ్వంసం, వంద మందికిపైగా మృతి! 
Priyanka Chopra: సిద్ధి వినాయక టెంపుల్‌లో ప్రియాంక చోప్రా... Varanasi కోసం ఇండియా వచ్చి...
సిద్ధి వినాయక టెంపుల్‌లో ప్రియాంక చోప్రా... Varanasi కోసం ఇండియా వచ్చి...
AP DSC Notification 2026: అక్టోబర్‌లో వచ్చే డీఎస్సీ  సిలబస్ ఇదేనా? మార్పులు ఉంటాయా?
అక్టోబర్‌లో వచ్చే డీఎస్సీ  సిలబస్ ఇదేనా? మార్పులు ఉంటాయా?
Fact Check: చైనా సైన్యం అరుణాచల్ ప్రదేశ్‌లోకి ప్రవేశించిందా? వైరల్ వీడియోలో నిజమెంత? 
చైనా సైన్యం అరుణాచల్ ప్రదేశ్‌లోకి ప్రవేశించిందా? వైరల్ వీడియోలో నిజమెంత? 
VIP Mobile Number:విఐపి మొబైల్ నంబర్‌ ఎలా తీసుకోవచ్చు? దాని ప్రక్రియ, ఖర్చు గురించి తెలుసా? 
విఐపి మొబైల్ నంబర్‌ ఎలా తీసుకోవచ్చు? దాని ప్రక్రియ, ఖర్చు గురించి తెలుసా? 
Embed widget