Chiranjeevi: మెగా ఇంట వినాయక చవితి సంబరాలు, ఈసారి ప్రత్యేకత ఇదేనట!
ఏదైనా పండగ వచ్చిందంటే చాలు.. తమ అభిమాన నటీనటులు ఆ పండగను ఎలా సెలబ్రేట్ చేసుకుంటారో తెలుసుకోవడానికి అభిమానులు తెగ ఆసక్తి చూపిస్తారు. అలా తమ ఇంట జరిగిన సంబరాలను షేర్ చేసి ఫ్యాన్స్‌ను ఖుషీ చేశారు చిరు.
![Chiranjeevi: మెగా ఇంట వినాయక చవితి సంబరాలు, ఈసారి ప్రత్యేకత ఇదేనట! Chiranjeevi shares a special post as he celebrates his first vinayaka chavithi with klin kaara Chiranjeevi: మెగా ఇంట వినాయక చవితి సంబరాలు, ఈసారి ప్రత్యేకత ఇదేనట!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/18/59b9d2cbcf822c34a478e23d4ac935521695033785524802_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
మెగాస్టార్ చిరంజీవి తాజాగా వినాయక చవితి సందర్భంగా తన ఫ్యామిలీతో పూజలో పాల్గొన్న ఫొటోలు పెట్టారు. అందులో తన మనవరాలు క్లిన్ కారా గురించి ప్రత్యేకంగా చెప్పారు.
మెగాస్టార్ చిరంజీవి.. తన సినిమాల గురించి మాత్రమే కాదు.. తన పర్సనల్ లైఫ్ విషయాలను కూడా ఎప్పటికప్పుడు అభిమానులతో షేర్ చేసుకోవడానికి ఇష్టపడతారు. ముఖ్యంగా మెగా ఫ్యామిలీలో ఎప్పుడు ఏ ఈవెంట్ అయినా అందరు హీరోలు కలవడం, కలిసి సంతోషంగా సెలబ్రేట్ చేసుకోవడం.. ఇదంతా మెగా ఫ్యాన్స్‌కు ఫుల్ ఫీస్ట్ ఇస్తాయి. అందులో అభిమానులను సంతోషపెట్టడం కోసం వారి ఇంట్లో జరుగుతున్న చాలావరకు ఈవెంట్స్ గురించి అప్డేట్ చేస్తుంటారు. పైగా తాజాగా రామ్ చరణ్‌కు కూతురు పుట్టింది. తన పేరే క్లిన్ కారా. క్లిన్ కారా.. కొణిదెల ఫ్యామిలీలోకి ఎంటర్ అయినప్పటి నుండి తన గురించి కూడా అప్డేట్స్ తెలుసుకోవడానికి ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రామ్ చరణ్ కానీ, తన భార్య ఉపాసన కానీ సోషల్ మీడియాలో క్లిన్ కారా గురించి పెద్దగా అప్డేట్స్ షేర్ చేసుకోకపోవడంతో ఫ్యాన్స్ అంతా చిరంజీవిపైనే ఆశలు పెట్టుకున్నారు.
క్లిన్ కారాతో మొదటి పండుగ..
వినాయక చవితి సందర్భంగా చిరంజీవి కుటుంబం అంతా కలిసి పూజలో పాల్గొన్నారు. ఆ పూజకు సంబంధించిన ఫోటోలను ట్విటర్‌లో పోస్ట్ చేశారు చిరు. ‘అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఆ విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో జీవితాల్లో విఘ్నాలు తొలగి అందరికీ శుభములు కలగాలని ప్రార్ధిస్తున్నాను! ఈసారి ప్రత్యేకత ... చిన్ని 'క్లిన్ కారా' తో కలిసి తొలి వినాయక చవితి జరుపుకోవడం’ అంటూ ఆ పోస్ట్‌కు క్యాప్షన్ కూడా పెట్టారు. క్లిన్ కారా పుట్టిన తర్వాత ఇది మొదటి వినాయక చవితి కావడంతో చిరంజీవి మాత్రమే కాదు.. మొత్తం మెగా కుటుంబం ఎంత స్పెషల్‌గా ఫీల్ అవుతుందో అర్థమవుతోంది.
సకుటుంబ సపరివార సమేతంగా..
మెగా ఇంట జరిగిన వినాయక చవితి పూజలో చిరంజీవితో పాటు తన భార్య సురేఖ, రామ్ చరణ్, ఉపాసనతో పాటు చిరంజీవి కూతుళ్లు, వారి పిల్లలు కూడా పాల్గొన్నారు. మరోవైపు నాగబాబు కూడా తన ఫ్యామిలీతో పండగను సెలబ్రేట్ చేసుకున్నారు. అంతా కలిసి ఇలా పూజ చేయడం, ఫోటోలు షేర్ చేయడం కనులవిందుగా ఉందని మెగా ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ పోస్ట్‌కు కామెంట్‌గా అభిమానులు సైతం చిరుకు వినాయక చవితి శుభాకాంక్షలు చెప్తున్నారు. తాజాగా ‘భోళా శంకర్’తో భారీ డిసాస్టర్ అందుకున్న చిరు.. బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్‌లో పెట్టారు. ఇప్పటివరకు చేసిన కమర్షియల్ సినిమాల్లాగా కాకుండా కొత్త జోనర్లతో హిట్ అందుకోవాలని ప్రయత్నాలు మొదలుపెట్టారు. మరి ఈసారి చిరు.. తన సినిమాతో ఫ్యాన్స్‌ను ఏ రేంజ్‌లో సంతోషపెడతారో చూడాలి.
అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు !
— Chiranjeevi Konidela (@KChiruTweets) September 18, 2023
ఆ విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో జీవితాల్లో విఘ్నాలు తొలగి అందరికీ శుభములు కలగాలని ప్రార్ధిస్తున్నాను! 🙏
ఈ సారి ప్రత్యేకత ... చిన్ని 'క్లిన్ కారా' తో కలిసి తొలి వినాయక చవితి జరుపుకోవడం 😍😊
Happy Ganesh Chaturthi to ALL ! Celebrating the… pic.twitter.com/FeaFOtDdhd
View this post on Instagram
Also Read: కేవలం 32 నిమిషాల్లోనే, ‘పుష్ప 2’ రికార్డు బద్దలుకొట్టిన ‘లియో’
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి. Join Us on Telegram: https://t.me/abpdesamofficial
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)