అన్వేషించండి

Film Shootings Start : రెండు రోజుల్లోనే ముగిసిన సినీ కార్మికుల సమ్మె - రేపట్నుంచి షూటింగ్‌లు

సినీ కార్మికుల సమ్మె ముగిసింది. శుక్రవారం నుంచి షూటింగ్‌లు ప్రారంభమవుతాయి.

Film Shootings Start :వేతన పెంపు కోరుతూ సినీ కార్మికులు (Cine workers) ప్రారంభించిన సమ్మె ముగిసింది. 45 శాతం వేతనాలు పెంచాలని వర్కర్స్ ఫెడరేషన్ ఆందోళనలు ప్రారంభించింది. అయితే ఫిల్మ్ చాంబర్  మాత్రం చర్చించుకుందాం.. ముందు షూటింగ్‌లు కొనసాగించాలని స్పష్టం చేసింది. షూటింగ్‌లు ప్రారంభిస్తేనే వేతనాల పెంపుపై చర్చలు ఉంటాయని లేకపోతే నిరవధికంగా షూటింగ్‌లు నిలిపివేయడానికైనా సిద్ధమని హెచ్చరించారు. ఈ క్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వద్ద రెండు వర్గాలు చర్చలు జరిపాయి.  ఎవరికి వారు సమస్యను లాగడం సరి కాదని చర్చించి ఓ పరిష్కారానికి రావాలని తలసాని సూచించారు. 

తలసాని సమక్షంలో ఫిల్మ్ చాంబర్, వర్కర్స్ ఫెడరేషన్ చర్చలు

దీంతో అటు నిర్మాతల మండలికి చెందిన వారు.. ఇటు వర్కర్స్ ఫెడరేషన్‌కు సంబంధించిన వారు చర్చలు జరిపారు. రేపట్నుంచి షూటింగ్‌లు ప్రారంభిచాలని నిర్ణయించారు. వేతనాల పెంపు విషయం శుక్రవారం కో ఆర్డినేషన్ కమిటీ సమావేశం జరిపి నిర్ణయం తీసుకుంటారు. ఫిల్మ్ చాంబర్, ఫిల్మ్ ఫెడరేషన్ ద్వారా జీతాల చెల్లింపు ఉంటుందని సి.కల్యాణ్ ప్రకటించారు. శుక్రవారం ఛాంబర్, ఫెడరేషన్ దిల్ రాజు అధ్యక్షతన సమావేశం అవుతుంది. 

వేతనాలు పెంచేందుకు అంగీకరించారంటున్న ఫెడరేషన్

వేతనాలు పెంచడానికి ఫిల్మ్ చాంబర్ ప్రతినిధులు అంగీకరించాని ఎంత మేర పెంచుతారనేది శుక్రవారం క్లారిటీ వస్తుందని ఫిల్మ్ ఫెడరేషన్ అధ్యక్షుడు వల్లభనేని అనిల్ తెలిపారు. మంత్రి సూచనతో చర్చలు జరిపామన్నారు. పెంచిన వేతనాలు కూడా శుక్రవారం నుంచే అమల్లోకి వస్తాయన్నారు. శుక్రవారం దిల్ రాజు సమక్షంలో జరిగే చర్చల్లో వేతనాల పెంపుపై విధివిధానాలు ఖరారు చేస్తామన్నారు. ఇరువర్గాలు కాస్త తగ్గేందుకు అంగీకరించడంతో  సమ్మె ముగియడానికి దారి లభించినట్లయింది.  

శుక్రవారం సమావేశం తర్వాత ఎంత వేతనాలు పెంచుతారన్నదానిపై క్లారిటీ

 సినీ కార్మికులు హఠాత్తుగా సమ్మె బాట పట్టడంతో రెండు రోజులుగా హైదరాబాద్‌ పరిసరాల్లో సినిమా షూటింగ్‌లు నిలిచిపోయాయి. తమ వేతనాలు పెంచాలని సిని కార్మికులు గత కొన్నిరోజులుగా డిమాండ్‌ చేస్తున్నారు. అయితే నిర్మాతల మండలి ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో 24 విభాగాల కార్మికులు నేటినుంచి సమ్మెకు పిలుపునిచారు. ఇందులో భాగంగా సినీ కార్మికులు షూటింగ్‌లకు హాజరుకాలేదు. జూనియర్‌ ఆర్టిస్టులను తీసుకెళ్లే బస్సులను ఫెడరేషన్‌ సభ్యులు నిలిపివేశారు. దీంతో తెలుగు, తమిళ, హిందీ చిత్రాల షూటింగ్‌లు నిలిచిపోయాయి. హైదరాబాద్‌ పరిసరాల్లో 20కిపైగా చిన్న, పెద్ద సినిమాల చిత్రీకరణ ఆగిపోయింది. ఈ సమస్యకు రెండు రోజుల్లోనే పరిష్కారం లభించింది. 

టాప్ హెడ్ లైన్స్

Bloody Romeo: బ్లడీ రోమియో కోసం క్లాసీ లుక్‌లోకి నాని... స్టైలిష్‌గా సుజీత్ సినిమా
బ్లడీ రోమియో కోసం క్లాసీ లుక్‌లోకి నాని... స్టైలిష్‌గా సుజీత్ సినిమా
Vijay Deverakonda : నా మూవీస్‌కు టికెట్ రేట్స్ పెరగవు - సత్యసాయి బయోపిక్‌ చేయాలనుకున్నా... విజయ్ దేవరకొండ రియాక్షన్
నా మూవీస్‌కు టికెట్ రేట్స్ పెరగవు - సత్యసాయి బయోపిక్‌ చేయాలనుకున్నా... విజయ్ దేవరకొండ రియాక్షన్
Sunday OTT Movies : ఆదివారం ఓటీటీల్లో సినిమాల సందడి - వీకెండ్ టాప్ 10 ట్రెండింగ్ మూవీస్... 150 కోట్ల మూవీ డోంట్ మిస్
ఆదివారం ఓటీటీల్లో సినిమాల సందడి - వీకెండ్ టాప్ 10 ట్రెండింగ్ మూవీస్... 150 కోట్ల మూవీ డోంట్ మిస్
Alias Rukmini Heroine: 'అలియాస్ రుక్మిణి'లో హీరోయిన్ ఈ అమ్మాయే... నితిన్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన ఆఫియా సయ్యద్
'అలియాస్ రుక్మిణి'లో హీరోయిన్ ఈ అమ్మాయే... నితిన్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన ఆఫియా సయ్యద్

వీడియోలు

West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Dasara Special Trains: రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. అక్టోబర్ 25 వరకు దసరా స్పెషల్‌ రైళ్లు
రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. అక్టోబర్ 25 వరకు దసరా స్పెషల్‌ రైళ్లు
Talliki Vandanam Phase 2: తల్లికి వందనం రెండో విడత లబ్ధిదారులు ఖరారు.. నిధుల విడుదలకు ఉత్తర్వులు జారీ
తల్లికి వందనం రెండో విడత లబ్ధిదారులు ఖరారు.. నిధుల విడుదలకు ఉత్తర్వులు జారీ
Abhijit Dipke Grandmother Passes Away: అభిజీత్ దీప్కే ఇంట్లో తీవ్ర విషాదం.. పోలీసుల అదుపులో ఉండగానే నానమ్మ కన్నుమూత
అభిజీత్ దీప్కే ఇంట్లో తీవ్ర విషాదం.. పోలీసుల అదుపులో ఉండగానే నానమ్మ కన్నుమూత
YS Sharmila: మోదీ ప్లాన్ ప్రకారం పేదలు, దళితులు, ముస్లిం, క్రిస్టియన్ల ఓట్లు తొలగిస్తున్నారు: వైఎస్ షర్మిల
మోదీ ప్లాన్ ప్రకారం పేదలు, దళితులు, ముస్లిం, క్రిస్టియన్ల ఓట్లు తొలగిస్తున్నారు: వైఎస్ షర్మిల
AP Cabinet Decisions: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వం స్పష్టత..! ఏ క్షణమైనా నోటిఫికేషన్
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వం స్పష్టత..! ఏ క్షణమైనా నోటిఫికేషన్
Ambani vs Elon Musk: భారత ప్రధాని అంబానీ..! స్టార్‌లింక్ జాప్యంపై బీజేపీ, రిలయన్స్‌‌ టార్గెట్‌గా ఎలాన్ మస్క్ సంచలన ఆరోపణలు
భారత ప్రధాని అంబానీ..! స్టార్‌లింక్ జాప్యంపై బీజేపీ, రిలయన్స్‌‌ టార్గెట్‌గా ఎలాన్ మస్క్ సంచలన ఆరోపణలు
Alias Rukmini Heroine: 'అలియాస్ రుక్మిణి'లో హీరోయిన్ ఈ అమ్మాయే... నితిన్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన ఆఫియా సయ్యద్
'అలియాస్ రుక్మిణి'లో హీరోయిన్ ఈ అమ్మాయే... నితిన్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన ఆఫియా సయ్యద్
Hyderabad Crime News: చెవులు కుట్టించేందుకు వెళితే రెండేళ్ల పాప మృతి- జీడిమెట్లలో విషాదం
చెవులు కుట్టించేందుకు వెళితే రెండేళ్ల పాప మృతి- జీడిమెట్లలో విషాదం
Embed widget