అన్వేషించండి

ధనుష్ 'కెప్టెన్ మిల్లర్' టీజర్‌లో గుడి, గన్స్ ఎందుకున్నాయి? ఇవి గమనించారా?

ధనుష్ నటిస్తున్న ‘కెప్టెన్ మిల్టర్’ టీజర్ వచ్చేసింది. అయితే, ఇందులోని కొన్ని అంశాలను పరిశీలిస్తే తప్పకుండా ఈ మూవీపై అంచనాలు పెరిగిపోతాయి.

ధనుష్ బర్త్ డే సందర్భంగా మోస్ట్ యాంటిసిపేటెడ్ ఫిలిం కెప్టెన్ మిల్లర్ టీజర్ వచ్చేసింది. రాకీ, సానికాయిదం లాంటి సినిమాలు తీసిన అరుణ్ మతీశ్వరన్, ధనుష్ కలిసి చేస్తున్న మొదటి సినిమా కావటంతో అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. అరుణ్ స్టైల్ లో మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ ఇస్తున్నట్లు ఫస్ట్ లుక్ లోనే అర్థం కాగా.. ఇప్పుడు విడుదలైన టీజర్ తో అది మరింత పీక్స్‌కు వెళ్లింది.

సినిమాల్లో క్యారెక్టర్ పరంగా వేరియేషన్స్ చూపించేందుకు ఏమాత్రం ఆలోచించని ధనుష్ ఈ సినిమాలోనూ మూడు డిఫరెంట్ గెటప్స్ లో కనిపిస్తున్నాయి. ఇంతకీ ఈ టీజర్‌లో ఓ రెండు విషయాలపైనే ఎక్కువగా కాన్సస్ట్రేషన్ కనిపించింది ఆ రెండే గుడి, గన్స్. టీజర్ మొత్తం తుపాకులే కనిపించాయి. ధనుష్ తో మొదలుపెట్టి హీరోయిన్ ప్రియా అరుల్ మోహన్, స్పెషల్ రోల్ చేస్తున్న సందీప్ కిషన్, ఇంకా మిగిలిన నటులు అందరి చేతుల్లోనూ గన్స్ ఉన్నాయి. కన్నడస్టార్ శివరాజ్ కుమార్ కూడా రివల్యూషనరీ తరహా స్క్రీన్ అప్పీరియెన్స్ లోనే కనిపించారు. అయితే టీజర్ లో ఈ గన్నులు ఎక్కువ కనపడటానికి కారణం ఏమిటనే విషయంపై పోస్టర్‌లోనే క్లూ ఇచ్చారు. 

ధనుష్‌కు ఈ మూవీలో మూడు పేర్లు మిల్లర్, ఈశ, అనలీశ అని ఉంది ఈ పోస్టర్‌లో. సన్నగా డార్క్ స్కిన్‌తో ఉండే మిల్లర్ డెకాయిట్ అని, మర్డరర్ అని రాసి ఉంది. పట్టిచ్చిన వారికి నగదు బహుమతిని కూడా అందులో ప్రకటించారు. ఈ పోస్టర్ వేసింది బ్రిటీషర్స్ అనీ, ధనుష్ ఓ ముఠాను మెయింటెన్ చేస్తూ బ్రిటీషర్లపైనే దాడులు చేస్తూ వాళ్ల నుంచే ఆయుధాలు దొంగిలిస్తున్నాడనీ అర్థం చేసుకోవచ్చు. అందుకే టీజర్ చివర్లో ఓ పెద్ద బెటాలియన్ తో ధనుష్, అతని మనుషులపై అటాక్ చేయించటానికి బ్రిటీషర్స్ వస్తున్నట్లు చూపించారు. ధనుష్ టీమ్ కూడా వాళ్లపై అటాక్ చేయడాన్ని టీజర్‌లో చూడవచ్చు. 

మరి ధనుష్ బ్రిటీష్ పోలీసుల నుంచి ఆయుధాలను దొంగిలించి వారిపైనే ఎందుకు పోరాడుతున్నాడు. స్వాతంత్ర్యం ముందు కథ కాబట్టి ధనుష్ కెప్టెన్ మిల్లర్ గా మారి బ్రిటీషర్లను దేశం నుంచి తరిమేసే యోధుడిగా పోరాడుతున్నాడా.. లేదా వేరే ఏదైనా కథ ఉందా చూడాలి. ఇక రెండో రిఫరెన్స్ టెంపుల్. టీజర్ లో చాలా ఎక్కువ సార్లు టెంపుల్ కనిపించింది. సార్పట్ట సినిమాలో విలన్ వేటపులిగా నటించిన జాన్ కొక్కేన్ రోజ్ కెప్టెన్ మిల్లర్ లోనూ నెగటివ్ రోల్ చేసినట్లున్నారు. టెంపుల్ లో అతను వెకిలిగా నవ్వుతున్నట్లు చూపించిన షాట్.. టెంపుల్ లోనే ఎవరినో చంపటానికి హీరోయిన్ ప్రియా అరుల్ మోహన్ ట్రై చేస్తున్నట్లు గన్ తో చూపించిన షాట్.. టెంపుల్ బయట అప్పటి సైన్యం, పోలీసులు కాపలా ఉన్నట్లు చూపించిన షాట్.. ఈ బ్రిటీషర్ ఫేస్ పక్కన నుంచి టెంపుల్ చూపించటం.. ధనుష్ స్లమ్స్ లో ఉంటున్నట్లు చూపించిన షాట్.. సో ఇది ఊరిలో ఆధిపత్యం, ఎక్కువ, తక్కువ కులం తరహా పాయింట్‌లా అర్థమవుతోంది. ఆ టైమ్ లో అస్పృశ్యత లాంటివి ఉండేవి కాబట్టి..బ్రిటీషర్స్ అండ్ అస్పృశ్యత...ఈ రెండు పాయింట్స్ లనూ కెప్టెన్ మిల్లర్ గా ధనుష్ చూపించనున్నారేమో చూడాలి. జీవీ ప్రకాష్ మ్యూజిక్ అందించిన ఈ సినిమా డిసెంబర్ 15న రిలీజ్ కానుంది.

Also Read : నన్ను వదిలేయండి, ప్రభాస్ మీద కామెంట్ చేయలేదు - 'కశ్మీర్ ఫైల్స్' దర్శకుడు

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

టాప్ హెడ్ లైన్స్

Garividi Lakshmi Review - 'గరివిడి లక్ష్మి' రివ్యూ: ఉత్తరాంధ్ర బుర్రకథ కళాకారిణి బయోపిక్... సినిమా ఎలా ఉందంటే?
'గరివిడి లక్ష్మి' రివ్యూ: ఉత్తరాంధ్ర బుర్రకథ కళాకారిణి బయోపిక్... సినిమా ఎలా ఉందంటే?
Sunday OTT Movies : సండే టాప్ 10 ఓటీటీ మూవీస్ - యూత్‌ను అట్రాక్ట్ చేసే రొమాంటిక్ డ్రామా సిరీస్... ఇవి డోంట్ మిస్
సండే టాప్ 10 ఓటీటీ మూవీస్ - యూత్‌ను అట్రాక్ట్ చేసే రొమాంటిక్ డ్రామా సిరీస్... ఇవి డోంట్ మిస్
AK47 Second Single: అక్టోబర్ 19న రెండో సాంగ్... ఆదర్శ కుటుంబం విడుదలపై సస్పెన్స్‌కు ఫుల్ స్టాప్
అక్టోబర్ 19న రెండో సాంగ్... ఆదర్శ కుటుంబం విడుదలపై సస్పెన్స్‌కు ఫుల్ స్టాప్
Horror Thrilelr OTT : ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్ - 7 కోట్లతో తీస్తే 2,500 కోట్ల కలెక్షన్స్... ఫ్రీగా స్ట్రీమింగ్ అయ్యేది ఎప్పుడంటే?
ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్ - 7 కోట్లతో తీస్తే 2,500 కోట్ల కలెక్షన్స్... ఫ్రీగా స్ట్రీమింగ్ అయ్యేది ఎప్పుడంటే?

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Bengaluru Decider Washed: వర్షం కారణంగా చివరి టీ20 రద్దు.. భార‌త్, విండీస్ టీ20 సిరీస్ సమం.. ఇషాన్, న‌మ‌న్ మెరుపులు వృథా
వర్షం కారణంగా చివరి టీ20 రద్దు.. భార‌త్, విండీస్ టీ20 సిరీస్ సమం.. ఇషాన్, న‌మ‌న్ మెరుపులు వృథా
Governor Quota MLC Seats: గ్రాడ్యుయేట్ ఎన్నికల హడావుడి ముగియకముందే.. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పదవులపై గంపెడు ఆశలు!
Graduate MLC ఎన్నికల హడావుడి ముగియకముందే.. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పదవులపై గంపెడు ఆశలు!
Harish Rao: కత్తి ఆంధ్రావాడిది.. కానీ పొడిచేది తెలంగాణోడు: సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్ రావు కీలక వ్యాఖ్యలు
కత్తి ఆంధ్రావాడిది.. కానీ పొడిచేది తెలంగాణోడు: సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్ రావు కీలక వ్యాఖ్యలు
Chief Selector Twist: అగార్కర్ సీటులో హైదరాబాదీ స్పిన్నర్.. టీమిండియా చీఫ్ సెలెక్టర్ గా ప్రజ్ఞాన్ ఓజా సరికొత్త చరిత్ర, వెస్ట్ జోన్ నుంచి పొవార్ ఎంట్రీతో రేస్ క్లోజ్
అగార్కర్ సీటులో హైదరాబాదీ స్పిన్నర్.. టీమిండియా చీఫ్ సెలెక్టర్ గా ప్రజ్ఞాన్ ఓజా సరికొత్త చరిత్ర, వెస్ట్ జోన్ నుంచి పొవార్ ఎంట్రీతో రేస్ క్లోజ్
Abhijeet Dipke: జైలు నుంచి అభిజీత్ దీప్కే విడుదల.. సౌరవ్ దాస్, ఆశుతోష్ రిలీజ్ కోసం వెయిటింగ్ అని పోస్ట్
జైలు నుంచి అభిజీత్ దీప్కే విడుదల.. సౌరవ్ దాస్, ఆశుతోష్ రిలీజ్ కోసం వెయిటింగ్ అని పోస్ట్
RTC Special Buses: జేబీఎస్‌, ఎంజీబీఎస్‌లో దసరా పండగ రద్దీ.. బస్సుల కోసం గంటల పాటు ప్రయాణికుల పడిగాపులు
జేబీఎస్‌, ఎంజీబీఎస్‌లో దసరా పండగ రద్దీ.. బస్సుల కోసం గంటల పాటు ప్రయాణికుల పడిగాపులు
TDP Second List of Candidates: పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు.. టీడీపీ అభ్యర్థుల రెండో జాబితా విడుదల
పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు.. టీడీపీ అభ్యర్థుల రెండో జాబితా విడుదల
Horror Thrilelr OTT : ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్ - 7 కోట్లతో తీస్తే 2,500 కోట్ల కలెక్షన్స్... ఫ్రీగా స్ట్రీమింగ్ అయ్యేది ఎప్పుడంటే?
ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్ - 7 కోట్లతో తీస్తే 2,500 కోట్ల కలెక్షన్స్... ఫ్రీగా స్ట్రీమింగ్ అయ్యేది ఎప్పుడంటే?
Embed widget